Friday, November 15, 2024

డీఎస్పీ, ఎస్ఐ సహా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లికూతురు.. ఫస్ట్ నైట్ అవ్వగానే..?

డీఎస్పీ, ఎస్ఐ సహా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లికూతురు.. ఫస్ట్ నైట్ అవ్వగానే..?

డీఎస్పీ, ఎస్ఐ సహా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు ఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నారు.

తమిళనాడు – తిరుపూర్‌కు చెందిన 35 సంవత్సరాల యువకుడి పెళ్లికాకపోవడంతో.. డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్‌లో చూసి సంధ్య అనే మహిళను పరిచయం చేసుకుని వివాహం చేసుకున్నాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. కొద్దిరోజుల్లో సంధ్య ప్రవర్తనలో తేడా వచ్చింది. ఇది గమనించిన పెళ్లి కొడుకు.. సంధ్య ఆధార్ కార్డును పరిశీలించగా ఆధార్ కార్డులో తన భర్త పేరు వేరే ఉండటంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు.

అనంతరం ఆమెను నిలదీయగా.. బాధితుడిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను దర్యాప్తు చేయగా ఒక్కోక్కటికి పెద్ద లిస్ట్ బయట పడింది. ఆమె ఇప్పటి వరకు 50 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఆ నిత్య పెళ్లి కూతురు లిస్టులో ఒక డీఎస్పీ, ఇద్దరు పోలీసు అధికారులు, ఫైనాన్స్ అధికారి సహా 50 మంది ఉన్నారు. నగలు, డబ్బులే లక్ష్యంగా పెళ్లి చేసుకుంది. వారితో మొదటి రాత్రి పూర్తైన కొద్ది రోజులకు తన ప్లాన్ మొదలు పెట్టి నగలు, డబ్బులు దోచుకుని నెమ్మదిగా పరారయ్యేదని పోలీసుల విచారణలో ఒప్పుకుంది.

ఇవి తింటే మీ ఊపిరితిత్తులు ఉక్కులా మారతాయి.. అస్సలు పాడుకావు

ఇవి తింటే మీ ఊపిరితిత్తులు ఉక్కులా మారతాయి.. అస్సలు పాడుకావు

Foods For Lungs Health: ఏటా భారతదేశంలో వేల మంది ఊపిరితిత్తుల అనారోగ్యంతో చనిపోతున్నారు. పర్యావరణ కాలుష్యం, సిగరెట్ పొగ తదితర కారణాలవల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యం దెబ్బతింటోంది.

ఫలితంగా శ్వాసకోస సమస్యలు వస్తున్నాయి. అందుకే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లంగ్స్ శరీరానికి ఆక్సిజన్‌ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా రెస్పిరేటరీ సిస్టమ్‌ను బలోపేతం చేసుకోవచ్చు. ఊపిరి పీల్చుకునే సామర్థ్యం పెంచుకోవచ్చు. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

డాక్టర్ మయుర్ రస్తోగి తాజాగా ‘న్యూస్9లైవ్‌’తో మాట్లాడుతూ శ్వాసకోశ వ్యవస్థను ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించగల ఆహారాలు, పోషకాల గురించి మాట్లాడారు. మయుర్ షార్దా యూనివర్సిటీలో న్యూట్రీషన్, డైటెటిక్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

యాంటీఆక్సిడెంట్లు ఉన్న పండ్లు, కూరగాయలు

యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కలిగే నష్టం నుంచి ఊపిరితిత్తుల కణాలను రక్షిస్తాయి. లంగ్స్ హెల్త్ కోసం విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా-కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. ఆరెంజ్, ద్రాక్షపండు, నిమ్మపండు వంటి సిట్రస్ ఫ్రూట్స్‌లో విటమిన్ C పుష్కలంగా లభిస్తుంది. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. క్యాప్సికమ్‌లో విటమిన్ సి, బీటా-కెరోటిన్ ఉంటాయి. టమాటాలు, పాలకూర, బచ్చలికూర, క్యాబేజీ వంటి ఆకుకూరలు ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో క్యాటెచిన్స్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్‌ ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ లంగ్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి. సాల్మన్, మాకరెల్, సార్డిన్స్ వంటి ఫ్యాటీ ఫిష్‌లో, అలాగే ఫ్లాక్స్‌సీడ్స్, చియా విత్తనాలు, వాల్‌నట్స్‌లో ఈ యాసిడ్స్ లభిస్తాయి. వీటిలో లంగ్స్‌కు మేలు చేసే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి.

పసుపు

పసుపులోని క్రియేటివ్ కాంపౌండ్ అయిన కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. పసుపు వల్ల శ్వాస మార్గాల్లో వాపు తగ్గుతుంది. శ్వాసకోశ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది.

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీమైక్రోబయల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దీంతో లంగ్స్ ఇన్ఫెక్షన్ల నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

అల్లం

అల్లంలోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తాయి. శ్వాస మార్గాల్లో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నట్స్, సీడ్స్

బాదం, సన్‌ఫ్లవర్ సీడ్స్, హాజెల్‌నట్స్‌లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తాయి.

ధాన్యాలు

ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటి ధాన్యాలు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. ధాన్యాలు ఎక్కువగా తినడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది, శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

నీరు

రెస్పిరేటరీ సిస్టమ్ హెల్తీగా ఉండాలంటే హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. నీరు శ్వాస మార్గాలలో శ్లేష్మం స్రావాలను పలుచగా చేస్తుంది. దీనివల్ల వాటిని బయటకు పంపడం సులభతరం అవుతుంది. శ్వాసకోశ సంక్రమణల ప్రమాదం తగ్గుతుంది.

చికెన్‌, లీన్ మీట్

చికెన్, టర్కీ వంటి లీన్ మీట్స్‌లో ప్రోటీన్, జింక్‌ను అందిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తి, శ్వాసకోశ ఆరోగ్యానికి ముఖ్యమైనవి.

పెరుగు, కేఫీర్

యోగర్ట్, కేఫీర్ వంటి ప్రోబయోటిక్-రిచ్ ఫుడ్స్‌లో పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, రోగనిరోధక శక్తిని పెంచే బ్యాక్టీరియా ఉంటాయి. హెల్తీ గట్ మైక్రోబయోమ్ మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. వీటితోపాటు స్మోకింగ్ మానేయాలి. రోజూ ఎక్సర్‌సైజ్‌ చేయాలి. హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి.

LPG Gas Cylinder: ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవుతే ఏం చేయాలో తెలుసా? ఈ టిప్స్ మీ కోసమే..

LPG Gas Cylinder: ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవుతే ఏం చేయాలో తెలుసా? ఈ టిప్స్ మీ కోసమే..

LPG Gas Cylinder Safety Tips: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ దీని అందరి ఇళ్లలో వంట కోసం వినియోగిస్తాం. గతంలో కట్టెల పోయ్యి, కిరోసిన్ స్టవ్ లపై వంట చేసుకునే విధానంలో భారీ మార్పులు చేసుకొని ఈ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ విస్త్రతంగా ఉపయోగిస్తున్నారు.

అయితే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఒక్కోసారి లీకై ప్రాణాంతక ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. భద్రతా చర్యలు తీసుకుంటే లీకేజీ వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం.

పొరపాటున ఎప్పుడైనా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీక్ అవుతే సత్వరమే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ని ఆఫ్ చేయండి అంటే రెగ్యులేటర్‌కు ఉండే నాజిల్ ని ఆఫ్ చేసి పెట్టాలి.

వెంటిలేషన్..
లీకేజ్ అయిన వెంటనే ఓపెన్ ప్రదేశంలోకి తీసుకెళ్లి సిలిండర్ ని పెట్టాలి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కి గాలి తగలాలి మంచి వెంటిలేషన్ ఉంటే మంట ప్రభావం తగ్గుతుంది.

ఫైర్
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లీక్ అయిన వెంటనే కరెంటు ఇతర స్పీచ్ లు ఆఫ్ చేసి పెట్టాలి. వాటి దరిదాపులో మంట కలిగించే వస్తువులను పెట్టకూడదు.

అంతేకాదు క్యాండిల్స్, అగరబత్తులు వంటివి గ్యాస్‌ సిలిండర్‌ దరిదాపుల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి.

అందరూ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు వెంటనే చేయాల్సిన మరో పని ఏంటంటే ముందుగా ఎల్పిజి డీలర్ కి వెంటనే కంప్లైంట్ చేయండి.

ఒకవేళ మీకు వీలైతే ఈ లీకేజీ అవుతున్న గ్యాస్ సిలిండర్ ని ఓపెన్ ప్లేస్ లోకి తీసుకెళ్లి ఒక తడి గుడ్డను కట్టండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో దాని వర్టికల్‌ విధానంలోనే ఉంచాలి

అంతేకానీ మీరే వాటికి రిపేర్ చేయాలని ప్రయత్నించకండి వీటికి నిపుణుల సూచన అవసరం. ప్రతి ఒక్కరు ఇంట్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉంటుంది కాబట్టి ఈ భద్రతా చర్యలు గుర్తుంచుకోవాలి.

