Friday, November 15, 2024

Fruits for Skin Aging: ఈ పండ్లు తినడం వల్ల 50 ఏళ్లు వచ్చినా ముఖంపై ముడతలు రావట!

Fruits for Skin Aging: ఈ పండ్లు తినడం వల్ల 50 ఏళ్లు వచ్చినా ముఖంపై ముడతలు రావట!

చర్మం వృద్ధాప్యం సహజంగా సంభవిస్తుంది. అయితే వేయించిన పదార్థాలు ఎక్కువగా తిన్నా, పొగ తాగినా, మద్యం సేవించినా ముఖంపై ఉన్న వయసు గుర్తులు అకాలంగా మాయమవుతాయి. అయితే, మీరు పండ్లు తినడం ద్వారా ముడతలు, మచ్చలు దూరమవుతాయి. ఎండుద్రాక్షలో విటమిన్ సి, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కొల్లాజెన్‌ను ..

చర్మం వృద్ధాప్యం సహజంగా సంభవిస్తుంది. అయితే వేయించిన పదార్థాలు ఎక్కువగా తిన్నా, పొగ తాగినా, మద్యం సేవించినా ముఖంపై ఉన్న వయసు గుర్తులు అకాలంగా మాయమవుతాయి. అయితే, మీరు పండ్లు తినడం ద్వారా ముడతలు, మచ్చలు దూరమవుతాయి.

జామపండులో విటమిన్ సి, విటమిన్ ఎ, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ స్థితిస్థాపకతను పెంచడంలో సహాయపడతాయి.

పండిన బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, పాపైన్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి మృత కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడతాయి. ఈ పండు మీ చర్మాన్ని వృద్ధాప్యం నుండి దూరంగా ఉంచుతుంది.

మామిడిలో విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్, లుటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మామిడి యూవీ దెబ్బతినకుండా చర్మాన్ని రక్షిస్తుంది.

అరటిపండ్లు తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పండు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు చర్మం ముడతలు పడకుండా చేస్తుంది.

పుచ్చకాయలో హైడ్రేటింగ్ గుణాలు ఉన్నాయి. ఈ పండులో విటమిన్ ఎ, బి6, సి, లైకోపీన్, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. పుచ్చకాయ తినడం వల్ల చర్మం మంట తగ్గుతుంది.

అమలాకిలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆమ్లాకిలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని అకాల వృద్ధాప్యం నుండి దూరంగా ఉంచుతాయి.

ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు అంతా సిద్ధం

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెంచిన పింఛను మొత్తాన్ని బకాయిలతో సహా సోమవారమే విజయవంతంగా పంపిణీ చేశామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 65.18 లక్షల మందికి పింఛన్లు అందించడానికి రూ.4,408 కోట్లు రెండు రోజుల కిందటే విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్నా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. జీతాల చెల్లింపులకు సంబంధించి నిధుల సర్దుబాటు పూర్తయిందన్నారు. మంగళవారం ఉదయం నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు, పెన్షన్లు జమవుతాయని వెల్లడించారు.

Chandrababu Naidu | సీఎం రేవంత్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ..

Chandrababu Naidu | తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన అంశాలపై ఈ లేఖ రాశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కలిసి చర్చించుకుందామన్నారు.

పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందన్నారు. విభజన జరిగి పదేళ్లు దాటినా కొన్ని అంశాలు పరిష్కారం కాలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 6న ముఖాముఖి కలిసి కూర్చోని చర్చించుకుందామన్నారు. ఉమ్మడి అంశాల సామరస్య పరిష్కారానికి ఎదురుచూస్తున్నట్లు లేఖలో వెల్లడించారు.

Cash Withdrawal: కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడం ఎలా?

Cash Withdrawal: కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడం ఎలా?

ఈ రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త టెక్నాలజీలు బ్యాంకింగ్ ప్రక్రియనే మారుస్తున్నాయి. సాంప్రదాయకంగా బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి డబ్బు లావాదేవీలు చేసేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారు.

నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, క్రెడిట్ కార్డ్, ఇటీవల యూపీఐ అందుబాటులోకి రావడంతో సామాన్యులకు బ్యాంకింగ్ చాలా సులువుగా మారింది. ఇప్పుడు కార్డు లేకుండా కూడా ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంది. యూపీఐ ఫీచర్ ఉన్న ఏటీఎంలకు వెళ్లి డబ్బులు తీసుకోవచ్చు.

యూపీఐ ఏటీఎంలలో డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు దశలు తెలుసుకుందాం.

కొన్ని ఎంపిక చేసిన ఏటీఎంలలో యూపీఐ ఫీచర్ అమలు అవుతోంది. సాధారణంగా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ దగ్గర ఉన్న ఏటీఎంలలో యూపీఐ ఫీచర్ ఉంటుంది.
ATM స్క్రీన్‌పై మీకు ‘UPI కార్డ్‌లెస్ క్యాష్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
మీకు ఎంత డబ్బు కావాలో నమోదు చేయాలి.
అప్పుడు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది.
చెల్లింపు చేయడానికి యూపీఐ యాప్‌ని తెరిచి, QR కోడ్‌ని స్కాన్ చేయండి.
ఇదంతా జరిగిన తర్వాత మీరు నమోదు చేసిన నగదు ఆ ఏటీఎం నుండి వస్తుంది.

SBI Yono యాప్‌లో కార్డ్‌లెస్ నగదును ఎలా పొందాలి?

ఎస్‌బీఐకి మరో ప్రత్యేకత ఉంది. మీరు ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా ఏటీఎంల నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
ముందుగా యోనో యాప్ ఓపెన్ చేసి లాగిన్ చేయండి
అక్కడ Yono Cash ఎంచుకోండి.
రిక్వెస్ట్ న్యూ అన్నో ట్యాబ్‌లో యోనో క్యాష్ కింద ఏటీఎం క్లిక్ చేయండి.
మీకు కావాల్సిన డబ్బును ఇక్కడ నమోదు చేయండి.
ఆపై మీ పిన్‌ను నమోదు చేయండి. ఇది ఆరు అంకెల సంఖ్య.
దీని తర్వాత Yono Cash ప్రారంభించబడిన ఏదైనా SBI ATMకి వెళ్లి, Yono Cash నొక్కండి.
ఇప్పుడు లావాదేవీ రిఫరెన్స్ నంబర్ మీ మొబైల్ నంబర్‌కు వస్తుంది. అక్కడ ఆ నంబర్‌ను నమోదు చేయండి.
ఎంత డబ్బు విత్‌డ్రా చేయాలో నమోదు చేయండి.
ఆపై మీరు మీ SBI Yono యాప్‌లో నమోదు చేసిన నంబర్‌ల PINని నమోదు చేయండి.
ఈ విధంగా, SBI Yono క్యాష్ ద్వారా మీరు ఒక రోజులో ఏటీఎం నుండి 500 నుండి 20,000 రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

Post Office Recurring Deposit Scheme: పోస్టాఫీస్‌లో సూపర్‌ స్కీమ్‌.. నెలకు రూ. వెయ్యి పొదుపు చేస్తే చాలు..!

Post Office Recurring Deposit Scheme: సంపాదించే దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు. వారి వారి ఆదాయాలకు అనుగుణంగా ఎంత పొదుపు చేయాలని ప్లాన్ చేసుకుంటారు.

అయితే కష్టపడి సంపాదించిన డబ్బుకు సెక్యూరిటీతో పాటు రిటర్న్స్‌ కావాలని ఆశించడం సర్వసాధారణం. అలాంటి వారి కోసమే ప్రభుత్వ రంగ సంస్థలు పలు పథకాలను తీసుకొచ్చాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పోస్టాఫీస్‌ పథకాల గురించి.

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీస్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బుకు భద్రతతో పాటు మంచి రిటర్న్స్‌ కూడా పొందొచ్చు. ఇలా పోస్టాఫీస్‌ అందిస్తున్న బెస్ట్‌ పథకాల్లో ఆర్​డీ(రికరింగ్​ డిపాజిట్​) ఒకటి. ఈ పథకాన్ని పలు బ్యాంకులతో పాటు పోస్టాఫీస్‌లో కూడా అందిస్తున్నారు. ఈ పథకంలో నెలవారీగా కొంత మొత్తంలో పెట్టుబడి పెడుతూ పోతుంటే మంచి రిటర్న్స్‌ వస్తాయి.

ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి 6.7 శాతం మేర వడ్డీ అందిస్తోంది కేంద్రం. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లుగా ఉంటుంది. ఒకవేళ మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడగించుకోవచ్చు. ఇందులో కనీసం రూ. 100 నుంచి గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పథకంలో నెలకు రూ. 1000 చొప్పున జమ చేస్తుంటే ఎంత ఆదాయం పొందుతారో తెలుసుకోవచ్చు.

మీరు నెలకు రూ. 1000 చొప్పున సేవ్‌ చేస్తూ వెళ్తే ఐదేళ్ల తర్వాత వడ్డీతో పాటు రూ.71 వేలు అవుతాయి. అంటే 5 ఏళ్ల తర్వాత చేతికి రూ.71 వేలు అందుతాయి. అలాగే మీరు ఈ స్కీమ్​ను మరో 5 ఏళ్ల పాటు నెలకు 1000 రూపాయలు జమ చేస్తూ వెళ్తే పదేళ్ల తర్వాత మీరు జమ చేసే సొమ్ము రూ.1.20 లక్షలు అవుతుంది. దానిపై వడ్డీ దాదాపు రూ. 50 వేల వరకు వస్తుంది. అంటే మీ చేతికి మొత్తంగా రూ.1.70 లక్షల వరకు వస్తాయి.

Mokshagna: బిగ్‌ బ్రేకింగ్‌.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

Mokshagna: బిగ్‌ బ్రేకింగ్‌.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?

Nandamuri Mokshagna Entry: నందమూరి వంశం నుంచి మరో వారసుడు తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు తీపి కబురు వచ్చేసింది.

నట సింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హనుమాన్‌ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మోక్షజ్ఞ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు.

నందమూరి వంశం నుంచి వస్తున్న మూడో తరం హీరో మోక్షజ్ఞ. తన సినిమా ఎంట్రీ గురించి మోక్షజ్ఞ ‘ఎక్స్‌’లో పంచుకున్నాడు. మొదట ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ ఒక పోస్టు చేశాడు. అనంతరం మరో రెండు ట్వీట్లు చేశాడు. ‘ఊహించనిది ఊహించండి.. ప్రశాంత్‌ వర్మతో’ అని ఒక ట్వీట్‌ చేశాడు. మరో ట్వీట్‌లో ‘ఈ సంవత్సరం బాలకృష్ణ ఎన్‌బీకే 109, ఎన్టీఆర్‌ దేవర, మోక్షు అరంగేట్రం. నందమూరి నామ సంవత్సరం’ అంటూ అభివర్ణించాడు.

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబంగా నందమూరి వంశం ఉంది. నందమూరి వంశం నుంచి ఎంతో మంది సినీ పరిశ్రమలో ఉన్నారు. ఆ వంశం నుంచి వస్తున్న మూడో తరం మోక్షజ్ఞ. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 29 ఏళ్లు. ఇంత లేటు వయసులో హీరోగా ఎంట్రీ ఇస్తున్న హీరోగా కూడా మోక్షు ప్రత్యేకత సాధిస్తున్నాడు. బాలకృష్ణ తన కుమారుడిని హీరో చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మోక్షజ్ఞ శరీరాకృతి హీరోకు తగ్గట్టు లేదు. హీరోకు తగ్గట్టు మోక్షజ్ఞ రూపురేఖలు మార్చుకున్నాడు. గతంలో కంటే చాలా సన్నగా.. ఆకర్షణీయంగా మోక్షజ్ఞ తయారయ్యాడు.

గతంలో చాలా సార్లు రాజకీయ, సినీ కార్యక్రమాల్లో మోక్షజ్ఞ కనిపించాడు. చిన్నప్పుడు హ్యాండ్సమ్‌.. మ్యాన్లీ లుక్‌లో కనిపించిన మోక్షు తర్వాత బొద్దుగా మారాడు. నారా లోకేశ్‌ యువగళంలో కొంచెం సన్నమై కనిపించిన మోక్షజ్ఞ తర్వాత కనిపించలేదు. లావు తగ్గడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర కసరత్తులు చేసి మోక్షజ్ఞ తగ్గినట్లు సమాచారం. మోక్షు హీరోగా ఎంట్రీ ఇస్తుండడంతో నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు స్వాగతిస్తున్నారు. మరో నట సింహంగా మోక్షజ్ఞ కనిపిస్తాడని భావిస్తున్నారు.

ఆ యాప్స్‌తో ఇక కరెంట్‌ బిల్లు కట్టలేరు..! : ఆర్‌బిఐ ఆంక్షలు

న్యూఢిల్లీ : చెల్లింపుల యాప్‌ల ద్వారా ఇకపై కరెంట్‌ బిల్లులను చెల్లించడానికి వీలుండదు. ఇప్పటికే క్రెడిట్‌ కార్డుల ద్వారా ప్రభుత్వ బిల్లు చెల్లింపులు కుదరవని చెప్పిన రిజర్వు బ్యాంక్‌, తాజాగా గూగుల్‌ పే, పోన్‌ పే, పేటియం తదితర యాప్స్‌ ద్వారా కూడా బిల్లులను అంగీకరించబోమని పేర్కొంది.

కరెంటు బిల్లుల్ని తమ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా గాని, ఆయా కార్యాలయాలకు వెళ్లి గాని చెల్లించాలని ఆర్‌బిఐ స్పష్టం చేసింది.

Ap news: బస్సు సీటు కోసం రూ. 11 లక్షలు పోగోట్టుకున్న వ్యాపారి

ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఓ వ్యాపారి రూ. 11 లక్షల నగదుతో పాటు బంగారాన్ని పోగొట్టుకున్నారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జరిగింది.

ఓ వ్యాపారీ తన బ్యాగులో బంగారంతో పాటు రూ. 11 లక్షల నగదు పెట్టుకుని వేరే ఊరికి బయల్దేరారు. ఈ మేరకు నర్సాపురం ఆర్టీసీ బస్సాండ్ వద్దకు వెళ్లారు. అయితే బస్సు కోసం చాలా మంది ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.

అంతలో బస్సు రావడంతో ప్రయాణికులు సీటు కోసం ప్రయత్నం చేశారు. వ్యాపారి కూడా బస్సులో సీటు కోసం ప్రయత్నం చేశారు. తన వద్దనున్న బ్యాగును బస్సు కిటీలో నుంచి సీటులో వేశారు. ఆ తర్వాత బస్సు ఎక్కి సీటు వద్దకు వెళ్లారు. అయితే ఆయనకు బిగ్ షాక్ తగిలింది. సీటులో బ్యాగు లేదు. దాంతో ఆందోళన చెందారు. తన బ్యాగు గురించి అందరినీ అడిగారు. అయితే ఎవరూ తమకు తెలియదని చెప్పారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బస్టాండ్ వద్దకు వెళ్లి ఆర్టీసీ బస్సు లోపల చూశారు. ఆ తర్వాత పరిసరాల్లో గాలించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరూ కనిపించలేదు. దీంతో స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AP TET 2024: ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్‌ పరీక్షలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టెట్‌ నోటిఫికేషన్‌ను సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది. పేపర్‌-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్‌-1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టెట్‌ నోటిఫికేషన్‌ను సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది. పేపర్‌-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్‌-1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. పేపర్‌-2ఏ స్కూల్‌ అసిస్టెంట్లకు, పేపర్‌-2బీ ప్రత్యేక విద్య స్కూల్‌ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్లకు ప్రత్యేకంగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. సిలబస్, పరీక్ష విధానం తదితర వివరాలను నోటిఫికేషన్‌లో పేర్కొంది. టెట్‌ దరఖాస్తు రుసుమును ఈ నెల 3 నుంచి 16 వరకు, దరఖాస్తుల సమర్పణకు 4 నుంచి 17 వరకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌ నమూనా పరీక్షలకు 16 నుంచి ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచుతారు. ఈనెల 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. టెట్‌ పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం ప్రాథమిక ‘కీ’ని ఆగస్టు 10న, తుది కీని 25న విడుదల చేస్తారు. ఆగస్టు 30 టెట్‌ ఫలితాలు ప్రకటిస్తారు.

