బరువు తగ్గాలంటే ఈ రాత్రి సమయంలోనే తినాలి..! లేకపోతే అంతే.

ప్రస్తుత రోజుల్లో చాలా మంది బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం వ్యాయామం చేయడం, ఆహారాన్ని నియంత్రించడం వంటి మార్గాలను పాటిస్తున్నారు. అయితే చాలా మంది ఒక ముఖ్యమైన విషయం మాత్రం దృష్టిలో పెట్టుకోరు.. అది రాత్రి భోజనం చేసే సమయం. సరిగ్గా నిర్ణీత సమయంలో డిన్నర్ చేయడం ద్వారా బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.

ఒకరోజు డిన్నర్ త్వరగా తింటే ఆ ఒక్కరోజుతో బరువు తక్కువవదు. కానీ దీని ప్రభావం మీరు తిన్న ఆహారం శరీరంలో ఎలా జీర్ణమవుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. శరీరంలోని సహజ శరీర గడియారం (circadian rhythm) నిద్ర, శక్తి, జీర్ణక్రియ, హార్మోన్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. మీరు రాత్రి ఆలస్యంగా తింటే శరీరం పూర్తిగా జీర్ణం చేయకపోవచ్చు. దీని వల్ల కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది.


ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం.. రాత్రి భోజనాన్ని సాయంత్రం 7 గంటల లోపు తీసుకోవడం ఉత్తమం. దీని వల్ల పడుకోకముందే ఆహారం కొంతవరకు జీర్ణమవుతుంది. అలా చేయడం వల్ల రాత్రివేళ ఆకలి వేయడం తగ్గుతుంది. అంతేకాకుండా మంచి నిద్రకు ఇది సహకరిస్తుంది.

డిన్నర్ తరువాత ఎలాంటి తేలికపాటి ఆహారం తీసుకోకుండా ఉంటే.. అది సహజంగా ఒక రకమైన ఉపవాస పరిస్థితిగా మారుతుంది. ఇది రాత్రంతా శరీరానికి విశ్రాంతిని ఇవ్వడంతో పాటు, కొత్త కొవ్వు చేరకుండా అడ్డుకుంటుంది. ఇలా చేయడం వల్ల శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది.

మీరు రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేస్తే జీర్ణక్రియ నెమ్మదిగా మారుతుంది. అంతేకాదు ఆకలి ఎక్కువగా వేయడం వల్ల మీరు అవసరానికి మించి తినే అవకాశం ఉంది. దీని వల్ల బరువు తగ్గే ప్రక్రియను మీరే అడ్డుకుంటారు. కొంతమంది ఎంతకాలం ఆకలిగా ఉన్నారో ఆ కారణంగా నూనె పదార్థాలపై, స్నాక్స్‌ పై ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.

2020లో విడుదలైన పరిశోధనల ప్రకారం.. రాత్రి 10 గంటల తరువాత భోజనం చేసే వ్యక్తులలో బ్లడ్ షుగర్ స్థాయిలు పెరుగుతున్నట్లు గమనించారు. అలాగే 6 నుంచి 7 గంటల మధ్య భోజనం చేసే వారు మంచి బరువు నియంత్రణ సాధిస్తున్నట్లు కూడా గుర్తించారు. రోజు రాత్రి ఒకే సమయంలో భోజనం చేయడం శరీరానికి అలవాటు పడేలా చేస్తుంది. ఒకే సమయాన్ని పాటించడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణించుకోవడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

వైద్య నిపుణులు చెప్పే విషయమేమిటంటే.. బరువు తగ్గాలనుకుంటే మీరు రాత్రి భోజనాన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది. ముఖ్యంగా 7 గంటల లోపు డిన్నర్ చేయడం వల్ల ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. ఇది శరీరానికి జీర్ణక్రియకు అవసరమైన సమయాన్ని ఇస్తుంది. అధికంగా కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.