భద్రతా చర్యలు..
ఎప్పుడైనా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ చల్లని ప్రదేశంలో పెట్టండి. ముఖ్యంగా నేరుగా సన్లైట్ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఎప్పుడు వర్టికల్ విధానంలోనే ఏర్పాటు చేయండి.
మీరు పెడుతున్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ చుట్టుముట్టు ప్రదేశాలు గాలి ఆడే విధంగా ఉండాలి మంచి వెంటిలేషన్ ఉండాలి
ఎప్పటికప్పుడు గ్యాస్ స్టవ్ సిలిండర్ను చెక్ చేస్తూ ఉండాలి గ్యాస్ పైప్ ను డీలర్ తో మార్పించుకోవాలి.

జగన్ కు మళ్లీ అధికారం పై తేల్చేసిన చంద్రబాబు..!!

జగన్ కు మళ్లీ అధికారం పై తేల్చేసిన చంద్రబాబు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ, తెలంగాణ రాజకీయాల గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్‌వైభవం వస్తుందని, ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని అన్నారు.

తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని, తెలుగు జాతి అనేక సంక్షోభాలు ఎదుర్కొందన్నారు. టీడీపీ కూడా రాజకీయంగా అనేక సంక్షోభాలు ఎదుర్కొందని, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుంటూ టీడీపీ ఎదిగిందన్నారు.

భూస్థాపితం చేస్తాం

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ క్యాడర్‌తో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న చంద్రబాబు ఏపీలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం గురించి వివరించారు. 2019 తర్వాత ఏపీలో విధ్వంస ప్రభుత్వం వచ్చిందన్న ఆయన విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఏపీలో వైసీపీ పాలన వల్ల జరిగిన నష్టమే ఎక్కువ జరిగిందని ధ్వజమెత్తారు. కొంత మంది తనను తిరిగి పాత ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారని.. ఈ ఎన్నికలతో అడ్రస్ లేకుండా పోయిన ఆ పార్టీ..ఆ భూతంను రాజకీయంగా పూర్తిగా భూస్థాపితం చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

నాటి చంద్రబాబును చూస్తారు

దేశంలో అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువని ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించే బాధ్యత తనదని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఏపీ తలసరి ఆదాయం రూ. 2,19,518 అని చెప్పారు. తెలుగువారు గ్లోబల్ సిటిజన్స్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజులు లేరని, విర్రవీగితే ప్రజలు శిక్షిస్తారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ప్రజలకు సేవకులని పెత్తందారులు కాదని వ్యాఖ్యానించారు. 2024లో 1995 సీబీఎన్​ను చూస్తారన్న చంద్రబాబు, అప్పుడు ఎలా పనిచేశానో ఇప్పుడు అలానే చేస్తానని పేర్కొన్నారు.

కలిసి పని చేస్తాం

తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని పార్టీల సిద్దాంతాలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగుజాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు. తెలంగాణలో నాలెడ్జ్‌ ఎకానమీకి నాంది పలికామని..తన తర్వాత కాంగ్రెస్‌, బీఆర్ఎస్ అభివృద్ధిని కొనసాగించాయన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవటంతో..తన చొరవను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు చెప్పారు. తెలుగురాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణను మరోస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఇక్కడి పాలకులకు ఉందని చంద్రబాబు వివరించారు.

Bael Plant | మారేడు చెట్టు కింద ఆ పనిచేస్తే నిరుపేద కూడా సంపన్నుడవుతాడట..!

Bael Plant | మారేడు చెట్టు కింద ఆ పనిచేస్తే నిరుపేద కూడా సంపన్నుడవుతాడట..!

Bael Plant : హిందూధర్మంలో చెట్టును దైవంగా పూజిస్తారు. కొన్ని వృక్షాలు దేవతా వృక్షాలుగా కీర్తించబడుతాయి. ఇలా దేవతా వృక్షాలుగా కీర్తించబడే వాటిలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది.

మారేడు చెట్టుని సంస్కృతంలో బిల్వ వృక్షం అంటారు. బిల్వ వృక్షం శివునికి అత్యంత ప్రీతికరమైనది. అందుకే మారేడు దళాలతో శివయ్యను పూజిస్తాం. బిల్వ పత్రంలోని మూడు ఆకులు శివుని మూడు కళ్ళకు ప్రతీకగా చెబుతారు.

లక్ష్మీదేవి తన కుడి చేతితో మారేడు చెట్టును సృష్టిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మారేడు వృక్షాన్ని శ్రీ వృక్షమని, మారేడు కాయలు శ్రీఫలాలని అంటారు. మారేడు చెట్టు ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుందనేది చాలమంది విశ్వాసం. మన పురాణాల్లో చెప్పబడ్డ ఐదు లక్ష్మీ స్థానాల్లో మారేడు దళం కూడా ఒకటి. పువ్వులు పూయకుండానే కాయలు కాయడం మారేడు విశిష్టతగా చెప్పవచ్చు. అందుకే దీన్ని వనస్పతి అని కూడా పిలుస్తారు.

ముళ్ల చెట్లను ఇంట్లో పెంచుకుంటే శత్రు బాధలు ఎక్కువవుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. కానీ ఈ దేవతా వృక్షానికి అటువంటి పట్టింపు ఏమీలేదు. ఇంటి ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో తూర్పు, దక్షిణ దిక్కుల్లో మారేడు చెట్టును పెంచుకోవచ్చు. అంతేకాదు ఈ చెట్టు కింద ఓ పరిహారం చేస్తే కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడట. ఇంట్లో లక్ష్మీదేవి తిరగాడుతుందట. పట్టిందల్లా బంగారమే అవుతుందట.

ఇంతకూ ఆ పరిహారం ఏమిటంటే.. చెట్టు మొదట్లో శుభ్రంచేసి మొదలుకు పసుపు అలంకరించి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలట. ఇలా చేస్తే కోటి మంది దేవతలకు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం లభిస్తుందట. అదేవిధంగా ఆ చెట్టు కింద పీటవేసి ఒక యోగ్యుడికి భోజనం పెడితే కోటి మంది దేవతలకు పూజ చేసిన పుణ్యం దక్కుతుందట. ఇలా మారేడు వృక్షాన్ని పూజించే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. దాంతో కటిక పేదవాడు కూడా క్రమంగా సంపన్నుడిగా మారిపోతాడట.

కాగా, మారేడు దళాలతో శివునికి పూజ చేసేటప్పుడు ఈనెలను తీయాల్సిన అవసరం లేదు. ఈనెలను పట్టుకుని శివార్చన చేస్తారు. అయితే మారేడు దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదట. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయట. బుధ, శనివారాల్లో మాత్రమే మారేడు పత్రాలను కోయాలట. చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, అష్టమి తిథుల్లో కూడా బిల్వాలను కోయకూడదట. సంధ్యా సమయం, రాత్రి వేళళ్లో, శివరాత్రి రోజున కూడా మారేడు పత్రాలను కోయవద్దని చెబుతారు.

సీఎం చంద్రబాబు ఇంటిచుట్టూ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు చక్కర్లు

సీఎం చంద్రబాబు ఇంటిచుట్టూ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు చక్కర్లు

హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు ఆ రాష్ట్ర మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పీఎస్‌ఆర్ ఆంజనేయులు యత్నించారు. అపాయింట్‌మెంట్‌ లేదని సీఎంవో అధికారులు చెప్పినా హైదరాబాద్‌లోని సీఎం ఇంటిచుట్టూ చక్కర్లు కొట్టారు.

ఆదివారం పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు రెండుసార్లు అక్కడికి వెళ్లారు. అపాయింట్‌మెంట్ లేకపోవడంతో సీఎం ఇంటి గేటుదగ్గరే పీఎస్‌ఆర్‌ను భద్రతా సిబ్బంది వెనక్కి పంపారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని పీఎస్‌ఆర్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) తప్పించింది. ఆ తర్వాత అనధికారికంగా కూడా వైకాపా కోసం పనిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

Ration Cards : రేషన్​ కార్డుల్లో తప్పుల సవరణకు అప్లై చేయడం ఇలా..

Ration Cards : రేషన్​ కార్డుల్లో తప్పుల సవరణకు అప్లై చేయడం ఇలా..

Ration Cards : కొంతమంది రేషన్ కార్డుల్లో తప్పులు ఉంటాయి. కొందరి పేర్లలో మిస్టేక్స్ ఉంటాయి. కొత్తగా పెళ్లయిన వారు తమ జీవిత భాగస్వామి పేరును రేషన్ కార్డులో(Ration Cards) చేర్చాల్సి ఉంటుంది.

ఇంకొందరు తమ పిల్లల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చాల్సి ఉంటుంది. మరికొందరు ఇంటి అడ్రస్‌ను మార్చాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడం ఇక ఈజీ. కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంటే ఆన్‌లైన్‌లో మీరే ఫోను నుంచి అప్లికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయొచ్చు.

ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులను మీరు స్కాన్ చేయించి, వాటి డిజిటల్ కాపీలను మీ ఫోనులోకి తీసుకోవాలి. ఒక సెట్ జిరాక్స్ ప్రతులు కూడా తీసి ఉంచుకోవాలి. గూగుల్‌లో Telangana Mee seva Portal అనే వెబ్ సైట్ ఉంటుంది. అది ఓపెన్ చేయగానే వచ్చే హోం పేజీలో Services అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. ఓపెన్ అయిన పేజీలో Search for Services అనే బటన్ వస్తుంది. దానిపై క్లిక్​ చేయాలి. తదుపరిగా Department అనే ఆప్షన్ వస్తుంది. దాని​లోకి వెళ్లి Selectపై క్లిక్ చేసి Civil Supplies అనే ఆప్షన్​ను క్లిక్ చేశాక ఓపెన్ అయిన పేజీలో ‘Corrections in Food Security Card’ అనే ఆప్షన్ వస్తుంది.

రాబోయే రెండు ఐసీసీ సిరీస్ లకు రోహిత్ శర్మకే కెప్టెన్సీ!

రాబోయే రెండు ఐసీసీ సిరీస్ లకు రోహిత్ శర్మకే కెప్టెన్సీ!

టీ20 వరల్డ్ కప్ ను భారత్ కు అందించిన రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఫిబ్రవరి లో పాకిస్తాన్ లో జరగనున్న ఛాంపియన్ ట్రోఫీకి,లార్డ్స్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, కూడా ప్రాతినిథ్యం వహిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు.ఆ తర్వాత జూన్‌ నెలలో లండన్‌లోని లార్డ్స్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఫైనల్‌లో భారత్ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి రోహిత్‌కి 38 ఏళ్లు రానున్నాయి.

“ఈ చారిత్రాత్మక విజయం కోసం నేను టీమ్ ఇండియాను అభినందించాలనుకుంటున్నాను.ఈ విజయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, (ఔట్‌గోయింగ్) హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ,రవీంద్ర జడేజాలకు అంకితం చేయాలనుకుంటున్నాను.ఇది మా మూడవ ఫైనల్. గత ఒక సంవత్సరంలో మేము జూన్ 2023లో (ఆస్ట్రేలియాతో ఓవల్‌లో) ఓడిపోయాము.నవంబర్ 2023లో, మేము 10 విజయాలు సాధించాము (ODI ప్రపంచ కప్‌లో), ప్రజల హృదయాలను గెలుచుకోలేకపోయాము.కానీ ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ విజయంతో భారత్ జట్టు మంచి ఉత్సాహంలో ఉంది.రాబోయే రెండు ఐసీసీ ఈవెంట్లలో భారత్ జట్టు ఖచ్ఛితంగా విజయం సాధిస్తుందని జైషా ఆశాభావం వ్యక్తం చేశారు.

HIV: ఈ ఇంజెక్షన్‌తో హెచ్‌ఐవీకి చెక్!

HIV: ఈ ఇంజెక్షన్‌తో హెచ్‌ఐవీకి చెక్!

HIV: ఇకపై హెచ్‌ఐవీకి ఆ ఇంజెక్షన్‌తో చెక్ పెట్టవచ్చు. దక్షిణాఫ్రికా, ఉగాండాలో జరిగిన ఓ పెద్ద క్లినికల్ ట్రయల్, కొత్త ఫ్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్‌ని రెండుసార్లు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే యువతులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి లభిస్తుంది.

ఇతర ఔషధాల కంటే మెరుగైన రక్షణను అందిస్తుంది. ఇది హెచ్‌ఐవీని తగ్గిస్తుందని వైద్య శాస్త్రవేత్త అయిన లిండా-గెయిల్ బెక్కర్ తెలిపారు. దీని కోసం 5000 మందిపై పర్పస్ 1 ట్రయల్ వేశారు. రెండు ఔషధాల సామర్థ్యాన్ని పరీక్షించారు.

లెనాకావిర్ అనే ఫ్యూజన్ క్యాప్‌సైడ్ ఇన్హిబిటర్‌ ఇంజెక్షన్‌తో పరీక్షించారు. ఇది హెచ్‌ఐవీ జన్యుపదార్థం. ప్రతిరూపణకు అవసరమైన ఎంజైమ్‌లను రక్షించే ప్రొటీన్ షెల్. ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి చర్మంపై వేస్తారు. ఈ ఇంజెక్షన్‌ను 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు ఇస్తారు. ఇది మెరుగైన రక్షణను అందిస్తుంది. రెండో ఇంజెక్షన్‌ డెస్కోవీ ఎఫ్/టీఏఎఫ్. ఇది మెరుగైన ఫార్మకోకైనటిక్ లక్షణాలు కలిగి ఉంది. ఇది ఎక్కువగా పురుషులు, లింగమార్పిడి చేసుకున్న స్త్రీలలో ఎక్కువ ఉపయోగం ఉంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ల కొత్త హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.

Amaravati: 2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ

గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా చిట్టడవిని తలపిస్తున్న రాజధాని అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

అమరావతి: గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా చిట్టడవిని తలపిస్తున్న రాజధాని అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాజధాని వ్యాప్తంగా కంప చెట్ల తొలగింపునకు సీఆర్డీయే సిద్ధంకాగా, ఈ పనులకు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) ఆమోదం తెలిపింది. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరే ముందు జూన్‌లో ఐదు రోజుల పాటు ముఖ్యమైన 25 ప్రాంతాల్లో తాత్కాలికంగా ముళ్ల కంపలు తొలగించి, శుభ్రం చేశారు. 109 చ.కి.మీ. పరిధిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో ఈ పనులు చేశారు. కరకట్ట రోడ్డు, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ అధికారుల నివాస సముదాయాల భవనాలకు వెళ్లే మార్గాలను శుభ్రం చేశారు. తాజాగా మంత్రి నారాయణ ఆదేశాలతో అమరావతి రూపురేఖలు మార్చేందుకు రూ.36.50 కోట్లతో పనులు చేపట్టాలని సీఆర్డీయే అంచనాలు సిద్ధం చేసింది. వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. గుత్తేదారులు పనులు చేసేందుకు నెల రోజుల గడువు ఇవ్వనున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో పరిశుభ్రత పనులు చేయనున్నారు. భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు సీఆర్డీయే రిటర్నబుల్‌ ప్లాట్లను ఇచ్చింది. అయితే, ముళ్లకంపలు పెరిగిపోవడంతో చాలామందికి తమ ప్లాట్‌ ఎక్కడుందో తెలియని పరిస్థితి. ప్లాట్లను మార్కింగ్‌ చేసి చూపించాలని రైతులు ఎన్నిసార్లు కోరినా, నాటి వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. సీఆర్డీయే చేపట్టే స్వచ్ఛ పనుల్లో భాగంగా ఎల్పీఎస్‌ లే ఔట్లలోనూ జంగిల్‌ క్లియరెన్స్‌ చేయనున్నారు.

Nara Lokesh: వాట్సప్‌లో ఫిర్యాదు.. దివ్యాంగ విద్యార్థుల సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేశ్‌

Nara Lokesh: వాట్సప్‌లో ఫిర్యాదు.. దివ్యాంగ విద్యార్థుల సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేశ్‌

అమరావతి: ఇంటర్‌ మార్కుల జాబితాలో దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక జీవో విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు సాధించిన విజయవాడకు చెందిన మారుతీ పృథ్వీ సత్యదేవ్‌.. ఇంటర్‌ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ విషయంలో ఎదురైన సమస్యను వాట్సప్‌ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సత్యదేవ్‌కు వచ్చిన ర్యాంకు ప్రకారం చెన్నయ్‌ ఐఐటీలో సీటు రావాల్సి ఉంది.

అయితే, దివ్యాంగ విద్యార్థులకు మినహాయింపు పొందిన సబ్జెక్టుకు సంబంధించి సర్టిఫికెట్‌లో ఇంటర్‌ బోర్డు ఎప్పటి నుంచో ‘E’ (EXEMPTION) అని మాత్రమే పేర్కొంటూ జారీ చేస్తున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటర్మీడియట్ మెమో సర్టిఫికెట్‌ని అప్‌లోడ్ చేయగా… మెమోలో కేవలం నాలుగు సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయని, మ్యాథ్స్ ఎ, మ్యాథ్స్ బిలను ఒకే సబ్జెక్ట్‌గా పరిగణిస్తున్నామని, అందువల్ల ఇంటర్మీడియట్ పత్రాన్ని అంగీకరించబోమని సమాచారమిచ్చారు. దీనిపై సత్యదేవ్ ఐఐటి మద్రాసుని సంప్రదించగా, సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్‌లో ‘E’ స్థానంలో నిర్దిష్ట సంఖ్యా విలువను కలిగి ఉంటేనే కళాశాలలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే స్పందించిన లోకేశ్‌ సంబంధిత విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి చొరవతో మొత్తం 25 మంది దివ్యాంగ విద్యార్థులకు దేశవ్యాప్తంగా పేరెన్నిక గన్న ఐఐటీ, ఎన్ఐటీ వంటి విద్యాసంస్థల్లో ప్రవేశాలు లభించాయి. సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో 25 మంది దివ్యాంగ విద్యార్థులను మంత్రి అభినందించనున్నారు.

