Friday, November 15, 2024

‘పేరెంట్ టీచర్ హోమ్ విజిట్ ప్రోగ్రాం’ గురించి ముఖ్య అంశాలు. తెలుగులో ..

“Parent-Teacher Home Visit Program” from the Academic Year 2024-25 Orders

School Education Enhancing the Academic Performance of students studying from Classes 1-12 in Government Schools and Colleges Implementation of “Parent-Teacher Home Visit Program” in the State from the Academic Year 2024-25 Orders Issued.

పాఠశాల విద్య – ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో 1-12 తరగతుల చదువుతున్న విద్యార్థుల అకడమిక్ పనితీరును మెరుగుపరచడం కొరకు – 2024-25 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలో “తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల గృహ సందర్శన కార్యక్రమం” అమలు మీద ఉత్తర్వులు – జారీ చేయబడ్డాయి.

1వ తరగతిలో విద్యర్థికి నాణ్యమైన స్పృహ ప్రారంభం కావడం అత్యవసరం, ఇది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థుల క్రియాశీల ప్రమేయం ద్వారా మాత్రమే సాధించబడుతుంది.

విద్యలో తల్లిదండ్రుల ప్రమేయం విద్యాపరమైన ఫలితాలను గణనీయంగా పెంచుతుందని రుజువు చేయబడింది. .

జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ జాయిస్ ఎప్స్టీన్, తల్లిదండ్రులు తమ విద్యలో చురుకుగా నిమగ్నమై ఉన్న విద్యార్థులు ఉన్నత గ్రేడ్‌లు సాధించడానికి, క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేందుకు మరియు గ్రాడ్యుయేట్ మరియు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉందని కనుగొన్నారు.

అదనంగా, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ, లాంగ్ బీచ్ నుండి డాక్టర్ విలియం జేన్స్, తల్లిదండ్రుల ప్రమేయం మెరుగైన విద్యార్థుల ప్రవర్తనకు దారితీస్తుందని, ప్రేరణ మరియు అధిక ఆత్మగౌరవానికి దారితీస్తుందని నిరూపించారు, ఇవి విద్యావిషయక విజయానికి కీలకమైన అంశాలు.

విద్యార్థుల ఇళ్లను సందర్శించే ఉపాధ్యాయులు విద్యా ఫలితాలపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.

హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ కరెన్ ఎల్. మ్యాప్ ఉపాధ్యాయుల ఇంటి సందర్శనలు విద్యార్థుల హాజరు రేటును పెంచడానికి మరియు ఉన్నత విద్యా పనితీరుకు దారితీస్తుందని కనుగొన్నారు.

ఉపాధ్యాయులు గృహ సందర్శనలు నిర్వహించిన విద్యార్థులు అటువంటి సందర్శనలు పొందని వారితో పోలిస్తే 24% ఎక్కువ హాజరు రేటు మరియు మెరుగైన గ్రేడ్‌లు. పొందినట్టు తెలుస్తుంది

అదనంగా, జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీలో డాక్టర్ స్టీవెన్ షెల్డన్ చేసిన పరిశోధనలో గృహ సందర్శనలు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తాయి, ఇది మెరుగైన కమ్యూనికేషన్ మరియు సహకారానికి దారితీస్తుందని, ఇది విద్యార్థుల విజయాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుందని వెల్లడించింది.

ఈ అధ్యయనాలు విద్యార్థులకు విద్యా అనుభవాలు మరియు ఫలితాలను మెరుగుపరచడంలో పేరెంట్-టీచర్ హోమ్ విజిట్ ప్రోగ్రామ్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి.

పేరెంట్ టీచర్ హోమ్ విజిట్ అమలుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలు :

  • ఫ్రీక్వెన్సీ: తరగతి ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి ఇంటిని సంవత్సరానికి రెండుసార్లు సందర్సించాలి
  • ఎప్పుడెప్పుడు అంటే : మొదటి సందర్శన జూన్‌లో ఉంటుంది మరియు రెండవ సందర్శన జనవరిలో ఉంటుంది.
  • జూన్ సందర్శన: జూన్ సందర్శన సమయంలో, తరగతి ఉపాధ్యాయుడు విద్యార్థి పనితీరు మరియు అవసరాల ఆధారంగా వ్యక్తిగతీకరించిన విద్యా ప్రగతి ప్రణాళికను అభివృద్ధి చేస్తారు.
  • జనవరి సందర్శన: జనవరిలో, ఉపాధ్యాయులు తిరిగి సందర్శించి, విద్యార్ధి పురోగతి మరియు ఏదైనా కొత్త పరిణామాల ఆధారంగా విద్యా ప్రగతి ప్రణాళిక రివైజ్ చేస్తారు
  • Personalization: ప్రతి సందర్శన వ్యక్తిగతీకరించిన విద్యా పురోగతి ప్రణాళికను రూపొందించడం మరియు సవరించడంపై దృష్టి పెడుతుంది.
  • Convenience: తల్లిదండ్రులకు అనుకూలమైన సమయాల్లో సందర్శనలు షెడ్యూల్ చేయబడతాయి.

Download Parent Teacher home visit program GO MS 26 copy

పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు.. చివరి రోజు సంచలన కామెంట్స్..

AB Venkateswara Rao Retirement: ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ చేసేందుకు రిలీవ్ చేస్తూ ప్రభుత్వం(Andhra Pradesh Government) ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది సేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి(Jawahar Reddy) ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, శుక్రవారం ఉదయమే ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఇదే రోజున సాయంత్రం పదవీ విరమణకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయనను విధుల్లోకి తిరిగి చేర్చిన ప్రభుత్వం.. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ బాధ్యతలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని హోం సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఈ మేరకు జీఐడీ నుంచి జీవో నెంబర్ 1013ను ప్రభుత్వం జారీ చేసింది.

కొన్నేళ్లుగా ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. రిటైర్ అవ్వాల్సిన రోజున విధుల్లో చేరారు. ఉదయం బాధ్యతలు చేపట్టిన ఆయన సాయంత్రం పదవీ విరమణ చేశారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేశారు. విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయంలో పదవీ విరమణ చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. పోలీసు శాఖ పరంగా డీజీలో హోదాలో ఉన్నారు ఏబీవీ. కాగా, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.. ఏబీవీని కలిసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏబీవీని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. వీరిద్దరూ ఒకే బ్యాచ్‌మేట్స్ కావడంతో పరస్పరం క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు ఇరువురు అధికారులు.

ఈ సందర్భంగా ప్రసంగించిన ఏబీవీ..

‘నేను ఇంజినీరింగ్ చదువుకుని తొలుత టాటామోటార్స్‌లో ఉద్యోగం చేశాను. అదే సంస్థలోలో ఉన్నా.. లేక అమెరికా వెళ్లినా.. ఇప్పుడు నా జీవితం వేరే విధంగా ఉండేది. ఐపీఎస్‌గా అధర్మాన్ని, అన్యాయాన్ని, అణచివేతను ఎదుర్కోవడం నా వృత్తిధర్మంగా పనిచేశాను. నా సర్వీసులో చట్టాన్ని కాపాడేండేందుకు అక్రమాలను, అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు పాటుపడ్డాను. అన్యాయాన్ని ఎదుర్కొన్నా తప్పితే నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. నేను ఈ రోజు పూర్తి సంతృప్తితో రిటైర్ అవుతున్నాను. నా సర్వీసులో నీతి నిజాయితీతో వ్యవహరించాను. ఎవరికీ అన్యాయం చేయకపోవడంతోనే ఈరోజు నేను లక్షల మంది అభిమానం పొందాను. నాకు ఎదురైన సవాళ్లు, కష్టాలు చూసి నా అభిమానులు ఉద్వేగ్వంతో ఏడ్చారు. నా నిజాయితీ, ధర్మం, పోరాటమే నన్ను కాపాడింది. నా సర్వీసులో దుర్మార్గులనూ చూశా.. నాకు వ్యతిరేకంగా వ్యవహరించాలని కొందరు ఎంత డబ్బు ఇచ్చినా కొందరు అంగీకరించలేదు. నాకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రిటైర్ అయినా నా జీవితం ఉన్నంతవరకు ప్రజా సేవలో ఉంటాను. నా శేష జీవితంలోనూ అన్యాయాన్ని, అణచివేతను ఎదురిస్తా. దుష్ట శిక్షణ-శిష్టరక్షణ చేసేందుకు నా రిటైర్డ్ జీవితంలో అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. నాకు ఆప్తులుగా ఉండి అండగా ఉన్న వారికి రుణపడి ఉంటా’ అని అన్నారు.

ఉదయం మీడియాతో మాట్లాడుతూ..

ఉదయం విధుల్లో చేరే సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తరువాత మళ్లీ విధుల్లోకి చేరడంపై సంతోషం వ్యక్తం చేశారాయన. రెండు సంవత్సరాల తరువాత ఇదే ఆఫీసులో చార్జ్ తీసుకుంటున్నానని, తనకు అభినందనలు తెలిపేందుకు వచ్విన వారికి కృతజ్ఞతలు చెప్పారు. ‘ఈరోజు నా పదవీ విరమణ రోజు.. ఈ రోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నా.. సాయంత్రం పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను. ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయి. విధుల్లో చేరాను. ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. యూనిఫాంతో రిటైర్ కావడం నా కల నెర వేరినట్లుగా భావిస్తున్నాను.’ అని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం కక్షపూరిత వైఖరి..

ఐదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చీ రాగానే.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఫోకస్ పెట్టింది. ఆయనపై కక్షగట్టిన సర్కార్.. అకారణంగా ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. అప్పడు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని ఏపీ ప్రభుత్వానికి క్యాట్ సూచించింది. దీనిపై జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అలా ఐదేళ్లుగా ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన పోరాటం ఫలించి.. పదవీ విరమణ రోజు విధుల్లో చేరారు. ఇప్పుడు పదవీ విరమణ పొందారు.

హెయిర్ కట్ నచ్చలేదని బాలుడి ఆత్మహత్య..

ఇటీవల చిన్నారులు చిన్న విషయాలకు కలత చెందడం, గొడవలకు దిగడం, అంతెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగించుకుంటున్నారు.

ఇంట్లో తమ తల్లిదండ్రుల శోకాన్ని మిగిల్చుతూ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. తాజాగా ఓ బాలుడు హెయిర్ కట్ నచ్చలేదని తనకు ఇష్టమైన కటింగ్ కాకుండా వేరేలా కటింగ్ చేయించారని తండ్రితో గొడవ పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం… గంగారం మండలంలోని చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం కాంతరావుకి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన హర్షవర్ధన్ (9) సీతానాగారం హాస్టల్ లో ఆరో తరగతి చదువుతున్నాడు.

వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉన్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట హర్షవర్ధన్ తండ్రి కాంతారావు కటింగ్ షాపుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తనకు ఇష్టం లేని కటింగ్ చేపించారని తండ్రితో గొడవకు దిగాడు. సముదాయించిన తండ్రి అతన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఇంటి వెనుక పనులు చేసుకుంటుండగా హర్షవర్ధన్ పురుగుల మందు సేవించాడు. ముందుగా నర్సంపేట లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నయం కాకపోవడంతో అక్కడ నుండి హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం. గంగారం ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించారు.హర్షవర్ధన్ మృతితో చింతగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బాబా పిలుస్తున్నాడు అంటూ హిమాలయాలకు అక్కాచెల్లెల్లు! చివరికి!

