ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా వందేభారత్ రైళ్ల అంశం తెరపైకి వచ్చింది. ఈ మేరకు లోక్‌సభలో ఈ అంశాన్ని ఏపీకి చెందిన ఎంపీలు ప్రస్తావించారు. తిరుపతి మీదుగా నెల్లూరు-మైసూరు మధ్య కొత్త వందేభారత్ రైలును ప్రారంభించాలని అరకు ఎంపీ తనూజారాణి రైల్వేశాఖ మంత్రిని కోరారు. అలాగే తిరుపతి-విశాఖపట్నం మధ్య వందేభారత్ స్లీపర్ రైలును నడపాలని రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు వాల్తేరు డివిజన్ నుంచి కేకే లైన్‌ను తొలగించి కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాయగడ డివిజన్‌లో చేర్చడం సరికాదని సభలో ప్రస్తావించారు. ఈ నిర్ణయం వల్ల ఏపీ ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందని.. అలాగే వ్యాలీ రైల్వేస్టేషన్‌ను వాల్తేరు డివిజన్‌లోనే ఉంచాలని కూడా రిక్వెస్ట్ చేశారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న దక్షిణకోస్తా రైల్వేజోన్‌కు శాశ్వత జనరల్ మేనేజర్‌ను నియమించాలని కూడా తనూజా రాణి కోరారు.
ఏపీలో నడిచే రైళ్లలో జనరల్ కోచ్‌లను, అలాగే కొత్తగా వందేభారత్ రైళ్లను పెంచాలని కోరారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. ఏపీకి కేటాయించిన 73 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలని.. ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు త్వరగా అందుబాటులోకి తేవాలని రిక్వెస్ట్ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో రైల్వేశాఖ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎంపీలను ఆహ్వానించాలని కూడా సభలో కేంద్రమంత్రిని కోరారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ పనులు 25 ఏళ్లుగా సాగుతున్నాయని.. ఈ పనుల్ని వేగంగా పూర్తి చేయాలన్నారు. మార్కాపురం-శ్రీశైలం రైల్వేలైన్, ఒంగోలు-దొనకొండ వయా పొదిలి రైల్వేలైన్ పనుల్ని కూడా వేగవంతం చేయాలని కోరారు.
అమరావతి రైల్వే లైన్‌ను ఆమోదించడంతో పాటుగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. మల్టీ-మోడల్ కమర్షియల్ కార్గో టెర్మినల్‌ను విజయవాడ సమీపంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రధాన నగరాలు, ఓడరేవులతో అనుసంధానిచడం ద్వారా ఆర్థిక వృద్థిని పెంపొదించేందుకు అరావతి రైల్వే లైన్ కీకలంగా మారబోతోందన్నారు. విజయవాడలోని గుణదల-బెజవాడ క్రాసింగ్ ఆర్వోబీ నిర్మాణానికి జాయింట్ సర్వే పూర్తయిందన్నారు. ఈ ఆర్వీబీని వెంటనే ఆమోదించాలని రిక్వెస్ట్ చేశారు. విజయవాడ రైల్వే డివిజన్ దేశంలోనే అత్యధిక ఆదాయం సాధిస్తోందన్నారు. అమృత్‌భారత్ స్టేషన్ పథకం కింద విజయవాడ స్టేషన్ అభివృద్ధికి కేటాయించిన నిధులు మూడేళ్లయినా ఇవ్వలేదని గుర్తు చేశారు.
విజయవాడలోని అజిత్ సింగ్‌నగర్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయంలో రైల్వే గేట్లు మూయడంతో వాహనదారులు ఒక్కోసారి గంటకుపైగా ఆగిపోవాల్సి వస్తుందన్నారు. నగరంలో ఆర్వోబీల పనుల్ని వేగంగా పూర్తిచేయాలని రిక్వెస్ట్ చేశారు. అలాగే విజయవాడ సమీపంలోని పరిటాల దగ్గర మల్టీమోడల్ కమర్షియల్ కార్గో టెర్మినల్ ఏర్పాటు.. వాణిజ్యానికి ఊతం ఇవ్వనుందని ఎంపీ చిన్ని పేర్కొన్నారు.