మైగ్రేన్ అనేది ఒక రకమైన తీవ్రమైన తలనొప్పి. ఇది సాధారణ తలనొప్పికి చాలా భిన్నంగా ఉంటుంది. ఇది ఒక నాడీ సంబంధిత సమస్య. తలలో ఒక వైపున బాగా నొప్పి ఉంటుంది. ఈ నొప్పి కొన్ని గంటల నుండి చాలా రోజుల వరకు ఉంటుంది. అంతేకాకుండా, తరచుగా వికారం, వాంతులు వంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. మీరు కూడా మైగ్రేన్ వల్ల బాధపడుతుంటే ఇంట్లోనే ఈ సాధారణ నివారణను ప్రయత్నించండి. నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.
మైగ్రేన్ కారణంగా తలనొప్పి ఉంటే మొదట సగం బకెట్‌లో గోరువెచ్చని నీరు తీసుకుని ఆపై మీ పాదాలను అందులో ముంచి 15 నిమిషాలు అలాగే ఉండండి. తలలో నొప్పి క్రమంగా తగ్గుతుంది. ఈ ప్రక్రియలో ఉపశమనం పొందడానికి తలపై కోల్డ్ జెల్ ప్యాక్ కూడా ఉంచండి. మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం పొందారు.
మైగ్రేన్లను ప్రేరేపించే సాధారణ కారణాలు ఒత్తిడి, నిద్ర లేకపోవడం లేదా హార్మోన్ల మార్పులు (ముఖ్యంగా మహిళల్లో), కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలు (చాక్లెట్, చీజ్, రెడ్ వైన్, కెఫిన్ వంటివి), ప్రకాశవంతమైన లైట్లు, బిగ్గరగా శబ్దాలు, వాతావరణ మార్పులు, ధూమపానం. కొన్ని సార్లు ఈ అలవాట్లు మైగ్రేన్ వచ్చేలా చేస్తాయి. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. నొప్పి నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది వైద్యుడిని సంప్రదించండి.