ఇంటి ముందు గుమ్మడికాయను ఎందుకు కడతారు..? గుమ్మడికాయ కుళ్లిపోతే ఏమవుతుంది ?

ఇంటి ముందు గుమ్మడికాయను ఎందుకు కడతారు..? గుమ్మడికాయ కుళ్లిపోతే ఏమవుతుంది ?


ప్రతీ హిందువుడి ఇంటి ముందు గుమ్మడికాయ వుంటుంది. గుమ్మడికాయ లేని హిందువుడి ఇళ్లు వుండరు. వాకిట్లో, డోర్ బయట పైన గుమ్మడికాయ వేలాడదీసి వుంటుంది.

ఇలా వేలాడదీయడానికి చాలా కారణాలు హిందూ శాస్త్రంలో వున్నాయ్. ఈ గుమ్మడికాయ వెనక చాలా రహస్యాలు దాగి వున్నాయ్. గుమ్మడికాయ కొన్ని సార్లు ఉన్నట్టుండి కుళ్లిపోతుంది. దానివెనక కూడా చాలా కారణాలు వున్నాయని పండితులు చెబుతున్నారు. అసలు గుమ్మడికాయను ఎందుకు కడతారు? గుమ్మడికాయ కుళ్లిపోతే ఏమవుతుందో తెలుసుకుందాం.

ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారంటే ?

ప్రతీ హిందువుల ఇంట్లో గుమ్మడికాయ వుంటుంది. ఇంట్లో ఎవరైనా చాలా సంతోషంగా వుంటే, లేదా ఇంటి వారా చాలా ఆనందంగా వున్నప్పుడు కొందరు ఆ ఇంటిని చూసి ఓర్వలేరు, అలాంటి దృష్టిని నరదృష్టి అని అంటారు. ఇలాంటి దృష్టి ఆ ఇంటిపై పడితే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన గొడవలు జరుగుతాయ్. కొందరికి ఆరోగ్యసమస్యలు కూడా వచ్చే అవకాశం వుంది. ఆర్థిక సమస్యలను కూడా వారు ఎదుర్కొంటారు.

నరదృష్టి పడ్డప్పటి నుంచి ఆ కుటుంబం అష్టకష్టాలను ఎదుర్కొంటుంది. ఆ ఇంట్లో వున్న ఉద్యోగులు సమస్యలను ఎదుర్కొంటారు, ఒక వేళ వ్యాపారం చేసేవారైతే నష్టాలను చూస్తారు. ఇలాంటి ప్రతికూల చూపు, నరదృష్టి ఆ ఇంటిపై తగలకుండా వుండాలంటే ఆ ఇంటి ముందు గుమ్మడికాయను కడతారు. వ్యాపారంలో నష్టాలు కూడా రాకుండా వుండడానికి షాపు ముందు ఈ గుమ్మడికాయలను కడుతుంటారు.

పిశాచాలు, రాహువు ప్రభావం కూడా ఇంటిపై, వ్యాపార సంస్థపై పడకుండా వుండడానికి ఈ గుమ్మడికాయను కడుతుంటారు. గుమ్మడికాయ వుంటే కాలభైరవుడు రక్షణగా వున్నట్లేనని హిందూ శాస్త్రం చెబుతోంది. రేడియేషన్‌ను తట్టుకునే శక్తి కూడా గుమ్మడికాయకు వుంటుందని కొందరు పరిశోధక నిపుణులు చెప్పడం విశేషం.

గుమ్మడికాయను కేవలం అమావాస్య రోజున, మంగళవారం, బుధవారం లేదా గృహప్రవేశం రోజున మాత్రమే ఇంటి గుమ్మం ముందు కట్టాలి. ఆ ప్రత్యేకమైన రోజున ఒక తెల్లని గుమ్మడికాయను తీసుకొని దాన్ని కడిగి పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి. గుమ్మడికాయపై స్వస్తిక్ గుర్తును లేదా ఓంకార గుర్తును కుంకుమతో దిద్ది, ఆ గుమ్మడి కాయకు దీపాలతో పూజ చేసి నమ్మస్కరించుకోవాలి. ఓం కాలభైరవాయ నమ: అని అంటూ ఆ గుమ్మడికాయకు ఆరతిని ఇచ్చి ఆ గుమ్మడికయను ఒక ఉట్టిలో కట్టి ఇంటి గుమ్మానికి లేదా షాపు గుమ్మానికి వేలాడదీయాలి.

గుమ్మడికాయ కుళ్లిపోవడానికి కారణాలు

ప్రతి రోజూ దీపారాధన చేసేటప్పుడు అగరబత్తులను వెలిగించి గుమ్మడికాయ ముందు తిప్పాలి. ఇలా చేయడం వల్ల చెడు దృష్టి ఇంట్లో ప్రవేశించకుండా వుంటుంది. ఒక వేళ ఇంటిపై నరదృష్టి ఎక్కువగా వుంటే ఆ ఇంట్లో వున్న గుమ్మడికాయ ఒక్కసారిగా కుళ్లిపోతుంది. గుమ్మడికాయ పగిలిపోయి అందులోని రసం బయటకు రావడాన్ని మనం చూస్తాం. అప్పుడు కుళ్లిపోయిన ఆ గుమ్మడికాయను పారవేసి మళ్ల ఒక మంచి రోజు చూసి కొత్త గుమ్మడికాయను తీసుకొని పూజచేసి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి.

గుమ్మడికాయను సంస్కృతంలో కూష్మాండం అని అంటారు. ఇంటిపైకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని, నరదృష్టిని, చెడును మొత్తం గుమ్మడికాయ లాగేస్తుంది. కాబట్టి ఇళ్లు శుభంగా వుండాలన్నా, ఏ దృటి ఇంటిపై పడకూడదంటే ఇంటి ముందు కచ్ఛితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని పండితులు, జ్యోతిష్యులు సూచిస్తున్నారు.