బాబా పిలుస్తున్నాడు అంటూ హిమాలయాలకు బయలు దేరారు ముగ్గురు అమ్మాయిలు. ఇంట్లో ఓ లెటర్ కూడా రాశారు. తమ కోసం వెతకొద్దని, మూడు నెలల తర్వాత ఇంటికి తిరిగొస్తామని.. కానీ

విశ్వాసం ఉండవచ్చు కానీ అంధ విశ్వాసం ఉండకూడదు. ఇదే మూఢత్వంగా మారిపోతుంది కొన్ని సార్లు. మూఢత్వం మనస్సును ఆలోచింపనివ్వకుండా చేస్తుంది. ఆధ్యాత్మిక చింతన మాటున అంధ విశ్వాసాలకు బలౌతున్నారు. చదువులేని వాళ్లు కాదు.. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ సైతం ఇదే దారిలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ముగ్గురు అమ్మాయిల జీవితాలను చిధ్రం చేసింది ఇదే అంధ విశ్వాసం. బాబా పిలుస్తాడని, ఆధ్యాత్మిక చింతనలో బతికేస్తూ.. హిమాలయాలకు వెళ్లానని ఇంట్లో ఓ ఉత్తరం ముక్క రాసి పరారయ్యాడు ఈ బాలికలు. వెతికితే.. తాము తిరిగి రామని కూడా బెదిరించారు. అందులో తాము త్వరగానే ఇంటికి వస్తామని చెప్పారు. కానీ నిజంగానే త్వరగానే వచ్చారు సజీవంగా కాదు.. శవాలుగా. కన్న తల్లిదండ్రులకు శోక సంద్రంలో ముంచేశారు.

‘బాబా పిలుస్తున్నాడు.. హిమాలయాలకు వెళ్తున్నాం.. మూడు నెలల తర్వాత తిరిగొస్తాం.. ఈలోపు మీరు మా గురించి వెతికితే ఆత్మహత్య చేసుకుంటాం. ’ అని లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారు ముగ్గురు అమ్మాయిలు. వీరిది బీహార్ రాష్ట్రం. వీరు ముగ్గురు స్నేహితులు. తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గౌరీ కుమారి, మోహినీ కుమారి, మాయా కుమారి స్కూల్ మేట్స్. ఈ ముగ్గురు ఈ నెల 13న ఇంట్లో నుండి పరారయ్యారు. బాబా పిలిచారని, హిమాలయకు వెళ్లాలని, మూడు నెలల తర్వాత అనగా ఆగస్టు 13న తిరిగి ఇంటికి వస్తామంటూ లేఖ రాసి వెళ్లిపోయారు. తమ కోసం పేరెంట్స్ వెతకకుండా.. ఓ బెదిరింపు కూడా చేశారు. తమను వెతికితే.. ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. అయితే అన్నంత పని చేశారు.

ఇప్పుడు మధురలోని బజ్జా బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్ పై ముగ్గురు అమ్మాయిల మృతదేహాలను గుర్తించారు పోలీసులు. వీరిని మిస్సైన గౌరీ కుమారి, మోహినీ కుమారి, మాయ కుమారిలుగా గుర్తించారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ నుండి నగరానికి చేరుకుని, వారి తమ కుమార్తెలుగా గుర్తించారు. కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాగా, ముగ్గురు అమ్మాయిల మొబైల్ ఫోన్లు మాయమయ్యాయి.అయితే బీహార్ పోలీసులు తమ కేసును సరిగ్గా పట్టించుకోలేదని, లేకుంటే తమ పిల్లలు బతికేవారంటూ ఆరోపిస్తున్నారు బాలికల తల్లిదండ్రులు. స్థానిక పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే పోలీసులు ఈ ఆరోపణలు ఖండించారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసుకున్నామని, బాలికలు స్వచ్చందంగా ఇంటి నుంచి వెళ్లిపోయారని, వారు వెళ్లిపోవడానికి గల కారణాలను వివరిస్తూ లేఖలు రాసి వెళ్లిపోయారని, వారి కోసం వెతుకుతున్నామని, మథురలో మృతదేహాలు లభ్యమైన విషయం తెలియడంతో వారి కుటుంబాలకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు

ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు లక్ష కిలోల బంగారం తరలింపు

Gold Reserves | ముంబయి: ఇంగ్లాండ్‌ నుంచి భారీఎత్తున బంగారం నిల్వలను ఆర్‌బీఐ (RBI) భారత్‌కు తరలించింది. దాదాపు 100 టన్నులు అంటే లక్ష కిలోల పసిడిని దేశీయ ఖజానాలో చేర్చింది. 1991 తర్వాత ఈ స్థాయిలో బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. అప్పట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్‌ పెద్దఎత్తున పసిడి నిల్వలను తనఖా పెట్టాల్సివచ్చింది.

రవాణా, నిల్వ సర్దుబాట్లలో భాగంగానే భారత్ ఇంతమొత్తం బంగారాన్ని తీసుకొచ్చింది. దేశీయంగా ముంబయి మింట్‌ రోడ్డు సహా నాగ్‌పుర్‌లోని పాత కార్యాలయాల్లో ఆర్‌బీఐ పుత్తడిని నిల్వ (Gold Reserves) చేస్తుంటుంది. కొన్నేళ్లుగా కేంద్ర బ్యాంకు పెద్దఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తోంది. దీన్ని ఎక్కడ నిల్వ చేయాలనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో విదేశాల్లోని మన నిల్వలు గణనీయంగా పెరిగాయి. దీంతో కొంత మొత్తాన్ని భారత్‌కు తీసుకురావాలని నిర్ణయించింది.

చాలా దేశాల కేంద్ర బ్యాంకులు బ్యాంక్ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. అదే బాటలో భారత్‌ సైతం అక్కడి డిపాజిటరీల్లో పెద్దఎత్తున పసిడిని నిల్వ చేస్తూ వచ్చింది. 2024 మార్చి ముగిసేనాటికి ఆర్‌బీఐ (RBI) వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. దీంట్లో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది. ఇటీవల కొన్నేళ్లుగా వరుసగా కొనుగోలు చేస్తూ వచ్చిన కేంద్ర బ్యాంకు గత ఏడాది 27.5 టన్నుల పసిడిని కొత్తగా నిల్వల్లో చేర్చింది. ఈ ఏడాది కొనుగోళ్ల జోరు మరింత పెరిగింది. జనవరి- ఏప్రిల్‌ వ్యవధిలోనే 2023 మొత్తం కంటే ఒకటిన్నర రెట్లు అధిక బంగారం కొనుగోలు చేయడం గమనార్హం.

కొన్ని నెలల కసరత్తు..
రవాణా, భద్రత విషయాలను పరిగణనలోకి తీసుకుంటే 100 టన్నుల బంగారాన్ని భారత్‌కు తరలించడం మామూలు విషయం కాదు. దీనివెనక కొన్ని నెలల కసరత్తు అవసరం. ఆర్‌బీఐ, ఆర్థికశాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక యంత్రాంగం మధ్య సమగ్ర సమన్వయం ఉండాలి. ఈ బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు తొలుత ఆర్థికశాఖ నుంచి ఆర్‌బీఐ కస్టమ్స్‌ సుంకం మినహాయింపు తీసుకుంది. సాధారణంగా అన్ని దిగుమతులపై వర్తించే ఐజీఎస్టీ మాత్రం తప్పలేదు. తద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా పంచుకోవాల్సి ఉండటమే దీనికి కారణం.

ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని భారత్‌కు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఉపయోగించారు. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. తాజా తరలింపుతో ఆర్‌బీఐ నిర్వహణ వ్యయాలు స్వల్ప స్థాయిలో తగ్గుతాయి. ఇప్పటి వరకు బంగారం నిల్వ చేసినందుకు బ్యాంక్‌ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చెల్లిస్తూ వచ్చిన రుసుము ఇకపై చెల్లించనక్కరలేదు.

ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఎప్పుడు విడుదల చేస్తారో తెలుసా?

Exit Polls Explained: భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు అంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలకు ప్రతిరూపం అని చెప్పవచ్చు. మనదేశంలో ఎన్నికలు చాలాదేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ఇప్పుడు రెండునెలలుగా ఎన్నికల హంగామా దేశంలో నడుస్తోంది. ఏ దేశాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తో వస్తున్నారు. ఇప్పటివరకూ ఆరు దశల పోలింగ్ పూర్తయింది. ఇక జూన్ 1న ఏడోదశ పోలింగ్ తో ఎన్నికల క్రతువు ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆరోజు ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతాయి. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై అందరూ టెన్షన్ తో ఎదురుచూస్తున్నారు. అయితే, దానికంటే ముందుగా అంటే జూన్ 1 వ తేదీన చివరిదశ పోలింగ్ పూర్తి అయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి అవుతాయి. అసలు ఫలితాల కంటే ముందుగా వచ్చే ఈ రిజల్ట్స్ పై కూడా అందరూ ఆసక్తి కనబరుస్తారు. ఎందుకంటే, కొంతవరకూ ఓటింగ్ పల్స్ తెలుస్తుందని చాలామంది నమ్ముతారు. అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? వీటిని ఎవరు ఎందుకు నిర్వహిస్తారు? ఎందుకు వీటిని చివరి దశ పోలింగ్ తరువాత మాత్రమే వెల్లడిస్తారు? అసలు ఫలితాలకు.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు.. మధ్యలో వ్యత్యాసం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు అర్ధం చేసుకుందాం.

ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?
Exit Polls Explained: ఓటు వేయడానికి వెళ్లిన ఓటరు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే.. అతను ఏపార్టీకి ఓటు వేశాడు? ఎందుకు వేశాడు? వంటి విషయాలను తెలుసుకుని.. ఆ అభిప్రాయాల్ని క్రోడీకరించి.. ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి అనే అంచనా వేయడమే ఎగ్జిట్ పోల్స్. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ దాదాపుగా ఎన్నికల నిర్వహణ అంత క్లిష్టంగానే ఉంటుంది. ఓటర్లను ఎంపిక చేసుకోవడం.. వారి నుంచి ప్రశ్నలకు సమాధానం రాబట్టడం.. వాటిని శాస్త్రీయంగా విశ్లేషించడం.. వాటిని వెల్లడి చేసాయడం ఇంత ప్రాసెస్ ఉంటుంది.

ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు?
Exit Polls Explained: చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తాయి. ఒక్కో సంస్థ ఒక్కో మార్గంలో దీనిని నిర్వహిస్తుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చాలా కీలకమైనది సాంపిల్ ఎంపిక. ఉదాహరణకు ఒకరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనుకుందాం. అప్పుడు అక్కడ ఉన్న నియోజకవర్గాలు.. వాటిలో కీలక నియోజకవర్గాలు వీటి నుంచి ఎగ్జిట్ పోల్స్ కోసం సాంపిల్స్ ఎంచుకుంటారు. అది కూడా మహిళలు, పురుషులు, వయసు, ఆర్థిక స్థితిగతులు ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ పై ఆధారపడి శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. ఎన్నిలలో ఓటింగ్ కు సంబంధించి కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకుని వాటిపై ఓటు వేసి బయటకు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. కొన్ని సంస్థలు నమూనా బ్యాలెట్ నిర్వహిస్తాయి. అంటే, బ్యాలెట్ పేపర్ లాంటిది ఇచ్చి వారు ఏ గుర్తుపై ఓటు వేశారో అదే గుర్తుపై ఓటు వేయమని కోరతాయి. ఈ సాంపిల్స్ ఒక్కో నియోజకవర్గంలోనూ వందల సంఖ్యలో తీసుకుంటారు.. వేర్వేరు పోలింగ్ స్టేషన్స్ నుంచి వీటిని కలెక్ట్ చేస్తారు. ఇలా సేకరించిన సాంపిల్స్ మదింపు చేసి ఏ పార్టీకి లేదా ఏ అభ్యర్ధికి ఎంత శాతం ఓట్లు రావచ్చు అనే ఒక అంచనా వేస్తారు. ఆ అంచనాల ఆధారంగా ఫలితాలు సిద్ధం చేస్తారు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎందుకు చివరి దశ వరకూ ప్రకటించరు?
Exit Polls Explained: నిర్ణీత సమయానికి ముందే ఎగ్జిట్ పోల్‌లను ప్రచురించడం ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని నిబంధన ప్రకారం ఉల్లంఘనగా ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. అలాంటివి ఓటర్ల మనస్సులపై ప్రభావం చూపుతాయని భావిస్తారు. మన దేశంలో ఒకే విడతలో ఎన్నికలు జరగవు. ఒక రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయని అనుకుందాం. మొదటి విడత పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ వెంటనే ప్రకటిస్తే.. ఏ అనే పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని వెల్లడి అయితే, రెండో విడత పోలింగ్ లో పాల్గొనే ఓటర్లపై ఆ ప్రభావం పడుతుంది. అందుకనే, ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెంటనే ప్రకటించకుండా.. అన్ని దశల పోలింగ్ పూర్తయ్యాకా వెలువరించేలా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
అసలు ఫలితాలు.. ఎగ్జిట్ పోల్ ఫలితాల మధ్య తేడా ఉండవచ్చా?
Exit Polls Explained: నూటికి నూరు శాతం కచ్చితమైన ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ లో రావడం జరగదు. ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ చెప్పడం వరకూ హెల్ప్ అవుతాయి. అంతేకానీ.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల లానే అసలు ఫలితాలు ఉండడం అనేది జరగదు. ఎందుకంటే, ఎగ్జిట్ పోల్స్ కోసం కొద్ది మంది అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటారు. అలాగే ఓటు వేసిన వారు కచ్చితంగా ఈ పార్టీకే ఓటు వేశామని నిజమే చెబుతారనేది నమ్మడం కష్టమే. కేవలం ముందస్తుగా ఒక అంచనాకు రావడానికి మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిర్వహించే సంస్థ క్రెడిబిలిటీ మీద కూడా ఆధారపడి ఉంటాయి. శాంపిల్స్ సేకరణ.. వాటి విశ్లేషణ జరిపే విధానాలు కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రభావితం చేస్తాయి.

ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎప్పుడు?
చివరి దశ పోలింగ్ జూన్ 1 సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది. ఆ తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకటన ఉంటుంది. ఆయా సంస్థలు వీటిని టీవీ ఛానల్స్, యూట్యూబ్, వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రసారం చేస్తాయి.

సీనియర్ ఎన్టీఆర్ పక్కన నుంచొన్న ఆ చిన్నోడు.. ఇప్పుడు గ్లోబల్ స్టార్

టాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ నటుల్లో ఒకరు నందమూరి తారక రామారావు. కళామతల్లి ముద్దుబిడ్డగా ఎదిగిన ఎన్టీఆర్.. ఆ తర్వాత ప్రజా హృదయాలను గెలుచుకున్న రాజకీయ నేతగా మారారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామంలో పుట్టి.. మన దేశం అనే మూవీలో చిన్న పాత్ర పోషించి.. అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ స్థానానికి చేరుకున్నాడు. పౌరాణిక, ఇతిహాస గాధలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. కృష్ణుడు, రాముడు ఎలా ఉంటాడో చాలా మందికి తెలియదు కానీ.. ఎన్టీఆర్‌నే దైవంలా భావించారు తెలుగు ప్రేక్షకులు. ఆయన తెరపై కనిపిస్తుంటే జైజైలు పలకడంతో పాటు హారతులు పట్టేవారంటే.. అతని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషల్లో దాదాపు 303 చిత్రాల్లో నటించారు.

ఆయన చివరిగా నటించింది శ్రీనాథ కవి సార్వభౌముడు. కానీ అందరికీ తుది చిత్రంగా నిలిచిపోయింది మాత్రం మేజర్ చంద్రకాత్. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఫోటో స్టిల్ కూడా ఆ చిత్రంలోనిదే. ఇందులో మోహన్ బాబు, నగ్మా, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లు. ఊర్వశి శారద, ఎన్టీఆర్‌కు భార్యగా నటించింది. పరుచూరి బ్రదర్స్ అందించిన కథను తెరకెక్కించాడు రాఘవేంద్ర రావు. ఎం ఎం కీరవాణి అందించిన మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ ఫోటోలో నందమూరి తారక రామారావు పక్కన ఉన్న ఈ బాబును గమనించారా..? అతడు ఎవరో చెప్పుకోండి చూద్దాం. బహుశా అతడు ఊహించి ఉండడు.. అతనంత స్టార్ హీరోను అవుతానని. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో మాత్రమే కాదు గ్లోబల్ స్టార్.

ఇంతకు ఆ చిన్నోడు ఎవరంటే.. నందమూరి తారకరామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్. అవును తాత పక్కన ఒదిగి ఉన్న ఈ బాలుడు టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ తారక్. బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామయణం వంటి చిత్రాలతో బాల నటుడిగా అలరించిన నందమూరి వారసుడు.. అత్యంత పిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నిను చూడాలని మూవీతో హీరోగా మారిన యంగ్ టైగర్.. స్టూడెంట్ నంబర్ 1తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మీసాలు సరిగా రాని ఈ కుర్రాడు.. టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోలేదు. ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్‌గా మారాడు. దేవర మూవీతో పాటు వార్ 2 చిత్రాలను చేస్తున్నాడు తారక్.

హనుమత్ జయంతి 2024 : ఆంజనేయుడి అనుగ్రహం కోసం చేయాల్సిన పరిహారాలు.. ఇవే

హనుమాన్ జయంతి ఏడాదికి మూడుసార్లు వస్తుంది. చైత్ర పౌర్ణమిరోజు , వైశాఖ దశమి రోజు ( జూన్ 1) , మార్గశిర మాసంలో జరుపుకుంటారు. చైత్ర మాసానికి సంబంధించిన హనుమాన్​ జయంతి ఇప్పటికే పూర్తి కాగా..

వైశాఖ దశమి హనుమాన్ జయంతిని జూన్​ 1 శనివారం నాడు జరుపుకోనున్నారు. మరి ఈ రోజున స్వామి వారి అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో.. పురాణాల్లో ఏముంది..పండితులు ఏం చెబుతున్నారో.. తెలుసుకుందాం. . .

దృక్​ పంచాంగం ప్రకారం.. వైశాఖ మాసం కృష్ణ పక్షం దశమి తిథి అంటే 2024 జూన్​1వ తేదీనే హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. హనుమాన్ జయంతి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమంతుని విగ్రహానికి సింధూరం, తమలపాకులు సమర్పించాలి. మల్లె నూనెతో దీపం వెలిగించి, గులాబీ పూల దండను విగ్రహం/పటానికి వేసి భజరంగబలికి ఇష్టమైన బెల్లం, పప్పును నైవేద్యంగా పెట్టాలి. హనుమాన్ చాలీసా 7 సార్లు చదవాలి. ఇంట్లో రామాయణ పారాయణం చేయడం చాలా మంచిది. హారతి ఇచ్చిన తరువాత శక్తి మేరకు పేదవారికి వస్త్రాలు, ఆహారం, డబ్బును దానం చేయొచ్చు.

చేయాల్సిన పరిహారాలు..

హనుమాన్ జయంతి నాడు ( జూన్ 1) స్వామి వారికి గులాబీ పూల దండ వేస్తే.. ఆయన అనుగ్రహం పొందవచ్చని.. ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయని స్కంద పురాణంలో పేర్కొన్నారు
చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే, హనుమాన్ జయంతి నాడు నెయ్యిలో వాము కలిపి ఆంజనేయుడికి సమర్పించాలని.. ఇది అనారోగ్యం నుంచి మిమ్మల్ని కాపాడుతుందని.. ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.
తమలపాకులు అంటే హనుమంతుడికి మహా ఇష్టం. వాటి మీద జైశ్రీరామ్ అని రాసి తమలపాకుల దండ సమర్పించడం వల్ల హనుమంతుడి అనుగ్రహం మీ మీద ఉండి.. కోరుకున్నవన్నీ జరుగుతాయని చెబుతున్నారు.
వ్యాపారాన్ని మెరుగుపరచడానికి, హనుమాన్ జయంతి నాడు స్వామికి సింధూర రంగు వస్త్రాన్ని సమర్పించాలని.. ఆంజనేయ స్వామి గుడిని కాషాయం జెండాలతో అలంకరించాలని అంటున్నారు. ఇది వ్యాపారంలో వచ్చే ఆకస్మిక సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుందని చెబుతున్నారు.
హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడికి శనగపిండి, ఎర్ర చోళం సమర్పించాలి. అలాగే మల్లె నూనె దీపాన్ని వెలిగించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని.. అప్పుల సమస్యల నుంచి బయట పడి ఆదాయం పెరిగేందుకు అవకాశాలు లభిస్తాయని అంటున్నారు.
ఆర్థిక శ్రేయస్సు కోసం తెల్ల కాగితంపై కాషాయ రంగుతో స్వస్తిక్ గుర్తు రాసి హనుమంతునికి సమర్పించి.. ఆ తరువాత ఇంట్లో భద్రంగా ఉంచుకోవాలని అంటున్నారు. ఇలా చేస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయని అంటున్నారు.
శని దోషం పోగొట్టేందుకు ఆంజనేయస్వామి విగ్రహం ముందు ఆవనూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులు వేయాలని.. ఇలా చేయడం వల్ల శని అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.

వావ్ : మెరుస్తున్న పుట్టగొడుగులు.. చూడాలంటే అక్కడకు వెళ్లాల్సిందే..

పుట్టగొడుగులు ఒక ఆహారంగానే చాలామందికి తెలుసు. ఇవి పర్యాటకులను కూడా ఆకర్షించే శక్తి ఉన్నవి. సాధారణ పుట్టగొడుగులను చూడడానికి ఎవరూ రారు, కానీ ఆ పుట్టగొడుగులు మెరుస్తూ కనిపిస్తే కచ్చితంగా వాటిని చూసేందుకు ఎంతో మంది వస్తారు. అలాంటి మెరుస్తున్న పుట్టగొడుగులు మనదేశంలోనే ఉన్నాయి. వాటిని సహజమైన టార్చ్ లైట్లుగా స్థానికులు భావిస్తారు. రాత్రిపూట అడవిలో వాటి వెలుతురులోనే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి మిలమిల మెరిసే పుట్టగొడుగులు ఉన్నది కర్నాటక అడవుల్లో( ఉత్తర కన్నడ). ఈ పుట్టగొడుగులకు బయోలుమినిసెన్స్ లక్షణం ఉంది. అంటే స్వయంగా వెలిగే శక్తిని కలిగి ఉన్నాయి.

ఉత్తర కన్నడలోని పల్లెటూళ్లలో నదీతీరంలో కప్పలు, చేపలు పట్టి పట్టే చేపలు, దట్టమైన అడవిలో చెట్లకింద వ్యాపించే పుట్టగొడుగులు సందర్శకులను కట్టిపడేస్తాయి. తాజాగా ఓ ఫోటోగ్రాఫర్ గోపి జాలీ తన కెమెరాలో అరుదైన పుట్టగొడుగును బంధించారు. అడవిలో కొన్ని జాతుల పుట్టగొడుగులు చాలా విచిత్రంగా కనువిందు చేస్తాయి. తడిగా ఉండే, కఠినమైన వాతావరణాల్లో పెరుగుతాయి, కొన్నిసార్లు విషపూరిత పదార్థాలను వెదజల్లుతూ విస్తారమైన ఆకారాలు.. వివిధ రంగుల్లో కనిపిస్తాయి అత్యంత ఆకర్షణీయమైన లక్షణాలతో మెరుస్తూ ఉంటాయి. 70 రకాల శిలీంధ్రాలు చీకటిలో కాంతిని విడుదల చేస్తయి, ఇవి సాధారణంగా గుర్తించలేని జీవులను ఆకర్షణీయంగా ఉంటాయి.

బయోలుమినిసెంట్ పుట్టగొడుగులు జీవరసాయన ప్రక్రియ ద్వారా కాంతిని ఉత్పత్తి చేసే శిలీంధ్రాలున్న వివిధ జాతుల పుట్టగొడుగులు. . ఉత్తర కన్నడ అడవులు అయస్కాంతంలా దూర ప్రాంతాల ప్రజలను కాంతితో ఆకర్షిస్తాయి. ఈ పుట్టగొడుగులను పగటిపూట సాధారణ పుట్టగొడుగుల్లాగా గుర్తించడం కష్టం. వీటి గురించి తెలిసిన వారు మాత్రమే గుర్తించగలరు. లూసిఫేరేస్ అనే ఎంజైమ్ పుట్టగొడుగులు, తుమ్మెదలు మరియు కొన్ని సముద్ర జీవులతో సహా వివిధ రకాల జీవులలో బయోలుమినిసెన్స్‌కు బాధ్యత వహిస్తుంది. ఈ ఎంజైమ్ ఆక్సిజన్ సమక్షంలో ఆక్సీకరణం చెంది కాంతి రూపంలో శక్తిని విడుదల చేస్తుంది. పుట్టగొడుగులు విడుదల చేసే కాంతి సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పుట్టగొడుగులలోని బయోలుమినిసెన్స్ వివిధ రకాల సహజ విధులను నిర్వహిస్తుంది. ఇది కీటకాలను ఆకర్షించగలదు, ఇది పుట్టగొడుగుల బీజాంశం వ్యాప్తికి కూడా సహాయపడుతుంది.

