Pakistan Army: పుల్వామా దాడిలో పాక్‌ పాత్ర.. నిజాలు బయటపెట్టిన పాక్‌ సైనిక అధికారి!

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత నేపథ్యంలో పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారి ఔరంగజేబ్ అహ్మద్ చేసిన ఓ ప్రకటన సంచలనంగా మారింది. ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో పాకిస్తాన్ సైన్యం పాత్ర కూడా ఉందని పాకిస్థాన్ సైనిక ఉన్నతాధికారి ఔరంగజేబ్ అహ్మద్ అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఈ నిజాన్ని అంగీకరించాడు.


పుల్వామా దాడిని పాకిస్తాన్ ‘వ్యూహాత్మక ప్రతిభ’గా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ పుల్వామా దాడి గురించి మా వ్యూహాత్మక ప్రతిభతో భారత్‌కు చెప్పడానికి ప్రయత్నించిందని ఆయన అన్నారు. తమ గగణతలం, భూ, జలాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడితే రాజీపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. తాము దేశానికి రుణపడి ఉన్నామని..పాక్‌ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుతామని ఆయన అన్నారు. ఈ ప్రకటన సమయంలో ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ తో పాటు డిజి ఐఎస్పిఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరితో పాటు నేవీ ప్రతినిధి కూడా ఉన్నారు.

అయితే ఇప్పుడు పాక్‌ అధికారి చేసిన ప్రకటన పుల్వామా దాడిలోనే కాకుండా ఇటీవలి పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో కూడా పాకిస్తాన్ పాత్ర ఉందన్న అనుమానాలను నిజం చేసింది అనుకోవచ్చు. ఈ ప్రకటనతో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలైంది.

ఇక ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది CRPF జవాన్లు అమరులయ్యారు. అయితే ఈ దాడికి జైష్-ఎ-మొహమ్మద్ (JeM) బాధ్యత వహించింది. కానీ భారత్‌ మాత్రం పాకిస్తాన్‌పై అనుమానం వ్యక్తం చేసింది. కానీ ఈ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ ఇందుతో తమ ప్రమేయం లేదని గట్టిగా వాధిస్తూ వచ్చింది. అయినప్పటికీ ఈ ఉగ్రదాడిలో పాక్‌ హస్తం ఉన్నట్టు భారత్ అనేక ఆధారాలను కూడా బయటపెట్టింది. కానీ నాటి పాక్‌ ప్రధాని మాత్రం వాటిని పట్టించుకోలేదు. ఈ ఉగ్రదాడిలో తన సైన్యం పాత్ర లేదని బకాయిస్తూ వచ్చారు. అయితే ఆరేళ్ల తర్వాత పాక్‌కు చెందిన సైనిక అధికారే పుల్వామా దాడిలో తమ పాత్ర ఉందని ఒప్పుకోవడంతో పాక్‌ వ్యవహారం బయటపడింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.