మోదీ సర్కార్ అదిరిపోయే తీపికబురు.. ఫ్రీగా అకౌంట్ లో రూ.50 వేలు పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్ ను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చుతున్న సంగతి తెలిసిందే.

మోదీ సర్కార్ ఒక ఆన్ లైన్ కాంటెస్ట్ ను నిర్వహిస్తుండగా ఈ కాంటెస్ట్ లో విజేతగా నిలిస్తే ఏకంగా 50,000 రూపాయలు పొందవచ్చు. లోగో డిజైన్ చేయడం ద్వారా ఈ కాంటెస్ట్ లో పోటీ చేసి విజేతగా నిలిచే అవకాశం అయితే ఉంటుంది.

సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) కోసం లోగో క్రియేట్ చేయడం ద్వారా ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. ఎస్‌టీపీఐ కు సంబంధించిన అడాప్షన్ ఆఫ్ మెఘ్ రాజ్ బై యూజర్ డిపార్ట్‌మెంట్స్ కోసం లోగో క్రియేట్ చేయడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. మైగౌ ద్వారా లోగో డిజైన్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుండగా ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

మన దేశానికి చెందిన పౌరులంతా ఈ కాంటెస్ట్ లో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. జేపీఈజీ, జేపీజీ, పీఎన్‌జీ ఫార్మాట్లలో లోగోను డిజైన్ చేసి పంపాల్సి ఉంటుంది. ఒరిజినల్ డిజైన్స్ కూడా సబ్‌మిట్ చేయడంతో పాటు లోగో డిజైన్ చేయడం వెనుక కారణాలను అందుకు సంబంధించిన సారాంశాన్ని కూడా వెల్లడించాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో సైతం యూజ్ చేసుకునేలా ఆ లోగో ఉండాలి.

రెజల్యూషన్ 300 డీపీఐతో ఉన్న లోగోలను మాత్రమే పంపాల్సి ఉంటుంది. లోగో నచ్చితే మాత్రం కమిటీ నుంచి 50 వేల రూపాయలు పొందవచ్చు. జులై 22వ తేదీ వరకు ఈ కాంటెస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ కాంటెస్ట్ టాప్2 ఫ్రైజ్ 20 వేల రూపాయలుగా ఉంది. ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ పోటీ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.

మహిళలకు కేంద్ర ప్రభుత్వం కానుక; ఖాతాలో 5,000 రూపాయలు జమ చేశారు

మహిళలకు కేంద్ర ప్రభుత్వం కానుక; ఖాతాలో 5,000 రూపాయలు జమ చేశారు

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. మహిళా సాధికారతను సాధించే లక్ష్యంతో మహిళలకు ప్రయోజనాలను అందించే పథకాలే వీటిలో ఎక్కువ.

మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రధాన మంత్రి మాతృత్వ వందన్ యోజన ఈ పథకాలలో ఒకటి.

ఈ పథకం కింద, ప్రభుత్వం నేరుగా మహిళలకు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది మరియు వారి ఖాతాలలో రూ. 5,000 జమ చేస్తుంది. ఈ ప్లాన్ ప్రయోజనాలను ఎలా పొందాలో తెలుసుకుందాం.

గర్భిణులకు ప్రభుత్వం రూ.5వేలు.
ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన కింద గర్భిణులకు రూ.5,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం ప్రభుత్వం 2017లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం మూడు విడతలుగా అందజేస్తుంది.

పథకం కింద నమోదైన దరఖాస్తును ధృవీకరించిన తర్వాత అధికారులు మొదటి విడతగా రూ.1000 మహిళల ఖాతాల్లో జమ చేస్తారు. గర్భం దాల్చిన 6 నెలల తర్వాత రెండో విడతగా రూ.2వేలు మహిళల ఖాతాకు పంపబడతాయి. బిడ్డ పుట్టిన తర్వాత మిగిలిన చివరి వాయిదా రూ.2,000 ఇస్తారు.

ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోండి!
ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు మహిళలు 19 ఏళ్లు పైబడి ఉండాలి. పథకం ప్రయోజనాలను పొందడానికి, మీరు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmmvy.wcd.gov.in/కి వెళ్లాలి.

దీని తర్వాత మీరు సిటిజన్ లాగిన్ ఎంపికపై క్లిక్ చేయాలి. దీని తర్వాత, మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా మీ లాగిన్, పాస్‌వర్డ్ మొదలైనవి ఉత్పత్తి చేయబడతాయి. దీని తర్వాత మీరు డేటా ఎంట్రీపై క్లిక్ చేసి, లబ్ధిదారుల నమోదుపై క్లిక్ చేయాలి.

దీని తర్వాత, మీరు పథకంలో ఏ పిల్లలకు దరఖాస్తు చేస్తున్నారు.? అంటే ఇది మొదటి జన్మనా లేదా రెండవ జన్మనా అనే సమాచారాన్ని నమోదు చేయవలసి ఉంటుంది. అప్పుడు మీరు ఆధార్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ, వయస్సు మరియు కేటగిరీని ఎంచుకోవాలి.

దీని తర్వాత, చిరునామా రుజువు మరియు ID ప్రూఫ్‌తో పాటు మొబైల్ నంబర్‌ను సమర్పించాలి. చివరగా, మీరు ఇచ్చిన మొత్తం సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత దరఖాస్తును సమర్పించినట్లయితే, మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆయా గ్రామాల అంగన్‌వాడీల నుంచి పూర్తి సమాచారం పొందవచ్చు.

Health Tips : ఒక్కో అడుగు ఆరోగ్యానికి ముందడుగు.. రోజుకు కనీసం ఎన్ని అడుగులు వేయాలంటే!

Health Tips : ఒక్కో అడుగు ఆరోగ్యానికి ముందడుగు.. రోజుకు కనీసం ఎన్ని అడుగులు వేయాలంటే!

Walking Benefits :నడక (Walking) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సులభమైన వ్యాయామం (Exercise). ప్రతిరోజు మనం వేసే అడుగు మన ఆయుష్షును పెంచుతుందని ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది.

అయితే తాజా అధ్యయనంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆరోగ్యకర జీవనానికి రోజుకు 10వేల అడుగులు వేయాల్సిందేనని అమెరికాకు చెందిన జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ, పోలండ్‌లోని లాడ్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది.

రోజుకు 10వేల అడుగులు..
1964 టోక్యో ఒలింపిక్స్‌ (Tokyo Olympics) కు ముందు జపాన్‌కు చెందిన ‘యమసా’ గడియారాల ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆ సమయంలో యమసా కంపెనీ కొత్తగా ఓ ‘పెడోమీటర్‌’ను ఆవిష్కరించింది. అది మెటల్‌ బాల్‌తో ఉండే ఒక కౌంటింగ్ మిషన్. దాన్ని నడుముకు ధరిస్తే మనం రోజుకు ఎన్ని అడుగులు వేశామో లెక్కిస్తుంది. ఒలింపిక్స్‌ సమయంలో దానికి విశేష ఆదరణ దక్కడమే కాకుండా.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ‘రోజుకు 10వేల అడుగులు’ అనే మాట వ్యాప్తి చెందింది. ఆ తర్వాత ఈ సలహాపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఇందుకోసం దాదాపు 2.26లక్షల మందితో 17 వేర్వేరు పరిశోధనలు జరిపింది. రోజుకు ఎంతసేపు నడవాలనే ప్రశ్నకు పరిశోధకులు రకరకాల ప్రత్యామ్నాయాలు సూచించారు. రోజుకు దాదాపు 4వేల అడుగులు నడిస్తే అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇది అల్జీమర్స్‌, డిమెన్షియా వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అధికబరువు/ఊబకాయం, డయాబెటిస్‌ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. 2337 అడుగులతో గుండె సంబంధిత (కార్డియోవాస్కులర్‌) జబ్బులతో మరణించే అవకాశాలు తగ్గుతాయని తెలిపారు.

గుండెజబ్బులు 15 శాతం తగ్గిపోతాయి..
అలాగే రోజుకు వెయ్యి అడుగులు వేస్తే గుండెజబ్బుల మరణాలు 15 శాతం తగ్గిపోతాయి. 500 అడుగులు పెంచితే 7 శాతం తగ్గుతాయి. 60 ఏళ్లు పైబడినవారు రోజుకు ఆరు వేల అడుగుల నుంచి 10 వేల అడుగులు నడిస్తే అకాల మరణాల ముప్పు 42 శాతం తగ్గుతుందని ఈ పరిశోధకులు సూచించారు. రోజు 8వేల నుంచి 10వేల అడుగులు నడవడం అనేది ఉత్తమం. ఒక్క రోజులోనే 10వేల అడుగులను చేరుకోలేకపోవచ్చు. వేగంగా నడవాలన్న ప్రయత్నంలో కొన్ని సార్లు గుండె మీద ఒత్తిడి పడుతుంది. కాబట్టి 2,500 నుంచి 3000లతో మొదలుపెట్టి నెమ్మదిగా ప్రతి 15రోజులకి ఐదు వందల చొప్పున పెంచుకుంటూ వెళ్లినా మేలంటున్నారు.

