Curd Rice Benefits: పెరుగన్నంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. డోంట్ మిస్!

పెరుగన్నం గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పని లేదు. అందరికీ పెరుగన్నం గురించి తెలుసు. పెరుగు అన్నాన్ని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.
నిజానికి పెరుగన్నం ఎంతో ఆరోగ్యకరమైన భోజనంగా చెబుతున్నారు నిపుణులు. పెరుగన్నంలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయట. మీరు రెస్టారెంట్స్‌లలో చూస్తే పెరుగన్నాన్ని మంచిగా తాళింపు పెట్టి.. నీటిగా ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి తీసుకొస్తారు. రెస్టారెంట్లలో కూడా చాలా మంది పెరుగన్నాన్ని తింటారు. పెరుగు అన్నం తింటే శరీరాన్ని చల్లబరుస్తుంది. చర్మానికి, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా పెరుగు హెల్ప్ చేస్తుంది. ఇంకా పెరుగన్నంతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

బ్యాక్టీరియాతో పోరాడుతుంది..

పెరుగు అన్నం క్రమం తప్పకుండా తింటే రోగాల బారిన పడే అవకాశం తగ్గుతుంది. పెరుగు అన్నంలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థకు, ప్రేగుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
గట్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది..

Related News

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవారు పెరుగన్నం తింటే చాలా బెటర్. పెరుగులో ప్రోబయోటిక్ ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరచడమే కాకుండా.. పొట్ట సమస్యలను తగ్గించడానికి సహాయ పడుతుంది. చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పెరుగు అన్నం తింటే గ్యాస్, కడపులో నొప్పి, మంట, మల బద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ఎముకలు, దంతాలు హెల్దీగా ఉంటాయి..

పెరుగులో క్యాల్షియం కంటెంట్ మెండుగా ఉంటుది. ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. పెరుగు అన్నం తింటే ఎముకలు, దంతాలు కూడా గట్టి పడతాయి. పలు సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి.
బరువు అదుపులో ఉంటుంది:

బరువు తగ్గాలి అనుకున్న వారు పెరుగు అన్నం తింటే చాలా మంచిది. ఎందుకంటే ఇది కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఆకలి పెద్దగా వేయదు. దీంతో ఇతర చిరు తిళ్లు తినే అవకాశం ఉండదు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీవక్రియను ప్రభావితం చేస్తాయి. ఇది కూడా మీ బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. పెరుగులో ఉండే ప్రోటీన్, క్యాల్షియంలు మీ ఆకలిని నియంత్రిస్తాయి. ఇలా బరువు తగ్గొచ్చు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Related News