కొందరికి చికెన్ లివర్ తినడం ఇష్టం ఉంటే.. మరికొందరికి మటన్ లివర్ తినడం చాలా ఇష్టం. రెండింటిలోనూ మనకు కావాల్సిన పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయి. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అనుకుంటున్నారు? ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మాంసాహార ప్రియులు చికెన్, మటన్ రెండింటిని ఇష్టపడతారు. ఈ రెండింటిలోనూ కామన్ గా లివర్ కూడా తింటారు. కొందరికి చికెన్ లివర్ తినడం ఇష్టం ఉంటే.. మరికొందరికి మటన్ లివర్ తినడం చాలా ఇష్టం. రెండింటిలోనూ మనకు కావాల్సిన పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయి. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అనుకుంటున్నారు? ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ లివర్ ప్రయోజనాలు:
చికెన్ లివర్‌లో శరీరానికి అవసరమైన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రక్తంలో ఎర్ర రక్తకణాలను పెంచుకోవడానికి దీన్ని తినాలి. రక్తహీనత రాకుండా కాపాడుతుంది. ఇనుముతో పాటు, విటమిన్ ఎ, బి12, ఫోలేట్ వంటి పోషకాలు లభిస్తాయి. లివర్ తినడం వల్ల కంటి చూపు మెరుగు అవుతుంది. కండరాలను బాగుచేసే ప్రోటీన్ లివర్‌లో దొరుకుతుంది. లివర్ తినడం వల్ల యాంటీఆక్సిడెంట్లు దొరుకుతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడరు. ఇక చర్మ సంరక్షణకు ఉపయోగపడే పోషకాలు కూడా ఎక్కువే లభిస్తాయి.
మటన్ లివర్ ప్రయోజనాలు:
మటన్ లివర్ లో విటమిన్ బి12 ఉంటుంది. ఈ లివర్ ను తింటే మెదడు పనితీరు మెరుగు అవుతుంది. మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి మటన్ లివర్ తీసుకోవచ్చు. నాడీ వ్యవస్థ, ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైన ఖనిజాలు మటన్ లివర్‌లో ఉన్నాయి. చికెన్ లివర్ లాగే మటన్ లివర్‌లో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి రక్తహీనత ఉన్నవారు తినవచ్చు. వ్యాయామం చేసినప్పుడు కండరాలు దెబ్బతింటాయి. వాటిని బాగుచేసే శక్తి మటన్ లివర్‌లోని ప్రోటీన్‌కి ఉంది. మటన్ లివర్‌లో కూడా విటమిన్ ఎ, ఫోలేట్ వంటి పోషకాలు ఉన్నాయి.
ఏది మంచిది?
చికెన్ లివర్ కంటే మటన్ లివర్ చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందులోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయట. మనం రెండింటీనీ అప్పుడప్పుడు ఆహారంలో చేర్చుకోవచ్చు. లివర్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగానే తినాలి.
ఎవరు తినకూడదు?
ఎక్కువ కొలెస్ట్రాల్ సమస్య, కిడ్నీ సమస్య, కండరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు మటన్ లివర్ తినే ముందు వైద్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఇక చికెన్ లివర్‌ని వారానికి ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే తినాలి.