ఈ ప్రదేశంలో కనిపెట్టిన పుట్టగొడుగులను ప్రపంచంలో ఇప్పటివరకు కనిపెట్టిన పుట్టగొడుగుల్లో 97వ బయోలుమినిసెంట్ శిలీంధ్రాలుగా గుర్తించారు.రుతుపవనాల సమయంలో శాస్త్రవేత్తల బృందం ఆ ప్రాంతంలో పర్యటించింది. రెండు వారాలు పాటు పరిశోధించి అక్కడి పుట్టగొడుగులను పరిశీలించింది. ఇక్కడ వారు వందలాది జాతుల పుట్టగొడుగులను గుర్తించారు. అవి సైన్స్‌కు కూడా చాలా కొత్తవి. అక్కడి స్థానికులు వీటిని ఎలక్ట్రిక్ పుట్టగొడుగులు అని పిలుస్తారు. చీకట్లో చిన్న చిన్న దీపాల్లా పుట్టగొడుగులు ఎంతో అందంగా మెరుస్తూ ఉంటాయి. ఆకుపచ్చని వెలుగుతో కనుల విందు చేస్తాయి. ఈ ఫంగస్ తన నుండి సొంత కాంతిని విడుదల చేస్తుంది. ఇది చూడాలంటే అక్కడికి వెళ్లి తరించాల్సిందే. పరిశోధకుల పర్యటన తర్వాత ఈ పుట్టగొడుగులను రోరీడోమైసెస్ జాతికి చెందిన పుట్టగొడుగులుగా గుర్తించారు. ఇవి మన దేశంలో మొదటిసారి గుర్తించినట్టు చెప్పారు శాస్త్రవేత్తలు.

ప్రపంచవ్యాప్తంగా 20వేల శిలీంధ్ర జాతులు ఉంటే, అందులో 70 రకాల పుట్టగొడుగులు మాత్రమే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి తమ నుంచి కాంతిని విడుదల చేయగలవు. అలాంటివే మేఘాలయ అడవుల్లోపరుచుకొని ఉన్నాయి. ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని మావ్లిన్నాంగ ప్రాంతంలో నీటి ప్రవాహానికి దగ్గరలో ఈ మెరిసే పుట్టగొడుగులను మొదటిసారి కనుగొన్నారు. అలాగే వెస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని క్రాంగ్ షూరి జిల్లాలో అదే రకమైన పుట్టగొడుగులను స్థానికులు గమనించారు. అప్పటినుంచి ఆ ప్రాంతం చాలా హైలెట్ అయింది

హనుమత్ జయంతి 2024: ఏడాదికి మూడు సార్లు హనుమత్ జయంతి వేడుకలు… పురాణాల్లో ఏముందంటే….

ఆంజనేయుడి పుట్టిన రోజు ఉత్సవాలను ఏడాదికి మూడు సార్లు జరుపుకుంటారు.. చైత్రమాసం పౌర్ణమి రోజున.. వైశాఖ మాసం బహుళ దశమి ( 2024 జాన్ 1) న.. జరుపుకుంటారు . మార్గశిర మాసంలో మరోసారి జరుపుకుంటారు… ఇలా మూడు సార్లు ఎందుకు జరుపుకుంటారు.. ఏఏ ప్రాంతాల్లో ఎప్పుడు జరుపుకుంటారు. హనుమత్ జయంతిని ఏ రోజు జరుపుకోవాలనే అనుమానాలను ఈ స్టోరీ లో తెలుసుకుందాం. . .

ఆంజనేయుడి జన్మ తిథి చైత్రమాసంలోనా , వైశాఖంలోనా ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో ఉంది. ఎందుకంటే చైత్ర మాసంలో హనుమాన్ జయంతి కొందరు జరుపుకుంటే వైశాఖ మాసంలో జరుపుకుంటారు. ఇంకొన్ని ప్రాంతాల వారు మార్గశిరమాసంలో జరుపుకుంటారు.

పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి( జూన్ 1) శనివారం జన్మించాడని అందుకే ఆ రోజున హనుమంతుడి జన్మతిథి చేసుకోవాలని చెబుతారు. మరికొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్రమాస పౌర్ణమి నాడు ఎందరో రాక్షసులను సంహరించి విజయం సాధించిన కారణంగా ఆ రోజు విజయోత్సవం జరుపుకుంటారంటారు. ఉత్తరాది సహా తెలంగాణలోనూ హన్ మాన్ విజయోత్సవాన్నే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటారు.. ఉత్తరాది సహా తెలంగాణలోనూ హన్ మాన్ విజయోత్సవాన్నే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. తమిళనాడు, కేరళ మరికొన్ని రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో జరుపుకుంటారు.

కలౌ పరాశర స్మృతి:” అని శాస్త్రాలు చెప్తున్నాయి..

శ్లోకం: వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||

ఈ శ్లోకం ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు.

ఆంజనేయుడిని పూజిస్తే ..
ఏకాదశ రుద్రులలో ఒకడు ఆంజనేయుడు, పరమేశ్వరుడి అంశతో జన్మించినవాడు, సప్త చిరంజీవుల్లో ఒకడు. ఇప్పటికీ హిమాలయాల్లో కైలాస మానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ జీవించి ఉన్నాడని విశ్వసిస్తారు. ఎక్కడ రామనామం జపిస్తారో, ఎక్కడ రామాయణం చెబుతుంటారో అక్కడ ఆనంద భాష్పాలతో చేతులు జోడించి నమస్కరిస్తూ ఆంజనేయుడు కూర్చుని ఉంటాడట. రామకధ చెప్పే సభకు అందరి కన్నా ముందుగా వచ్చి అందరూ వెళ్లిపోయేవరకూ ఉంటాడట. హనుమంతుడిని పూజిస్తే రోగాలు నయమవుతాయి, భూతప్రేత పిశాచాలు పారిపోతాయి, చేసే పనిపట్ల శ్రద్ధ పెరుగుతుంది, శని బాధలు తొలిగిపోతాయి, బుద్ధి బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం పెరుగుతుందని పండితులు చెబుతారు…

కలౌ కపి వినాయకౌ” అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు.

యత్ర యత్ర రఘునాధ కీర్తనం – తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం – మారుతిం నమత రాక్షసాంతకమ్

అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నానని అర్థం.

హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, రావణుడితో యుద్ధానికి వారధి నిర్మించడం, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించడం ఇలా రాముడు ఎదురైన క్షణం నుంచి తిరిగి అయోధ్య చేరుకునే వరకూ శ్రీరామ విజయం వెనుక అడుగడుకునా భక్తుడు హనుమంతుడు ఉన్నాడు. అయోధ్యకు చేరుకుని పట్టాభిషేక ఘట్టం ముగిసినతర్వాత రాముడు ఇలా అనుకున్నాడట ” హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చింది, తిరిగి అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుడిని అయ్యాను, ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారంటే ఈ విజయం , ఆనందం అన్నీ హనుమంతుడి వల్లనే” అని… ఆంజనేయుడిని ప్రేమగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడట రాముడు. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకున్న రాజ్య ప్రజలు అప్పటి నుంచి… శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చే పూర్ణిమను గుర్తుపెట్టుకుని హనుమాన్ విజయోత్సవంగా భావించి… హనుమత్ జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

మహిళలకు శుభవార్త . అకౌంట్లోకి 15వేలు వేయనున్న ప్రభుత్వం.!

కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఒక శుభవార్త చెప్పింది. మహిళలకు ఒక్కొక్కరికి 15వేల రూపాయల ప్రయోజనం కలిగించే కార్యక్రమాల అమలు చేయ బోతుంది అని తెలిపింది.

ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రిటిష్ వారు రాకముందు వరకు కూడా మన దేశంలో చేతివృత్తులు చేసుకునే వారికి మంచి ఆదాయం అయితే ఉండేది. దాని తర్వాత క్రమంగా వారి ఆదాయం తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం గ్రామాలలో సైతం చేతివృత్తులు చేసుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కొన్ని వృత్తులకు సంబంధించిన వారైతే పూర్తిగా కనుమరుగయ్యారు. ఈ తరుణంలో సాంప్రదాయ చేతి వృత్తుల వారిని ప్రోత్సహిస్తూ వారి ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా ఒక పథకాన్ని ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసినదే. దీని వలన సుమారు ఐదు సంవత్సరాల వ్యవధిలో సాంప్రదాయ చేతివృత్తులు చేసుకునే వారికోసం 15వేల కోట్ల రూపాయలు కేటాయించటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇక కొత్తగా ఈ పథకానికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఆ వివరాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయ చేతివృత్తుల వారి కోసం సీఎం విశ్వకర్మ ఒక పథకాన్ని ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసినదే. సాంప్రదాయ పనిముట్లు,చేతులను ఉపయోగించి పనిచేస్తున్న కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులలో బలోపేతం చేసేందుకే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. వారు చేస్తున్నటువంటి ఉత్పత్తుల నాణ్యతను పెంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల తో వారిని అనుసంధానించి,వారి ఆదాయాన్ని పెంచటానికి ఈ పథకాన్ని తీసుకువచ్చారు. దేశంలోని గ్రామీణ,పట్టణ ప్రాంతాలలో కళాకారులు చేతివృత్తుల వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది. అయితే ముందుగా 18 సంప్రదాయ వృత్తులకు చెందిన వారికి ఈ స్క్రీమ్ కు సంబంధించిన ప్రయోజనాలు అందుతాయి.
ఈ పథకం వలన ఆయా వృత్తుల వారికి సీఎం విశ్వకర్మ సర్టిఫికెట్ తో పాటుగా గుర్తింపు కార్డును కూడా ఒకటి ఇవ్వనున్నారు. అలానే తొలి విడత కింద లక్ష, రెండో విడత కింద రెండు లక్షల రూపాయలు రుణం ఇస్తున్నట్లుగా తెలిపారు. దీనికి కేవలం 5% వడ్డీ మాత్రమే వసూలు చేయనున్నారు. అలాగే చేతి వృత్తుల వారి కోసం కూడా ప్రత్యేక శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇక్కడ బేసిక్ నుండి అడ్వాన్స్డ్ స్థాయి వరకు ట్రైనింగ్ కార్యక్రమాలు అనేవి ఉంటాయి. శిక్షణ తీసుకునే వారికి రోజుకు 500 రూపాయలు చొప్పున స్టే ఫండ్ కూడా ఇవ్వనున్నారు…

రూ.15000 విలువైన టూల్ కిట్ : అంతే చేతివృత్తుల వారు తమకు అవసరమైనటువంటి పారిశ్రామిక పనిముట్లను కూడా కనుక్కోవటం కోసం అవసరమైనటువంటి వారికి 15 వేల రూపాయలను కూడా ఆర్థిక సహాయం అందించనున్నారు. అయితే వీరిలో మహిళలకు అధిక ప్రాధాన్యత అనేది ఇస్తున్నట్లుగా గతంలోనే తెలిపారు. ఇక ఈ స్కీమ్ అనేది ప్రారంభించిన 20 రోజులలోనే దేశవ్యాప్తంగా సుమారు 5.24 లక్షల మంది కూడా దరఖాస్తు చేశారు. ఇక ఇప్పుడు కిట్ కోసం అప్లై చేసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నది.

