సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ నోటిఫికేషన్ జారీ అయింది. 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు మీ కోసం..
మొత్తం పోస్టులు: 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు, జనరల్ పోస్టులు 405, ఎస్సీ 150, ఎస్టీ 75, ఓబీసీ 270, ఈడబ్ల్యూఎస్ 100 పోస్టులు.
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 20, దరఖాస్తు ముద్రణ తేదీ మార్చి 7 వరకు.
విద్యా అర్హత: 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 20-30 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, సంబంధిత రిజర్వేషన్లను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం: పే స్కేల్ రూ. 48,480 నుండి రూ. 85,920.
జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 750/- కాగా, SC, ST, మహిళలు మరియు PWD వారికి ఇది రూ. 150/-.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ముందుగా www.centralbankofindia.co.in కు లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత, దరఖాస్తు ఫారమ్ నింపి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.