ఈ ఒక్క పని చేస్తే, మీరు డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బులను అదుపులో ఉంచుకోవచ్చు

మనలో చాలామంది ప్రస్తుతం ఉద్యోగం, ఇతర కారణాల వల్ల పూర్తిస్థాయిలో ఇంటికే పరిమితం అవుతున్నారు. సూర్యరశ్మి పడకుండా ఎక్కువమంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


అయితే కొన్ని పనులు చేయడం ద్వారా షుగర్, క్యాన్సర్, గుండె జబ్బులకు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మన శరీరం వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే విటమిన్ డి ఎంతో ముఖ్యం.

ప్రతిరోజూ 20 నిమిషాల పాటు ఎండలో ఉండటం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ డి లభించే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరి శరీరంలో అయినా విటమిన్ డి లోపిస్తే మాత్రం వాళ్లు కీళ్ల సంబంధిత సమస్యల బారిన పడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. కొత్త ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మాత్రం అలవాట్లను కచ్చితంగా మార్చుకుంటే మంచిది.

విటమిన్ డి లోపంతో ఇప్పటికే బాధ పడుతున్న వాళ్లు డైట్ లో కొన్ని కీలక మార్పులు చేసుకోవాలి. పాలు, పుట్టగొడుగులు, పన్నీర్, వెన్నతో పాటు లివర్, సాల్మన్ పిష్ తీసుకోవడం ద్వారా కొత్త ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. మానసిక సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు విటమిన్ డి లెవెల్స్ ను చెక్ చేసుకుంటే మంచిది.

విటమిన్ డి లోపాన్ని ఆలస్యంగా గుర్తిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా విటమిన్ డి లోపాన్ని కొంతమేర అధిగమించే ఛాన్స్ ఉండగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొత్త ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.