మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా యువత కూడా త్వరగా నీరసంతో ఉంటున్నారు. చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారు. చిన్న వయసులోనే వయసు పెరిగిన వారిలో కనిపిస్తున్నారు.
అయితే లండన్‌కు చెందిన డాక్టర్ మహమ్మద్ ఇనాయత్ మాత్రం అద్భుతం చేశాడు.
41 ఏళ్ల వయస్సు ఉన్నా, ఆయన శరీర వయస్సు మాత్రం కేవలం 24 ఏళ్ల వయస్సుగా మలచుకున్నారు. వయస్సును 17 ఏళ్లు తగ్గించుకోవడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. డాక్టర్ ఇనాయత్ ప్రకారం… తాను తీసుకునే ఆహార విధానమే ఈ మార్పుకు ప్రధాన కారణమని తెలిపారు. ప్రత్యేకమైన న్యూట్రిషన్, జీవనశైలి మార్పులు, సరిగ్గా నిద్ర, నిత్యఆరోగ్య పర్యవేక్షణతో తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మలుచుకున్నారు. గత ఏడు ఏళ్లుగా తన శరీరాన్ని ఒక డేటా ల్యాబ్‌లా మార్చుకుని, ప్రతిరోజూ ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తూ వస్తున్నారు.
సప్లిమెంట్లతో శరీరాన్ని రీసెట్ చేసిన వైద్యుడు డాక్టర్ ఇనాయత్ ప్రతి రోజు తినే ఆహారంతో పాటు కొన్ని ముఖ్యమైన సప్లిమెంట్లను కూడా వాడుతున్నారు. ముఖ్యంగా: ఫోలేట్‌తో కూడిన బీ-కాంప్లెక్స్: మెదడు పనితీరు మెరుగయ్యేందుకు, మానసిక స్థితి స్థిరంగా ఉండేందుకు. మెగ్నీషియం: నిద్రలేమి, కండరాల నొప్పులపై ప్రభావం చూపించేందుకు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు: గుండె ఆరోగ్యానికి.
ఇవన్నీ తాను వ్యక్తిగత మెటబాలిజం, జన్యుపరమైన పరిస్థితుల ఆధారంగా ఎంపిక చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మిథైలేషన్ లోపం కారణంగా ఫోలేట్ అవసరమైందని, బీ కాంప్లెక్స్ తనకు మంచి పని చేసిందని వివరించారు.
తన జీవనశైలి పూర్తిగా సాంకేతికత ఆధారంగా ఉంది. నిద్ర, మేల్కొనడం, ఆహారం, వ్యాయామం వంటి ప్రతి విషయాన్ని ట్రాక్ చేయడానికి ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారు. తరచూ రక్త పరీక్షలు, హార్మోన్ విశ్లేషణలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని తనే పరిశీలించుకున్నారు.
మహమ్మద్ ఇనాయత్ ప్రస్తుతం HUM2N లాంగ్వేజ్ క్లినిక్ అనే పేరుతో లండన్‌లో క్లినిక్‌ను స్థాపించి, ఆరోగ్యానికి భిన్నమైన దృక్పథాన్ని అందిస్తున్నారు. ఇక్కడ వ్యక్తిగత డేటా ఆధారంగా ఆరోగ్య పరీక్షలు, డైట్ ప్లానింగ్, యూనిక్ ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు.