ఏపీలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ

ఏపీలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సీపీ రవి శంకర్ అయ్యన్నార్‌ను సీఐడీ అదనపు డీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది.


ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీగా ఉన్న అతుల్ సింగ్‌ను ఏసీబీ డీజీగా నియమించింది. లా అండ్ ఆర్డర్ అనపు డీజీ శంకబ్రత బాగీని విశాఖ సీపీగా బదిలీ చేసింది.

కాగా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అవినితీ, అక్రమాలు, డ్రగ్స్, గంజాయి తదితర అంశాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా అన్ని విభాగాల్లో ప్రక్షాళన చేపట్టారు. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. తాజాగా సీనియర్ ఐపీఎస్‌ల ట్రాన్స్ ఫర్ చేయడంతో పాటు బాధ్యతలను సైతం అప్పగించారు.