Women టూల్ కిట్ కోసం ఎలా అప్లై చేయాలి అంటే

సీఎం విశ్వకర్మ టూల్ కిట్ ఇ -వోచర్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసేందుకు,మీరు ముందుగా పీఎం విశ్వకర్మ అధికారిక వెబ్ సైట్ https://pmvishwakarma.gov.in/. ను సందర్శించాలి.
– మీరు స్కీమ్ అధికారిక వెబ్ సైట్ హోమ్ పేజీలో, ఐడి పాస్వర్డ్ సహాయంతో మీ ఖాతాను లాగిన్ చేసుకోవాలి. •ఖాతాను తెరిచిన తరువాత మీరు కొత్త పేజీకి వెళ్ళాలి.
– అక్కడ మీరు కొత్త అభ్యర్థి ఆప్షన్ ఎంపికపై క్లిక్ చేసుకోవాలి.
– దాని తర్వాత మీరు మీ రిజిస్ట్రేషన్ ఫామ్ ను జాగ్రత్తగా నిప్పుకోవాలి.
-ప్రస్తుతం మీకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
– సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి.
– ఎలా చేయటం వలన మీ పేరు పథకంలో నమోదు చేస్తారు.
-మీ వివరాలు అన్నింటిని కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాత అర్హులు అనుకుంటే అప్పుడు మీకు సంబంధించిన నగదు అనేది వస్తుంది.
– తొందరలోనే ప్రభుత్వం ఈ టూల్ కిట్ కు సంబంధించిన మొత్తాన్ని మీ ఖాతాలో జమ చేస్తారు…

తన ఫోన్ తీసుకున్నాడనే కోపంతో భర్తకు కరెంట్ షాక్ ఇచ్చిన భార్య..?

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్య మొబైల్ వాడకాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్న ఓ భర్తకు ఆ ఇల్లాలు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది.

భర్త ఫోన్‌ తీసుకున్నాడనే కోపంతో రగిలిపోయిన ఆమె భర్తపై దాడికి దిగింది. కరెంట్‌ షాక్‌ పెట్టి చిత్ర హింసలకు గురిచేసింది. భార్య బ్యాడ్‌ హ్యాబిట్ తగ్గించాలనుకున్న ఆ భర్త భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన బేబీ యాదవ్‌, ప్రదీప్‌ సింగ్ భార్యా భర్తలు. వారికి 14ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కాగా, బేబీ యాదవ్‌ గత కొంత కాలంగా మొబైల్‌ ఫోన్‌కు బాగా అలవాటుపడిపోయింది. గంటల తరబడి ఫోన్‌లోనే కాలం గడుపుతోందనే ఆరోపణతో ఆమె భర్త తనను పలుమార్లు మందలించాడు. అలవాటు మానుకోవాలని ఆమెను అతడు హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దానికి వారు ఆమె నుంచి ఫోన్‌ తీసుకోవాలని సలహా ఇచ్చారట. దాంతో అతడు ఆమె ఫోన్‌ను తీసుకున్నాడు. అంతే.. ప్రదీప్‌ సింగ్‌పై ఆగ్రహంతో ఆమె.. అదను చూసి అతనికి మత్తుమందు ఇచ్చింది. అనంతరం కుర్చీకి కట్టేసి విచక్షణా రహితంగా కొట్టింది. అంతటితో ఆగకుండా పలుమార్లు కరెంట్‌ షాక్‌ పెట్టింది. అడ్డుకోబోయిన తన కుమారుడిపై కూడా దాడి చేసింది.

అయితే ఎలాగోలా అమె నుంచి తప్పించుకున్న ప్రదీప్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. భార్య దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త ప్రదీప్ సింగ్ ప్రస్తుతం సైఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. కాగా, బేబీ యాదవ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బేబీ యాదవ్‌ పరారీలో ఉండడంతో ఆమె కోసం గాలిస్తున్నారు.

BREAKING: పదో తరగతి విద్యార్థిని గర్భవతిని చేసిన కామాంధుడు

పదో తరగతి విద్యార్థినిపై ఓ కామాంధుడు కన్నేసి గర్భవతిని చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్లలో చోటుచేసుకుంది. చెవెళ్లకు చెందిన కోజ్జంకి సుదర్శన్ అనే వ్యక్తికి విహాహమై ఓ పిల్లాడు కూడా ఉన్నాడు.

ఈ క్రమంలోనే పాఠశాలకు వెళ్తున్న పదో తరగతి విద్యార్థిని వెంట నిత్యం వెంటబడుతూ.. ఆమెను లోబరచుకున్నాడు. దీంతో ఆ విద్యార్థిని గర్భం దాల్చింది. దీంతో ఎక్కడ పరువుపోతుందోనని గ్రహించిన విద్యార్థిని తండ్రి గాంధీ ఆసుపత్రిలో అబార్షన్ చేయించడంతో ప్రస్తుతం ఆ బాలిక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థిని తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు కొజ్జంకి సుదర్శన్‌పై పోలీసులు ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడు ఎమ్మెల్యే కాలె యాదయ్య అనుచరుడిగా తెలుస్తోంది.

AP వాహనదారులకు అలర్ట్.. ఈ డాక్యుమెంట్ లేకుంటే జైలు శిక్ష, జరిమానా

జూన్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. ఈ నియమాలను ఎవరైనా ఉల్లంఘిస్తే.. వారికి భారీగా జరిమానా విధించడమే కాక.. జైలు శిక్ష కూడా పంసిస్తామని ఆర్టీఓ అధికారులు తెలిపారు. ఇక మైనర్లకు బండ్లు ఇస్తే.. 25 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అలానే ఇకపై డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడానికి ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన పని లేదు. ఇక ఈ రూల్స్‌ దేశవ్యాప్తంగా అంటే అన్ని రాష్ట్రాల్లో అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ వాహనదారులకు కీలక అలర్ట్‌ జారీ చేసింది ప్రభుత్వం. ఆ పత్రాలు లేకుండా.. రోడ్ల మీదకు వస్తే.. జరిమానా విధించడంతో పాటు.. జైలు శిక్ష కూడా పడుతుందని హెచ్చరించింది. ఇంతకు ఆ పత్రాలు ఏవంటే..

ఏపీలోని వాహనదారులకు కీలక అలర్ట్‌ జారీ చేసింది ప్రభుత్వం. ఇకపై థర్ఢ్‌ పార్టీ బీమా లేకుండా నడిపే వాహనాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించింది. ఇందుకోసం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని.. ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక బీమా పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేయాలని సూచించింది. ఈమేరకు ఏపీ రవాణా శాఖ కమిషనర్‌.. మనీష్‌ కుమార్‌ సిన్హా.. ఆదేశాలు జారీ చేశారు. బీమా పత్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది ఏప్రిల్‌ 2న కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై రహదారి భద్రతలో భాగంగా.. వాహనాలకు తప్పనిసరిగా బీమా ఉండేలా చూడాలని ఆదేశించింది. ఈమేరకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ప్రధానంగా థర్డ్‌ పార్టీ బీమా లేని వాహనాల వల్ల ప్రమాదాలు జరిగితే.. అలాంటి ఘటనల్లో.. చనిపోయిన బాధితుల కుటుంబాలకు ఎలాంటి బీమా సాయం అందటం లేదు. ఈక్రమంలోనే కేంద్రం.. వాహనాలకు కచ్చితంగా బీమా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి తగ్గట్టుగానే ఏపీ ప్రభుత్వం ఏప్రిల్‌ 3న మెమో జారీ చేసింది. వాహనాల బీమాకు సంబంధించి తరచుగా మోటారు వాహన ఇన్‌స్పెక్టర్‌ తరచుగా తనిఖీలు చేయాలంటూ.. తాజాగా ఆర్‌జేటీసీలు, డీటీఓలకు కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు. బీమా లేకుండా పట్టుబడే వాహనదారులకు అవగాహన కల్పించాలని ఆదేశాల్లో ప్రస్తావించారు. అంతేకాక బీమా లేకుండా పట్టుబడిన వాహనదారుడిపై మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దీని ప్రకారం.. ఇకపై బీమా లేకుండా తొలిసారి పట్టుబడే వాహనదారుడికి 3 నెలల వరకు జైలు శిక్ష లేదా 2 వేల రూపాయల జరిమానా విధిస్తారు. కొన్ని కేసుల్లో జైలు శిక్ష, జరిమానా రెండు విధించే అవకాశం ఉంది. ఒకవేళ మళ్లీ దొరికిపోతే.. మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా.. 4 వేల రూపాయలు ఫైన్‌ విధిస్తారు. అలానే కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంది.

T20 World Cup 2024: టెన్షన్‌లో బౌలింగ్ టీం.. టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ కొత్త రూల్‌..

T20 World Cup 2024: T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభానికి మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. ఐసీసీ ఈ మెగా ఈవెంట్ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. 2007లో మొదలైన ఈ మినీ వరల్డ్ వార్ ఇప్పటికే 8 ఎడిషన్స్ పూర్తి చేసుకుని 9వ సీజన్‌లోకి అడుగుపెట్టింది.

గత 8 ఎడిషన్లలో, ICC ఈ మోడల్‌లో అనేక కొత్త నిబంధనలను అనుసరించింది. అందుకు తగ్గట్టుగానే ఈసారి కూడా కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. ఆ నియమమే స్టాప్ క్లాక్ రూల్.

T20 ప్రపంచకప్‌లో నిర్ణీత సమయంలో తమ ఓవర్లను పూర్తి చేయని జట్లకు ఈ నియమం ఖచ్చితత్వంతో కూడుకున్నది. ప్రయోగాత్మకంగా ఈ నిబంధన విజయవంతం కావడంతో ఈ వరల్డ్ కప్ నుంచి వైట్ బాల్ ఫార్మాట్‌లో స్టాప్ క్లాక్ రూల్‌ని ఉపయోగించాలని ఐసీసీ నిర్ణయించింది.

స్టాప్ క్లాక్ నియమం ఏమిటి?

ఈ నియమం ప్రకారం, రెండు ఓవర్ల మధ్య, ఒక జట్టు తర్వాతి ఓవర్ ప్రారంభించడానికి 60 సెకన్లు ఇవ్వనున్నారు. ఈ టైం వ్యవధిలో బౌలింగ్ జట్టు తదుపరి ఓవర్‌ను ప్రారంభించాలి. ఒక ఓవర్ ముగిసిన వెంటనే, థర్డ్ అంపైర్ ఈ నిబంధనను అమలు చేస్తాడు. ఈ గడువులోపు ఓవర్ ప్రారంభం కాకపోతే, ఆన్-ఫీల్డ్ అంపైర్ బౌలింగ్ జట్టుకు రెండు హెచ్చరికలు జారీ చేస్తాడు. మూడవ హెచ్చరికపై ఐదు పరుగుల పెనాల్టీ విధించబడుతుంది. ఈ పరుగులు బ్యాటింగ్ జట్టు ఖాతాలో చేరతాయి.

డి. 23 ట్రయల్ రన్‌గా..

ఐసీసీ డిసెంబర్ 2023 నుంచి వైట్ బాల్ ఫార్మాట్‌లో ఈ నిబంధనను అమలు చేసింది. ఈ నియమం మ్యాచ్ సమయంలో 20 నిమిషాల సమయాన్ని ఆదా చేస్తుంది. ఇది విజయవంతం కావడంతో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా ఈ నిబంధనను అమలు చేస్తోంది.

ఈ సందర్భంలో ఈ నియమం వర్తించదు..

నిజానికి మ్యాచ్ సమయంలో కొన్ని సందర్భాల్లో ఈ నిబంధనను ఉపయోగించరు. అయితే, ఈ నిబంధనను ఉపయోగించాలా వద్దా అనేది పూర్తిగా థర్డ్ అంపైర్‌పై ఆధారపడి ఉంటుంది. క్రిజ్‌లోకి కొత్త బ్యాట్స్‌మెన్ వచ్చినప్పుడు ఈ నియమం వర్తించదు. అధికారిక పానీయాల విరామం సమయంలో కూడా ఈ నియమం మినహాయించబడుతుంది. బ్యాట్స్‌మన్ లేదా ఫీల్డర్‌కు గాయం అయినప్పుడు లేదా ఫీల్డింగ్ జట్టు సమయం కోల్పోకుండా ఉంటే ఈ నియమం పరిగణనలోకి తీసుకోబడదు.

Eye Sight : ఎండవేడికి పెరుగుతున్న డ్రై ఐ సిండ్రోమ్ బాధితులు. కంటి చూపులో ఈ సమస్యలు..!

