హైదరాబాద్(Hyderabad) లోని గాంధీభవన్(Gandhi Bhavan) వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీలో పదవుల కోసం యూత్ కాంగ్రెస్ నేతల(Youth Congress Leaders) మధ్య మొదలైన గొడవ..
చిలికి చిలికి చివరకు పెద్ద గొడవకు దారి తీసింది. బీఆర్ఎస్(BRS) నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పదవులు ఇస్తున్నారంటూ కొత్తగూడెం నేతలు(Kotthagudem) ఆందోళనకు దిగటంతో ఘర్షణ మొదలైంది. మాటా మాటా పెరిగి.. ఆరు వర్గాల నేతలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు నేతలకు గాయాలు అయినట్టు సమాచారం. పార్టీ కోసం ఎప్పటి నుంచో పని చేస్తున్న తమకు పార్టీలో విలువ ఇవ్వడం లేదని పలువురు నేతలు వాపోయారు. కాగా ఈ దాడులపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం స్పందించాల్సి ఉంది