Kuppam: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం!

చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్‌ లంచం తీసుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు తెలుగుదేశం నాయకులు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు.

స్థలాన్ని సబ్‌ డివిజన్‌ చేయాలని కోరగా, డిప్యూటీ సర్వేయర్‌ సద్దాం హుస్సేన్‌ రూ.1.80 లక్షల లంచాన్ని డిమాండ్‌ చేశారు. ఆ మొత్తం ఇవ్వడంతో దస్త్రం ముందుకు కదిలింది. గత నెల 25, 26వ తేదీల్లో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. దీనిపై కలెక్టర్‌ సుమిత్‌కుమార్, సంయుక్త కలెక్టర్‌ శ్రీనివాసులు ఆరా తీయగా లంచం బాగోతం వెలుగు చూసింది. సర్వే శాఖ ఏడీ గౌస్‌బాషాతో శాఖాపరమైన విచారణ చేయించగా, డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది.

భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్‌ రూ.లక్ష డిమాండ్‌ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికే చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైనా విచారణ జరిపి.. అది కూడా నిజమేనని నిర్ధారించారు. ఈ అంశాలపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని సోమవారం జేసీ శ్రీనివాసులు సర్వే ఏడీని ఆదేశించారు. రాత్రి డిప్యూటీ సర్వేయర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

IBPS Clerk Notification 2024: ఐబీపీఎస్‌ క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఈ సారి భారీగా పెరిగిన పోస్టులు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్‌) 2025-2026 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ (సీఆర్‌పీ)-XIV నోటిఫికేషన్ విడుదలైంది.

ఐబీపీఎస్‌ క్లర్క్‌ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 6128 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం లభించినట్లైంది. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ భారీగా ఖాళీలున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2024 నాటికి 20 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. అంటే దరఖాస్తుదారులు జులై 2, 1996 నుంచి జులై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 1వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు జులై 21, 2024 చివరి తేదీ. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎమ్‌ఎమ్‌, డీఈఎస్‌ఎమ్‌ అభ్యర్ధులు మాత్రం రూ.175 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది.
ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

రాత పరీక్ష విధానం..

ఐబీపీఎస్‌ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌ పరీక్ష మొత్తం 200 మార్కులకు రెండు గంటల సమయంలో ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 01,2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 21, 2024
ప్రీ-ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ నిర్వహణ తేదీలు: ఆగస్టు 12 నుంచి 17 వరకు
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్షలు: ఆగస్టు 24, 25, 31 తేదీల్లో
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదల తేదీ: సెప్టెంబర్‌ 2024లో
ఆన్‌లైన్‌ మెయిన్ పరీక్షలు: అక్టోబర్‌ 13, 2024.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

BIG BREAKING: కవితకు బిగ్‌ షాక్‌.. బెయిల్ నిరాకరణ

Kavitha Bail: ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్‌ షాక్‌ తగిలింది. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసుల్లో ఆమెకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.

తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయస్థానం.. కవిత పటిషన్‌ను తిరస్కరిస్తూ.. బెయిల్‌కు నిరాకరించింది. ఈ ఏడాది మార్చిలో లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టయిన కవిత.. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే.

అయితే కవిత ఇంతకుముందు బెయిల్‌ కోసం రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ వేసింది. కానీ ఆమె బెయిల్‌ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న కోర్టు బెయిల్ ఇవ్వలేదు. దీంతో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కవిత.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. లిక్కర్‌ కేసులో 50మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కవిత తరఫు న్యాయవాది వాదనతో సహా.. సీబీఐ, ఈడీ వాదనలు విన్న కోర్టు జులై 1కి తీర్పును రిజర్వు చేసింది. చివరికి ఢిల్లీ హైకోర్టు కూడా బెయిల్ నిరాకరించడంతో కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగినట్లైంది.

NIDHI Pay Slip App Download

NIDHI Pay Slip App Download Latest Version https://nidhi.apcfss.in/ NIDHI AP Employees Pay Slip App NIDHI APCFSS APP latest Updated Version Download Android App Latest version Download nidhi-pay-slip-android-app APCFSS – MOBILE APPS AP Employees Pay Slip https://nidhi.apcfss.in/ AP Employees Pay Slip Download Pay Slip Android App Download Pay Slip iOS App AP Employees, Teachers pay particulars AP Govt. Employee Pay Slip AP Employees Salary Slip / Pay Slip Download AP Employees Download Pay Slips from Govt Official NIDHI APP Government of Andhra Pradesh has implemented the new PRC for the Employees / Pensioners and is making the payment of Salaries / Pensions Revised Pay Scale RPS 2022. Employees / Pensioners can access their New Pay Slips from January 2022.

NIDHI Pay Slip App Download Latest Version Features:

▪️ Personal Information

▪️ Pay Slips

▪️ Bank Details

▪️ Spouse Name

▪️ School Address

▪️ APGLI

▪️ PF

▪️ PRAN/ CPS వివరాలు పొందవచ్చు

▪️ Paermanent /Communication Address

▪️ 01.01.2022 నుండి Pay Slips పొందవచ్చు

▪️ Bank Account No మార్చుకునే సదుపాయం కలదు

▪️ ELs

AP Employees can download Official Pay Slips and can change Personal, Aadhaar, PAN, Bank details without any OTP & without DDO Login from Latest NIDHI Mobile Application.

NIDHI Pay Slip App Download Latest Version User-friendly app designed for all Andhra Pradesh state government employees. This app has a provision that, an employee can get his/her information through the services designed as per employee data. At present services provided like, Pay slip, APGLI, CPS Contribution Dash Board Employee services. Employee can view pay slip and they can download the pay slip. Employee can check APGLI Fresh/enhanced policy status, loan status and refund status. Employee can view the profile.

NIDHI Pay Slip App Download
NIDHI (HERB) Mobile App:

NIDHI Mobile ద్వారా జీత భత్యాల వివరాలు CFMS ID తో చాల సులభంగా తెలుసుకోవచ్చు.
మనకు కావలసిన నెలకి పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.(one year back up)
APGLI వివరాలు తెలుసుకోవచ్చు .
CPS వివరాలు తెలుసుకోవచ్చు .
NIDHI అప్ ను ఇన్స్టాల్ చేసుకుని మన వ్యక్తిగత ప్రతినెల శాలరీ వివరాలు, శాలరీ సిప్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు .
అలాగే ఏపీజిఎల్ఐ వివరాలు మరియు యాన్యువల్ అకౌంట్ స్టేట్మెంట్, లోన్ స్టేటస్, లోన్ వివరాలు అన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
Pay Slip Option తో పాటుగా అందరికి EMPLOYEE Self Services ESS Tile, APGLI Tile ఇవ్వడం జరిగింది.
Personal Details Tile ఉపయోగించి Personal, Mobile, email PAN, PF, PRAN, Bank Details etc… ఈ యాప్ ద్వారానే ఎడిట్ లేదా మార్పు చేయవచ్చు.
యూజర్ ఐడి గా మీ సి ఎఫ్ ఎం ఎస్ ఐ డి ని ఎంటర్ చేసి డిఫాల్ట్ పాస్వర్డ్ cfss@123 ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓటిపి వస్తుంది.
ఓటీపీని ఎంటర్ చేస్తే ఆప్ మనం వినియోగించుకోవచ్చు.
To download mobile app Click on below link

Download NIDHI Pay Slip App

AP News: నాలుగునరేళ్ల తర్వాత సరిగ్గా ఒకటో తేదీనే జీతాలు.. ఆశ్చర్యంలో ఉద్యోగులు!

అమరావతి, జూలై 1: ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు (AP Government Employees) జీతాల కోసం ఎదురు చూపులు చూసేవారు. జీతాలు ఎప్పుడు పడతాయో అంటూ పడిగాపులు కాసేవారు.

