Without Guarantee Loan: ఈ రోజుల్లో గ్యారెంటీ లేకుండా లోన్ లభించడం చాలా కష్టం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి స్వనిధి యోజన కింద సులభంగా లోన్ పొందవచ్చు.
అయితే ఇందులో పెద్ద మొత్తంలో లోన్ లభించదు. చిన్న చిన్న వ్యాపారలు చేసుకోవడానికి రూ. 10,000 నుంచి రూ. 50,000 వరకు లోన్ మంజూరు చేస్తారు. వాస్తవానికి కరోనా సమయంలో వీధి వ్యాపారులను అధిక వడ్డీల బారినుంచి కాపాడడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు 70 లక్షల మందికి పైగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఎంత రుణం పొందవచ్చు..
ప్రధాన మంత్రి స్వానిధి యోజన కింద భారత ప్రభుత్వం వీధి వ్యాపారులకు ఎటువంటి హామీ లేకుండా రూ. 50,000 వరకు రుణాలు మంజూరుచేస్తుంది. ఈ డబ్బు వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇస్తారు. జూన్ 1, 2020న ప్రారంభించబడిన ఈ పథకం లక్ష్యం వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడం. ఇప్పటివరకు 70 లక్షల మందికి పైగా ప్రజలు సరసమైన వడ్డీ రేట్లకు రుణాలు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు.
లబ్ధిదారులు ఎవరు..?
వీధి వ్యాపారులుగా పనిచేసే ఎవరైనా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. లబ్ధిదారుని వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇది కాకుండా లబ్ధిదారునికి ఎటువంటి రుణ ఖాతా ఉండకూడదు. ప్రభుత్వం ఎటువంటి హామీ లేకుండా రూ. 50,000 వరకు రుణం మంజూరుచేస్తుంది. తిరిగి చెల్లించే వ్యవధి 3 సంవత్సరాలు. వడ్డీ రేటు సంవత్సరానికి 12 శాతం. కానీ ప్రభుత్వం దానిపై 7% రాయితీ ఇస్తుంది. దీంతో అది 5 శాతానికి తగ్గింది.
రుణం కోసం దరఖాస్తు ప్రక్రియ
> లబ్ధిదారుడు ముందుగా దగ్గరలోని బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి.
> లబ్ధిదారుడి అర్హతను బ్యాంక్ తనిఖీ చేస్తుంది.
> అర్హత ఉన్నట్లు గుర్తించినట్లయితే లబ్ధిదారునికి
రుణం కోసం దరఖాస్తు ఫారమ్ ఇస్తారు.
> దరఖాస్తు ఫారమ్‌ను పూరించిన తర్వాత అవసరమైన పత్రాలను యాడ్ చేసి వాటిని బ్యాంకులో అందించాలి.
> దరఖాస్తును పరిశీలించిన తర్వాత రుణం మంజూరు చేస్తారు.
అవసరమైన పత్రాలు
> ఆధార్ కార్డ్
> పాన్ కార్డ్
> ఓటర్ ఐడి కార్డ్
> బ్యాంక్ ఖాతా పాస్ బుక్
> ఫొటో
పథకం షరతులు
ఈ పథకం కింద మొదటిసారిగా లబ్ధిదారునికి రూ.10,000 వరకు రుణం ఇస్తారు. ఈ రుణం ఎలాంటి హామీ లేకుండా ఉంటుంది. ఈ డబ్బును 12 నెలల్లో తిరిగి చెల్లించడం వల్ల రెండవసారి రూ. 20,000, మూడవసారి రూ. 50,000 మొత్తాన్ని పొందవచ్చు. పథకం కింద వీధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా విస్తరించడం చేసుకోవచ్చు.