ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన తన నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా మానవ వాళికి ఉపయోగపడే అనేక అంశాలను తెలియజేశాడు.
అవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇక చాణక్యడు స్త్రీ, బంధాలు, బంధుత్వాలు, డబ్బు, స్నేహం, విద్య, ఉద్యోగం, ఇలా చాలా అంశాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే.
అలాగే జీవితంలో సక్సెస్ అయ్యే వారి గురించి కూడా కొన్ని విషయాలను తెలియజేశాడు. ప్రతి వ్యక్తీ తమ జీవితంలో త్వరగా సక్సెస్ అందుకోవాలని, మంచిగా సంపాదించుకొని గొప్పస్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. కానీ కొన్ని సార్లు కొంత మంది కష్టపడి పని చేసినప్పటికీ త్వరగా విజయాన్ని అందుకోలేరు. అది వారిని మానసికంగా కుంగదీస్తుంది.
అటువంటి పరిస్థితుల్లో తప్పు ఎక్కడ జరుగుతుందో మనం తెలుసుకోవాలి. లేకపోతే జీవితంలో ఎదగడం చాలా కష్టం అని తెలిపారు. చాణక్యుడు పలు విధానాల ద్వారా ఏ వ్యక్తులు ధనవంతులు అవుతారో,ఎందుకు అవుతారో తెలియజేశారు. మీరు కూడా వారిలో ఒకరో కాదో తెలుసుకోవాలనుకుంటే, ఈ న్యూస్ చదవాల్సిందే మరి !
చాణక్యనీతి శాస్త్రం ప్రకారం.. చాణక్యుడు ప్రజలు తమ జీవితంలో విజయాన్ని అందుకోవాలంటే, కష్టపడి పని చేయడం మాత్రమే సరిపోదు అని చెప్పుకొచ్చాడు. ఒక వ్యక్తికి ఆలోచన, అలవాట్లు, ప్రవర్తన చాలా ముఖ్యమైనవి. అంతే కాకుండా సమయానికి విలువనిచ్చి, సరైన నిర్ణయాలు తీసుకుని తన లక్ష్యంపై దృష్టి సారించే వ్యక్తి మాత్రమే ముందుకు సాగుతాడని తెలిపారు.
సోమరితనం లేదా ప్రతి పనిని వాయిదా వేసే వ్యక్తులు ఎప్పటికీ ధనవంతులు కాలేరని, అంతే కాకుండా వారు జీవితంలో విజయం సాధించలేరని చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా తెలిజయేశాడు. అలాంటి వ్యక్తులు జీవితాంతం ఇతరులపై ఆధారపడి ఉంటారు. తనను తాను నమ్మే వ్యక్తి, నిరంతరం తన తప్పుల నుండి కొత్త విషయాలు నేర్చుకుంటాడు విజయం సాధిస్తాడని తెలిపాడు.