రాబోయే రెండు ఐసీసీ సిరీస్ లకు రోహిత్ శర్మకే కెప్టెన్సీ!

రాబోయే రెండు ఐసీసీ సిరీస్ లకు రోహిత్ శర్మకే కెప్టెన్సీ!


టీ20 వరల్డ్ కప్ ను భారత్ కు అందించిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఫిబ్రవరి లో పాకిస్తాన్ లో జరగనున్న ఛాంపియన్ ట్రోఫీకి,లార్డ్స్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, కూడా ప్రాతినిథ్యం వహిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు.ఆ తర్వాత జూన్‌ నెలలో లండన్‌లోని లార్డ్స్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఫైనల్‌లో భారత్ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి రోహిత్‌కి 38 ఏళ్లు రానున్నాయి.

“ఈ చారిత్రాత్మక విజయం కోసం నేను టీమ్ ఇండియాను అభినందించాలనుకుంటున్నాను.ఈ విజయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, (ఔట్‌గోయింగ్) హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ,రవీంద్ర జడేజాలకు అంకితం చేయాలనుకుంటున్నాను.ఇది మా మూడవ ఫైనల్. గత ఒక సంవత్సరంలో మేము జూన్ 2023లో (ఆస్ట్రేలియాతో ఓవల్‌లో) ఓడిపోయాము.నవంబర్ 2023లో, మేము 10 విజయాలు సాధించాము (ODI ప్రపంచ కప్‌లో), ప్రజల హృదయాలను గెలుచుకోలేకపోయాము.కానీ ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ విజయంతో భారత్ జట్టు మంచి ఉత్సాహంలో ఉంది.రాబోయే రెండు ఐసీసీ ఈవెంట్లలో భారత్ జట్టు ఖచ్ఛితంగా విజయం సాధిస్తుందని జైషా ఆశాభావం వ్యక్తం చేశారు.