Post Office : పోస్ట్ ఆఫీస్ కొత్త ప్లాన్. నెలకు 9000 రూపాయల వడ్డీ పొందండిలా.!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Post Office : ప్రతి ఒక్కరూ కూడా తాము పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో రాబడి రావాలని కోరుకుంటారు. అదేవిధంగా పెట్టుబడి కూడా సురక్షితవంతమైనదిగా ఉండాలి.
అలాగే ఏ విధంగా నువ్వు మోసపోకూడదు అని భావిస్తుంటారు. అయితే ఈ విధంగా ఆలోచించేవారు పోస్ట్ ఆఫీస్ లో పెట్టుబడిని పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీ డబ్బు భద్రంగా ఉండడంతో పాటు అధిక లాభాలు కూడా వస్తాయి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.అయితే నేటి కాలంలో మ్యూచువల్ ఫండ్స్ , స్టాక్ మార్కెట్ వంటివి అధిక రాబడులను అందిస్తున్నప్పటికీ వీటిలో పెట్టుబడి పెట్టడం అంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ మరియు స్టాక్ మార్కెట్లో మీరు పెట్టే పెట్టుబడి సురక్షితంగా ఉండదు. తద్వారా మీరు పెట్టిన పెట్టుబడి సైతం కోల్పోవాల్సి వస్తుంది. అయితే అలా కాకుండా పోస్ట్ ఆఫీస్ ద్వారా మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ఎక్కువ మొత్తంలో లాభాలను పొందవచ్చు. ఈ విషయంలో పోస్టల్ శాఖ అందిస్తున్న నెలవారి ఆదాయ పథకం చాలా ముఖ్యమైనది. దీంతో మీరు ప్రతి నెల స్థిర ఆదాయాన్ని పొందడంతో పాటు మీరు పెట్టిన పెట్టుబడికి కూడా హామీ ఇవ్వబడుతుంది.

Post Office : పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఫార్మాట్ ఏంటంటే…

దీనిని పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీం అని పిలుస్తారు. ఇక ఈ పథకంలో ప్రస్తుతం వడ్డీ రేటు 7.40% ఉంది. దీనిని ఉపయోగించి మీరు కనీసం 1000 నుండి 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఉమ్మడిగా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే దాదాపు 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే దీనికి పన్ను మినహాయింపు కూడా ఉండదు. ఇక ఈ పెట్టుబడి మొత్తం 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి మీ డబ్బుకు కేంద్ర ప్రభుత్వమే సంరక్షకుడుగా వ్యవహరిస్తుంది.

Related News

Post Office : బ్యాంకు ఖాతా…

అయితే ఈ పథకం ద్వారా మీరు పెట్టిన పెట్టుబడి పై వచ్చిన లాభాలను నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. లేదా నామినేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్ లో కూడా వీటిని జమ చేసుకోవచ్చు. కావున అర్హులైన వారంతా ఈ ఖాతాను తెరవచ్చు. దీనికోసం ముందుగా పోస్ట్ ఆఫీస్ లో ఖాతా తెరిచి ఆ తర్వాత నెల ఆదాయానికి సంబంధించిన దరఖాస్తు నింపి అవసరమైన పాత్రలతో అధికారులకు సమర్పించాలి.

Post Office : డబ్బు తిరిగి పొందవచ్చా…

ఈ పథకంలో పెట్టిన పెట్టుబడి అత్యవసర సమయంలో కాలానికి ముందే విత్ డ్రా కూడా చేసుకోవచ్చు. అయితే మీరు ఒక సంవత్సరానికి ముందే దీనిని ఉపసంహరించుకుంటే జీరో రేటు ఉంటుంది. ఈ పథకం ద్వారా 15 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే నెలకు రూ.9,250 వడ్డీ లభిస్తుంది. 12 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే రూ.7,400 వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా ఈ పథకం ద్వారా మీరు మీ డబ్బులు సురక్షితంగా ఉంచడంతోపాటు ప్రతినెల వడ్డీ పొందవచ్చు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *