ఐన్‌స్టీన్ నుంచి థామస్ అల్వా ఎడిసన్ వరకు, పుల్లారెడ్డి నుంచి బిల్‌గేట్స్ వరకు ఇలా ఒక్కరో ఇద్దరో కాదు, తామున్న రంగంలో, నిత్య జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొని సక్సెస్ సాధించిన వ్యక్తులు చాలా మందే ఉన్నారు.
అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని, విజేతల సక్సెస్ సీక్రెట్స్ తెలుసుకొని ప్రేరణ పొందాలని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. అయితే ఏ విషయంలోనైనా సరే సక్సెస్ సాధించిన వ్యక్తులు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. అవేమిటో చూద్దాదం.
*క్లియర్ విజన్: లైఫ్‌లో సక్సెస్ సాధించిన ఏ వ్యక్తినైనా గమనించండి. వారిలో ఒక లక్షణం తప్పక ఆకట్టుకుంటుందని నిపుణులు చెబుతుంటారు. అదే క్లియర్ విజన్. నిజానికి తాము ఏం సాధించాలనుకుంటున్నారో, ఎలాంటి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలో స్పష్టతను, ముందు చూపును కలిగి ఉండటాన్నే క్లియర్ విజన్ అంటారు. ఈ తరహా వ్యక్తులు గంటకో విధంగా మారే రకం అస్సలు కాదు. ఇతరుల మెప్పుకోసమో, సౌకర్యాలకోసమో తమ క్యారెక్టర్‌ను, గోల్స్‌ను, ప్రవర్తనను మార్చుకోరు. అనుకున్న మార్గంలోనే కష్టపడుతూ ముందుకు వెళ్తుంటారు. సక్సెస్ సాధించిన వ్యక్తుల్లో 90 శాతం ఇలాంటివారే ఉంటారని నిపుణులు చెబుతున్నారు. సో.. మీ లక్ష్యం సాధించాలంటే క్లియర్ విజన్ చాలా ముఖ్యమని గుర్తించాలి.
*క్రమశిక్షణ : ఎంత టాలెంట్ ఉన్నా క్రమశిక్షణ లేకపోతే ఎక్కడో ఒక దగ్గర బొక్క బోర్లా పడతారని నిపుణులు చెబుతుంటారు. సక్సెస్‌ఫుల్ పీపుల్‌లో కనిపించే అత్యంత సాధారణ అలవాట్లలో క్రమశిక్షణ ఒకటి. ఇది కలిగి ఉండటంవల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తవచ్చు సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవడంలోనూ క్రమశిక్షణ మీకు సహాయపడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే జీవితంలోని ప్రతీ సందర్భంలో క్రమ శిక్షణ మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. తాత్కాలికంగా సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. క్రమ శిక్షణ ఉన్నవారినే ఈ సమాజం మెచ్చుకుంటుంది. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఫైనల్లీ అవకాశాలన్నీ వారివైపే మొగ్గుతుంటాయి.
*ఆచరణకే ప్రయారిటీ : విజయవంతమైన ఏ వ్యక్తినైనా గమనించండి. వారిలో కనిపించే ముఖ్య లక్షణం ఏమిటంటే వారు మాటలకంటే పనికి లేదా ఆచరణకు మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మాటలను, లక్ష్యాలను ఆచరణలో పెడుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఏమీ ఎరుగని అమాయక విద్యార్థుల్లా కనిపిస్తుంటారు సక్సెస్‌ఫుల్ పీపుల్. నిజానికి వీరు నిత్య విద్యార్థిలా ఉంటారు. నిండు కుండ తొణకదు అన్నట్లు అనవసర విషయాలకు ఆవేశ పడటమో, ఆందోళన చెందమో చేయరు. వాస్తవాలను బేరీజు వేసుకుంటూ ప్రశాంతంగా ఉంటారు. అదే వారిలో సక్సెస్‌కు కారణం అవుతూ ఉంటుందని నిపుణులు అంటున్నారు.