ఎంతగా ఎదురు చూసినప్పటికీ వారికి నిరాశే ఎదురయ్యేది. గత నాలుగున్నరేళ్లుగా ఉద్యోగులు ఇదే పరిస్థితిని చవిచూశారు. అయితే వ్యవస్థలను గాడిన పెట్టడంపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై చంద్రబాబు దృష్టి సారించారు. అందులో భాగంగా 1న తారీఖున జీతాలు పడతాయా? లేదా? అనే సందేహాలన్నింటికి కూడా సీఎం చెక్ పెట్టేశారు. మొత్తానికి సరిగ్గా ఒకటో తేదీనే (జులై 1) ఉద్యోగుల అందరి ఖాతాల్లోకి జీతాలు జమ కావడంతో ఆశ్చర్యపోవడం ఉద్యోగుల వంతైంది.

దాదాపు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఒకటో తేదీన జీతాలు పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి అకౌంట్లలో శాలరీలు జమ అవుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు నుంచి బ్యాచ్ నెంబర్ల వారీగా జీతాలు పడుతుండటంతో ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో నెలల తర్వాత ఒకటో తేదీనే జీతాలు జమ అయినట్లు మొబైల్స్‌కు బ్యాంక్ మెసేజ్‌లు వస్తున్నాయని చెబుతున్నారు. ఇక సాయంత్రానికి పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సీఎఫ్.ఎం.యస్‌లో గ్రీన్ ఛానల్‌లో పెన్షన్ బిల్లులు పెట్టారు.

నెలకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం రూ.5500 కోట్ల రూపాయలు నిధులు కావాల్సి ఉంటుందరి. ఈ మొత్తం లేక నాలుగున్నర సంవత్సరాల నుంచి ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం ముప్పు తిప్పులు పెట్టిన పరిస్థితి. అయితే అధికారంలోకి వచ్చిన 17 రోజుల్లోనే ఆర్ధిక శాఖపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. సామాజిక భద్రతా పెన్షన్లకు రూ.4వేల కోట్లు సర్దుబాటు చేసింది. మరోవైపు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా రేపటిలోగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో ఒకటో తేదీ ఉదయం నుంచి జీతాలు చెల్లింపు ప్రారంభం అయ్యాయి. సరిగ్గా ఒకటో తేదీన జీతాలు పడటంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

లోక్ సభలో శివుడి ఫొటో చూపించిన రాహుల్ : స్పీకర్ అభ్యంతరం

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా తొలి ప్రసంగంతోనే తనదైన స్టైల్ లో ప్రధాని మోడీపై సెటైర్లు వేశారు రాహుల్ గాంధీ.రాహుల్ శివుడి ఫోటో చూపించి శివుడి నుండే తాను ప్రేరణ పొందానని అన్నారు.

రాహుల్ శివుడి ఫోటో చూపించటంపై స్పీకర్ ఓం బిర్లా అడ్డునుకున్నారు.ప్రతిపక్షంలో ఉన్నందుకు గర్వపడుతున్నానని, సంతోషంగా ఉందని అన్నారు రాహుల్ గాంధీ. రాంజ్యాంగానికి రక్షణగా ఉంటామని, అధికారంకంటే నిజం గొప్పదని అన్నారు రాహుల్.ఇండియా కూటమి నేతల్ని ఈడీ,సీబీఐ వేధిస్తోందని అన్నారు.

రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే తమని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడతామని అన్నారు రాహుల్ గాంధీ. తన ఎంపీ పదవి, ఇంటిని లాక్కున్నారని అన్నారు. ఈడీ నుండి 55గంటల విచారణ ఎదుర్కున్నానని అన్నారు రాహుల్ గాంధీ.

రాహుల్ గాంధీ ప్రసంగింపై ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అభ్యంతరం వ్యక్తం చేయగా, శివుడి ఫోటోను, రాజ్యాంగాన్ని చూపిస్తే తప్పా అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

Gas Cylinders Price: గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన సిలిండర్‌ ధర

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు వరుసగా నాలుగో నెలలో తగ్గుముఖం పట్టాయి. నాలుగు మెట్రో నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.150 తగ్గింది. మరోవైపు దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలు మార్చి 9 నుంచి నిలకడగా కొనసాగుతున్నాయి. గత 10 నెలల్లో ప్రభుత్వం గృహ గ్యాస్ సిలిండర్ ధరను రూ.300 తగ్గించింది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి..

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు వరుసగా నాలుగో నెలలో తగ్గుముఖం పట్టాయి. నాలుగు మెట్రో నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.150 తగ్గింది. మరోవైపు దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలు మార్చి 9 నుంచి నిలకడగా కొనసాగుతున్నాయి. గత 10 నెలల్లో ప్రభుత్వం గృహ గ్యాస్ సిలిండర్ ధరను రూ.300 తగ్గించింది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు ఉండదని అంచనా. మరోవైపు, రాబోయే నెలల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర మరింత తగ్గే అవకాశం ఉంది. గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

అయితే జూలై 1న వ్యాపారులు, వాణిజ్య సంస్థలకు చమురు కంపెనీలు ఊరటనిచ్చాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.30 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. ప్రస్తుతం ఢిల్లీలో ధర రూ.1,646కు దిగొచ్చింది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలో మార్చి నుంచి ఎలాంటి మార్పు లేదు. చివరిసారిగా మార్చి 9న గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.100 తగ్గించారు. అంతకు ముందు ఆగస్టు 30న దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గింది. గత 10 నెలల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో కేవలం రెండు మార్పులు మాత్రమే కనిపించాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు

ఢిల్లీ- రూ.1,646
హైదరాబాద్‌ – రూ.1,872
విజయవాడ – రూ.1,832
విశాఖపట్నం – రూ.1,704
ముంబయి – రూ.1,598
కోల్‌కతా – 1,756
చెన్నై – రూ.1,809
బెంగళూరు – రూ.1,724
తిరువనంతపురం – రూ.1,676

Chandrababu: ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు

మంగళగిరి: ఏపీలో ‘ఎన్టీఆర్‌ భరోసా’ పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛను పంపిణీని ప్రారంభించారు.

మంత్రి లోకేశ్‌, ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం.. పూరిగుడిసెలో ఉన్న లబ్ధిదారు రాములు ఇంటికి వెళ్లి ముగ్గురు లబ్ధిదారులకు స్వయంగా పింఛను అందజేశారు. లబ్ధిదారు కుటుంబసభ్యులతో మాట్లాడారు. త్వరలో ఇల్లు నిర్మించి అందజేస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారు కుటుంబసభ్యులు ఇచ్చిన టీ తాగారు. రాములు కుటుంబసభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొందరు పేదరికంలోనే పుట్టి అందులోనే చనిపోతున్నారని.. వారి జీవితాలు మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దానికి ఏం చేయాలనేదానిపై ఆలోచన చేస్తామన్నారు. పిల్లల్ని బాగా చదివిస్తేనే జీవితాలు బాగుపడతాయని చెప్పారు.

ఇప్పటి వరకు పింఛనుదారులకు రూ. 3,000 చొప్పున అందుతుండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆ మొత్తానికి ఒకేసారి రూ. 1,000 పెంచి రూ. 4,000 చేశారు. దీంతోపాటు ఏప్రిల్‌ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు రూ. 1,000 చొప్పున కలిపి రూ. 7,000 నేడు పంపిణీ చేస్తున్నారు.

పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తొలి రోజే 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తిచేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పింఛనుదారులను కేటాయించారు. అంతకుమించి ఉంటే కొన్నిచోట్ల అంగన్‌వాడీ, ఆశా సిబ్బందిని వినియోగించనున్నారు. ఏదైనా కారణంగా తొలి రోజు పింఛను అందుకోలేని వారికి రెండోరోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందిస్తారు. మొత్తం 65.18 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,408 కోట్లు విడుదల చేసింది.

Pawan kalyan: ఆ ఎమ్మెల్యేలిద్దరినీ విప్‌లుగా ప్రకటించండి: సీఎం చంద్రబాబుకు పవన్‌ లేఖ

Pawan kalyan: ఆ ఎమ్మెల్యేలిద్దరినీ విప్‌లుగా ప్రకటించండి: సీఎం చంద్రబాబుకు పవన్‌ లేఖ

అమరావతి: తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యుల్ని ప్రభుత్వ విప్‌లుగా ప్రకటించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన లేఖ రాశారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను విప్‌లుగా నియమించాలని కోరినట్లు పవన్‌ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

NTR Bharosa Pensions: ఏపీలో పెన్షన్ అప్లై చేసుకోవడం ఎంత సింపులో తెల్సా..?

ఏపీవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 50% మందికి నగదు పంపిణీ పూర్తయింది. ఇంటింటికీ వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. ఈ ఒక్క రోజే 100% పెన్షన్లు పంపిణీ పూర్తి చేసే దృక్ఫథంతో ముందుకు సాగుతున్నారు. ప్రణాళికలో భాగంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి 50 మంది పింఛనుదారులకు పింఛను అందజేసేలా బాధ్యతలు అప్పగించారు. ఇక తొలి రోజు అందుకోలేని వారికి రెండోరోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛను అందజేస్తారు. పెన్షన్ పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు భాగమవుతున్నారు. అయితే ఏపీలో అర్హత ఉండి పెన్షన్ పొందాలంటే ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం….

ఆఫ్​లైన్​లో ఇలా…

తొలుత గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్… https://sspensions.ap.gov.in/SSP/Home/Index విజిట్ చేయండి. ఆ పోర్టల్​లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోజన దరఖాస్తు ఫామ్ సెలక్ట్ చేసి డౌన్‌లోడ్ చేయండి. ఆ ఫామ్‌ ఫ్రింట్ తీసి వివరాలు కరెక్ట్‌గా నింపండి. ఎక్కడా తప్పులు పడకుండా చూసుకోండి. ఆ ఫామ్‌కు ఆధార్ కార్డ్, అడ్రస్ ఫ్రూప్, తెల్ల రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం.. ఇతర సంబంధిత పత్రాలు జత చేయండి. ఆపై వాటిని గ్రామ పంచాయతీ ఆఫీసులో సంబంధిత అధికారికి ఇవ్వండి.,

ఆన్‌లైన్‌లో ఇలా….

పెన్షన్లకు సంబంధించిన అధికారిక పోర్టల్… https://sspensions.ap.gov.in/SSP/Home/Index విజిట్ చేయండి. స్క్రీన్ కుడివైపున ఎగువన ఉన్న లాగిన్ ఆప్షన్ ఎంచుకోండి.క్రెడెన్షియల్‌లను నమోదు తర్వాత.. మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఇవ్వండి. ఆ తర్వాత గెట్ OTP ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆపై మీ రిజిస్టర్డ్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని అక్కడ ఎంటర్ చేయండి. అనంతరం మీరు ఫిల్ చేయాల్సిన పేజీ అక్కడ వస్తుంది. ఆ సూచనలు బట్టి ఆ ఫామ్ నింపండి. పెన్షన్ల సంబంధించి మీకు ఇంకా సాయం, సమాచారం కావాలంటే.. 0866 – 2410017 కాల్ చేసి వివరాలు పొందవచ్చు.

వాలంటీర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. !

ఏపీలో వైసీపీ హయాంలో నియమించిన రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్ల సేవల కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం ఇవాళ ఓ స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే వైసీపీ అధికారం కోల్పోయాక డైలమాలో ఉన్న వాలంటీర్ల సేవల కొనసాగింపుపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రులు చెప్తూ వచ్చారు.

అయితే ఇవాళ నేరుగా సీఎం చంద్రబాబే పెన్షన్ల పంపిణీ సందర్భంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.

ఏపీలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకే వాలంటీర్లకు బదులుగా సచివాలయ సిబ్బంది, టీడీపీ నేతలు దగ్గరుండి మరీ పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఇవాళ సాయంత్రానికి వీలైతే 100 శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేసేయాలని ప్రభుత్వం టార్గెట్ కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో స్వయంగా పెనుమాకలో లబ్దిదారుల ఇంటికెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు అనంతరం నిర్వహించిన బహిరంగసభలో వాలంటీర్లపై స్పందించారు.

వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్, మే నెలల్లో అప్పటి వైసీపీ సర్కార్.. 33 మంది లబ్దిదారులు చనిపోయే పరిస్థితిని తెచ్చిందని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పట్లో తాము సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని కోరినా వారు అలా చేయలేదన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక సచివాలయ సిబ్బందితో ఎందుకు పెన్షన్ల పంపిణీ జరగదో చేసి చూపించాలనే పట్టుదలతో ఇవాళ ఒకే రోజు వారితో పంపిణీ చేయిస్తున్నామన్నారు. అంతే కాదు సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే వాలంటీర్ల సహాయం తీసుకోవాలని చెప్పామన్నారు. తద్వారా సచివాలయ సిబ్బందికి తోడుగా వాలంటీర్లను కూడా వాడుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

నోటి పూతతో తరచూ ఇబ్బంది పడుతున్నారా.. అయితే మీ డైట్ లో ఈ డ్రింక్ ఉండాల్సిందే

నోటి పూత( mouth ulcer ).. దీన్నే మౌత్ అల్సర్ అని పిలుస్తారు. పిల్లలు నుంచి పెద్దల వరకు చాలా మంది చాలా కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో నోటి పూత కూడా ఒకటి.

నాలుక, దవడలు, పెదాలపై పండ్లు ఏర్పడి తీవ్రమైన నొప్పికి గురిచేస్తాయి. నోటిపూత వల్ల తినడం, తాగడమే కాదు మాట్లాడటం కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. శరీరంలో వేడి ఎక్కువ కావడం, పోషకాల కొరత, డీహైడ్రేషన్, హార్మోన్ల అసమతుల్యత ( Nutrient deficiency, dehydration, hormonal imbalance )తదితర కారణాల వల్ల నోటి పూత ఏర్పడుతుంది.

మీరు కూడా తరచూ ఈ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే మీ డైట్ లో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను కచ్చితంగా చేర్చుకోవాల్సిందే. ఈ డ్రింక్ నోటి పూతని తగ్గించడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా అడ్డుకుంటుంది. మరి ఇంతకీ ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఒక చూపు చూసేయండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ హీట్‌ అయ్యాక నాలుగు జామ ఆకులను( Guava leaves ) ముక్కలుగా తుంచి వేసుకుని దాదాపు పదిహేను నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో జామాకుల వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వాటర్ లో వన్ టేబుల్ తేనె( honey ) కలిపి తీసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఈ జామాకుల కషాయాన్ని కనుక తీసుకుంటే నోటి పూత సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు. నోటి పూతను వదిలించడానికి ఈ కాషాయం చాలా బాగా సహాయపడుతుంది. పైగా ఈ కషాయాన్ని తాగడం వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ళ నుంచి రక్తస్రావం వంటి సమస్యలు తగ్గుతాయి. నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. అంతేకాదు ఈ కషాయం జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యను నివారిస్తుంది. నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పికి చెక్ పెడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. మరియు ఈ కషాయాన్ని తాగడం వల్ల ఒంట్లో వ్యర్ధాలు సైతం బయటకు తొలగుతాయి.

AP News : బహిరంగ సభలో సీఎం చంద్రబాబును ప్రశ్నించిన మహిళ?

రాష్ట్ర వ్యాప్తంగా నేడు సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ అనంతరం సీఎం చంద్రబాబు బహిరంగ సభలో సమావేశమయ్యారు.

సీఎం వెంట మంత్రి నారా లోకేష్, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభలో ఓ మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. మొన్న విడుదల చేసిన శ్వేతపత్రంలో పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో లేదని, పెనుమాక సభలో ఓ మహిళ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సీఎం చంద్రబాబు నవ్వుతూ సమాధానమిచ్చారు.

జూలైలో వర్షాలు వస్తాయి. డిసెంబర్‌లో ప్రారంభిస్తే మళ్లీ మే లో పూర్తి చేయాల్సి ఉంటుంది. గోదావరి నది వరదల కారణంగా ఏడాదిలో 6 నెలలే పనులు జరుగుతాయి. గత ప్రభుత్వం 2 ఏళ్లు పట్టించుకోకపోవడంతో డయాఫ్రవాల్, కాపర్ డ్యాం దెబ్బతిన్నాయని సూచించారు. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. నివేదిక ఇస్తారు అని సీఎం చంద్రబాబు వివరించారు.

