మీ దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఉందా? వెంటనే ఆ పని చేయాల్సిందే

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్రతి కొనుగోలు, ఆన్‌లైన్ షాపింగ్, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులపై విస్తృత శ్రేణి ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తుంది.


ఈ ప్రయోజనాలను పొందడానికి మీ కొత్త హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌ను వెంటనే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం ద్వారా మీ క్రెడిట్ కార్డ్‌ను యాక్టివేట్ చేయాడాన్ని నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఏప్రిల్ 21, 2022 నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘మాస్టర్ డైరెక్షన్ – క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ – ఇష్యూయెన్స్ అండ్ కండక్ట్ డైరెక్షన్స్, 2022’ ప్రకారం మీరు మీ కార్డును పొందిన 37 రోజులలోపు (30 రోజులు + ఒక వారం గ్రేస్ పీరియడ్) యాక్టివేట్ చేయాలి. కాబట్టి మీరు ఇంకా మీ క్రెడిట్ కార్డ్‌ను యాక్టివేట్ చేయకపోతే ఏటీఎంలో కార్డును ఎలా యాక్టివేట్ చేయాలో? తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు యాక్టివేషన్ ఇలా

  • మీ సమీపంలోని ఏటీఎంకి వెళ్లే ముందు, టోల్-ఫ్రీ నంబర్ 1860 266 0333 కు కాల్ చేయాలి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ అందుకోవడానికి అందించిన సూచనలను అనుసరించాలి.
  • తర్వాత మీ సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎంని సందర్శించి మీ కొత్త క్రెడిట్ కార్డును తీసుకోవాలి.
  • ఇప్పుడు, మీ క్రెడిట్ కార్డును ఏటీఎం మెషీన్‌లో పెట్టి స్క్రీన్‌పై ఉన్న సూచనలను జాగ్రత్తగా పాటించాలి.
  • ‘క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ లేదా ఓటీపీ ఉపయోగించి కొత్త ఏటీఎం పిన్‌ను సృష్టించండి’ అనే ఎంపికను ఎంచుకోవాలి.
  • అనంతరం మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆపై దానిపై వచ్చిన ఓటీపీను నమోదు చేయాలి.
  • ఈ దశలు పూర్తయిన తర్వాత ఏటీఎం సూచించిన విధంగా మీ క్రెడిట్ కార్డ్ కోసం 4-అంకెల పిన్‌ను సృష్టించాలి.
  • పిన్‌ను నిర్ధారించి, మీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది.

ఏటీఎంను సందర్శించడంతో పాటు మీరు మీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా మీ స్థానిక బ్రాంచ్ ద్వారా లేదా 1860 266 0333 టోల్-ఫ్రీ నంబర్ ద్వారా ఆఫ్‌లైన్‌లో యాక్టివేట్ చేసుకోవచ్చు. త్వరిత యాక్టివేషన్ కోసం మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాట్సాప్ నంబర్, 7070022222 ను కూడా ఉపయోగించవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ 37 రోజుల్లోపు యాక్టివేట్ కాకపోతే బ్యాంక్ ఆటోమెటిక్‌గా కార్డును ఇన్‌యాక్టివేట్ చేస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.