టీమ్ఇండియా (Team India) టీ20 వరల్డ్ కప్ 2026ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ (BCCI) భారత జట్టుకు రూ.131 కోట్ల భారీ నజరానాను మంగళవారం ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా ధ్రువీకరించారు. ‘అద్భుత ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు బీసీసీఐ రూ.131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది’ అని సైకియా తెలిపారు.
2024లోనూ రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో టీమ్ఇండియా టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో బీసీసీఐ రూ.125 కోట్లను బహుమతిగా ప్రకటించింది. ప్రస్తుతం మరో ఆరు కోట్ల రూపాయలను పెంచింది. టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన తర్వాత టీమ్ఇండియాకు ఐసీసీ (ICC) రూ.27.48 కోట్లను బహుమతిగా ప్రకటించిన విషయం తెలిసిందే. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ రూ.14.65 కోట్లు దక్కించుకోనుంది.

































