Tenth Class Exams: పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది.

Tenth Class Exams

తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి. పరీక్షలు ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి.


10వ తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి జరుగుతాయని తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. హాల్ టిక్కెట్లను తన అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని SSC బోర్డు తెలిపింది.

హాల్ టిక్కెట్లు అవసరమైన విద్యార్థులు మార్చి 7 నుంచి సైట్ నుండి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు, హాల్ టిక్కెట్లను ఇప్పటికే జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రతి పాఠశాలకు పంపినట్లు వెల్లడించారు. ప్రతి విద్యార్థి వాటిని పరీక్షా గదికి తీసుకెళ్లాలని సూచించారు.

ఇదిలా ఉండగా, ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి.

ఈ సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మరోవైపు, విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే లేదా సమాచారం అవసరమైతే, వివరాల కోసం ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయానికి 040-23230942 నంబర్‌కు కాల్ చేయవచ్చు.