Indian Cricketers : హరికేన్ బెరిల్ ఎఫెక్ట్. బార్బడోస్‌ లో చిక్కుకుపోయిన టీమిండియా!

Indian Cricketers : హరికేన్ బెరిల్ ఎఫెక్ట్. బార్బడోస్‌ లో చిక్కుకుపోయిన టీమిండియా!

T20 World Cup :పురుషుల టీ20 ప్రపంచ కప్‌ 2024 సాధించిన టీమిండియా (Team India) ఆటగాళ్లు ఆదివారం సాయంత్రం భారత్ కి తిరిగి పయనమవ్వాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల జట్టు అక్కడే ఆగిపోయింది.

అట్లాంటిక్‌ సముద్రంలో ఏర్పడిన ‘హరికేన్ బెరిల్’ (Hurricane Beryl) తీవ్రం ప్రభావం బార్బడోస్‌పై తీవ్రంగా పడింది. దాంతో అక్కడ గంటకు 210 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.

దీంతో బ్రిడ్జ్‌టౌన్‌లోని ఎయిర్‌పోర్టులో ఆదివారం సాయంత్రం విమాన సర్వీసులు (Air Services) అన్నింటినీ అక్కడి అధికారులు రద్దు చేశారు. నిజానికి బార్బడోస్ నుంచి న్యూయార్క్ వెళ్లి.. అక్కడి నుంచి ఎమిరేట్స్ విమానంలో ముంబై కి రావాల్సి ఉంది. కానీ ‘హారికేన్ బెరిల్’ ప్రభావంతో ప్రయాణం వాయిదా పడిందని సమాచారం. తుఫాన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న టీమిండియా ఆటగాళ్లు కనీస సౌకర్యాలు లేక చాలా తిప్పలు పడుతున్నారు. వారు భోజనం చేయడానికి కూడా సరైన సదుపాయాలు లేక క్యూ లైన్లలో నిల్చుని పేపర్‌ ప్లేట్లలో భోజనం చేస్తున్నారు.

కాగా ప్రయాణం వాయిదా పడిన నేపథ్యంలో తదుపరి ఏర్పాట్లను బీసీసీఐ (BCCI) సెక్రటరీ జై షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కలుపుకొని మొత్తం 70 మంది బార్బడోస్ నుంచి స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. అమెరికా నుంచి భారీ చార్టెర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసి నేరుగా బ్రిడ్జ్‌టౌన్ నుంచి ఢిల్లీకి తీసుకునిరావాలని బీసీసీఐ భావిస్తోంది. జులై 2న ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆటగాళ్లు చేరుకునే అవకాశం ఉంది.

టీ 20 ప్రపంచ కప్‌ ను టీమిండియా జట్టు ముద్దాడిన నేపథ్యంలో వారికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించే అవకాశాలు ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. నాకు జీతం వద్దు.. దానికోసమే పనిచేస్తా?

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. నాకు జీతం వద్దు.. దానికోసమే పనిచేస్తా?

Pawan Kalyan: పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లేదని అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నా.. కానీ శాఖలో డబ్బులు లేకపోవడం, వేల కోట్ల అప్పులు చూసి జీతం తీసుకోకుండా ఎమ్మెల్యేగా పనిచేద్దా అని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అప్పుల కారణంగా ఆఫీస్‌లో కొత్త ఫర్నిచర్, మరమ్మత్తులు కూడా తన కార్యాలయానికి చేయించలేదని తెలిపారు. ఇంతే కాకుండా తనకి కావాల్సిన ఫర్నీచర్ తానే తెచ్చుకుంటానని వెల్లడించారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే తాను పనిచేస్తానన్నారు. విజయయాత్రలు మాత్రమే చేయడానికి నేను సిద్ధంగా లేనని తెలాపారు. గెలిచినందుకు తనకి ఆనందం లేదని.. తన వంతుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందితేనే తనకి ఆనందం కలుగుతుందన్నారు.

పిఠాపురాన్ని దేశంలోనే అగ్రగామిగా తయారుచేయాలన్నదే తన లక్ష్యం అని.. అందుకే నెపుణ్య శిక్షణ ఇచ్చి యువతలో నైపుణ్యాలను వెలికి తీస్తాన్నారు. పర్యావరణ పరక్షణకు అనుకూలంగా ఉండే పరిశ్రమలు ఇక్కడి రావాలని కోరారు. నైపుణ్య శిక్షణ ద్వారా విదేశాలకు వెళ్లే వారికి శిక్షణ ఇప్పించి పంపాలన్నారు. డబ్బులు వెనకేసుకోవాలనో, కొత్తగా పేరు రావాలనో తనకి ఆశ లేదన్నారు.

Cabbage : క్యాబేజీ వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలు. ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే.!

Cabbage : క్యాబేజీ వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలు. ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే.!

Cabbage : మన రోజువారి ఆహారంలో కచ్చితంగా ఆకుకూరలు మరియు కూరగాయలు ఉండాలి అని ఆరోగ్య నిపుణులు ఎప్పుడు చెబుతూ ఉంటారు. విటితో మన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

అయితే అన్ని కూరగాయలతో పాటుగా క్యాబేజీ కూడా కచ్చితంగా తినమని చెబుతూ ఉన్నారు. కానీ చాలామంది దీనిని తినటానికి అస్సలు ఇష్టపడరు. అయితే క్యాబేజీలో ఉండే పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఇకనుంచి తినకుండా అసలు ఉండలేరు. క్యాబేజీ రోగనిరోధక శక్తి ని పెంచే గుణం ఉంది అని నిపుణులు అంటున్నారు. అయితే షుగర్, థైరాయిడ్ సమస్యలపై క్యాబేజీ ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అని అంటున్నారు. ఈ క్యాబేజీ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

క్యాబేజీలో నీరు అనేది ఎక్కువ శాతం ఉంటుంది.దీనిలో కేలరీలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇది మనకు రోజంతటికి కావలసిన హైడ్రేట్ ను ఇస్తుంది. అయితే బరువు తగ్గాలి అని ప్రయత్నించే వారికి కూడా ఇది చాలా మంచిది. దీని పచ్చిగా సలాడ్,సూప్ లాంటివి కూడా చేసుకొని తీసుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉన్నాయి. అంతేకా క క్యాబేజీలో ఫైబర్, విటమిన్ కే,సి కూడా ఉన్నాయి. ఇది జీ ర్ణ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇది ఎంతో ప్రాణాంతకమైన గుండె కాన్సర్ సమస్యల నుండి కూడా ఇది ఎంతగానో రక్షిస్తుంది…

Cabbage మధుమేహం

ఈ క్యాబేజీలో యాంటీ హైపర్ గ్లైసోమిక్ గుణం అనేది ఉంటుంది. ఇది మధుమేహ బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది డయాబెటిస్ నెఫ్రోపతి నుండి కూడా ఎంతగానో రక్షిస్తుంది. ఇది రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను కూడా నిర్వహించి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.అలాగే షుగర్ ఉన్నటువంటి వారు కచ్చితంగా వారి డైట్ లో క్యాబేజీని చేర్చుకుంటే చాలా మంచిది అని నిపుణులు అంటున్నారు…

Cabbage క్యాన్సర్

క్యాబేజీలో గ్లూకో సైనోలేట్స్ మరియు సల్ఫర్ ఉంటుంది. అంతేకాక క్యాబేజీలో యాంటీ ఇన్ఫ్ల మెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది క్యాన్సర్ ను తగ్గిస్తుంది. అయితే క్యాన్సర్ కణాలు కూడా అభివృద్ధి చెందకుండా కూడా రక్షిస్తుంది. క్యాబేజీ అన్నీ సీజన్లో కూడా మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది…

జీర్ణక్రియ : దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాబేజీ చెడు కొలెస్ట్రాలను తగ్గించి, అలాగే మంచి కొలెస్ట్రాలను పెంచగలదు. ఇది కడుపు అల్సర్ రాకుండా కూడా చేస్తుంది. ఈ క్యాబేజీని డైట్ లో చేర్చుకోవటం వలన మన శరీర పనితిరు కూడా ఎంతో మెరుగుపడుతుంది.అయితే ఫైబర్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్యలు ఉండి కూడా దూరంగా ఉండవచ్చు. శరీరంలో మంట,వాపు సమస్యలకు కూడా క్యాబేజీ చెక్ పెట్టుతుంది. దీంతో క్యాన్సర్, గుండె సమస్యలు డయాబెటిస్ అల్జీమర్స్ తో బాధపడే వారికి కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది.