TG TET: ఇక టెట్‌ ఏటా రెండుసార్లు

ఇక నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2015 డిసెంబరు 23న ఇచ్చిన జీవో 36లో సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 18 జారీ చేశారు.

హైదరాబాద్‌: ఇక నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2015 డిసెంబరు 23న ఇచ్చిన జీవో 36లో సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 18 జారీ చేశారు. ఏటా జూన్, డిసెంబరులో పరీక్షను జరుపుతామని అందులో పేర్కొన్నారు.

ఏటా ఒకసారి టెట్‌ నిర్వహిస్తామని 2015లో జీవో 36 జారీ చేసినా ఇప్పటి వరకు ఐదుసార్లు మాత్రమే పరీక్ష జరిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016, 2017లో నిర్వహించారు. అనంతరం 2018 నుంచి 2021 వరకు చేపట్టలేదు. మళ్లీ 2022, 2023, 2024లో వరుసగా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011, 2012(రెండుసార్లు), 2014లో టెట్‌ జరిగింది.

Gongura Pachadi:కేవలం 2 నిమిషాల్లో గోంగూర పచ్చడి రుచిగా రావాలంటే ఇలా చేయండి

Gongura Pachadi:కేవలం 2 నిమిషాల్లో గోంగూర పచ్చడి రుచిగా రావాలంటే ఇలా చేయండి

Gongura Pachadi:కేవలం 2 నిమిషాల్లో గోంగూర పచ్చడి రుచిగా రావాలంటే ఇలా చేయండి..గోంగూర పచ్చడి..పొరుగింటి గోంగూర పుల్లన అంటారు.ఇంట్లో చేసిన దానికంటే ,ఫంక్షన్ లో చేసిన గోంగూర పచ్చడిని,లొట్టలు వేసుకుంటూ తింటుంటారు.అచ్చం ఫంక్షన్ స్టైల్ గోంగూర పచ్చడిని,ఇంట్లోనే ఎలా చేసుకోవాలో తెల్సుకుందాం.

కావాల్సిన పదార్థాలు
గోంగూర – 2 కట్టలు
ఆయిల్ – 2 స్పూన్లు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు -8
పచ్చిమిర్చి -6
వెల్లుల్లి రెబ్బలు -4
టమాటలు -2
సాల్ట్ – తగినంత
పసుపు – ½ టీ స్పూన్
మెంతుల పొడి – 1/4 టీ స్పూన్

తయారీ విధానం
ముందుగా గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి.
2.స్టవ్ పై కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, వేడెక్కిన ఆయిల్ లోకి,
జీలకర్ర, ధనియాలు,ఎండుమిర్చి తుంచుకుని వేసుకోండి.
3. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బులు వేసేసి లో ఫ్లేమ్ లో మాడకుండా వేయించుకోండి.
4. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటలు యాడ్ చేసుకుని, కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకుని,
దగ్గరికి వచ్చే వరకు ఉడకనీవ్వండి.
5. ఉడికిన టమాటాలోకి గోంగూర ఆకులు వేసుకుని , బాగా మిక్స్ చేసుకుని మెత్తగా ఉడికించుకోండి.
6. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని పావు టీ స్పూన్ మెంతిపొడి వేసి, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి.
7. ఇప్పుడు తాళింపు కోసం కడాయిలో ఒక టెబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, వేడెక్కిన ఆయిల్లో తాళింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ యాడ్ చేసుకుని , రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసుకోవాలి.
8. చివరగా కరివేపాకు వేసుకుని, వేగిన పోపులోకి గోంగూరపచ్చడి వేసుకోవాలి.
9. ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే, అదిరిపోయే గోంగూర చెట్నీ రెడీ.

పింఛన్ దారులకు షాకిచ్చిన ముఖ్యమంత్రి.. ఇకపై వారికి పింఛన్ లేనట్లే!

పింఛన్ దారుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు రెండున్నర లక్షల బోగస్ పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

ఈ పింఛన్లలో అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆధార్‌లో వయస్సు మార్చుకుని, వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారని గుర్తించారు. దివ్యాంగులు కాకపోయినా.. దివ్యాంగుల ఫేక్ సర్టిఫికేట్ చూపించి పింఛన్లు అందుకుంటున్నట్లు తెలిపారు.

ఒంటరి మహిళ కాకపోయినా వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారని.. ఇది సరైన పద్ధతి కాదంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అన్ని రకాల అక్రమాలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం సామాజిక పింఛన్లు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయని అన్నారు.

ఈ ఫిర్యాదులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే విచారించాల్సిందిగా అర్హులైన వారికి మాత్రం పింఛన్లు రాకుండా ఆపినట్లు గుర్తించారు. ఇక బాధ్యులైన అధికారులను కూటమి సర్కారు గుర్తిస్తుంది. పింఛన్లలో అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మండల స్థాయి అధికారులు కూడా సస్పెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Google సెర్చ్ హిస్టరీ : ఈ ప్రమాదకరమైన సెట్టింగ్‌ని వెంటనే ఆఫ్ చేయండి, లేకుంటే మీ సెర్చ్ హిస్టరీ బహిర్గతమవుతుంది

Google సెర్చ్ హిస్టరీ : ఈ ప్రమాదకరమైన సెట్టింగ్‌ని వెంటనే ఆఫ్ చేయండి, లేకుంటే మీ సెర్చ్ హిస్టరీ బహిర్గతమవుతుంది

ప్రజలు గూగుల్‌లో చాలా సెర్చ్ చేసి, సెర్చ్ చేసిన తర్వాత హిస్టరీని డిలీట్ చేసి, ఇప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేసిన విషయం ఎవరికీ తెలియదని అనుకుంటారు.

అయితే, మీరు చరిత్రను తొలగించినప్పటికీ, మొత్తం రికార్డ్ ఉంచబడుతుంది.

షాక్ అయ్యా కానీ ఇది నిజం. సర్, బ్రౌజర్ నుండి హిస్టరీని డిలీట్ చేయడం వల్ల ఏమీ జరగదు, మీరు సెర్చ్ హిస్టరీని శాశ్వతంగా డిలీట్ చేయాలి, లేకపోతే ఈ డేటా మీకు ఒక రోజు పెద్ద సమస్యగా మారవచ్చు.

సమస్యను నివారించడానికి ఏకైక పరిష్కారం Google శోధన సహాయంతో మీ శోధన చరిత్రను శాశ్వతంగా తొలగించడం. మీరు మీ శోధన చరిత్రను శాశ్వతంగా ఎలా తొలగించవచ్చో మేము మీకు తెలియజేస్తాము. ఈ పని చేయడానికి మీరు కొన్ని సాధారణ దశలను అనుసరించాలి.

ముందుగా, మీ ఫోన్‌ని తీయండి, ఆపై మీ ఫోన్ సెట్టింగ్‌లను తెరవండి. దీని తర్వాత మీరు సెట్టింగ్‌లలో వ్రాసిన Googleని చూస్తారు, ఈ ఎంపికపై క్లిక్ చేయండి. మీరు ఈ ఎంపికపై క్లిక్ చేసిన వెంటనే మీ Google ఖాతాను నిర్వహించండి అని వ్రాయబడిందని మీరు చూస్తారు, ఈ ఎంపికపై క్లిక్ చేయండి.

దీని తర్వాత మీరు డేటా మరియు గోప్యతా విభాగాన్ని చూస్తారు, ఈ విభాగంలో మీరు వెబ్ మరియు యాప్ యాక్టివిటీ ఎంపికను కనుగొంటారు. మీకు మై యాక్టివిటీ ఆప్షన్ కూడా కనిపిస్తుంది, మై యాక్టివిటీ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు గూగుల్ సెర్చ్ సహాయంతో సెర్చ్ చేసిన మొత్తం సమాచారం మీకు కనిపిస్తుంది.

మీరు తొలగించడానికి తేదీ ద్వారా ఫిల్టర్ ఎంపికను పొందుతారు, దీనిలో మీరు చివరి గంట, చివరి రోజు, అన్ని సమయం మరియు అనుకూల పరిధి ఎంపికను పొందుతారు. ఇప్పటి వరకు ఉన్న హిస్టరీ మొత్తం డిలీట్ చేయాలనుకుంటే ఆల్ టైమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేయండి. ఇది మీ మొత్తం చరిత్రను తొలగిస్తుంది.

Business Idea: మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెండ్‌.. ఈ బిజినెస్‌తో లాభాలే, లాభాలు..

యువత ఆలోచనలో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యోగం చేసి ఆ తర్వాత వ్యాపారం చేద్దామనే ఆలోచనలో ఉండేవారు. కానీ ప్రస్తుతం చదువు పూర్తికాగానే వ్యాపారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

వినూత్న ఆలోచనలతో కొంగొత్త వ్యాపారాలను చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు.