Eye Sight : ప్రస్తుతం మన దేశంలోనే చాలా ప్రాంతాలలో విపరీతమైన వేడిని ఎదుర్కొంటున్నాము. అలాగే దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటున్నాయి.

వేడితో పాటుగా వడగల్పులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. దీనివలన ప్రజలు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటున్నది. హిట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ కడుపుకు సంబంధించిన కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ వేడి కారణం వలన ప్రజలు కూడా డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. ఈ డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడిన వ్యక్తులకు సమయానికి చికిత్స చేయకపోతే కళ్ళు దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. కావున డ్రై ఐ సిండ్రోమ్ అంటే ఏమిటి. దానిని ఎలా నివారించవచ్చు. వైద్యులు చెప్పిన సలహా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వైద్యులు చెప్పిన ప్రకారం చూస్తే అధిక వేడి కారణం వలన కంటికి సంబంధించిన వ్యాధి డ్రై ఐ సిండ్రోమ్ బారిన ఎక్కువగా పడుతున్నారు. ఇది కళ్ళల్లో తగినంత ద్రవం ఉత్పత్తి కానప్పుడు సంభవిస్తుంది. దీనివల్ల కళ్ళు పొడి వారి దురదగా ఉంటాయి. సకాలంలో దీనికి చికిత్స గనుక చేయకపోతే దృష్టి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి సంబంధించిన కేసులు చాలా ఎక్కువగా ఆసుపత్రులకు వస్తున్నాయి…

ఈ విషయంపై ఢిల్లీలో సర్ గంగారావు హాస్పిటల్ లోని కంటి విభాగం హెచ్ ఓ డి ప్రొఫెసర్ డాక్టర్ ఎకే గ్రోవర్ మాట్లాడుతూ, ప్రస్తుతం చాలా మంది రోగులు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. హీట్ వేవ్ విపరీతమైన వేడి కారణం వలన ఇది జరుగుతుంది. ఎండలో ఎక్కువసేపు ఉండేవారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కళ్ళల్లో మంట, కళ్ళల్లో తేమ తగ్గటం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వేడి కారణం వలన టియర్ ఫిల్మ్ అనేది ఎండిపోతుంది అని డాక్టర్ గ్రోవర్ తెలిపారు. దీనితో కళ్ళు వాచిపోవడం, తేమ తగ్గటం,కళ్ల వాపులు రావడం లాంటి వాటిని డ్రై ఐ సిండ్రోమ్ అంటారు. విపరీతమైన వేడి కారణం వలన కార్నియల్ బర్న్ కూడా వస్తుంది. దీంతో చూపు అనేది మనదిగించే సమస్య కూడా వస్తుంది. ఈ సమస్యలకు సకాలంలో చికిత్స అనేది అందించకపోతే కంటికి నష్టం అనేది జరిగే ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పటికే కంటి సమస్యలు ఉన్నవారి దృష్టికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సూర్య రశ్మి నేరుగా కంటిపై పడటం వలన ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు. సూర్యుడి అతినీలలోహిత కిరణాలు కళ్ల పై పడినప్పుడు ఈ కార్నియా ను కూడా ప్రభావితం చేస్తుంది. అప్పుడే కార్నియల్ బర్న్ కు కారణం అవుతుంది. ఇది కళ్ల కు ఎంతో తీవ్రమైన హాని కలిగిస్తుంది.
Eye Sight కళ్ళను ఎలా రక్షించుకోవాలి అంటే

1. బయటికి వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ ను తప్పనిసరిగా ధరించాలి.
2. చల్లరి నీళ్లతో కళ్ళను కడుక్కోవాలి.
3. వైద్యులను సంప్రదించిన తర్వాత కంటిలో ఐ డ్రాప్స్ ను ఉపయోగించాలి.
4. ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు…

Viral News: అక్కడ హౌస్ కీపర్‌కి కోట్లలో జీతాలు.. అయినా పని మనుషులు దొరకరు.. కారణం ఏమంటే?

లక్షలు, కోట్ల జీతంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే ఉద్యోగం రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మార్కెట్‌లో అలాంటి ఉద్యోగాలు దొరుకుతాయన్నది నిజమే..

కానీ అందరూ వాటిని పొందలేరు. సాధారణంగా ఏదో ఒక పనిలో నిష్ణాతులైన వారు, మంచి కాలేజీల్లో చదివి ఏళ్ల తరబడి అనుభవం ఉన్నవారు మాత్రమే కోట్లలో జీతాలు పొందుతారని ఓ నమ్మకం. అయితే హౌస్‌కీపర్ అంటే ఇంటిపని చేసేవారికి కూడా ఉద్యోగస్తుల కంటే జీవితం ఎక్కువగా ఉంటె ఎలా ఉంటుందో ఊహించుకోండి.. అది కూడా హౌస్ కీపింగ్ పనికి కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటుంటే.. వినడానికే షాక్ ఇస్తున్నది కదా ఈ న్యూస్.. అవును ప్రస్తుతం అలాంటి రెండు ప్రదేశాలు వార్తల్లో ఉన్నాయి. ఇక్కడ గృహనిర్వాహకులకు కూడా కోట్లలో జీతాలు లభిస్తున్నాయి.

ఈ ప్రదేశాలు వెస్ట్ పామ్ బీచ్, బోకా రాటన్. ఈ రెండు ప్రదేశాలు అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నాయి. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం ఈ రెండు ప్రదేశాలలో చాలా ధనవంతులు నివసిస్తున్నారు. ఈ సంపన్నులు తమ ఇళ్లలో హౌస్ కీపింగ్ ఉద్యోగాలు చేసే వ్యక్తులకు సంవత్సరానికి 1.5 లక్షల డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 1 కోటి 25 లక్షల వరకు జీతాన్ని చెల్లిస్తున్నారు. అంతే కాదు ఆ ఉద్యోగి ఓవర్ టైం పనిచేస్తే, దానికి కూడా అదనపు జీతం ఇస్తారు. దీంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కూడా అందుతాయి.. ఈ సౌకర్యాలలో ఆరోగ్య బీమా కూడా ఉంటుంది. అయితే ఇంత జీతం చేల్లిస్తున్నా, ఇన్ని సౌకర్యాలు అందిస్తున్నా ఇక్కడ నివసించే ధనవంతులకు ఇంట్లో పని చేసే వారు దొరకడం లేదు.

ఇంటి పనులు చేసుకునే వారికి గిరాకీ..

సిబ్బంది ఏజెన్సీల ప్రకారం హౌస్‌కీపర్‌ల డిమాండ్ ఇక్కడ బాగా పెరిగింది. 2020 సంవత్సరంలో హౌస్‌కీపర్‌ల జీతం గంటకు సుమారు $25 ఉండగా.. ఇప్పుడు అది $45 నుంచి $50కి పెరిగింది. పామ్ బీచ్, మియామి, న్యూయార్క్ వెలుపల సేవలందిస్తున్న వెల్లింగ్‌టన్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు ఏప్రిల్ బెరూబ్ మాట్లాడుతూ హౌస్‌కీపర్‌లను నియమించాలనే డిమాండ్ గత 30 ఏళ్లలో నేను చూడని డిమాండ్‌లా ఉందని అన్నారు. ముఖ్యంగా పామ్ బీచ్, మయామిలో హౌస్‌కీపర్‌ల డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది.

ఇక్కడ లక్షాధికారులు మాత్రమే నివాసం

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం పామ్ బీచ్ ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాల్లో ఒకటి. అక్కడ నివసించే ప్రతి వ్యక్తి కోట్ల, బిలియన్ల విలువైన నగరాల్లో ఒకటి. ఇక్కడ ఇళ్ల సగటు ధర రూ.12 కోట్లకు పైగానే ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ఇక్కడే రిసార్ట్ ఉంది. అంతేకాదు చాలా మంది ప్రసిద్ధ వ్యక్తులు ఇక్కడ నివసిస్తున్నారు.

Anjali: థాంక్యూ బాలకృష్ణ… ట్రోలర్స్‌కు లాగిపెట్టి కొట్టినట్టు స్టేట్మెంట్ ఇచ్చిన అంజలి

Anjali Reacts On Balakrishna Controversy: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ భీభత్సమైన పబ్లిసిటీ తెచ్చింది. రీజనల్ నుంచి నేషనల్ మీడియా వరకు ఒక్కటే వీడియో వైరల్ అయ్యింది.

సోషల్ మీడియాలో సంగతి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అంజలిని బాలకృష్ణ అలా తోసేయడం ఏమిటని నెటిజనులు అంతా ఆడిపోసుకున్నారు. ఆయనకు మర్యాద లేదని బాలీవుడ్ డైరెక్టర్ ఒకరు కామెంట్ చేశారు. అయితే, బాలకృష్ణను ట్రోల్ చేసే జనాలు అందరికీ చెంప చెళ్ళుమనేలా అంజలి ట్వీట్ చేశారు.

థాంక్యూ బాలకృష్ణ… నవ్వులతో కూడిన వీడియో!
అంజలిని బాలకృష్ణ పక్కకు తోసిన విజువల్స్ మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే… ఈవెంట్ మొత్తంలో తామిద్దరం ఉన్న విజువల్స్ అంజలి ట్వీట్ చేశారు. తోసిన తర్వాత హైఫై కొట్టిన వీడియో కూడా అందులో యాడ్ చేశారు. ఇంకా ఆవిడ ఏమన్నారంటే?

”గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు విచ్చేసిన బాలకృష్ణ గారికి థాంక్స్. మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి పరస్పర గౌరవం ఉంది. చాలా రోజుల నుంచి మా మధ్య మంచి స్నేహం ఉంది. ఆయనతో మరోసారి స్టేజి షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతి” అని అంజలి పేర్కొన్నారు.

TTD: శుభవార్త చెప్పిన టీటీడీ..ఇక నుంచి వారికి ఉచిత దర్శనం!

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు స్వామి వారి కొండకు తరలి వస్తుంటారు. చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు స్వామి వారిని చూసేందుకు వెయ్యి కళ్లతో వస్తుంటారు.

ఇదిలా ఉంటే స్వామి వారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు టీటీడీ ఓ శుభవార్త చెప్పింది.

తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌ విషయంలో టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎటువంటి టెన్షన్​ లేకుండా నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం వారి కోసమే రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్​ ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది.

ఆలయం బయట గేట్ వద్ద పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంటుందని టీటీడీ వివరించింది. వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని.. ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని బయటకు రావొచ్చని తెలిపారు.

అలాగే దర్శనం చేసుకునే వృద్ధులు, దివ్యాంగులు రూ.20 చెల్లించి రెండు లడ్డూలను తీసుకొచ్చాని టీటీడీ పేర్కొంది.

ఎవరు అర్హులు:

వృద్ధులకు వయసు 65 సంవత్సరాలు పూర్తై ఉండాలి.

దివ్యాంగులు, ఓపెన్ హార్ట్​ సర్జరీ, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా లక్షణాలున్న ఉన్న వ్యక్తులు కూడా తిరుమల ఉచిత దర్శనం చేసుకోవచ్చని అధికారులు వివరించారు.

ఒకవేళ వృద్ధులు వాళ్లకై వాళ్లే నిలుచోలేని పక్షంలో ఒక వ్యక్తికి అనుమతి ఉంటుందని.. అటెండర్‌గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి ఉంటుంది.

కావాల్సిన పత్రాలు:

ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.

దివ్యాంగులు తప్పనిసరిగా వారి ఐడీ కార్డుతో పాటు.. ఫిజికల్ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకురావాలి.

వృద్ధులు, దివ్యాంగులు కాకుండా పైన తెలిపిన ఆరోగ్య సమస్యలు ఉన్న వారు సంబంధిత సర్జన్ / స్పెషలిస్ట్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో రావాలి.

