అందుకే ఆ రాక్షసుడిని ఉరితీయలేదు

కలకత్తా హత్యాచార కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు సీల్దియా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అంటే చనిపోయే వరకు జైల్లోనే ఉండాలన్నమాట.


కానీ మృతురాలి తల్లిదండ్రులు అతనికి ఉరిశిక్ష విధించాలని కోరారు. బాధితుల తరఫు న్యాయవాది కూడా దీనిని అత్యంత అరుదైన కేసుగా పరిగణించి ఉరిశిక్ష విధించాలని కోరగా.. న్యాయమూర్తి అనిర్బన్ దాస్ ఇది అరుదైన కేసు కాదు అంటూ కేవలం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. దీంతో పాటు బాధిత కుటుంబానికి సంజయ్ రాయ్ రూ.50 వేలు జరిమానా కట్టాలని.. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.17 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వం ఎందుకు పరిహారం చెల్లించాలంటే.. ఈ ఘటన జరిగింది ప్రభుత్వ హాస్పిటల్‌లో కాబట్టి.

సంజయ్ రాయ్ లాంటి రాక్షసుడిని ఉరితీయక ఇంకా ఎందుకు జైల్లో పెట్టి తిండి పెట్టాలనుకుంటున్నారు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు. యావత్ భారతదేశం కూడా కోర్టు ఇచ్చిన తీర్పుతో సంతృప్తికరంగా లేదు. అసలు సంజయ్ రాయ్‌కి ఎందుకు ఉరిశిక్ష పడలేదంటే.. ఈ కేసుని అరుదైన కేసుగా సీల్దియా కోర్టు జడ్జి అనిర్బన్ దాస్ భావించలేదు. దీనినే రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసు అని అంటారు.

రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అనేది న్యాయ వ్యవస్థలోని చట్టాల్లో ఓ కేటగిరీ. ఈ కేటగిరీని సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రవేశపెట్టింది. 1980లో బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో వాదనలు జరిగాయి. ఈ బచ్చన్ సింగ్ వర్సె స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు భారతీయ క్రైం చరిత్రలోనే ఓ ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోయింది. 1980లో పంజాబ్‌కు చెందిన బచ్చన్ సింగ్ అనే వ్యక్తి తన గ్రామంలోని ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చాడు. అప్పట్లో వీరికి భూతగాదాలు ఉండేవని టాక్. దాంతో ఇంత దారుణంగా ఓ వ్యక్తిని చంపినందుకు గానూ అప్పట్లో బచ్చన్ సింగ్ కేసును రేరెస్ట్ ఆఫ్ ది రేర్‌గా భావించి అతనికి ఉరిశిక్ష విధించారు. అప్పటి నుంచి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అనే కేటగిరీకి చెందిన కేసుల్లోని దోషులకే ఉరిశిక్ష వేస్తున్నారు.

ఎందుకంటే.. సంజయ్ రాయ్ పెద్దగా చదువుకోలేదు. చెప్పుకోదగ్గ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా లేదు. మరీ ముఖ్యంగా అతను గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర కూడా లేదు. దాంతో ఇతని కేసును రేరెస్ట్ ఆఫ్ ది రేర్ క్యాటగిరీలో చేర్చలేదు.

ఉన్నాయి. బచ్చన్ సింగ్ కేసు తర్వాత 1990లో ధనుంజయ్ చట్టర్జీ అనే వ్యక్తికి సంబంధించిన కేసులోనూ ఉరిశిక్ష పడింది. ధనుంజయ్ అనే సెక్యూరిటీ గార్డు ఓ మైనర్‌ను రేప్ చేసి చంపినందుకు గానూ అతన్ని ఉరితీసారు. ఆ తర్వాత 2012లో జరిగిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడింది.

అయితే.. సంజయ్ రాయ్‌కి ఉరిశిక్ష వేయలేదు కానీ.. ఈరోజే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేటగిరీలో ఓ యువతికి ఉరిశిక్ష పడింది. కేరళకు చెందిన గ్రీష్మ అనే యువతి షరోన్ రాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. అతను కూడా ప్రేమించాడు. 2022లో అతన్ని వదిలించుకోవాలన్న ఉద్దేశంతో తన మామ కుమార్ సాయంతో కూల్‌డ్రింక్‌లో విషం కలిపి అతనికి తాగించింది. అతను హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ కేసులో కేరళ హైకోర్టు ఈ రోజు తీర్పూ ఇస్తూ గ్రీష్మకు ఉరిశిక్ష విధించింది.