విద్యార్థులకు గొప్ప అవకాశం.. కెరీర్ గైడెన్స్ పై అతిపెద్ద విద్యా ఉత్సవం! ప్రవేశం ఉచితం..

ఇంటర్మీడియట్, డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే లక్ష్యంగా దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్‌ ఎక్స్ పో మన హైదరాబాద్ లో జరగనుంది. ఈ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ హైదరాబాద్‌లో మే 23 నుంచి 25 వరకు మూడు రోజులపాటు హైటెక్ సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని హాల్ నంబర్ 1లో జరుగుతుంది. ఇక విజయవాడలో మే 31, జూన్ 1 తేదీల్లో SS కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది..

విద్యార్ధుల ఉన్నత భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు.. విద్య అవకాశాలపై సందేహాల నివృతికి చక్కని అవకాశం మీ ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్‌ ఎక్స్ పో జరగనుంది. ఎంట్రీ ఫ్రీ కూడా పూర్తిగా ఉచితం. TV9 నెట్‌వర్క్, KAB సంయుక్తంగా ఈ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2025ను నిర్వహిస్తోంది. ఇంటర్మీడియట్, డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే లక్ష్యంగా దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, బెంగళూరు, హుబ్బళ్లి, గుల్బర్గా, పాట్నా, కోల్‌కతా, గౌహతి, పూణే, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌తో సహా దేశంలోని మొత్తం15 ప్రధాన నగరాల్లో ఈ ఎడ్యుకేషన్ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. ఈ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ హైదరాబాద్‌లో మే 23 నుంచి 25 వరకు మూడు రోజులపాటు హైటెక్ సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని హాల్ నంబర్ 1లో జరుగుతుంది. ఇక విజయవాడలో మే 31వ తేదీన SS కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. వైజాగ్‌లో జూన్ 1వ తేదీన చిల్డ్రన్ అరీనాలో నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విద్యార్ధులు ఈ ఎడ్యుకేషన్ ఎక్స్‌పోకి హాజరుకావచ్చు.


ఈ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, విద్యా సంస్థలను ఒకే రూఫ్‌ కిందకు తెస్తుంది. ఈ ఎక్స్‌పో విద్యార్థులకు విస్తృత శ్రేణి ఉన్నత విద్యా కోర్సుల గురించి సమగ్ర సమాచారాన్ని అందించడానికి సిద్ధం చేశారు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ నుంచి హోటల్ మేనేజ్‌మెంట్, వ్యవసాయం, ఫ్యాషన్ టెక్నాలజీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సుల వరకు విస్తృత శ్రేణి కెరీర్ అవకాశాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా ఈ ఎక్స్‌పోలో దిశానిర్దేశం పొందొచ్చు.

ఎక్స్‌పో ముఖ్యాంశాలలో మరో కీలకాశం ఏంటంటే.. విద్యార్ధులకు ఉచిత నిపుణుల కౌన్సెలింగ్ కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు వారి ఆసక్తులు, విద్యా నేపథ్యం ఆధారంగా తగిన కోర్సులను ఎంచుకోవడం గురించి నిపుణుల సలహాలను పొందవచ్చు. ఎక్స్‌పోలో EAPCET, ECET, JoSAA, NEET వంటి కీలక ఎంట్రన్స్‌ టెస్ట్‌లకు వెబ్ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. ఇది విద్యార్థులు తమ స్కోర్‌ల ఆధారంగా ఏయే ఎంపికలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో పాటు ఈ ఎక్స్‌పోకు హాజరు కావచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఈ ఎక్స్‌పో కీలకమైన సమాచారం అందించగలదు. అగ్రశ్రేణి సంస్థలు, నిపుణుల మార్గదర్శకత్వం, పూర్తి సమాచారం మొత్తం ఒకే చోట అందుబాటులో ఉంటాయి. ఈ ఈవెంట్‌ను కేవలం ఒక ఎక్స్‌పోగా కాకుండా, వచ్చే ప్రతి విద్యార్థికి కెరీర్‌ను మార్చే అనుభవంగా మార్చాలని TV9, KAB లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఏ తేదీల్లో ఎక్కడెక్కడంటే..

  • హైదరాబాద్: మే 23 నుంచి 25 వరకు, 2025.

వేదిక: హాల్ నెంబర్ 1, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైటెక్ సిటీ, హైదరాబాద్.

  • విశాఖపట్నం: జూన్ 1, 2025.

వేదిక: చిల్ట్రన్ అరేనా (Children Arena)

  • విజయవాడ: మే 31, జూన్ 1 తేదీల్లో 2025.

వేదిక: ఎస్ఎస్‌ కన్వెన్షన్‌ (SS Convention)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.