Cabbage : క్యాబేజీ వారానికి ఒక్కసారి తీసుకుంటే చాలు… ఈ సమస్యలకు చెక్ పెట్టినట్లే…!

గుండె ఆరోగ్యం : క్యాబేజీలు ఆంథోసైనిన్స్ ఉంటాయి. ఆర్థరైటిస్ సమస్యలకు కూడా క్యాబేజీ చెక్ పెడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గించటంతో పాటు బీపీని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. ముఖ్యంగా క్యాబేజీ మహిళలకు ఒక వరం అని చెప్పొచ్చు…

డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకు బంపర్ ఆఫర్.. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలు!

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలిగిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ విభాగాల్లో జూనియర్ మేనేజర్ పోస్టులకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.

అభ్యర్థుల నుంచి ఈ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తుండగా మొత్తంగా 56 జూనియర్ మేనేజర్ పోస్టులను హెచ్‌సీఎల్ భర్తీ చేయనుందని సమాచారం అందుతోంది.

వేర్వేరు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జూనియర్ మేనేజర్ పోస్టులకు జులై 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. జులై 21 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అని చెప్పవచ్చు.

ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉండనుందని సమాచారం అందుతోంది. జూన్ నెల 1వ తేదీ నాటికి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలకు చెందిన వాళ్లకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 30,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎగ్జామ్‌లో జనరల్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులు 20 శాతం మార్కులు తెచ్చుకోవాలి.

Banking News: ఇకపై వారానికి 5 రోజులే బ్యాంక్స్ వర్కింగ్.. పూర్తి వివరాలివే..

Banks 5 Days Working: దేశంలోని బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా వారానికి 5 రోజులు పనిదినాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రెండవ, నాల్గవ శనివారం బ్యాంకులకు సెలవుగా ఉండగా..

ఐటీ ఉద్యోగుల మాదిరిగా వారాంతంలో రెండు సెలవురోజులు కావాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

చాలా కాలంగా పెండింగ్ ఉన్న బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ ఈ ఏడాది చివరి నాటికి నెరవేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వారానికి రెండు రోజుల పాటు సెలవుకు సంబంధించి ఇండియన్​ బ్యాంక్స్ అసోసియేషన్- ఉద్యోగుల సంఘాల మధ్య ఇప్పటికే ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనికి కేంద్రంలో కొత్తగా ఏర్పడిన మోదీ సర్కార్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఫైల్ ఏడాది చివరి నాటికి ఆమోదం పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024 మార్చి 8న ఆల్​ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్​ కాన్ఫెడరేషన్​తో పాటు, ఐబీఏ, బ్యాంకు యూనియన్​లు 9వ జాయింట్​ నోట్ పై సంతకాలు చేశాయి.

కేంద్రం ఆమోదం లభిస్తే ఈ ఏడాది డిసెంబర్ నుంచి బ్యాంకులు సోమవారం నుంచి శుక్రవారం వరకు అంటే వారంలో కేవలం 5 రోజుల పాటు పనిచేసే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది డిసెంబర్​ నెలలో ప్రభుత్వ, ప్రైవేట్​ బ్యాంకులతో సహా ఇండియన్ బ్యాంక్స్​ అసోసియేషన్, బ్యాంక్ యూనియన్​ల మధ్య ఒక అవగాహన ఒప్పందం కొన్ని షరతులతో కుదిరిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం పనిగంటల పెంపుతో పాటు, ఖాతాదారులకు సేవల్లో అంతరాయాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించబడింది.

ఒకవేళ ప్రస్తుతం జరిగిన అంగీకారం ప్రకారం బ్యాంకులు రానున్న కాలంలో వారానికి కేవలం 5 రోజులు మాత్రమే పనిచేసినట్లయితే బ్యాంకింగ్ సమయాల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. దీని ప్రకారం బ్యాంకులు ఉదయం 9.45న తెరుచుకుని సాయంత్రం 5.30 వరకు ఖాతాదారులకు సేవలు అందించనున్నాయి.

ఈ ఊరు.. వైద్యుల పుట్టినిల్లు..!

ఏళ్ల కిందట ఆ గ్రామం కూడా ఓ మారుమూల పల్లెటూరే. వ్యవసాయం చేసుకుని.. కూలీ పనులకు వెళ్లి కుటుంబాలను పోషించుకునేవారు. కష్టాన్నే నమ్ముకుని జీవించేవారు. ఇప్పుడు ఆ ఊరు ఎనలేని ఖ్యాతిని గడిచింది. ఎంతో మంది విద్యావంతుల్ని తీర్చిదిద్దింది. ముఖ్యంగా అధిక శాతం మంది వైద్యులను అందించింది. అదే ఆమదాలవలస మండలంలోని కణుగులవలస. వైద్యుల ఊరుగా గుర్తింపు తెచ్చుకున్న ఆ పల్లె గురించి నేడు ‘జాతీయ వైద్యుల దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

ఆమదాలవలస పట్టణానికి రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న కణుగులవలసలో 3,200పైగా జనాభా ఉంది. 750 ఇళ్లు ఉన్నాయి. వాటిలో సుమారు 100 మందికిపైగా పేరొందిన వైద్యులుగా స్థిరపడ్డారు. దిల్లీ ఎయిమ్స్‌ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో వైద్య సేవలందిస్తున్నారు. ఇందుకు కారణం 1900లో దివంగత బొడ్డేపల్లి రామ్మూర్తినాయుడు ప్రారంభించిన ఓ పాఠశాల. అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకుని ఎంతో మంది ఉన్నత స్థానాలకు ఎదిగారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉండే రోజుల్లోనూ తల్లిదండ్రులు సైతం పిల్లలను తప్పనిసరిగా బడికి పంపేవారు. గ్రామంలోని యువత ఒకరినొకరు ఆదర్శంగా తీసుకుంటూ.. చదువులో పోటీ పడుతూ ఉన్నతోద్యోగాలు సాధించడంతో పాటు దేశవిదేశాల్లో స్థిరపడి ఊరికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. ఇప్పటికీ రామ్మూర్తినాయుడు కేటాయించిన స్థలంలోనే ప్రాథమిక పాఠశాల నడుస్తోంది.

ఇలా మొదలైంది…
గ్రామంలో గుంటముక్కల అప్పన్న, అన్నాజీరావు, అధికార్ల జగబందు మొట్టమొదట ఆయుర్వేద వైద్యం చేసేవారు. ఆ తరువాత కాలంలో డాక్టర్‌ బెండి చంద్రశేఖరరావు (ఎంబీబీఎస్‌), నూక భాస్కరరావు (ఎం.ఎస్‌.), నూక చంద్రశేఖరరావు అల్లోపతి వైద్యులుగా సేవలందించేవారు. వారి నుంచి స్ఫూర్తి పొంది ప్రస్తుతం సంపతిరావు శ్రీదేవి (ఎం.ఎస్‌. గైనకాలజీ), బొడ్డేపల్లి సూర్యారావు (ఎం.ఎస్‌ ఆర్థో), సీపాన జయలక్ష్మి, సీపాన గోపి (న్యూరాలజిస్టు), బెండి తేజేశ్వరరావు (ఎం.ఎస్‌. సర్జన్‌), సీపాన సోమశేఖర్‌ (ఎండీ పీడియాట్రిక్‌), సీపాన రమేశ్‌ (ఈఎన్‌టీ), పంచాది శ్రీదేవి, బొడ్డేపల్లి సురేశ్, శ్రీనివాసరావు, తదితరులు పలు చోట్ల వైద్య నిపుణులుగా ఎదిగారు. వారిని ఆదర్శంగా తీసుకొని వారి పిల్లలు, మనమలు సైతం వైద్యవృత్తినే ఎంచుకుని ముందుకు సాగుతున్నారు.

