2019 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ దేశంలోనే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీలలో ఒకటి. సీఎం జగన్ దేశం లోనే మోస్ట్ పవర్ ఫుల్ నాయకుడు. పార్టీ 3 దశాబ్దాల పాటు అధికారం లో ఉంటుందని అందరూ బలంగా నమ్మారు.
కానీ ఆ నమ్మకాన్ని ఒకే ఒక్క ఎన్నిక నీరుగార్చేసింది. 151 స్థానాల్లో గెలిచిన వైసీపీ పార్టీ, కేవలం గత ఎన్నికలలో 11 స్థానాలకు పడిపోయింది. అయినప్పటికీ జగన్ పట్టుదలతో నిలబడి జనాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆయన మీద నమ్మకం లేక, ఆ పార్టీ నాయకులు మొత్తం వెళ్లిపోతున్నారు. ఇది వరకు ఎంతో మంది వైసీపీ ముఖ్యనాయకులు ఆ పార్టీ కి రాజీనామా చేసి జనసేన పార్టీ లో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. కాసేపటి క్రితమే పార్టీ స్థాపించిన రోజు నుండి నేటి వరకు జగన్ అన్ని సమయాల్లోనూ అండగా నిల్చిన విజయ్ సాయి రెడ్డి కూడా రాజీనామా చేశాడు.
ఈయన రాజీనామా చేసిన కాసేపటికే ఆళ్ళ అయోధ్యరామి రెడ్డి కూడా తన రాజీనామా ని ప్రకటించాడు. త్వరలోనే రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. ఒక్క ఎన్నిక ఆ పార్టీ క్లోజ్ అయిపోయే స్థితికి రావడం దురదృష్టకరం అనే చెప్పాలి. కేవలం వీళ్లిద్దరు మాత్రమే కాదు. వైసీపీ కి సీమలో పట్టుకొమ్మ లాగా నిలుస్తూ వచ్చిన పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, అదే విధంగా ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వంటి వారు కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో బొత్స సత్యనారాయణ లేకపోతే, అసలు వైసీపీ పార్టీ నే లేదు. అలాంటి వ్యక్తి కూడా త్వరలోనే రాజీనామా చేసి జనసేన పార్టీ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సీమ నుండి కేతి రెడ్డి, అదే విధంగా నెల్లూరు నుండి అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు కూడా రాజీనామా చేయడానికి సిద్ధం గా ఉన్నారట.
పార్టీ కి ముఖ్య నాయకులుగా ఉండే ఇలాంటోళ్లే రాజీనామా చేస్తూ వెళ్ళిపోతున్నారంటే, భవిష్యత్తులో జగన్, రోజా, అంబటి రాంబాబు వంటి వారు మాత్రమే ఆ పార్టీ లో మిగిలేలా ఉన్నారు. రోజా, అంబటి వంటి వారిని ఏ పార్టీ కూడా చేర్చుకోదు, లేకపోతే వీళ్ళు కూడా వేరే పార్టీ కి జంప్ అయ్యేవారని టాక్. త్వరలోనే చిలకలూరిపేట విడదల రజిని కూడా ఆ పార్టీ కి రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. వైసీపీ పార్టీ మళ్ళీ అధికారం లోకి వస్తుందనే నమ్మకం లేకనే వీళ్లంతా ఒక్కొక్కరిగా జంప్ అవుతున్నట్టు తెలుస్తుంది. వైసీపీ పార్టీ పై ఈగ వాలినా ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యర్థులపై విరుచుకుపడే కోడలి నాని, బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి వంటి వారు కూడా సైలెంట్ గా ఉంటున్నారంటే, పార్టీ ఎలాంటి స్థాయికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.