నటితో ప్రేమలో పడ్డ దొంగ.. గిఫ్ట్‌ కింద రూ.3 కోట్ల ఇల్లు

ఓ నటితో లవ్ ఎఫైర్ నడిపాడు. ఆవిడగారికి 3 కోట్లు పెట్టి భారీ భవంతిని కట్టించేశాడు. ఇంట్లో అందంగా ఉంటుందని.. 22 లక్షలు పెట్టి పెద్ద అక్వేరియం కూడా కొన్నాడు. కానీ ఆ పంచాక్షరి స్వామి కేసులో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అదే ఈ స్టోరీ! మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన 37 ఏళ్ల పంచాక్షరి స్వామి స్టోరీ ఇది. తాజాగా ఓ దొంగతనం కేసులో బెంగళూరు పోలీసులు పంచాక్షరి స్వామిని అరెస్ట్ చేయడంతో అతడి చోరీల చిట్టా మొత్తం బయటికి వచ్చింది. చిన్నతనం నుంచి అంటే 15 ఏళ్ల నుంచి చోరీలు చేయడం ప్రారంభించి చోరీలే ఫుల్ టైమ్ వృత్తిగా చేసుకునట్లు విచారణలో తేలడంతో పోలీసులే షాక్ అయ్యారు.