*టైమ్ మేనేజ్‌మెంట్ : ప్రతీ క్షణం మారుతూ ఉంటుంది. కాబట్టి సమయాన్ని సక్రమంగా సద్వినయోగం చేసుకోవాలని పెద్దలు, నిపుణులు అందరూ చెబుతుంటారు. విజయవంతమైన వ్యక్తుల్లో కనిపించే ముఖ్యమైన అలవాట్లలో ఇది కూడా ఒకటి. సమయం ప్రకారం నడుచుకోవడం, పనులు చేసుకోవడం, లక్ష్యం కోసం సమయాన్ని తమకు అనుకూలంగా మల్చుకోవడం, వాయిదా వేయడాన్ని మానుకోవడం వంటివి విజయవంతమైన వ్యక్తుల్లో ఉండే ప్రధాన లక్షణంగా నిపుణులు పేర్కొ్ంటున్నారు. మీరూ సక్సెస్ సాధించాలంటే ప్రతీ విషయంలో టైమ్ మేనేజ్‌మెంట్ సక్రమంగా ఉండాలని గుర్తుంచుకోండి.
*పాజిటివ్ మెంటాలిటీ : జీవితంలో సానుకూల, ప్రతికూల పరిస్థితులు, సందర్భాలు ప్రతీ ఒక్కరికీ ఎదురవుతుంటాయి. అయితే విజయవంతమైన వారిని గమనిస్తే గనుక.. వీరిలో అన్ని సందర్భాల్లోనూ నెగెటివిటీకంటే పాజిటివిటీ ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంటే కాస్త ఇబ్బందులు ఎదురు కాగానే.. ఇక లాభం లేదు అనుకోరు. మంచి రోజులు రాకపోతాయా? అని ఎదురు చూస్తారు. కష్టాలు, ఇబ్బందులేం శాశ్వతం కాదని భావిస్తారు. వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి పాజిటివ్ మెంటాలిటీని కలిగి ఉండటమే సక్సెస్‌ఫుల్ పీపుల్ టాప్ సీక్రెట్స్‌లో ఒకటి.
*మనీ మేనేజ్‌మెంట్ : జీవితంలో డబ్బు చాలా ముఖ్యం. కానీ డబ్బే సర్వస్వం కాదంటారు నిపుణులు. అయితే సంతోషంగా జీవించాలంటే మీ కనీస అవసరాలను తీర్చగలిగేందుకు డబ్బు కావాలి. కాబట్టి మీ దగ్గర ఎంతున్నదనేది ఇక్క పాయింట్ కాదు. ఉన్నంతలో ఎంత సంతోషంగా జీవిస్తున్నారన్నది కూడా ముఖ్యమే. అనవసరంగా ఖర్చు చేయకుండా అవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తూ ఉండటం, భవిష్యత్ గురించి ఆలోచించడం, పొందుపు చేయడం, ఏ సందర్భంలో ఎంత ఖర్చు పెట్టాలో తెలిసి ఉండటం వంటి విషయాల్లో క్లారిటీ ఉండాలి. విజయం సాధించిన ప్రతీ ఒక్కరిలో ఇలాంటి మనీ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగనీ వీరికి డబ్బు సంపాదన మీద ఆశ ఉండదు అని కాదు, ఉన్న డబ్బుతోనే ఆనందంగా జీవిస్తూ.. దానిని రెట్టింపు చేసుకునే ప్రయత్నం చేయడం వీరిలోని ప్రత్యేకత. పరిమితికి మించి అప్పులు చేసేకంటే.. తమవద్ద ఉన్నడబ్బుతోనే ఒక్కోమెట్టు ఎదిగే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటారు. ఈ సక్సెస్ సీక్రెట్స్‌ను స్ఫూర్తిగా, ప్రేరణగా తీసుకుంటే ఇక మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు!