భారీగా పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో ఉంచుకున్న.. భారత్ ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భారతదేశంలో విదేశీ మారక నిల్వల స్థాయి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇప్పుడు అది గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా బంగారం ధర భారీగా పెరిగిపోతున్న క్రమంలో.. దానిని నిల్వ ఉంచేందుకు.. భారత్ బంగారాన్ని భారీగానే కొనుగోలు చేస్తూ..దానిని నిల్వ చేస్తూ వస్తోంది. గత రెండేళ్లలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇండియా .. బంగారాన్ని కొనుగోలు చేసింది. కానీ, ఇప్పటివరకు ఎంత బంగారం సేకరించారన్న విషయాన్నీ బయటకు చెప్పలేదు కానీ.. భారత్ లో బంగారం నిల్వల విలువ మాత్రం గరిష్ట స్థాయికి చేరుకుందని. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అయితే, అసలు ఎంత స్థాయిలో ఇప్పటివరకు బంగారం నిల్వలు జరుగుతున్నాయన్న విషయం తెలియదు కానీ, అధికారిక లెక్కల ప్రకారం.. 2022 మార్చి నాటికి ఫారిన్ ఎక్స్చేంజి నిల్వలలో 51.487 బిలియన్ డాలర్స్ విలువైన బంగారం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో 2023 మార్చి నాటికి అప్పటికి ఉన్న విలువలతో పోల్చితే.. 6.287 బిలియన్ డాలర్స్ రెట్టింపు అయిందట. ఇక ఇప్పుడు చూసినట్లయితే.. ఒక్క జనవరి నెలలోనే.. 8.7 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. గత రెండు సంవత్సరాల నుంచి చూసినట్లయితే కనుక.. ఇంత బంగారాన్ని సేకరించడం ఇదే మొదటిసారి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ఈ 2024 జనవరి నాటికి ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం నిల్వలు 812.3 టన్నులకు చేరుకున్నట్లు సమాచారం.
ఈ విషయాలన్నీ కూడా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. లేవరేజ్ పాలసీ రివ్యూ నిర్ణయాలను శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఈ క్రమంలోనే మార్చి 29 నాటికీ ఫారెన్ నిల్వలు 645.6 బిలియన్ డాలర్స్ వరకు చేరుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ భవిష్యత్తులో ఒక డాలర్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చినపుడు.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఈ నిల్వలను కొనసాగిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగానే గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా దీనిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భావి తరాలకు ఉపయోగపడతాయని. అంతా భావిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ సేకరణ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే దానికి సంభందించిన భద్రతా చర్యలను కూడా పటిష్టంగానే చేపడుతున్నారు.