లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉండడం అన్నది కామన్. అయితే కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉండకూడదు. ఆర్థిక సమస్యలు ఉండకూడదు అంటే లక్ష్మి అనుగ్రహం కలగడం తప్పనిసరి.


మరి లక్ష్మి అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు వ్రతాలు, నోములు దానధర్మాలు వంటివి చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. అయితే అంతా బాగానే ఉంది కానీ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది ఆ విషయాన్ని ఎలా తెలుసుకోవచ్చు అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆంజనేయ స్వామి స్వరూపమైన కోతి అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి దేవుడి పటం దగ్గర పెట్టిన నైవేధ్యాన్ని లేదా కొబ్బరి చిప్పనో లేదా అరటిపండునో తీసుకెళ్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కాలుపెట్టబోతుందని అర్థం.

అలాగే నిద్రిస్తున్నప్పుడు కలలో తెల్లని గుర్రం లేదా ఏనుగులు కనబడితే త్వరలో ఆ వ్యక్తి కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందని అర్థం. కలలో ఎవరో మీ చెయ్యి పట్టుకొని నడిపించుకొని తీసుకెళ్తున్నట్లు కనబడితే భగవంతుడి అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతున్నాయని అర్థం. మీ ఇంటి చుట్టు పక్కల ఉండే ఆడవాళ్లలో ఎవరైనా మీ ఇంటికొచ్చి ఆకలేస్తుంది ఏదైనా పెట్టండి అని అడిగితే మీ పంట పండినట్లే అని వారికి తీపి పదార్థాలు పెట్టడం ద్వారా మీ ఇంట్లోని దరిద్రమంతా తొలగిపోతుందని, తద్వారా లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో అకస్మాత్తుగా మెలుకువ వచ్చి గంటలు మోగిన శబ్దం వినబడి, వాళ్ల మనస్సులో వాళ్లకు తెలియకుండా ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరీ మంత్రం లేదా ఓం నమో నారాయణాయ అనే విష్ణు అష్ఠాక్షరీ మంత్రాన్ని జపిస్తారో వాళ్లకి అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం.

పురుషులకు అస్తమానం కుడికన్ను అదురుతున్నా, కుడి చెయ్యి అదురుతున్న, అదేవిధంగా స్త్రీలకు అయితే ఎడమకన్ను,ఎడమ చెయ్యి అదురుతుంటే వాళ్లకు తొందర్లోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అంటున్నారు. సకల దేవతా స్వరూపి అయిన గోమాత శుక్రవారం లేదా మంగళవారం రోజు అనుకోకుండా మీ ఇంట్లోకి వచ్చినా లేదా ఇంటి ముందుకొచ్చి ఆహారాన్ని స్వీకరించినా,మూత్రం పోసినా,పేడ వేసినా మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి త్వరలోనే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం అంటున్నారు. ఇంట్లో పూజ చేసిన సమయంలో దేవుడికి మంగళ హారతి ఇచ్చేటప్పుడు దేవుడు పటంపై లేదా విగ్రహంపై ఉన్న పువ్వు అకస్మాత్తుగా జారిపడితే వారికి త్వరలోనే మంచిరోజులు రాబోతున్నాయని అర్థం అంటున్నారు పండితులు. అలాగే ఇంట్లోకి అకస్మాత్తుగా రామ చిలుక వస్తే ఆ ఇంట్లోవాళ్లకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. చిలుక మన్మథుడి వాహనం. మన్మథుడు లక్ష్మీదేవి కుమారుడు. కుబేరుడికి చిలుకకి కూడా గొప్ప సంబంధం ఉందని చెబుతున్నారు.