ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో 40 డిగ్రీల సెల్సియస్ కు మించిన ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
అయితే బంగాళాఖాతం వల్ల వర్షాలు పడే ఛాన్స్ పెరిగాయి. నేడు రెండు రాష్ట్రాల్లో ఎండలు ఉంటాయి. అయితే రాయలసీమ, కోస్తాంద్రలో మాత్రం మేఘాలు బాగా వస్తాయి. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణలో వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఎండ కూడా బాగా ఉంటుంది. తెలంగాణలో మేఘాలు కూడా పెద్దగా రావు. ఎండ బాగా ఉంటుంది. కానీ ఏపీలో వాతావరణం మారుతోంది. ఒక బలమైన సుడిలాటింది ఉంటుంది. కేరళ నుంచి కర్నాటక మీదుగా ఏపీలోని రాయలసీమకు వస్తూ అక్కడి నుంచి కోస్తా వైపుగా వెళ్తోంది. అందువల్ల మేఘాలు కూడా అదేవిధంగా వస్తాయి.
తెలంగాణలో 35నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఉత్తర తెలంగాణ ఎండలతో భగ్గుమంటుంది. ఏపీలో ఉష్ణోగ్రత 34 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అయితే మధ్యాహ్నం తర్వాత మేఘాలు బాగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల రాయలసీమ, కోస్తాంధ్ర యానాం ప్రజలకు కొంచెం ఉపశమనం కలుగుతుంది. తేమ తెలంగాణలో 30శాతం ఉండగా..ఏపీలో 44శాతం ఉంది. అయితే మేఘాలు వస్తాయి కాబట్టి ఏపీలో తేమ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వర్షం పడనట్లయితే కనీసం వేడి తగ్గే అవకాశాలు ఉంటాయి. గాలులు వేగంగా ఉన్నాయి. కాబట్టి ఎండలో బయటకు వెళ్లేవారికి కొంత ఉపశమనంగా ఉంటుంది. అయితే వేడి గాలులతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అవి దాహం ఎక్కువ వేసేలా చేస్తాయి.
ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి భారీ మేఘాలు తెలుగు రాష్ట్రాలవైపు వస్తున్నాయి. రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణకు చేరే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణాదిన ఉన్న మేఘాలు కూడా ఏపీ, తెలంగాణ వైపు వస్తున్నాయి. ఇవన్నీ వర్షాలు కురిసేందుకు అనుకూలంగా మారవచ్చు. వర్షం కురిస్తే మాత్రం భారీగా కురుస్తుంది. లేదంటే భూమి నుంచి ఆవిరిపైకి వస్తూ ఉక్కపోతగా అనిపివచ్చే అవకాశం ఉంటుంది.