మెడికల్ కాలేజీలోకి విమానం కూలిపోయింది, 20 మంది వరకు MBBS విద్యార్థులు, వైద్యులు మరణించారు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం (జూన్ 12) నాడు ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది, అందులో సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు ఉన్నారు.


12 మంది ఎయిర్ లైన్స్ సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులలో భారతీయులు 170 మంది వరకు ఉన్నారని సమాచారం. ఆ తరువాత బ్రిటిష్, కెనడా, పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. ఎయిరిండియా హెల్ప్‌లైన్‌ నెంబర్ 1800 5691 444

అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. అయితే బిల్డింగ్స్, జనావాసాల మీద విమానం కూలడంతో విమానంలో ఉన్న వారితో పాటు ఫ్లైట్ కూలడంతో కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు, డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. ఎయిరిండియా విమానం బీజే మెడికల్ కాలేజీ, హాస్టల్ బిల్డింగ్ (BJ Medical College Hostel) మీద కూలింది. దాంతో ఆ బిల్డింగులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది వరకు ఎంబీబీఎస్ విద్యార్థులు, డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని సమాచారం. మనకు ప్రాణం పోసే డాక్టర్లే వారికి ఏమాత్రం ప్రమేయం లేని ఘటనలో చనిపోవడం అందరినీ కలిచివేస్తోంది. మెడికోల మృతిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

ఎయిర్ ఇండియా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా విమాన ప్రమాదం సమాచారాన్ని అందించింది. బోయింగ్ 787-7 విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్, 1 కెనడా, 7 మంది పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. ప్రమాదం తర్వాత గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. గురువారం మధ్యాహ్నం 1 గంటల 38 నిమిషాలకు విమానం బయలుదేరిందని ఎయిర్ ఇండియా తెలిపింది.

లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం అహ్మదాబాద్‌లోని మేఘానగర్ ప్రాంతంలో జరిగింది. విమానం టేకాఫ్ సమయంలో కూలిపోయింది.

విమానం కూలిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం అహ్మదాబాద్ హార్స్ క్యాంప్ సమీపంలో జరిగింది, ఇది సివిల్ హాస్పిటల్ దగ్గర ఉంది. ఇది వస్త్రపూర్ ప్రాంతంతో సహా చాలా కిలోమీటర్ల దూరం నుండి చూడవచ్చు. ఈ ఆకస్మిక సంఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదంపై ఎయిర్ ఇండియా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో సమాచారం అందించింది.

‘ఫ్లైట్ AI171 అహ్మదాబాద్ నుండి లండన్ గ్యాట్‌విక్ వెళుతోంది. జూన్ 12న ప్రమాదానికి గురైంది. మేము ఇంకా వివరాలను పరిశీలిస్తున్నాము. ఈ విషయంలో మా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’, ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌లో మరింత సమాచారాన్ని షేర్ చేస్తామని ఎయిరిండియా తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.