చంద్రబాబు మోసాలను ఎండగట్టాలి: YS Jagan

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ సీనియర్‌ నేతలతో మంగళవారం(ఫిబ్రవరి 4) భేటీ అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణ, మేరుగ నాగార్జున, జోగి రమేష్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై వైఎస్‌ జగన్‌ సీనియర్‌ నేతలకు దిశా నిర్దేశం చేశారు.


వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..
చంద్రబాబు మోసాలను మరింత ఎండగట్టాలి
వాటిని ఇంకా లోతుగా ప్రజలకు వివరించాలి
కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీరని నష్టం
పేదల పట్ల చంద్రబాబుకు ఉన్న కక్షను బట్టబయలు చేయాలి
సూపర్‌సిక్స్ హామీల అమలుపై చంద్రబాబు వైఖరిని ఎండగట్టాలి
ఏవేవో సాకులు చెబుతూ.. అవి ప్రజలు నమ్మేలా బాబు ప్రచారం చేయడంపై మనం నిలదీయాలి
సంపద సృష్టించడం తనకు తెలుసంటూ ప్రచారం చేసుకున్న బాబు.. కేవలం అప్పులతోనే కాలం వెళ్లదీస్తున్నారు
చంద్రబాబు దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
బాబు మోసాలను చెప్పడం కోసం రోజూ ప్రజల్లో ఉండాలి
ప్రజలతో మరింత మమేకం కావాలి
కేంద్రం వచ్చే అయిదేళ్లలో 75వేల మెడికల్‌ సీట్లు అదనంగా పెంచబోతోంది.
కానీ, చంద్రబాబు తమకు కొత్తగా మెడికల్‌ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడం అత్యంత దారుణం
రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల కోత, నిల్చిపోయిన పథకాలు, ఆరోగ్యశ్రీ ఆగిపోవడంపైనా జనంలోకి తీసుకెళ్లాలి
తొమ్మిది నెలల కూటమి పాలన, పేదల వ్యతిరేక పాలనలా మారింది
దీని వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల వ్యవహారం దారుణం
ఇలాంటి అరాచకాలు ఎక్కడా ఎప్పుడూ చూడలేదు
మెజారిటీ లేని చోట, అసలు ఒక్కోచోట సభ్యులే లేని వారు కూడా గెలవడానికి ఎన్నో దారుణాలు చేశారు
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు తగిన సమయంలో కచ్చితంగా బుద్ధి చెప్తారు