అయితే ఇప్పటికీ చాలా మంది వ్యాపారం అనగానే నష్టాలు వస్తాయన్న భావనలో ఉంటారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్‌ ఉన్న బిజినెస్‌ను ప్రారంభిస్తే నష్టాలు ఉండవు. అలాంటి ఓ మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ కామర్స్‌ వ్యాపారం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న చిన్న గ్రామాలకు కూడా ఈ కామర్స్‌ సేవలు విస్తరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో డెలివరీ ఫ్రాంచైజ్‌ బిజినెస్‌ను ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయం పొందొచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించేందుకు పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా వంటి ఫ్రాంచైజీలను తీసుకోవచ్చు. ఇందుకోసం మీకు కొంత స్థలం ఉండాలి. మీరు ఫ్రాంచైజీ ఏర్పాటు చేయలనుకుంటున్న ఏరియాలో అదే కంపెనీకి చెందిన ఫ్రాంచైజీ ఉండకుండా చూడాలి. ఇక కంపెనీకి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీ కోసం సదరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి. 400 నుంచి 700 గజాల స్థలం ఉండాలి. అలాగే ప్రొడక్ట్స్‌ను సరఫరా చేయడానికి బైక్స్‌తో పాటు ఆటోలు ఉండాలి. కనీసం నలుగురు వర్కర్స్‌ ఉండాలి. ఇక ఇందులో ఏం చేయాల్సి ఉంటుందందే. మీ చుట్టు పక్కల ఏరియాల్లో ఎవరైనా ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్స్‌ బుక్‌ చేసుకుంటే మొదట మీ వద్దకు ప్రొడక్ట్స్‌ అన్ని వస్తాయి. వాటిని కస్టమర్లకు వీలైనంత త్వరగా సరఫరా చేయడమే మీ పని. మీకు ఒక్కో ప్రాడక్ట్‌పై కనీసం 35 శాతం కమిషన్‌ ఇస్తుంది. ఆర్డర్స్‌ పెరిగితే కమిషన్‌ పెంచుతుంటారు.

లాభాల విషయానికొస్తే ఇందుకోసం ముందుగా రూ. లక్ష డిపాజిట్ చేయొచ్చు. ఇది రిఫండబుల్‌. అలాగే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గోడౌన్‌కు సంబంధించి రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కామర్స్‌ మార్కెట్ డిమాండ్‌ ప్రకారం తక్కువలో తక్కువ నెలకు రూ. లక్ష వరకు ఆదాయం పొందొచ్చు

రూ.2లక్షల రుణమాఫీపై తెలంగాణ సర్కార్ బిగ్‌ అప్‌డేట్

రూ.2లక్షల రుణమాఫీపై తెలంగాణ సర్కార్ బిగ్‌ అప్‌డేట్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఇందు కోసం నిధుల సమీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

సీఎం రేవంత్‌రెడ్డి సహా.. మంత్రులు ఆగస్టు 15 వరకు రుణమాఫీ అమలు చేసి తీరుతామని చెప్పారు. తాజాగా రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది.

రూ. 2 లక్షల రైతు రుణమాఫీతో పాటు, రైతు భరోసా, రైతు బీమా పథకాలకు కూడా దాదాపు రూ.40 వేల కోట్లు డబ్బులు జమ చేయాల్సి ఉంది. రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందుకు రుణ సేకరణపై చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు మెుదటి వారం నుంచి రైతు రుణమాఫీ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రుణమాఫీ ఒకేసారి అమలు చేస్తామని చెప్పగా.. తాజగా ఈ విషయంపై ఓ వార్త వినిపిస్తోంది. అందరికీ ఒకేసారి కాకుండా తొలి విడతలో రూ. 50 వేల వరకు రుణాలు తీసుకున్న వారికి మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రూ. లక్ష వరకు.. ఆ తర్వాత రూ. లక్షన్నర, రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనున్నారని తెలిసింది. మెుత్తం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న 40 లక్షల మంది రైతుల్లో 70 శాతం వరకు రైతుల రుణాలు లక్షలోపు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది.

రైతు భరోసా పథకం అమలుపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ సీజన్‌లో రైతు భరోసా కింద రూ.15వేల రెండు విడుతల కింద వేస్తామని చెబుతోంది. రైతుభరోసా అర్హులను నిర్ధారించడం, అలాగే ఎన్ని ఎకరాల లోపు పంట పెట్టుబడి ఇవ్వాలనేదానిపై సబ్ కమిటీ వేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక రాజకీయ, వ్యవసాయ సంఘాలతో సబ్‌కమిటీ చర్చలు జరిపి.. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. నివేదికను బట్టి ప్రభుత్వం రైతుభరోసాపై నిర్ణయం తీసుకోనుంది.

Laptops: రూ.34 వేల HP ల్యాప్ టాప్.. రూ.10 వేలకే.. వివరాలు ఇవిగో..

Laptops: రూ.34 వేల HP ల్యాప్ టాప్.. రూ.10 వేలకే.. వివరాలు ఇవిగో..

Laptops: ప్రస్తుత కాలంలో డెస్క్ టాప్ సిస్టమ్ కొనుగోలు చేసే బదులు ల్యాప్ ట్యాప్ కొనాలని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ల్యాప్ టాప్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది.

కానీ ఫీచర్లను బట్టి ఈ ప్రైస్ డిసైడ్ చేస్తారు. తక్కువ అవసరాలు ఉండేవారు తక్కువ బడ్జెట్ లోనే ల్యాప్ టాప్ ను కొనుగోలు చేయొచ్చు. తాజాగా విద్యార్థుల కోసం మార్కెట్లోకి తీసుకొచ్చిన హైఫై హెచ్ పీ ల్యాప్ టాప్ పై 68 శాతం డిస్కౌంట్ ను ప్రకటించారు. దీంతో ఇది రూ.10 వేలకే లభ్యమవుతుంది. అయితే ఇందులో ఉండే ఫీచర్స్ ఎలాంటివి? అనే వివరాల్లోకి వెళితే..

ల్యాప్ టాప్ అనగానే చాలా మంది ధరను చూసి భయపడిపోతుంటారు. కానీ కొన్ని అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. అయితే అధిక ధరకు విక్రయించే వాటిపై ఒక్కోసారి డిస్కౌంట్ ప్రకటిస్తారు. ఇప్పుడు హెచ్ పీ ల్యాప్ టాప్ పై భారీ ఆఫర్ ను ప్రకటించారు. సాధారణంగానే కంపెనీ 68 శాతం డిస్కౌంట్ ను అందిస్తుంది. అదనంగా హెచ్ డీఎఫ్ సీ కార్డు ఉంటే మరింత తక్కువకే లభించనుంది.

ప్రముఖ కంపెనీ HP Chromebook 2024 పై భారీ ఆఫర్ ను ప్రకటించారు. ఇందులో 11.6 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే ఉంది. 1366×768 పిక్సెస్ రిసోల్యూషన్ తో కూడి ఉంది. 220 నిట్స్ బ్రైట్ నెస్ తో పనిచేస్తుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 32 జీబి స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో మొత్తంగా క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా కావాల్సిన అప్లికేషన్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని బరువు 1.34 కిలోలు. ఇందులో 720 పీ హెచ్ డీ వెబ్ కెమెరాను అమర్చారు.

ప్రస్తుతం మార్కెట్లో HP Chromebook 2024 రూ.34,554 తో విక్రయిస్తున్నారు. అయితే దీనిపై 68 శాతం డిస్కౌంట్ ను ప్రకటించారు. అంటే దీనిని రూ.10,990 కే పొందవచ్చు. అయతే హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డు ఉంటే మరింత డిస్కౌంట్ లభించి మొత్తంగా రూ.10 వేలకే వస్తుంది. విద్యార్థులకు బాగా ఉపయోగపడే ఈ ల్యాప్ టాప్ ప్లిప్ కార్డు లో అందుబాటులో ఉంది. కావాల్సిన వారు వెంటనే కొనుగోలు చేసుకోవచ్చు.

Viral Video: 30 చొక్కాలు వేసుకుని ఫ్లైట్ ఎక్కిన ప్యాసింజర్.. ఇలా ఎందుకు చేసాడో తెలిస్తే షాక్ అవుతారు..

Viral Video: 30 చొక్కాలు వేసుకుని ఫ్లైట్ ఎక్కిన ప్యాసింజర్.. ఇలా ఎందుకు చేసాడో తెలిస్తే షాక్ అవుతారు..

Viral Video: కొన్నిసార్లు సమాజంలో చట్ట బద్ధంగా ఉండే రూల్స్ పాటించడం అంటే ఎవరకీ ఇష్టం ఉండదు. అంతేకాదు వీటి నుండి తప్పించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్, బస్సు, రైలు ప్రయాణాలు వంటి వాటిల్లోను చాలా రకాలుగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఎయిర్ పోర్టుల్లోను ఉండే రూల్స్ పాటించడానికి ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కోంటుంటారు.

