సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందాలు ఎంత ఫేమసో, తెలుగు సినిమాలు రిలీజ్ కావడం అంతే ఫేమస్. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి సినిమా ఇండస్ట్రీకి అతి పెద్ద పండుగ.పెద్ద హీరోల సినిమాలు సాధ్యమైనంత వరకు సంక్రాంతి రేసులో ఉండేలా ప్లాన్ చేస్తుంటారు.
ఫ్యామిలీ అంతా కలిసి కేవలం సంక్రాంతి పండక్కి మాత్రమే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తుంటారు. ఈ కారణంగానే పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదల అయ్యేలా చూస్తుంటారు. తద్వారా సినిమాలకు భారీ కలెక్షన్లు సాధిస్తాయి.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంక్రాంతికి సైతం మూడు భారీ సినిమాలు విడుదలయ్యాయి. నందమూరి బాలకృష్ణ, యాక్షన్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం “డాకు మహారాజ్”,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తమిళ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం “గేమ్ ఛేంజర్”,విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” ఈ మూడు సినిమాలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిల్లో “డాకు మహారాజ్”,”సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలు హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి.
భారీ అంచనాల మధ్య విడుదలైన “గేమ్ ఛేంజర్” మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్‌గా నిలిచింది.’గేమ్ ఛేంజర్’ చిత్రం సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 10) ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మెగా అభిమానులు సైతం సినిమాపై పెదవి విరుస్తున్నారు. రూ.450 కోట్ల రూపాయిలతో భారీ బడ్జెట్‌తో ‘గేమ్ ఛేంజర్’ను నిర్మించారు.
అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. తెలిసిన కథే అయినప్పటికీ, కథను నడిపించడంలో వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో తర్వాత సినిమా మరింత నీరసం తెప్పించిందని అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు సినిమా కలెక్షన్లు సైతం ఆశించిన స్థాయిలో లేవు. ఫస్ట్ డే రూ.51 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా 2వ రోజు గణనీయంగా తగ్గుముఖం పట్టింది.
దాంతో రెండో రోజైన శనివారం రూ.21.6 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. మూడవ రోజైన ఆదివారం (జనవరి 12) న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.17 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో గేమ్ ఛేంజర్ ఆరు రోజుల్లో గేమ్ ఛేంజర్ మూవీ నెట్ కలెక్షన్లు రూ.110.03 కోట్లకు చేరుకుంది.ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.ఎంత తీసేసిన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగానే నష్టాలను తెచ్చేలా కనిపిస్తోంది.