ఏసీ కొంటే బెటరా? ఎయిర్ కూలర్ కొంటే బెటరా.? వీటిలో దేనికి గాలి కూల్ అవుతుంది. గదిని తొందరగా చల్లబరుస్తుంది. ఏసీల కన్నా కూలర్ వాడితే మంచిదేనా? ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
బాబోయ్ సమ్మర్ వచ్చేస్తోంది.. ఎండాకాలంలో ఎండలు మండిపోతాయి మరి.. ఎండలు ముదిరికా ఏసీలు, కూలర్లు కొట్టే ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడే కొనేస్తే పోలా.. అని ఆలోచిస్తున్నారా? అయితే, ఇప్పుడు ఏసీ కొనాలా? కూలర్ కొనాలా? అసలు ఈ రెండింటిలో ఏది కొంటే బెటర్ అని తేల్చుకోలేకపోతున్నారా? అయితే, ఇది మీకోసమే.. సాధారణంగా సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్ల గాలి కోసం ఆరాటపడుతుంటారు. ఇంట్లో ఫ్యాన్ ఉన్నా లేనట్టే అనిపిస్తుంటుంది.
రూమ్ అంతా వేడిక్కి ఉక్క తట్టుకులేకపోతుంటారు. చాలామంది సమ్మర్ అనగానే మార్కెట్లో ఏ కూలర్ లేదా ఏసీ ఉందా? అని తెగ వెతుకుతుంటారు. వాస్తవానికి కూలర్ కన్నా ఎక్కువగా ఏసీలను కొనేందుకు ఇష్టపడుతారు. కానీ, ఇక్కడ ఒక విషయంలో తప్పక గుర్తుపెట్టుకోవాలి. ఏసీలు కొనాలంటే ఎక్కువ డబ్బులు పోయాలి. అదే కూలర్ అయితే తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. కానీ, ఏసీలకే సై అంటుంటారు.
ఇలా చేయడం వల్ల మీ జేబుకు చిల్లు పడటం ఖాయమే. మరో విషయం ఏమిటంటే.. ఏసీల కన్నా కూలర్లు మంచి చల్లగాలితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏసీలు అయితే ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏసీలు లేదా కూలర్ రెండింటిలో ఏది బెటర్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏసీ, కూలర్ గాలి నాణ్యతను గమనించారా? :
ఏసీ నుంచి వచ్చే గాలిని.. కూలర్ నుంచి వచ్చే గాలిని ఎప్పుడైనా గమనించారా? మీరు ఏసీని తీసుకుంటే.. మీ గదిలో ఒకే గాలిని పీల్చుకుని అదే గాలిని బయటకు వదులుతుంది. ఇలాంటి గాలి పొడిగా మారుతుంది.
అదే కూలర్ అయితే.. బయటి గాలిని పీల్చుకుని ఫ్రెష్ ఎయిర్ చల్లబరిచి అదే బయటకు పంపుతుంది. అందులోనూ కూలర్ ద్వారా వచ్చే గాలి చాలా తేమతో ఉంటుంది. అందుకే ఏసీల కన్నా కంటే కూలర్ మంచి గాలిని ఇస్తుంది అనమాట. కూలర్ గాలి వంద శాతం నాణ్యమైనదిగా చెప్పవచ్చు.
ఆరోగ్య సమస్యలన్న వారికి రిస్క్ :
కూలర్లలో గాలి చల్లబడాలంటే నీరు ఉండాలి. కూలర్‌లో ఎయిర్ నేచురల్‌గా ఉంటుంది. ఆస్తమా, డస్ట్ ఎలర్జీ అనారోగ్య సమస్యలు ఉంటే వారికి కూలర్ గాలి చాలా మంచిది. అదే, ఏసీ విడుదల చేసే గాలిలో క్లోరోఫ్లోరోకార్బన్, హైడ్రో-క్లోరోఫ్లోరోకార్బన్లతో చల్లబరుస్తుంది.
వాస్తవానికి ఈ రసాయనాలన్నీ పర్యావరణానికి హాని కలిగించేవి. ఏసీలో గాలి కూల్ అయినా రసాయనాలను పీల్చడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
ఏసీ, కూలర్ ధరలతో పోలిస్తే.. :
అదేవిధంగా.. ధరలతో పోల్చినా.. ఏసీలు రూ. 30వేల నుంచి రూ. 70వేల వరకు ఉంటాయి. సాధారణ మిడిల్ క్లాసు వారు ఇంత ఖర్చుతో ఏసీలను కొనడం భారమే. అదే కూలర్లు తీసుకుంటే రూ. 3వేల నుంచి రూ. 15వేల ధరలో ఉంటాయి. సగటు మధ్యతరగతి వారు ఈ కూలర్లను కొనేందుకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.