అందులో ముఖ్యంగా ఉండే రూల్ లగేజ్ చెకింగ్. లగేజ్ చెకింగ్ అంటేనే చాలా మంది ప్రయాణికులు భయపడుతుంటారు. ఎందుకంటే పర్యటనకు వెళ్లే వారు ఎక్కువ లగేజ్ తీసుకుని వెళ్తారు. ఈ తరుణంలో లగేజ్ వెయిట్ ఎక్కువ అయితే దానికి కూడా ఛార్జ్ చేస్తుంటారు. అయితే ఇలాంటి పరిస్థితినే ఎదుర్కున్న ఓ వ్యక్తి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ వ్యక్తి ఏకంగా 30 చొక్కాలు ధరించి ఫ్లైట్ ఎక్కాడు. ఒక్కసారిగా ఫ్లైట్ ఎక్కిన అనంతరం తన లగేజ్ ను లోపల పెట్టి షర్ట్స్ విప్పడం ప్రారంభించాడు. ఈ తరుణంలో ఒకటి, రెండు, మూడు ఇలా ఒక దాని తర్వాత ఒకటి విప్పుతూనే ఉన్నాడు. ఎన్ని విప్పినా కూడా మరొకటి వస్తూనే ఉంది. దీంతో మొత్తం 30 చొక్కాలను వేసుకుని ఫ్లైట్ ఎక్కాడు. తన లగేజ్ వెయిట్ ఎక్కువగా ఉండడంతో దానికి డబ్బులు చెల్లించడం ఇష్టం లేక ఆ వ్యక్తి ఈ పని చేశాడు. అయితే ఏది ఏమైనా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

10 క్యాన్సర్ రిస్క్ ఫుడ్స్: తప్పక తెలుసుకోవాలి

మేము క్యాన్సర్ గురించి ఆలోచించినప్పుడు, ప్రతి ఒక్కరూ ప్రాణాంతక పరిణామాలతో కూడిన ప్రమాదకరమైన వ్యాధి గురించి ఆలోచిస్తారు.

వాస్తవానికి, చాలా క్యాన్సర్లు చాలా అభివృద్ధి చెందకముందే గుర్తించబడితే వాటిని చికిత్స చేయవచ్చు.

కాబట్టి, క్యాన్సర్‌కు కారణమయ్యే 10 ఆహారాలను నిశితంగా పరిశీలిద్దాం.

1. తయారుగా ఉన్న పానీయాలు

క్యాన్డ్ డ్రింక్స్‌లో రొమ్ము క్యాన్సర్‌కు కారణమయ్యే బిస్ఫినాల్ ఎ అనే రసాయనం ఉంటుంది.

2. కార్బోనేటేడ్ శీతల పానీయాలు

కార్బోనేటేడ్ శీతల పానీయాలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు.

3. హైడ్రోజనేటెడ్ ఆయిల్

ఆహార పదార్థాల షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి ఉపయోగించే హైడ్రోజనేటెడ్ నూనెలు ఫ్రీ రాడికల్స్‌ను విడుదల చేస్తాయి. ఇది క్యాన్సర్‌కు కారణమవుతుంది.

4. మైక్రోవేవ్ పాప్ కార్న్

మైక్రోవేవ్ పాప్‌కార్న్‌లో పెర్ఫ్లూరోక్టానోయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్‌కు కారణం కావచ్చు.

5. శుద్ధి చేసిన చక్కెర

శుద్ధి చేసిన చక్కెరలు ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి మరియు తద్వారా శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను పెంచుతాయి.

6. ప్రాసెస్ చేసిన మాంసం

బేకన్ మరియు సాసేజ్ వంటి ప్రాసెస్ చేయబడిన మాంసాలలో ప్రిజర్వేటివ్‌లు మరియు నైట్రేట్‌లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలుగా మారతాయి.

7. ఎర్ర మాంసం

రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ వస్తుంది.

8. ఊరగాయలు

ఊరగాయలలో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పచ్చిమిర్చి ఎక్కువగా తినడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

9. పొగబెట్టిన ఆహారాలు

పొగబెట్టిన మాంసాలు మరియు చేపలు పాలీసైక్లిక్ సుగంధ హైడ్రోకార్బన్‌లను కలిగి ఉంటాయి. ఇది కడుపు క్యాన్సర్‌కు కారణం కావచ్చు.

10. ఉప్పు చేప

కరువాట్‌లో నైట్రోసమైన్‌లు ఉంటాయి. ఇవి నాసికా క్యాన్సర్‌కు కారణమవుతాయి.

విస్కీ తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

విస్కీ తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

ఏదైనా మితంగా తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యానికి చేటు. ఆల్కహాల్ అయినా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే.

విస్కీని మితంగా తీసుకోవడంవల్ల రక్త ప్రసరణతోపాటు మెదడులోని కొన్ని ప్రాంతాలను ఉత్తేజపరుస్తుంది. విస్కీని పులియబెట్టిన ధాన్యాల నుంచి తయారుచేస్తారు. ఇందులో 40 శాతం ఆల్కహాల్ ఉంటుంది. దీన్ని మితంగా తీసుకోవడంవల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడంతోపాటు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జలుబు కూడా తగ్గుతుంది. ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యానికి మేలు

పరిమిత మోతాదులో విస్కీ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. ఇది రక్త నాళాలను వ్యాకోచింప చేయడంతోపాటు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు తగ్గడంతోపాటు గుండెపోటు వచ్చే ప్రమాదం తప్పుతుంది. విస్కీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జలుబు లక్షణాలను తగ్గిస్తాయి.

దగ్గు, ఛాతీ నొప్పి తగ్గుతుంది

విస్కీ శ్వాస మార్గాల్లోని శ్లేష్మం కరిగిపోయేలా చేయడంతోపాటు దగ్గు, ఛాతీ నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుంది. విస్కీని మోతాదులో తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. ఈ ప్రయోజనాలన్నీ విస్కీని పరిమితంగా తీసుకోవడంవల్లనే లభిస్తాయి. ఎక్కువగా తీసుకుంటే వర్తించవు. వైద్యుల సూచనలు, సలహాల మేరకే ఆల్కహాల్ ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

సీబీఎస్‌ఈ పదోతరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తకాల కొరత

రాష్ట్రంలో పదోతరగతి సీబీఎస్‌ఈ విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తకాల కొరత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు పాఠ్యపుస్తకాన్ని ఈ ఏడాది మార్పు చేసింది.

అమరావతి: రాష్ట్రంలో పదోతరగతి సీబీఎస్‌ఈ విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తకాల కొరత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు పాఠ్యపుస్తకాన్ని ఈ ఏడాది మార్పు చేసింది. కానీ, ఈ విషయాన్ని సకాలంలో సీబీఎస్‌ఈ బోర్డుకు చెప్పలేదు. దీంతో సీబీఎస్‌ఈ బడుల్లో పాత తెలుగు అమలుకే ఆ బోర్డు గత ఏప్రిల్‌లోనే ఆదేశాలు ఇచ్చింది. దీన్ని పట్టించుకోని పాఠశాల విద్యాశాఖ పాత పాఠ్యపుస్తకాలను ముద్రించలేదు. కొత్తవాటినే మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇప్పుడు ప్రైవేటు, ప్రభుత్వ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తెలుగు పుస్తకాలు దొరకడం లేదు. రాష్ట్రంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ అమలు చేస్తున్నారు. వీటిల్లో 83 వేల మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. వీరికి అందించేందుకు పాత తెలుగు పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవు. గతేడాది ముద్రించినవి 30 వేలు ఉంటే వీటిని పంపిణీ చేశారు. మిగతా 53 వేల మంది తెలుగు పుస్తకాలు లేకుండా తరగతులకు హాజరుకావాల్సి వస్తోంది. ప్రైవేటు సీబీఎస్‌ఈ బడుల్లో చదివే విద్యార్థులదీ ఇదే పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ఆరో సబ్జెక్టుగా ఐటీని ప్రవేశపెట్టనున్నారు. వీటి పాఠ్యపుస్తకాలను కూడా ఇంతవరకు ముద్రించలేదు.

Netherlands: 14 ఏళ్లుగా ప్రధాని.. పదవి నుంచి దిగి సైకిల్‌పై ఇంటికి..

Netherlands: 14 ఏళ్ల పాటు ప్రధానిగా దేశానికి సేవలందించిన నేత పదవి నుంచి దిగిపోతూ సైకిల్‌పై వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

నెదర్లాండ్స్‌ (Netherlands)లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ప్రధానిగా డిక్‌ స్కూఫ్‌ ప్రమాణస్వీకారం చేశారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మార్క్‌ రుట్టే (Mark Rutte).. కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగించి తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అయితే, అందరు నేతల్లా బందోబస్తు నడుమ కారులో కాకుండా సింపుల్‌గా సైకిల్‌పై తన సొంతింటికి వెళ్లిపోయారు. సైకిల్‌ నడుపుకుంటూ సిబ్బందికి టాటా చెబుతూ వీడ్కోలు పలికారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video)గా మారాయి. ఈ వీడియోను రిటైర్డ్‌ పోలీసు అధికారిణి, పుదుచ్చేరి మాజీ గవర్నర్‌ కిరణ్‌ బేడీ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో మార్క్‌ రుట్టేపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అధికార మార్పిడి ఇలా శాంతియుతంగా, ఆనందంగా ఉంటే ప్రజాస్వామ్యం బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

2010లో రుట్టే తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా ఆయనే పదవిలో కొనసాగుతూ వచ్చారు. అయితే, వలసలను నియంత్రించే విధానంపై సంకీర్ణ ప్రభుత్వంలో అంగీకారం కుదరలేదు. దీంతో గతేడాది జులైలో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. రుట్టే ప్రధానిగా రాజీనామా చేయగా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ బాధ్యతలు కొనసాగించారు.

