మారుతి సుజుకి నుండి అడ్వెంచర్ కారు

దేశంలో Maruthi Suzuki కార్ల అమ్మకాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ నుంచి ప్రీమియం కార్లు కొనేవారి కోసం ఈ కంపెనీ కొత్త కొత్త మోడళ్లను అందుబాటులో ఉంచుతోంద. ఇప్పటికే మారుతి నుంచి రిలజ్ అయిన వ్యాగన్ ఆర్, స్విప్ట్ కార్లు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి.


దేశంలో Maruthi Suzuki కార్ల అమ్మకాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ నుంచి ప్రీమియం కార్లు కొనేవారి కోసం ఈ కంపెనీ కొత్త కొత్త మోడళ్లను అందుబాటులో ఉంచుతోంద. ఇప్పటికే మారుతి నుంచి రిలజ్ అయిన వ్యాగన్ ఆర్, స్విప్ట్ కార్లు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. అయితే మారుతి కంపెనీ నుంచి రిలీజ్ అయిన మొట్ట మొదటి SUV గ్రాండ్ విఠారా. అప్పటి వరకు కేవలం హ్యాచ్ బ్యాక్ కార్లు మాత్రమే వచ్చిన ఈ కంపెనీ నుంచి Grand Vitara 2005లో మినీ SUV గా మార్కెట్లోకి వచ్చింది. ఆ తరువాత పలు రూపాలు చెంది చివరకు 2015లో SUVగా అవతరించింది. అప్పటి నుంచి ఈ కారుకు ఆదరణ పెరిగింది. అయితే ప్రస్తుత కాల వినియోగదారుకు అనుగుణంగా లేటేస్ట్ టెక్నాలజీని అమర్చిన కంపెనీ కొత్తగా గ్రాండ్ విటారా అడ్వెంచర్ డిజైన్ ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఆటో మొబలిటీ షో లో ఈ కారును ప్రదర్శించింది. ఈ కారు వివరాల్లోకి వెళితే..

Grand Vitara Adventure డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. ఇది మొత్తం ఆర్మీ గ్రీన్ కలర్ బ్లాక్ రూప్ తో కనిపిస్తుంది. గ్రాఫిక్ డిజైన్ తో పాటు సైడ్ నుంచి చూసినా.. అదిరిపోయే లుక్ ను చూపిస్తుంది. ఈ కారు ఎక్కడ ఉన్నా ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపించేలా డిజైన్ చేశారు. ఆఫ్ రోడ్ ప్రయాణికులకు అనుగుణంగా ఉన్న ఈ కారు రూప్ భాగంలో క్యారియర్ సెటప్ ను అమర్చారు. ఎక్కువగా క్యారియర్ ట్రిప్ చేసేవారు ఇది అనుగుణంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ లగేజీని ఏర్పాటు చేసుకొని ట్రిప్ చేయడం వల్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అయితే వెనక నుంచి చూస్తే సాధారణ డిజైన్ లా కనిపించినా.. అల్లాయ్ వీల్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. అలాగే లగేజీని ఏర్పాట చేసుకోవడానికి ప్రత్యేకంగా క్యాబిన్ ఇచ్చారు.

పాత గ్రాండ్ విటారాను కొద్ది పాటి మార్పులు చేసి డిజైన్ ను తీర్చిదిద్దారు. ఈ కారుకు ఎల్ ఈడీ లైట్స్, రిప్లెక్టర్, బంపర్ బ్లాక్ కలర్ ను సెట్ చేశారు. ఆల్ గ్రిప్ బ్యాడ్స్ ను కలిగి ఉన్న ఆల్ వీల్ డ్రైవ్ ను సెట్ చేశారు. ఈ మోడల్ ఇంజిన్ విషయానికొస్తే.. 1.5 లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 103 బీహెచ్ పీ పవర్ తో పాటు 137 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.అయితే ఈ కారును రూ. 10.99 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.20.09 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉంది. పాత గ్రాండ్ విఠారా ఇంచు మించి ఇదే ధరను కలిగి ఉంది.

ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఆటోమొబలిటీ షో 2025లో ఈ కారును ప్రదర్శించారు. అయితే ఈ కారు లేటేస్ట్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టకుంటుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అంతేకాకుండా అడ్వెంజర్ కారును కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.