జొన్నలు.. ఈ పేరు చెప్పగానే ఒక్కొకరి ముఖంలో ఒక్కో రియాక్షన్ కనిపిస్తుంది. పిల్లలైతే జొన్న రొట్టెలను చూస్తేనే ఆమడ దూరానికి పారిపోతారు. పెద్దల్లో ఈ తరం వారు ఎక్కువగా జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడరు. అయితే గోధుమ రొట్టెలతో పోల్చితే జొన్న రొట్టెల్లో పోషకాలు చాలా ఎక్కువ.
జొన్నలు తృణధాన్యాల రకం కిందకి వస్తాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది షుగర్, బీపీ, అల్సర్ వంటి అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరంతా ఇప్పుడు జొన్నల వైపు ఆసక్తి చూపుతున్నారు. వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఉద్బవించిన జొన్నలు ఆరోగ్యకర ఆహారంగా పేరుపొందాయి. జొన్నలను పిండి లేదా సిరప్‌గా తీసుకున్నా ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవచ్చు. మెరుగైన జీర్ణక్రియ, ఆరోగ్యవంతమైన గుండె, బరువుని అదుపులో ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయి. జొన్నల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాలు..
జొన్నలు ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో గణనీయమైన మొత్తంలో ప్రొటీన్, ఫైబర్, భాస్వరం, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాల వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
జీర్ణ వ్యవస్థ..
జొన్నలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పేగుల కదలికలకు సహాయం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఫైబర్ ప్రీబయోటిక్‌గా కూడా పనిచేస్తుంది. ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాను పోషిస్తుంది. జొన్నలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.
షుగర్ స్థాయిలు..
జొన్నలు తక్కువ గ్లైసెమిక్‌ని కలిగి ఉంటాయి. మధుమేహం కలిగి ఉన్నవారు తమ శరీరంలో ఉన్న చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయాలనుకుంటే జొన్నలు బెస్ట్ ఆప్షన్. జొన్నలను భోజనంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌లో వచ్చే స్పైక్‌లు, క్రాష్‌లను నివారించవచ్చు. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
గుండెలో..
జొన్నలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జొన్నలో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండూ హృదయ సంబంధ వ్యాధులతో ముడిపడి ఉంటాయి. జొన్నలోని అధిక ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుంది.
బరువు నియంత్రణ..
తినే ఆహారంలో రోజూ జొన్నలను చేర్చుకుంటే బరువు అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలన్నా జొన్నలు బాగా ఉపయోగపడతాయి. ఇందులోని అధిక ఫైబర్, ప్రొటీన్లు ఉంటాయి.