స్లాట్ ఇలా బుక్ చేసుకోవాలి: వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనం స్లాట్ కోసం టికెట్‌ను ఆన్​లైన్​లో తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్​సైట్​ ద్వారా బుక్​ చేసుకోవాలి. అందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ముందుగా టీటీడీ వెబ్​సైట్​ Tirumala Tirupati Devasthanam(Official Booking Portal)ఓపెన్​ చేయాలి.
హోమ్​పేజీలో Online Services​ ఆప్షన్​పై క్లిక్​ చేసి Differently Abled/Sr.Citizen Darshan ఆప్షన్​పై క్లిక్​ చేసుకోవాలి.
తర్వాత మొబైల్​ నెంబర్​, ఓటీపీ సాయంతో లాగిన్​ అవ్వాలి.

ఇప్పుడు Category ఆప్షన్​లో Senior Citizen/Medical Cases/Differently Abled ఈ మూడింటిలో ఒక ఆప్షన్​ను సెలక్ట్​ చేసుకోవాలి.
తర్వాత మీరు ఏ రోజు స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ తేదీని ఎంచుకోవాలి.
తర్వాత మిగిలిన వివరాలు నమోదు చేసి టికెట్​ బుక్​ చేసుకోవాలి.

Shocking incident: కడుపా.. బార్బర్ షాపా..!? డాక్టర్లే షాక్!

మధ్యప్రదేశ్ వైద్యులకు ఒక షాకింగ్ సంఘటన ఎదురైంది. ఎన్నడూ చూడలేని అరుదైన దృశ్యం ప్రత్యక్షం కావడంతో వైద్యులే నివ్వెరపోయారు. అసలేం జరిగింది. డాక్టర్లే షాకైన ఆ సంఘటన ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోని కుంద్ సద్గురు హాస్పిటల్ వైద్యులు ఓ మహిళకు శస్త్ర చికిత్స చేశారు. అయితే ఆమె కడుపులో ఉన్న తల వెంట్రుకల ముద్దను చూసి షాక్ అయ్యారు. దాదాపు 2.5 కిలోల జుట్టును బయటకు తీశారు. అయితే ఈ వ్యాధిని వైద్య పరిభాషలో ట్రైకోబెజోర్ అని పిలుస్తారని డాక్టర్ గెహానీ పేర్కొన్నారు. ఆమెకు రెండో సారి డెలివరీ అయ్యాక హెయిర్ తినడం ప్రారంభించింది. ట్రైకోబెజోర్ వ్యాధి ఉన్నవారు ఇలా చేస్తారని తెలిపారు. ఈ వ్యాధి ఒక శాతం మందిలో కనిపిస్తోందని డాక్టర్ చెప్పారు.

ఇటీవల బాధితురాలు తీవ్రమైన నొప్పితో బాధపడుతుండగా వైద్యుల్ని సంప్రదించింది. డాక్టర్లు స్కాన్ చేస్తే ఈ ఘటన బయటపడింది. ఆమె తన జుట్టుతో పాటు ఇతరుల వెంట్రుకలు కూడా తిన్నట్టుగా గుర్తించారు. సీనియర్ వైద్యురాలు డాక్టర్ నిర్మలా గెహానీ ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులోంచి 2.5 కిలోల వెంట్రుకలను బయటకు తీశారు. మహిళ యూపీలోని మహోబా నివాసి అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ముగ్గురు పిల్లలను కలిగి ఉన్న మహిళ తన మూడవ గర్భధారణ సమయంలో జుట్టు తినడం ప్రారంభించిందని డాక్టర్ గెహానీ చెప్పారు. CT స్కాన్ చేయమని సలహా ఇచ్చినప్పుడు ఆమె వ్యాధి బయటపడింది.

షాకింగ్ ఘటన : మాజీ ప్రియురాలిని 20 సార్లు కత్తితో పొడిచిన హీరో

హాలీవుడ్‌లో సంచలన ఘటన చోటు చేసుకుంది. నటుడు నిక్ పాస్క్వల్ (34) తన మాజీ ప్రియురాలిని, ఆమె నివాసంలోనే 20 సార్లు కత్తితో పొడిచి హత్యాయత్నం చేసినట్లు సమాచారం.

లాస్ ఏంజిల్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్ని ఆఫీస్ వెళ్లడించిన సమాచారం ప్రకారం. నటుడు తన ప్రియురాలిపై హత్యాయత్నం చేశారని, తర్వాత ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు వారు తెలిపారు. కానీ ఆయనను పోలీసులు టెక్సాస్‌లోని US-మెక్సికో సరిహద్దు చెక్‌పాయింట్ వద్ద పట్టుకున్నారు. అయితే ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 4.30 నిమిషాలకు షెహార్న్ నివాసంలో జరిగింది. నటుడు ఆమె ఇంటిలోకి చొరబడి తనపై పలు కత్తిపోట్లతో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను తన సన్నిహితులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇక గోఫండ్‌మీ పేజీలో హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ అల్లీ షెహార్న్ అని పిలువబడే బాధితురాలు ఇటీవల పాస్‌వాల్‌పై నిషేధాజ్ఞను పొందిందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

ఇక ఘటన జరిగిన వెంటనే అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నటుడు గృహ హింసలో భాగంగా బాధితురాలిని తీవ్రంగా గాయపరిచాడని, తన భాగస్వామినే కాకుండా ఇంటి సభ్యుునికి గాయం చేయడం లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇవి నిజం అయితే ఆయనకు జీవిత ఖైదు శిక్ష పడే చాన్స్ ఉన్నదంటున్నారు కొందరు.

గుడ్ న్యూస్ చెప్పిన ప్రముఖ బ్యాంక్.. ఇక వినియోగదారులకు పండగే!

SBI Fix Deposit Scheme: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది అకౌంట్లు కలిగివున్న బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). అందువల్ల ఈ బ్యాంక్‌లో వడ్డీ రేట్లు మార్చితే, వాటి ప్రభావం వినియోగదారులందరిపైనా ఉంటుంది.

అందువల్ల తాజాగా ఆ బ్యాంక్ వడ్డీ రేట్లలో మార్పులు చెయ్యడంతో.. ఆ ప్రభావం కస్టమర్లపై కనిపించనుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై SBI వడ్డీ రేట్లను మార్చింది. తద్వారా వినియోగదారులు మరింత ఎక్కువగా వడ్డీ పొందేలా చేస్తోంది. ఉదాహరణకు 180 రోజుల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ వేసుకుంటే.. దానిపై వడ్డీ 6.50 శాతం ఇస్తోంది. తాజాగా ఈ రేట్లలో మరిన్ని మార్పులు చేసింది. ముఖ్యంగా రూ.2 కోట్ల కంటే తక్కువగా FD చేసిన వారికి వడ్డీ రేట్ల మార్చింది.

సామాన్య కస్టమర్లకు SBI వడ్డీ రేట్లను పరిశీలిస్తే…

7 నుంచి 45 రోజులకు వడ్డీ రేటు 3.50 శాతంగా ఉండేది. ఇది ఇప్పుడు 4 శాతం అయ్యింది.

46 నుంచి 179 రోజులకు వడ్డీ రేటు 5.50 శాతంగా ఉండేది. ఇది ఇప్పుడు 6 శాతం అయ్యింది.

180 నుంచి 210 రోజులకు వడ్డీ రేటు 6 శాతంగా ఉండేది. ఇది ఇప్పుడు 6.50 శాతం అయ్యింది.

211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువకు వడ్డీ రేటు 6.25 శాతంగా ఉండేది. ఇది ఇప్పుడు 6.75 శాతం అయ్యింది.

1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు పెట్టుబడి పెడితే వడ్డీ రేటు 6.80 శాతంగా ఉండేది. ఇది ఇప్పుడు 7.30 శాతం అయ్యింది.

2 సంవత్సరాల నుంచి 3 ఏళ్ల లోపు పెట్టుబడి పెడితే వడ్డీ రేటు 7 శాతంగా ఉండేది. ఇది ఇప్పుడు 7.50 శాతం అయ్యింది.

3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు పెట్టుబడి పెడితే వడ్డీ రేటు 6.75 శాతంగా ఉండేది. ఇది ఇప్పుడు 7.25 శాతం అయ్యింది.

5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పెట్టుబడి పెడితే వడ్డీ రేటు 6.50 శాతంగా ఉండేది. ఇది ఇప్పుడు 7.50 శాతం అయ్యింది.

ఇలా వడ్డీ రేట్లను పెంచింది కాబట్టి.. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనీ దాచుకునే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు కూడా రిస్క్ వద్దనుకొని SBIలో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి.

Amaravati: ఇంతలో ఎంత మార్పు! అమరావతి నుంచి సామగ్రి తరలింపుపై సీఆర్డీఏ అధికారుల స్పందన

అమరావతి – తుళ్లూరు : రాజధానిలో రోడ్లు తవ్వుకుపోతున్నా.. ఏమాత్రం స్పందన లేదు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో మట్టిని తీసుకెళ్తున్నా… అడ్డుకోలేదు. నిర్మాణాల నుంచి ఇనుప సామగ్రిని దొంగిలించుకెళ్తున్నా.. ఫిర్యాదు చేసిన పాపాన పోలేదు. ఉద్దండరాయునిపాలెంలోని ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన స్థలంలో అమరావతి ప్రణాళిక నమూనాలను ధ్వంసం చేసినా.. ఉలుకూపలుకూ లేదు. రాజధానిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెంబడి వేయాల్సిన భారీ తాగునీటి పైపులను అనుమతి లేకుండానే గుత్త సంస్థ పట్టుకెళ్తున్నా.. సంబంధం లేనట్లు ఊరుకున్నారు… గత ఐదేళ్లలో ఇదీ సీఆర్డీఏ అధికారుల వ్యవహార శైలి. అమరావతికి వ్యతిరేకంగా సీఎం జగన్‌ వ్యవహరిస్తుండటంతో.. సీఆర్డీఏ అధికారులూ ఇందుకు తగ్గట్లే నడుచుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు మినహా మిగిలిన వాటిని పూర్తిగా గాలికొదిలేశారు. అలాంటి అధికారులు గురువారం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. మందడంలోని నిల్వ కేంద్రం నుంచి ఎల్‌ అండ్‌ టీ సంస్థ… వ్యాపారులకు విక్రయించిన సరకును ఆఘమేఘాలపై వెనక్కి రప్పించి, అన్‌లోడింగ్‌ చేయించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ప్రచారం ఉన్న సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌.. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఆయన స్పందించి ఇంజినీరింగ్‌ అధికారులను హుటాహుటిన పంపించారు. ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతుండటం.. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుండటమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. కూటమి అధికారం చేపడితే.. అమరావతికి ప్రాధాన్యం ఇస్తారనే సంకేతాలతో సీఆర్డీఏ అధికారులు వెంటనే స్పందించినట్లు తెలిసింది.

అమరావతిలో భూగర్భ కేబుళ్లకు అమర్చే ప్లాస్టిక్‌ స్పేసర్లను ఎల్‌ అండ్‌ టీ సంస్థ దిల్లీకి చెందిన ఓ వ్యాపారికి తుక్కు కింద విక్రయించింది. ఆరేళ్లుగా వీటిని మందడం సమీపంలోని ఏజెన్సీ కేంద్రంలో నిల్వ ఉంచింది. నిరుపయోగంగా ఉన్న వీటిని తుక్కు కింద అమ్మింది. ఈ లోడ్‌తో వెళ్తున్న కంటెయినర్‌ తరలిపోతోందని ‘ఈనాడు’ ప్రధాన సంచికలో గురువారం ‘అమరావతి నుంచి తరలిపోతున్న సామగ్రి’ శీర్షికన వచ్చిన కథనానికి సీఆర్డీఏ అధికారులు.. తమ సహజశైలికి భిన్నంగా స్పందించారు. గురువారం ఉదయం నుంచే రాజధానికి ఉరుకులు పరుగులు పెట్టారు. సీఈ నుంచి ఏఈ వరకు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్లాస్టిక్‌ స్పేసర్లను తీసుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే ఎల్‌ అండ్‌ టీ సంస్థ అధికారులతో మాట్లాడి తరలిన లోడ్‌ను వెనక్కి తెప్పించారు. సీఆర్డీఏతో చేసుకున్న ఒప్పందాన్ని ఎల్‌ అండ్‌ టీ ఉల్లంఘించినట్లు తేల్చారు. తెదేపా ప్రభుత్వ హయాంలో భూగర్భంలో కేబుళ్లు వేసే పనులను ఈ సంస్థ దక్కించుకుంది. పనులు పూర్తయ్యాక చెల్లింపులు చేసేలా సీఆర్డీఏతో ఒప్పందం కుదిరింది. పనులు పూర్తి కాలేదు కాబట్టి గుత్తేదారు అజమాయిషీలోనే సామగ్రి ఉండాలి. సీఆర్డీఏకు చెప్పకుండా సామగ్రిని తరలించకూడదు. ఈ నేపథ్యంలో బయలుదేరిన కంటెయినర్లను వెనక్కి రప్పించారు. ఇటీవల రాజధాని నుంచి మేఘా సంస్థ తరలించిన విద్యుత్తు కేబుళ్ల డ్రమ్‌ల సామగ్రి సీఆర్డీఏ పనులకు సంబంధించినవి కాదని గుర్తించారు. లైన్లు మార్చేందుకు గతంలో ఏపీ ట్రాన్స్‌కోతో మేఘా సంస్థ ఒప్పందం కుదర్చుకుంది. దీనిని ఇటీవల గుత్తసంస్థ రద్దు చేసుకున్నట్లు సమాచారం.