స్వగ్రామంపై మమకారం చాటుతూ..
శ్రీకాకుళం నగరంలోనూ సుమారు 25 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారు. స్వగ్రామానికి చెందినవారు ఎవరైనా అనారోగ్యంతో వస్తే కొందరు ఉచితంగా వైద్యం చేస్తున్నారు. మరికొందరు ప్రత్యేక రాయితీపై మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు. అప్పుడప్పుడు గ్రామంలో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తుంటారు.

నా విద్యార్థులే వైద్యం చేస్తున్నారు..
తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువే. ఇప్పుడు విద్య వ్యాపారంగా మారింది. మా గ్రామంలో బెండి చిట్టయ్య మాస్టారు వద్ద నేను ఉచితంగానే చదువుకున్నాను. ఉపాధ్యాయుడిగా నేను మా ఊర్లోనే సుమారు ఏళ్లు నిస్వార్థంగా పాఠాలు చెప్పాను. నా దగ్గర చదువుకున్న ఎంతో మంది అనేక రంగాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు నా వయసు 90 సంవత్సరాలు. నేను అనారోగ్యం బారిన పడినప్పుడు నా విద్యార్థులే ఇంటికి వచ్చి వైద్యం చేస్తుంటారు. దీన్ని పూర్వజన్మ సకృతంగా భావిస్తున్నాను.
బెండి కృష్ణారావు, విశ్రాంత ఎంఈవో, కణుగులవలస

Personal Loan: ఈ టెక్నిక్ తెలిస్తే వెంటనే పర్సనల్ లోన్స్ తీసుకోవటం ఆపేస్తారు..! తక్కువ వడ్డీకే రుణం..

Overdraft Facility: మనలో చాలా మంది తన అత్యవసరం డబ్బు అవసరాల కోసం పర్సనల్ లోన్స్ కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదిస్తుంటారు. అయితే బ్యాంకులు ఈ పర్సనల్ లోన్స్ పై భారీగా వడ్డీని వసూలు చేస్తుంటాయి.

ఈ క్రమంలో వీటి కంటే గోల్డ్ లోన్, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ వంటి ఇతర మార్గాల్లో లోన్ పొందటం తక్కువ వడ్డీ రేటుకే డబ్బు పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం OD ఫెసిలిటీని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే ఏంటి..?
దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు తమ కస్టమర్లకు ఓవర్డ్రాఫ్ట్(OD) సౌకర్యాన్ని అందిస్తుంటాయి. ఈ బ్యాంకులు కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తుంటాయి. ఇవి కస్టమర్లకు తమ తక్షణ నగదు అవసరాలను తీర్చుకునేందుకు తోడ్పడతాయి.ఇదే క్రమంలో దేశంలోని అనేక బ్యాంకింగ్ సంస్థలు తమ ఖాతాదారులకు షేర్లు, బాండ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై ఓడీ ఫెసిలిటీని అందిస్తుంటాయి. ఇక్కడ ఉపయోగం ఏమిటంటే డ్రా చేసిన డబ్బుపై మాత్రమే వడ్డీ లెక్కిస్తాయి. అది కూడా డ్రాచేసిన రోజు నుంచి మాత్రమే వడ్డీ లెక్కించబడుతుంది.

ముందుగా బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని పొందాలంటే అందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా అర్హులైన కస్టమర్లకు బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు ముందుగానే ఓడీ ఫెసిలిటీని అందిస్తుంటాయి. కస్టమర్లు ఈ సదుపాయం కోసం ఆన్లైన్లో లేదా వ్యక్తిగతంగా బ్యాంకును సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రెండు రకాల ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాలు ఉంటాయి. మెుదటిది సెక్యూర్డ్ కాగా రెండవది అన్ సెక్యూర్డ్ ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఇక్కడ సెక్యూర్డ్ ఓడీ సౌకర్యాన్ని అందించేందుకు.. వారి నుంచి సెక్యూరిటీగా షేర్లు, బాండ్స్, ఎఫ్డి, ఇల్లు, ఇన్సూరెన్స్ పాలసీ, జీతం లేదా తనఖా ఇవ్వడం ద్వారా బ్యాంక్ నుంచి ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం అందిస్తుంటాయి. అందించిన సెక్యూరిటీ ఆదారంగా ఓడీ ఎంత ఇవ్వాలనే నిర్ణయం ఆర్థిక సంస్థ చేతిలోనే ఉంటుంది.

దేశంలో చాలా బ్యాంకులు జీతం, ఎఫ్డికి బదులుగా ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని తీసుకోవడానికి ఎక్కువ డబ్బు ఇస్తాయి. పరిమితిని ఎక్కువగా ఇస్తుంటాయి. ఉద్యోగి పేమెంట్ హిస్టరీ బాగుంటే వారి జీతానికి 200 శాతం వరకు ఓడీ రూపంలో సౌకర్యాన్ని అందిస్తాయి. లేకపోతే సాధారణంగా బ్యాంకులు జీతంలో 50 శాతం మాత్రమే ఓవర్డ్రాఫ్ట్ ఇస్తాయి. ఇక్కడ బ్యాంకులు పేమెంట్ హిస్టరీతో పాటు, కస్టమర్ క్రెడిట్ స్కోర్ను సైతం పరిశీలనలోకి తీసుకుంటాయి.

ఇక్కడ క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్తో పోలిస్తే ఓవర్డ్రాఫ్ట్ ద్వారా డబ్బు తీసుకోవడం చౌక. ఓవర్డ్రాఫ్ట్లో బ్యాంకులు ఇతర లోన్స్ కంటే తక్కువ వడ్డీని వసూలు చేస్తుంటాయి. ముందుగా అందించిన ఓడి లిమిట్లో డ్రా చేసుకున్న మెుత్తానికి, అలాగే వాడుకున్న సమయానికి మాత్రమే డబ్బుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అదే పర్సనల్ లోన్స్ విషయంలో అధిక వడ్డీతో పాటు.. ఆ లోన్ మొత్తాన్ని ముందస్తుగా చెల్లించినందుకు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యంలో వాస్తవానికి డబ్బు డ్రా చేసుకుని వినియోగించిన కాలానికి మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ప్రక్షాళన దిశగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ – ఇతర శాఖల్లోకి మార్పు..!!

కీలకశాఖల్లోకి ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, ఎమినిటీస్‌ సెక్రటరీలు – కసరత్తు చేస్తున్న ప్రభుత్వం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :గ్రామ వార్డు సచివాలయాల శాఖను ప్రక్షాళన చేసే ఆలోచనలో ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది.

ఇందులో భాగంగా సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీలను ( మౌళిక వసతుల కల్పన కార్యదర్శి) ఇతర శాఖల్లోకి మార్చాలని యోచిస్తోంది. ఈ రెండు విభాగాల్లో సుమారు 14,500 మంది ఉన్నారు. వీరిని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్లుఎస్‌ శాఖలకు బదిలీ చేసి, ఆయా శాఖల్లో సిబ్బంది కొరతను అధిగమించాలని కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
అభివృద్ధి కార్యాక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటి అమలులో అమినిటీస్‌ సెక్రటరీలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల పాత్ర చాలా ప్రధానమైనది. ప్రత్యేకించి నిర్మాణ రంగానికి సంబంధించి గృహాల నిర్మాణ ప్రణాళికకు ఆమోదం మొదలుకొని నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా చూడాల్సిన బాధ్యత కూడా వీరిదే. అలాగే మంచినీటి పైపులైన్లు, రహదారులు, కాల్వల పనుల పర్యవేక్షణ, అనుమతుల మంజూరు వంటి పనులు కూడా వీరి చేయాల్సివుంది. ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖలో తగిన సంఖ్యలో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో పనులు నత్తనడకనసాగుతున్నాయనే విమర్శ ఉంది. గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యాలయంలో కీలకమైన మూడు డిజిఎం , రెండు జనరల్‌ మేనేజర్లు, ఒక ఇడి పోస్టు ఖాళీగా ఉంది. జిల్లాల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖల్లో ఉన్న ఖాళీలకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

Health

సినిమా