మాంసాన్ని కూడా నేరుగా మంటపై ఫ్రై చేయడం వల్ల క్యాన్సర్ కారకాలు పెరిగిపోతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు వైద్యులు.
క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా తగ్గించాలంటే..
రొట్టెలు, పుల్కా వంటివి చాలా మంది ఎక్కువ మంటపై కాలుస్తుంటారు. కానీ, ఇలా కాలుస్తున్నప్పుడు నల్లగా మాడిపోకుండా చూడాలని నిపుణులు చెబుతున్నారు. మంటను తగ్గించి.. రొట్టెలను తరచూ తిప్పడం వల్ల అవి ఎక్కువ కాలకుండా, మాడకుండా ఉంటాయని అంటున్నారు. ఒకవేళ మాడితే తినేముందు నల్లగా మారిన ప్రాంతాలను తొలగించాలని సూచిస్తున్నారు.
ఒకవేళ మీకు నేరుగా మంటపై కాల్చిన రొట్టెలు నచ్చితే.. వాటిని వీలైనంత తక్కువ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందుకు బదులుగా సమతుల్యమైన ఆహారాన్ని మీ డైట్లో చేర్చుకోవాలని చెబుతున్నారు.
రొట్టెలను నేరుగా మంటపై కాల్చకుండా పెనంపై వేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పెనం అధిక ఉష్ణోగ్రతను గ్రహించి.. తక్కువ వేడిపై రొట్టేలను కాల్చేలా సాయం చేస్తుందని తెలిపారు. ఫలితంగా PAHలు, అక్రిలమైడ్ ఉత్పత్తిని నిరోధిస్తుందని చెప్పారు.
రొట్టెలు ఎక్కువగా తీసుకునే వారు వీటితో పాటు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను డైట్లో చేర్చుకోవాలని చెబుతున్నారు. ఇవి ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి క్యాన్సర్ రాకుండా సహాయ పడుతుందని వివరించారు.