Ration Cards : రేషన్​ కార్డుల్లో తప్పుల సవరణకు అప్లై చేయడం ఇలా..

www.mannamweb.com


Ration Cards : రేషన్​ కార్డుల్లో తప్పుల సవరణకు అప్లై చేయడం ఇలా..

Ration Cards : కొంతమంది రేషన్ కార్డుల్లో తప్పులు ఉంటాయి. కొందరి పేర్లలో మిస్టేక్స్ ఉంటాయి. కొత్తగా పెళ్లయిన వారు తమ జీవిత భాగస్వామి పేరును రేషన్ కార్డులో(Ration Cards) చేర్చాల్సి ఉంటుంది.

ఇంకొందరు తమ పిల్లల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చాల్సి ఉంటుంది. మరికొందరు ఇంటి అడ్రస్‌ను మార్చాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడం ఇక ఈజీ. కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంటే ఆన్‌లైన్‌లో మీరే ఫోను నుంచి అప్లికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయొచ్చు.

ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులను మీరు స్కాన్ చేయించి, వాటి డిజిటల్ కాపీలను మీ ఫోనులోకి తీసుకోవాలి. ఒక సెట్ జిరాక్స్ ప్రతులు కూడా తీసి ఉంచుకోవాలి. గూగుల్‌లో Telangana Mee seva Portal అనే వెబ్ సైట్ ఉంటుంది. అది ఓపెన్ చేయగానే వచ్చే హోం పేజీలో Services అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. ఓపెన్ అయిన పేజీలో Search for Services అనే బటన్ వస్తుంది. దానిపై క్లిక్​ చేయాలి. తదుపరిగా Department అనే ఆప్షన్ వస్తుంది. దాని​లోకి వెళ్లి Selectపై క్లిక్ చేసి Civil Supplies అనే ఆప్షన్​ను క్లిక్ చేశాక ఓపెన్ అయిన పేజీలో ‘Corrections in Food Security Card’ అనే ఆప్షన్ వస్తుంది.