టైమ్ ఆఫ్ డే టారీఫ్ అమలు చేస్తాంవిధి విధానాలు చెప్పండి
ఎపిఇఆర్‌సికి డిస్కంల ప్రతిపాదన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజానీకంపై మరింతగా విద్యుత్ భారాలు మోపడానికి రంగం సిద్ధమౌతోంది.
దీనిలోభాగంగా ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లను వినియోగదారుల అందరి ఇళ్లకుఅమర్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఎపిఇఆర్‌సికి విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్)లు ప్రతిపాదనలు సమర్పించాయి. వార్షిక ఆదాయ అవసర నివేదిక (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్ -ఎఆర్‌ఆర్)లోనే ఈ విషయానిు ప్రస్తావించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్‌లు గత వారం ఎఆర్‌ఆర్‌లను సమర్పించిన విషయం తెలిసిందే. వీటిలో వినియోగదారులనుండి వసూలు చేయాల్సిన ఛార్జీల వివరాలను పేర్కొనే విషయం తెలిసిందే. అయితే, తాజాగా సమర్పించిన ఎఆర్‌ఆర్‌లో ఆ వివరాలతో పాటు, ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్ల వినియోగానికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా డిస్కమ్‌లు చేశాయి. ‘హయ్యర్ లోడ్ వినియోగదారులతో పాటు, ఎల్‌టి టారిఫ్‌లోనిఅందరు వినియోగదారులకు’ స్మార్ట్ మీటర్లు బిగించనునుట్లు ఈ ప్రతిపాదనల్లో డిస్కమ్‌లు తెలిపాయి. ఈ మేరకుఅనుమతి ఇవ్వాలనిఎపిఇఆర్‌సినికోరాయి. దీంతో పాటు స్మార్ట్ మీటర్లు బిగించిన వెంటనే టైమ్ ఆఫ్ డే టారీఫ్‌ను అమలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేసినట్లు డిస్కమ్‌లు తెలిపాయి. వ్యవసాయ పంపు సెట్లకుమినహా మిగిలిన అందరు వినియోగదారులకుటైమ్ ఆఫ్ డే టారీఫ్‌ను సమర్ధవంతంగా వినియోగించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు ఎపిఇఆర్‌సికి డిస్కమ్‌లు తెలపడం గమనార్హం.
ఏమిటీ టైమ్ ఆప్ డే టారీఫ్ ?
విద్యుత్‌ను వినియోగించే సమయానిు బట్టి ఛార్జీలను విధించే విధానానేు టైమ్ ఆఫ్ డే టారీఫ్ అనిచెబుతునాురు. అంటే విద్యుత్ వినియోగానికి డిమాండ్ ఎక్కువ ఉను సమయంలో ఎక్కువ ఛార్జీలను విధిస్తారు. సాధారణంగా ఉదయం పూట, సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది,పదకొండు గంటల వరకుఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఆ సమయంలో వాడే కరెంటుకుఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తారు. అదే విధంగా ఆదివారాల్లో, సెలవు దినాల్లో కూడా ఇళ్లలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో కూడా గృహ అవసరాలకోసం వాడే విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదే విధంగా వేసవి కాలంలోనూ విద్యుత్ ఎక్కువగా ఉండే పగటి వేళల్లో ఛార్జీల మోత మోగే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యుత్‌కుడిమాండ్ పెరిగే అనిుసమయాల్లో (వినియోగదారుడు ఎంత తక్కువ వాడినా ) అధిక ఛార్జీలను భరించాల్సిఉంటుంది.
కేంద్రం ఆదేశాల మేరకే….
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తునుట్లు విద్యుత్ సంస్థలు చెబుతునాుయి. ఇఆర్‌సికి సమర్పించిన ఎఆర్‌ఆర్‌లోనూ ఈ విషయానిు పేర్కొనాుయి. 2024 జులై ఒకటిన కేంద్ర విద్యుత్‌శాఖ నుండి వచ్చిన ఆదేశాల మేరకుఎల్‌టి వినియోగదారులకుకూడా స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేయాలనినిర్ణయించినట్లు ఎఆర్‌ఆర్‌లో పేర్కొనాుయి. గతేడాదిజూన్‌లో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం టైమ్ ఆప్ డే టారీఫ్‌ను అమలు చేస్తునుట్లు తెలిపాయి.
టిడిపి…వైసిపిలది ఒకే దారి!
ప్రజలకుభారమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకువిద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేయడంలో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ఒకేదారిన నడుస్తునాుయి. వైసిపి ప్రభుత్వం 10.01.2024న, 7.05.2024న స్మార్ట్ మీటర్ల వినియోగానికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించినట్లు డిస్కామ్‌లు తాజాగా ఇఆర్‌సికి అందచేసిన నివేదికలో పేర్కొనాుయి. అప్పట్లో ఈ ప్రతిపాదనను టిడిపి తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తాజాగా టిడిపి ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను మరోమారు సమర్పించడంతో పాటు, వినియోగదారులందరికీ వర్తింపచేయడానికి, డిమాండ్‌ను బట్టి టారీఫ్‌ను మార్చడానికి ఇఆర్‌సి అనుమతి కోరింది.