ఒక్కసారి చూస్తే షాక్ అవుతారు.. బెస్ట్ హారర్ సినిమా

ఆ సినిమా పేరు ఏ క్లాసిక్ హారర్ స్టోరీ. ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఈసినిమా.. ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను తెగ భయపెడుతోంది. ఈ సినిమాలో ఓ నలుగురు ఫ్రెండ్స్ కారులో.. అడవి మార్గం గుండా వెళ్తుంటారు. దారిలో అనుకోకుండా వాళ్ళ కారు ఓ చెట్టును ఢీ కొడుతుంది. ఈ క్రమంలోనే వాళ్లకి అక్కడ ఓ వుడెన్ హౌజ్ కనిపిస్తుంది. కానీ హౌస్‌ చాలా విచిత్రంగా.. కాస్త భయానకంగా ఉంటుంది. లోపలికి వెళ్లి చూస్తే.. కొన్ని బొమ్మలు కనిపిస్తాయి. కానీ ఆ బొమ్మలకు కళ్లు, చెవి, నోరు ఇలా కొన్ని పార్ట్స్ బదులు మనిషివి భాగాలు అంటించి ఉంటాయి. దీంతో ఒక్క సారిగా ఆ నలుగురు ఫ్రెండ్స్ షాకవుతారు.