కొంతమంది ఎంత సంపాదించినా కూడా చేతుల్లో చిల్లి గవ్వ కూడా మిగలదు. సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేస్తూ ఉంటారు. అలాగే ఏ పని చేసిన కలిసి రావడం లేదని అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయని లోపుల ఆలోచిస్తూ మదన పడుతూ ఉంటారు.
అయితే ఇలాంటి సమస్యల నుంచి బయటపడడం కోసం ఎన్నో పూజలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ మంచి ఫలితం కనిపించదు. అలాంటివారు మిరియాలతో కొన్ని పరిహారాలు పాటిస్తే తప్పకుండా మంచి జరుగుతుందని చెబుతున్నారు.
అయితే మరి ఇంతకీ మిరియాలతో ఎలాంటి పరిహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మిరియాలతో దీపం వెలిగిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయట. ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో ఆ ఇంట్లో ఎలాంటి దిష్టి దోషాలు, శత్రు బాధలు ఉండవని చెబుతున్నారు. అలాగే ఆకస్మిక ధనలాభం కలుగుతుందట. వృథా ఖర్చులను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. మిరియాల దీపానికి అంతటి శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు. కాగా ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలి అన్న విషయానికి వస్తే.. శనివారం సూర్యా స్తమయ సమయంలో ఒక మట్టి ప్రమిదలో ఇంకో ప్రమిద ఉంచి ఆవాల నూనె పోయాలి. ఆ తర్వాత మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి.
ఆపై ఆ దీపంలో 9 నల్ల మిరియాలు వేయాలి. అప్పుడు అది మిరియాల దీపం అవుతుందట. కాగా ఈ దీపం వెలిగించాక దాన్ని చేతిలో పట్టుకొని, ఇష్ట దేవతను మనసులో స్మరించుకుంటూ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో తిరగాలి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తాన్ని ఆ దీపం లాక్కుంటుందట. అలాగే ఇంటిపై దిష్టి దోషం, ధనపరంగా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా అవీ పోయి ధన ఆదాయం పెరిగేలా ఆ దీపం దోహదం చేస్తుందట. ఇల్లు మొత్తం తిరిగాక ఏదో ఒక మూల ఆ దీపాన్ని పెట్టేయాలట. శనివారం ఆ దీపం కొండెక్కాక మర్నాడు ఆదివారం స్నానం చేసి అందులో ఉన్న తొమ్మిది నల్ల మిరియాలను తీసి ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలట. లేదా ఒక ప్లేట్ లో కర్పూరంతో కలిపి ఆ నల్ల మిరియాలను కాల్చేయాలట. ఈ శక్తివంతమైన పరిహారం చేస్తే వారికి జీవితంలో తిరుగుండదని అన్ని రకాలుగా ధనాకర్షణ పెరగడంతో పాటు దుష్ట శక్తుల పీడ నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు.