స్ప్లెండర్ EV ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది?

ఈ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా వరకు బైక్ లు రిలీజ్ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ఈ కంపెనీ బైక్ లు కనిపిస్తాయి. మైలేజ్ తో పాటు లో బడ్జెట్ లో అందించే ఈ కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ బైక్ లు మార్కెట్లోకి రాలేదు. అయితే కొత్తగా ఈవీలను తీసుకు రావడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీకి చెందిన Splender న ఈవీ వేరియంట్ లో తీసుకు రాడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్ప్లెండర్ బైక్ ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఎలక్ట్రిక్ గా రావడంతో చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఇది మార్కెట్లోకి వస్తే ఎలా ఉంటుందంటే?


ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. కార్ల నుంచి బైక్ అన్నీ ఈవీ వేరియంట్ లో మార్కెట్లోకి వస్తన్నాయి. టీవీఎస్ నుంచి ఓలా వరకు ఈవీలను అందుబాటలోకి తీసుకొచ్చి వినియోగదారులను ఆకట్టకుంటున్నాయి. ఇదే తరహాలు ఇప్పుడు Hero కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ వెహికల్ ఎలా ఉంటుందో అధికారికంగా తెలియజేయనప్పటికీ 2027లో దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరో కంపెనీకి మంచి ఆదరణ ఉంది. ఈ సమయంలో ఎలక్ట్రిక్ వేరియంట్ లో కూడా సత్తా చాటాలని చూస్తోంది.

అయితే కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం వచ్చే రెండేళ్లలో 2 లక్షల ఈవీలను తయారు చేసి ఒకేసారి మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. కొందరు బైక్ ప్రమఖులు అంచనా వేస్తున్న ప్రకారం.. ఈ బైక్ లో 4 కిలోవాట్ బ్యాటరీని అమర్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే 6 కిలో వాట్ కూడా పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఏ బైక్ కొనాలన్న లక్ష రూపాయలకు తక్కువ లేదు. అయితే ఈవీలు అంతకు మించి ఉన్నాయి. కానీ స్ప్లెండర్ పాత బైక్ మాదిరిగానే ఎలక్ట్రిక్ బైక్ ను తక్కువ ధరకు అందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిని రూ. లక్ష వరకు విక్రయించేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ విధంగా 4 లేదా 6 కిలో వాట్ బ్యాటరీని స్ప్లెండర్ బైక్ లో అమర్చితే సింగిల్ ఛార్జింగ్ తో 120 నుంచి 180 కిలోమీటర్ల వరక మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా స్ల్పెండర్ నుంచి ఈవీ మాత్రమే కాకుండా డర్ట్ అనే మరో బైక్ ను కూడా తీసుకొస్తారని అంటున్నారు. మొత్తంగా హీరో కంపెనీ సైతం ఈవీ వేరియంట్ ను తీసుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం హీరో నుంచి స్ల్పెండర్ తో పాటు గ్లామర్ బైక్ లు ఆదరణ పొందుతున్నాయి. ఒకవేళ స్ప్లెండర్ ఈవీ అందుబాటులోకి వస్తే వినియోగదారులకు పండుగే అని అంటున్నారు.