ఏపీ సర్కారు సీక్రెట్స్ లీకవుతున్నాయి..! సచివాలయం ఔట్ సోర్స్ సిబ్బందిపైనే డౌట్స్

ఏపీ సర్కారు సీక్రెట్స్ లీకవుతున్నాయి..! సచివాలయం ఔట్ సోర్స్ సిబ్బందిపైనే డౌట్స్


ఏపీ(AP)లో ప్రభుత్వం మారింది…ఒక్కో అడుగు ప్రక్షాలవైపు పడుతూ వస్తుంది. ఇప్పటికే పలు శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు(Chandrababu) సమీక్షలపై సమీక్షలు నిర్వహిస్తున్న అధికారుల గుండెల్లో గుపులు పుట్టేలా చేస్తున్నారు.

మరో వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సైతం తన సత్తా చాటే విధంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై దృష్టి పెడుతూనే, ప్రస్తుతం ప్రజల సంక్షేమ కార్యక్రమాలపై ఫోకస్ పెడుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రం 30ఏళ్లు అభివృద్ధిలో వెనుకబడిందని ప్రస్తుత ప్రభుత్వ వాదన. గత ప్రభుత్వంలో జరిగిన ఆధారాలుగా ఉండే కీలక సమాచారం దస్త్రాలు సైతం బయటకు వెళ్లకుండా ఫ్రీజ్ చేశారు. అయితే గవర్నమెంట్ నుంచి కీలక విషయాలను ఏపీ సచివాలయం లోని అవుట్ సోర్సింగ్ సిబ్బంది(Outsourcing staff) గత ప్రభుత్వలోని పెద్దలకు లీకులు ఇస్తున్నారట. కీలక సమాచారం., ఇతర ప్రభుత్వ విషయాలు బయట వ్యక్తుల చెవిలో ఉదేస్తున్నారట…?? అసలు ఆ సచివాలయ సిబ్బంది ఎవరు…?? ఏంటి వారి కథ…??

తిన్నింటి వాసాలు లెక్కేస్తున్నారా..

2019ఎన్నికల్లో ఏపీలో అధికారం దక్కించుకున్న వైసీపీ ప్రభుత్వం అనేక విషయాల్లో తమకు నమ్మిన బంటుగా పనిచేసే వారికి అగ్ర తంబులన్నీ ఇచ్చాయని టాక్. వివిధ శాఖల్లో పనిచేసేందుకు పదిహేను వందలకు పైగా అవుట్ సోర్సింగ్ విధానంలో తమ వారికి ఉద్యోగాలు ఇచ్చారట. అలా చాలా మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించిన వాళ్లు ఇప్పటికీ స్వామి భక్తి చాటుకుంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించి వైసీపీ సోసియల్ మీడియాకు వాడుకునట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. విళ్లంతా ఇప్పటికి సజ్జల భార్గవ్ రెడ్డికి పనిచేస్తున్నట్లు భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సర్కారు సమాచారం లీకవుతోందా..

ఈ ప్రగతి, డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వైసీపీ సోషల్ మీడియా గ్రూపులను గతంలో భార్గవ్ రెడ్డి నడిపించడం గమనార్హం. ప్రభుత్వంలో కీలక శాఖ అయిన ఆర్టీజీఎస్‌ లో కీలక సమాచారాలను వైసీపీ పెద్దలకు., సజ్జల భార్గవ్ రెడ్డికి అందిస్తున్నట్లు సమాచారం. దాదాపు 70 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ప్రభుత్వ కీలక సమాచారాన్ని గోప్య విషయాలను భార్గవ్ రెడ్డికి చేరవేస్తున్నట్లు సచివాలయంలో టాక్. వీళ్లంతా ఒకే ఏజన్సీ ద్వారా ఆర్టీజీఎస్ లో పని చేస్తున్నట్లు సమాచారం. కార్యకలాపాలు ముగిసిన అనంతరం వీరంతా ప్రతిరోజూ సజ్జల భార్గవ్ తో సమీక్ష నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమీక్షలో ప్రభుత్వం ఎంచేయబోతుంది…. ప్రభుత్వ పరంగా ఎవరి మెడపై కత్తి పెట్టనుందో ముందుగానే భార్గవ్ కు సమాచారన్ని చేరవేసి అలెర్ట్ చేస్తున్నారట. ఇప్పటికే కీలక సంచారాన్ని అవుట్ సోర్సింగ్ టీమ్ చేరవేసినట్లు సమాచారం.

చాటు మాటు వ్యవహారం..

ఈ ఉద్యోగులు ఇస్తున్న సమాచారం మేరకే అనేక విషయాల్లో జగన్ కోర్ట్ లను ఆశ్రయిస్తున్నట్లు సంచారం. ప్రభుత్వం దృష్టి పెట్టకుంటే కీలక సమాచారం చేయి దాటి పోయే ప్రమాదని అంటున్నారు విశ్లేషకులు. వెంటనే వీరిపై నిఘాపెట్టి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.