మీరు రోజంతా ఏసీలో కూర్చుంటున్నారా? మీరు పెద్ద సమస్యలో ఉన్నారు.

నిపుణుల అధ్యయనాల ప్రకారం ఏసీ కూలింగ్లో ఎక్కువసేపు ఉండే వ్యక్తులు సగటు వ్యక్తులకంటే జీవక్రియ రేటు తక్కువగా ఉంటుందని గుర్తించారు. దీనివల్ల బరువు వేగంగా పెరుగుతున్నారని చెబుతున్నారు. ఏసీ గదుల్లో ఎక్కువ టైం ఉండటం మంచిది కాదంటున్నారు. ఏసీలో ఎక్కువ సమయం కూర్చుని ఉండటం వల్ల ఊబకాయం పెరిగి వేగాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ ఊబకాయం, డయాబెటిస్, హృదయ సంబంధిత సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలను పెంచుతుందని చెబుతున్నారు. ఏసీ ఉష్ణోగ్రత, ఎముకలు, ఊపిరితిత్తులకు హాని కలిగించడమే కాకుండా నిశ్చల జీవనశైలికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ఏసీలో ఎక్కువ సమయం గడిపితే శారీరక శ్రమ దాదాపు తగ్గిపోతుంది. దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం పెరుగుతుంది. శరీరంలోని కండరాల పనితీరు తగ్గుతుంది. నరాలలో రక్త ప్రసరణ మందగిస్తుంది. దీంతో నరాలు బలహీనంగా మారుతాయి. కొందరిలో తలతిప్పడం, వాంతులు కూడా అవుతూ ఉంటాయి. చాలామందిలో తలనొప్పి కూడా మొదలవుతుంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.