AP News: మహిళల నెలసరి రక్తంతో స్టెమ్ సెల్స్‌ త్రీడీ ప్రింట్‌.. ఏయూ విద్యార్థినుల ఆవిష్కరణ

ఆంధ్ర విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగం పీజీ విద్యార్థినులు సరికొత్త అవిష్కరణ చేశారు. మహిళల నెలసరి సమయంలో వ్యర్థంగా పోయే రక్తం నుంచి ఎండోమెట్రియల్ స్టెమ్ సెల్స్‌ను వేరు చేశారు. వాటి ద్వారా త్రీడీ ప్రింట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పరిశోధన ఆధారంగా త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో కృత్రిమ అవయవాలు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.