గతేడాది చివర్లో నెదర్లాండ్స్‌లో ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం తప్పలేదు. అయితే, ప్రధాని పీఠంపై ఏకాభిప్రాయం కుదరడంలో ఆలస్యం కావడంతో చివరకు గత మంగళవారం డిక్‌ స్కూఫ్‌ అధికారికంగా పీఎం బాధ్యతలు చేపట్టారు.

సీఎంపై ఉన్న కేసులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్

సీఎంపై ఉన్న కేసులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓ జర్నలిస్ట్ బిగ్ షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు, వ్యాపారవేత్తలపై ఉన్న కేసులన్నీ సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.

స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర్ తిలక్ హైకోర్టులో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, వ్యాపారవేత్తలు లింగమనేని రమేశ్, వేమూరు హరికృష్ణ సహా మొత్తం 114 మందిని ఈ కేసులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు.

కేసులను ఈడీ, సీబీఐకి అప్పగించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు మెుత్తం 114 మంది నాయకులు ఎదుర్కొంటున్న పలు కేసులను పిల్‌లో పొందుపరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముుల కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇన్నర్ రింగు రోడ్ అలైన్‌మెంట్‌లో అక్రమాలు ఇతర స్కామ్‌లకు సంబంధించి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఉందని సీనియర్ జర్నలిస్ట్ కొట్టి బాల గంగాధర్ తిలిక్ అభిప్రాయపడ్డారు. ఈ కేసులకు సంబంధించి నిష్పాక్షిక, పారదర్శక, వేగవంతమైన దర్యాప్తు కోసం కేసులను సీబీఐ, ఈడీకి అప్పగించాలని పిల్‌లో కోరారు.

డీజీపీ చర్యలు చట్ట విరుద్ధం
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడిన రోజు నుంచి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులకు నో ఎంట్రీ ఇచ్చారని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని గ్రహించిన డీజీపీ ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులను సీఐడీ కార్యాలయానికి రాకుండా అడ్డుకుని వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని పిల్‌లో ఆరోపించారు. భారీగా పోలీసులను అక్కడ మోహరించారని.. ఆర్థిక నేరాల విభాగం నుంచి అధికారులందరినీ వెళ్లిపోమ్మన్నారని స్పష్టం చేశారు. ఓ డీజీపీ ఈ విధంగా చేయడం చట్టవిరుద్ధం, ఏకపక్షం, దౌర్జన్యపూరితం అని పిటిషనర్ బాల గంగాధర్ తిలక్ అభిప్రాయపడ్డారు.

రెడ్ బుక్ పేరుతో అధికారులకు వేధింపులు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి డీజీపీ, సీఐడీ అదనపు డీజీలు ఈ కేసుల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని పిటిషనర్ బాల గంగాధర్ తిలక్ ఆరోపించారు. ఈ కేసుల్లో సీఐడీ, ఈడీ దర్యాప్తును నీరు గార్చేలా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసుల విచారణను సీబీఐ, ఈడీకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ హోదాలో డి. వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారని… ఇసుక కుంభకోణంపై ఫిర్యాదు చేసినందుకు గనుల శాఖ అప్పటి డైరెక్టర్ జి.వెంకట రెడ్డిపై కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుతోపాటు ఇతరులపై ఫిర్యాదు చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటామని రెడ్ బుక్ పేరుతో పలువురు అధికారులను వేధిస్తున్నారని పిల్‌లో ఆరోపించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని కేసుల దర్యాప్తును సీబీఐ, సీఐడీకి అప్పగించాలని పిల్‌లో కోరారు.

Indian Air Force: అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

Indian Air Force: అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

అగ్నివీర్ పథకంలో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.విక్టర్‌బాబు జూలై 5వ తేదీ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసేందుకు కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లతో ఇంటర్మిడియెట్‌, మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా, తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలన్నారు. ఆన్‌లైన్‌లో జూలై 8 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

అర్హత కలిగిన అవివాహిత పురుషులతో పాటు మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ మూడు విఇధాలుగా ఉంటుంది. అనంతరం ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేసి పోస్టింగ్ ఇస్తారు.

Budget 2024: ఉద్యోగులకు నిర్మలమ్మ 3 తాయిలాలు..!! బడ్జెట్లో ప్రకటన

Budget 2024: ఉద్యోగులకు నిర్మలమ్మ 3 తాయిలాలు..!! బడ్జెట్లో ప్రకటన

Budget News: మూడోసారి అధికారంలోకి వచ్చి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయే ప్రభుత్వంపై ఉద్యోగులు కోటి ఆశలతో ఉన్నారు. ఈ సారి ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ లో నిర్మలమ్మ ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెలాఖరులో 2024-25 కోసం కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. దీనిలో తమకు పన్ను విషయంలో కొంత ఉపశమనం, రాయితీని దేశంలోని ఉద్యోగులు ఆశిస్తున్నారు. మధ్యంతర బడ్జెట్‌లో ఉపాధి కూలీలు నిరాశ చెందిన సంగతి తెలిసిందే. అయితే జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు పన్ను ఉపశమనం అందించడం వల్ల ఖర్చులు పెరుగుతాయని, అది చివరికి వినియోగాన్ని పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.

1. కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్వేషిస్తున్నట్లు బడ్జెట్ ముందు కొన్ని వార్తా నివేదికలు చెబుతున్నాయి. అయితే పాత పన్ను విధానంలో ఈ విషయంలో మార్పులు ఉంటాయనే ఆశ లేదు. ఇది ఉద్యోగుల వాస్తవ వ్యయానికి సంబంధించిన రుజువును అందించకుండా వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి తీసివేయవచ్చు.

2. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం పన్ను స్లాబ్‌లను క్రమబద్ధీకరించవచ్చని మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే పన్నులను తగ్గించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త విధానంలో పన్ను రేట్లు ఆదాయ స్థాయిని బట్టి 5-30% మధ్య ఉంటాయి.

3. కేంద్ర బడ్జెట్ 2023 కొత్త వ్యక్తిగత పన్ను విధానం పన్ను స్లాబ్‌లలో గణనీయమైన సవరణలను తీసుకువచ్చిందని డెలాయిట్ ఇండియా నివేదించింది. ఇందులో ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడం, రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు సర్‌చార్జిని 37% నుంచి 25%కి తగ్గించింది. కొత్త పన్ను విధానం ఆకర్షణను పెంచడానికి ఈ సర్దుబాట్లు అమలు చేయబడ్డాయి. అయితే పాత పన్ను విధానంలో పన్ను రేట్లు మారవు.

Union Budget 2024: ఈ నెల 23న కేంద్ర బడ్జెట్, కీలక ప్రకటన చేసిన పార్లమెంట్ వ్యవహారాల మంత్రి

Union Budget 2024-25 Date: ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు.

ఇప్పటికే నిర్మలా సీతారామన్ RBI గవర్నర్తో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల ముందు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఇప్పుడు పూర్తి స్థాయి పద్దుని ప్రకటించనున్నారు. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు. జులై 23న కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టేందుకు ఆమోదం లభించిందని తెలిపారు.

“కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు రాష్ట్రపతి ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకూ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు ఆమోదం తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి స్థాయి బడ్జెట్ని జులై 23న ప్రవేశపెట్టనున్నాం”

– కిరణ్ రిజిజు, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి

బడ్జెట్పై ఎన్నో అంచనాలు..

ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికలు ఉండడం వల్ల ఈ పద్దుని ప్రకటించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటవడం వల్ల మొత్తం పద్దుని ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఏడోసారి బడ్జెట్ని ప్రవేశపెట్టి అరుదైన రికార్డుని సొంతం చేసుకోనున్నారు సీతారామన్. అంతకు ముందు మొరార్జీ దేశాయ్ పేరిట ఈ రికార్డు ఉండగా దీన్ని అధిగమించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్లో తొలిసారి ప్రకటిస్తున్న పద్దు ఇది. ఫలితంగా ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. అంచనాలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. పైగా ఈ సారి బీజేపీకి మెజార్టీ లేకపోవడమూ మరింత కీలకంగా మారింది. అంచనాలు అందుకునేలా పద్దు ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాత్రం దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బడ్జెట్ ఉంటుందని చెప్పారు. జూన్ 27న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలో తన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

“ప్రభుత్వ ముందు చూపుకి, గొప్ప విధానాలకు ఈ బడ్జెట్ ఓ ఉదాహరణగా నిలిచిపోతుంది. ఆర్థికంగా, సామాజికపరంగా కీలక నిర్ణయాలతో పాటు చరిత్రాత్మక అడుగులు వేసే విధంగా ఈ పద్దుని కేంద్రం రూపొందించింది. ఇప్పటి వరకూ ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో అంత కన్నా వేగంగా ఇకపైనా కొనసాగుతుంది. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకుంటుంది”

– రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Health

సినిమా