ఉదయం టిఫిన్ కి ఏం చేయాలో ఆలోచిస్తున్నారా? 15 నిమిషాల్లో తయారు చేయగల టిఫిన్ వంటకాలు మీ కోసం.

మిగిలిపోయిన అన్నం ఉంటే చాలు ఇది సులభంగా తయారవుతుంది. ఒక పాన్‌ లో నూనె వేయాలి. ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మినపప్పు, వేరుశెనగలు వేసి వేయించాలి.


కొద్దిగా పసుపు, ఉప్పు వేయాలి. చివరగా నిమ్మరసం చిందించి అన్నంలో కలిపితే సరిపోతుంది. చల్లారినా రుచిలో మార్పు ఉండదు.

రవ్వ ఉప్మాతో తయారయ్యే ఈ ఉప్మా ఉదయం ఆకలిని బాగా తీరుస్తుంది. దీన్ని తయారు చేయడానికి ముందుగా రవ్వను వేయించాలి. తర్వాత ఒక పాన్‌ లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. అవి వేగాక వేడి నీళ్లు పోసి రవ్వను నెమ్మదిగా జల్లుతూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా చేస్తే తక్కువ సమయంలోనే రుచికరమైన ఉప్మా సిద్ధమవుతుంది. ఇది త్వరగా సులభంగా చేసుకునే అల్పాహారం.

పెసరపప్పుతో తయారయ్యే ఈ దోశ ఉదయపు భోజనానికి చాలా సరైనది. నానబెట్టిన పెసరపప్పుతో టొమాటో, అల్లం, మిరపకాయలు వేసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై పోసి రెండు వైపులా కాల్చితే చాలు. చట్నీ లేకుండానే రుచిగా తినవచ్చు.

ఇడ్లీ లేదా దోశ పిండి లేనప్పుడు రాగి పిండి మంచి ప్రత్యామ్నాయం. రాగి పిండి, బియ్యపు పిండి, పెరుగు, ఉల్లిపాయలు, కొత్తిమీర కలిపి నీటితో పల్చగా చేయాలి. పెనంపై వేసి కాల్చాలి. ఇది ఐరన్, కాల్షియంతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం.

రెడీ టు కుక్ రైస్ వర్మిసెల్లి ఉపయోగించండి.. చాలా త్వరగా ఈ వంటకం తయారవుతుంది. వేడి నీటిలో వర్మిసెల్లిని నానబెట్టి వడపోసి పాన్‌ లో కరివేపాకు, ఆవాలు, ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికం వేయించాలి. చివరగా వర్మిసెల్లి రైస్ ని ఉప్పుతో కలపాలి. తేలికగా ఉండే ఈ వంటకం టిఫిన్ బాక్స్ కోసం చాలా బాగుంటుంది.

ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక పాన్‌ లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేయాలి. ఆ తర్వాత ఇడ్లీ ముక్కలను వేసి బాగా వేయించాలి. ఇలా తయారు చేసిన పొడి ఇడ్లీ చాలా రుచిగా ఉంటాయి. ఇది టిఫిన్ బాక్స్‌ లో చల్లారినా కూడా దాని రుచి మారదు. అలాగే ఉంటుంది.

పెరుగు అన్నం తయారు చేయడం చాలా సులభం.. తినడానికి చాలా హాయిగా ఉంటుంది. ముందుగా అన్నంలో పెరుగు, కొద్దిగా పాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఆవాలు, కరివేపాకు, అల్లంతో తాలింపు వేసి అన్నంలో కలుపుకోవాలి. చివరగా పైన ద్రాక్షలు లేదా దానిమ్మ గింజలు వేసుకుంటే పెరుగు అన్నానికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.