సాధారణంగా 20 ఏళ్ల వయస్సులో యువత చదువుపై దృష్టి పెడుతుంటారు. కొందరు ఇంజనీరింగ్ కాలేజ్ వైపు వెళ్తుంటారు. అలాగే మరికొందరు డాక్టర్ కావాలని, ఇంకొందరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం రెడీ అవుతుంటారు.
కానీ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ప్రదీప్ దేవరకొండ మాత్రం ఈ వయస్సులోనే ఒక సంచలనం సృష్టిస్తున్నాడు.
అతను కేవలం 20 ఏళ్ల యువకుడు మాత్రమే కాదు, కృప కార్ప్ అనే కన్స్ట్రక్షన్స్ సొల్యూషన్స్ స్టార్టప్‌కు వ్యవస్థాపకుడు. ఇంత చిన్న వయస్సులోనే పెద్ద సక్సెస్ అందుకున్న ప్రదీప్, నిర్మాణ పరిశ్రమను తన స్టయిల్లో మార్చేందుకు సిద్ధమయ్యాడు. బిల్డర్లు, కాంట్రాక్టర్లు ఇంకా మౌలిక సదుపాయాల కంపెనీలకు తక్కువ ధరలకు నాణ్యమైన మెటీరియల్ వేగంగా అందించడమే కృప కార్ప్ ముఖ్య ఉద్దేశం.
నిర్మాణ రంగంలో మెటీరియల్ కొనడం ఎప్పుడూ ఒక పెద్ద తలనొప్పి. ఇంకా కేవలం పరిచయాలపై ఆధారపడి ఉంటుంది. కానీ బిల్డర్లను, సప్లయలర్లను కలపడానికి ఒక ప్రదేశం లేదు. దీన్ని చేయడానికే నేను కృప కార్ప్ ప్రారంభించాను,” అని ప్రదీప్ తన స్టార్టప్ ఆలోచన గురించి వివరించాడు.
ప్రదీప్ జీవితం ఒక ఆసక్తికరమైన ప్రయాణం అని చెప్పవచ్చు. ఎందుకంటే కాలేజ్ చదువు మధ్యలోనే ఆపేసిన అతను మొదట ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ నిర్మాణ రంగాల్లోని రెండు కంపెనీలలో పనిచేశాడు. కానీ అక్కడ తన ఆశయాలకు తగ్గట్టు లేకపోవడం విడిచిపెట్టాడు. నిర్మాణ మార్కెట్‌లోని అసౌకర్యాలను స్వయంగా చూసిన ప్రదీప్ బిల్డర్లు, కాంట్రాక్టర్లు, మౌలిక సదుపాయాల కంపెనీలు ఇంకా సొంత ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడే ఒక పరిష్కారం కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు.
చివరకు 2024లో ప్రదీప్ ఒక MVP (Minimum Viable Product)ని మార్కెట్‌లోకి విడుదల చేశాడు. ఇది కేవలం మార్కెట్ సమస్యను పరిష్కరించగలదా లేదా అని పరీక్షించడానికి రూపొందించిన ఒక డిజిటల్ ఉత్పత్తి. ఆశ్చర్యకరంగా, కేవలం ఒక్క సంవత్సరంలోనే, అంటే 2024 చివరి నాటికి ప్రదీప్ తన పైలట్ ప్రాజెక్ట్ ద్వారానే రూ.50 లక్షల ఆదాయాన్ని సంపాదించాడు. దింతో అతను చేస్తున్న పని సరైనదని అతనికి నమ్మకం వచ్చింది.
అలాగే 2025లో ప్రదీప్ అధికారికంగా కృప కార్ప్ అనే కన్స్ట్రక్షన్స్ సొల్యూషన్స్ స్టార్టప్‌ను ప్రారంభించాడు. ఈ సంస్థ నిర్మాణ సామగ్రి అందించడం ఈజీగా చేయడం. ఇంకా కస్టమర్లు వివిధ రకాల నిర్మాణ ఉత్పత్తులను ఒకే చోట చూడగలగాలి, వాటి ధరలను పోల్చగలగాలి అలాగే నాణ్యతను బట్టి సరైన నిర్ణయం తీసుకోగలగాలి అనేదే ప్రదీప్ ఆలోచన.
దీని కోసం అతను ఒక చిన్న టెక్ టీం ఏర్పాటు చేసి నిర్మాణ పరిశ్రమలోని మొత్తం సప్లయ్ చైన్ డిజిటలైజ్ చేసే పనిలో పడ్డాడు. అయితే, ఈ ప్రయాణంలో అతనికి కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. కొన్నిసార్లు లాజిస్టిక్స్ సమస్యలు తలెత్తేవి, మరికొన్నిసార్లు బిల్డర్లు హఠాత్తుగా ఆర్డర్‌లను క్యాన్సల్ చేసుకునేవారు. అంతేకాకుండా నిర్మాణ ప్రాజెక్టులు తొందరగా పూర్తి చేయాల్సిన ఒత్తిడి ఉన్నప్పుడు డెలివరీలను వేగంగా చేయమని బిల్డర్ల నుండి ఒత్తిడి వచ్చేది.
ఎటిఎంలో ‘క్యాన్సల్’ బటన్ నొక్కుతున్నారా.. ఆర్బీఐ వార్నింగ్.. నిజమేంటంటే !
అన్ని సవాళ్లను అధిగమిస్తూ ప్రదీప్ తన లక్ష్యం వైపు అడుగులు వేసాడు. ఇటీవల మార్చి 2025లో కృప కార్ప్ కృప మార్కెట్ అనే ఒక B2B బిజినెస్ ప్రారంభించింది. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న కన్స్ట్రక్షన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది. బిల్డర్లు, కాంట్రాక్టర్లు కస్టమర్ డేటా, ఆర్డర్‌లను ట్రాక్ చేయవచ్చు ఇంకా డెలివరీ తేదీలను కూడా పేర్కొనవచ్చు. కృప మార్కెట్ ముఖ్యంగా కాంట్రాక్టర్లు, బిల్డర్ల కోసం, సొంత ఇల్లు కట్టుకునే వారు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. కృప మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ మాట్లాడుతూ కృప మార్కెట్ని ప్రశంసించారు.
ప్రదీప్ తన విజయాన్ని ఇక్కడితో ఆపకుండా హోమ్ అప్లియెన్సెస్, నిర్మాణ సామగ్రి కోసం కృప రిటైల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక రిటైల్ వ్యాపార విభాగాన్ని ప్రారంభించాలని చూస్తున్నాడు. దీని ద్వారా స్థానిక చిన్న వ్యాపారులు, ఆర్కిటెక్ట్‌లు, ఇంటి ఓనర్లకు నిర్మాణ సామగ్రిని అందుబాటులోకి తేవాలని అతని లక్ష్యం. 20 ఏళ్లకే ఇంతటి విజయాన్ని సాధించిన ప్రదీప్ దేవరకొండ నిజంగా నేటి యువతకు ఒక స్ఫూర్తి అని చెప్పవచ్చు.