ప్రముఖ సినీ నటుడు, వైసీపీ పార్టీ నేత పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) ని పోలీసులు అరెస్ట్ చేసి సరిగ్గా రెండు వారాలు అయ్యింది.
మీ అందరికి నందమూరి హరికృష్ణ ‘సీతయ్య’ సినిమా గుర్తు ఉండే ఉంటుంది. అందులో విలన్ ని హరికృష్ణ పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిప్పుతూ వీరబాదుడు బాదుతాడు. పోసాని కృష్ణ మురళి ని అలా కొట్టారో లేదో తెలియదు కానీ, పోలీస్ స్టేషన్స్ చుట్టూ మాత్రం ఆయనని తిప్పుతూనే ఉన్నారు. అయితే ఎట్టకేలకు పోసాని కి దాదాపుగా అన్ని కేసులలో నిన్న బెయిల్ వచ్చింది. ఇక బెయిల్ వచ్చేసింది, ఇంటికి వెళ్లిపోవచ్చని పోసాని కాస్త ఆనందపడేలోపు మరో పీటీ వారెంట్ వచ్చింది. మంగళగిరి పోలీసులు పోసాని ని అదుపులోకి తీసుకునేందుకు పీటీ వారెంట్ తో వచ్చారు. దీంతో పోసాని తనకు పీటీ వారంట్ ని రద్దు చేయాల్సిందిగా హై కోర్టు లో లంచ్ మోషన్ పిటీషన్ దాఖా చేశాడు.
నేడు ఈ పిటీషన్ పై విచారణ జరిపిన ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు పోసాని పిటీషన్ ని రద్దు చేసింది. దీంతో మంగళగిరి పోలీసులు కర్నూలు లో అదుపులోకి తీసుకొని మంగళగిరి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఇక్కడ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఇదంతా చూసిన తర్వాత పోసాని ని ఇప్పట్లో వదిలేలా లేరని స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ కేసు లో ఆయనకు బెయిల్ భవిష్యత్తులో లభించినా, మరో కేసు లో అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మనోడు అధికారం లో ఉన్నప్పుడు నోటికి ఆనకట్ట వేసుంటే ఈ రేంజ్ లో పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరిగే అవసరం ఉండేది కాదు. అధికారం శాశ్వతం అనుకున్నాడు కాబట్టే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇతను మాట్లాడిన మాటలను ఒక్కసారి చూస్తే మనిషి అన్నోడికి కోపం, అసహ్యం రాకుండా ఉండదు. పోలీస్ స్టేషన్ నుండి విడుదల అయ్యాక అయినా చక్కగా ఉంటాడో లేదో చూడాలి.