సీఆర్డీఏ నుంచి వెళ్లే ప్రయత్నాలు
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందనీ, చంద్రబాబు సీఎం కానున్నారనీ విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీంతో సీఆర్డీఏలో ఇప్పటి వరకు అధికార వైకాపాతో అంటకాగిన అధికారులు ఇక్కడి నుంచి బయటపడేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఎన్డీయే వస్తే తమకు ఇబ్బందులు తప్పవన్న ఆందోళనలో వీరు ఉన్నట్లు తెలిసింది. ఇటీవల ప్లానింగ్‌ విభాగం అధికారి ఒకరు… తన పలుకుబడిని ఉపయోగించి మరో శాఖకు వెళ్లిపోయారు. ఇదే ప్రయత్నాల్లో పలువురు అధికారులు ఉన్నట్లు సమాచారం.

AP Govt: ఏబీవీని సర్వీసులోకి తీసుకోవాలి.. ఏపీ సీఎస్‌ ఆదేశాలు

AP Govt: ఏబీవీని సర్వీసులోకి తీసుకోవాలి.. ఏపీ సీఎస్‌ ఆదేశాలు

అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)ను సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఎత్తివేసింది. ఇవాళే ఏబీ వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాసేపట్లో పోస్టింగ్‌కు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వనుంది.

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ఉన్న సస్పెన్షన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేయనుంది. ఐదేళ్ల క్రితం జగన్ సర్కార్ ఏర్పడిన వెంటనే ఏవీబీపై కక్షగట్టింది. ఏబీవీని సస్పెండ్ చేసింది. దాంతో ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. క్యాట్ ఉత్తర్వులను జగన్ సర్కార్ హైకోర్టులో సవాల్ చేసింది. ఆ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతో ఏపీ సర్కార్ ఏబీవీపై ఉన్న సస్పెన్షన్ ఎత్తి వేయాలని నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్ల నుంచి ఏబీవీ సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ రోజు ఏబీవీ చివరి వర్కింగ్ డే.. రిటైర్మెంట్ డే రోజున విధుల్లోకి రానున్నారు. ఆ వెంటనే పదవీ విరమణ చేస్తారు. మొత్తానికి ఇలా జగన్ సర్కార్ ఏవీ వెంకటేశ్వర రావు చివరి పని దినం రోజున కొలువు ఇచ్చి తన పైశాచిక ఆనందాన్ని చాటుకుంది.

AB Venkateswara Rao: ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం..
అమరావతి: కాసేపటి క్రితం సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్ట్ ఉత్తర్వులు మేరకు ఈ రోజు ఉదయం వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పోస్టింగ్ ఇచ్చింది. కొద్దిసేపట్లో ఏబీ వెంకటేశ్వరరావు ఛార్జ్ తీసుకోనున్నారు. తిరిగి ఈ రోజు సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు.

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై కేసు

అమరావతి: వైకాపా ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)పై కేసు నమోదైంది. కౌంటింగ్‌ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తెదేపా నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు.

వైకాపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘మన టార్గెట్‌ ఇదీ అని దృష్టిలో పెట్టుకుని… దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. అవతలివారు (ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి) అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏవేం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలి. అంతే తప్ప రూల్‌ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదాం అని మనం కూర్చోకూడదు.

మనకు అనుకూలంగా, అవతలివాళ్ల ఆటలు సాగకుండా రూల్‌ని ఎలా చూసుకోవాలి? అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్‌ చేయాలనేది నేర్చుకుందాం. ఇందులో కౌంటింగ్‌ ఏజెంట్‌ తనవంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి మీరు (చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్లు) బాగా ఎక్కించాలి. పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు. కానీ, రూల్‌ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్‌గా వద్దు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై తెదేపా నేతలు ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

మీపై మీరు విజయం సాధిస్తారు ఇలా చేస్తే…

చాలామంది సంకల్పబలం, క్రమశిక్షణల గురించి ఓ అరగంట ప్రసంగించమంటే తడుముకోకుండా మాట్లాడతారు. కానీ వాటిని పాటించే విషయంలోనే వస్తాయి చిక్కులన్నీ. తమ దాకా వచ్చేసరికి అవి అందరికీ సాధ్యం కాదని తేల్చేస్తారు. అది పుట్టుకతోనే రావాలని చల్లగా జారుకుంటారు. అలాంటి వారికి సమాధనమే ఈ కింది విషయాలు..

దృఢనిర్ణయాలు తీసుకోవాలంటే? …

మీ మానసిక బలాన్ని పరీక్షించుకొని, పెంపొందించుకొనే మార్గాల్లో ముఖ్యంగా ప్రతి నిత్యం జీవితంలో కొన్ని ఇష్టం లేని, కష్టంగా కనిపించే పనుల్ని చేయడం ఒకటి. అలా తరచూ సాధన చేయాలి. వీటి వల్ల ప్రయోజనాలు కలుగుతాయని తెలిసినా మీ మనసు ఆ పనుల్ని ఏదో ఒక వంకతో వ్యతిరేకిస్తూనే ఉంటుంది. అయినా సరే ఆ పనులు చేయాలి. అలా చేయడం ద్వారా మీ మెదడులో నిక్షిప్తమైన వ్యతిరేక భావాలను అధిగమించగలుగుతారు. అంతర్గతంగా ఉన్న వ్యతిరేక శక్తులను అధిగమించడం ద్వారానే మనకు అవసరమైన అంతర్గత శక్తిని మేల్కొల్పగలం.

ఉదాహరణకు మీరు బస్సులో ప్రయణిస్తున్నారనప్పుడు సీటు దొరికితే హాయిగా కూర్చుంటారు, లేకపోతే తప్పదు కాబట్టి నిలబడి ప్రయాణిస్తారు. ఒకవేళ మీకు సీటు దొరికినా సరే ఆ సీటును ఇంకొకరికి ఇవ్వండి. ఓ పదిహేను లేదా ఇరవై నిమిషాలు నిలబడి ప్రయాణించండి. ఈ చిన్న విషయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మీలోని మానసిక నిరోధ భావాలను గమనించండి. అయినా మనస్సు మాట వినకుండా ఇంకొకరికి ఆ సీటు ఇచ్చి, ప్రయాణం చేయండి. ఆ తరువాత చూడండి. మీరు ఈ నిరోధ భావాల నుంచి బయటపడడానికి చేసిన సంఘర్షణ, చివరికి సాధించడం చూస్తే మీలో మీకే తెలియని ఆత్మవిశ్వాసం, ధైర్యం కలుగుతాయి.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునుడితో మానసిక దౌర్బల్యాన్ని జయించాలని చెబుతూ ఎవరికైనా మనస్సును అదుపులో ఉంచుకోవడం దుస్సాధ్యమే, కానీ అభ్యాస, వైరాగ్యాల ద్వారా దాన్ని సాధించవచ్చని బోధిస్తాడు.

మీ ఇంట్లోని వారికి వారి పనుల్లో ఎప్పుడైనా సహాయం చేశారా?

ఈసారి ఈ విధంగా ప్రయత్నించండి! నేరుగా వంటింట్లోకి వెళ్ళి అమ్మతో “అమ్మా! నేను ఏదైనా సహాయం చేయనా?” అని అడగండి, ఎప్పుడూ ఆ మాట అడగని మీరు ఈ ప్రశ్న వేసేసరికి ఆవతలివారు కాస్త కంగారు పడి, మిమ్మల్ని కొత్తగా చూడడం సహజమే. అయినా సరే, వంటిల్లు సర్దడంలోనో, కూరలు తరగడంలోనో, గిన్నెలు కడగడంలోనో సహాయం చేయండి. అది చిన్న పనే అయినా, మీకిష్టం లేని పని చేసిన తరువాత ఒక్కసారి వారి కళ్ళలోని ఆ వెలుగును చూడండి. రెండూ మిమ్మల్ని సంకల్ప బలం వైపు నడిపిస్తాయి.

ఒక్కోసారి మీరు అలసిపోయి ఇంటికొస్తారు. రాగానే మీ శరీరాన్ని సోఫాలో పడేసి అందుబాటులో ఉన్న టీవీ రిమోట్ తీసుకొని, అలా ఎంతసేపు ఛానల్స్ మారుస్తూ కూర్చుంటారో మీకే తెలియదు. అప్పుడు స్నానం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ బద్దకం మీ కన్నా బలమైంది కాబట్టి, అది అక్కడ నుంచి లేవనీయదు. అయితే ఈ సారి మీ బద్ధకం మాట వినకండి. కష్టమైనా సరే లేచివెళ్ళండి. చేయాలనుకున్న పని వాయిదా వెయ్యకుండా చేయండి. అప్పుడు చూడండి మీపై మీకే తెలియని దృఢత్వం, ఒక నమ్మకం, ధైర్యం కలుగుతాయి. ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది.

ఒకరోజు మీరు కాఫీ, టీ, పాలల్లో చక్కెర లేకుండా తాగేందుకో లేదా కనీసం పెరుగన్నంలో ఉప్పు లేకుండా తినేందుకో ప్రయత్నించండి. మీ కన్నా ముందు మీ నాలుక ఈ ప్రయోగానికి ఒప్పుకోదు. దాన్ని జయించడానికేగా ఈ ప్రయత్నమంతా! అలాగే వేడినీళ్ళ స్నానం అలవాటున్న వాళ్ళు వరుసగా వారం రోజులు చన్నీటి స్నానం చేసి మీలోని శారీరక, మానసిక నిబ్బరాన్ని పరీక్షించి సాధించండి. చదువుకునేటప్పుడు కష్టమైన సబ్జెక్టుతో వాయిదా వేయకుండా పోరాడండి. కొన్ని మాటలు మాట్లాడే కన్నా మాట్లాడకుండా ఉంటేనే ఎక్కువ ప్రయోజనం ఉన్నప్పుడు మౌనాన్ని ఆశ్రయించండి. మీ ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోండి.

ఇలా అన్నీ ఒక్కొక్కటిగా మీ జీవితంలో ఫాలో అయ్యారంటే మీ మీద మీరు విజయం సాధిస్తారు కచ్చితంగా.

బే ఏరియాలో ఘనంగా ‘ఎన్టీఆర్‌ 101వ జయంతి’ ఉత్సవాలు

తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను బే ఏరియాలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ‘జయరాం కోమటి’ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

కాలిఫోర్నియా: తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను బే ఏరియాలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ‘జయరాం కోమటి’ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ అభిమానులు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం బే ఏరియా నుంచి ఎంతోమంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌ వెళ్లి పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా వారు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధిస్తుందని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు భక్త భల్లా, వెంకట్ కోగంటి, సుబ్బ యంత్ర, శ్రీనివాస్ వల్లూరిపల్లి, విజయ్ గుమ్మడి, సతీశ్‌ అంబటి, హరి సన్నిధి, వెంకట్ అడుసుమల్లి, లియోన్ రెడ్డి బోయపాటి, వెంకట్ మద్దిపాటి, సుధీర్ ఉన్నం, వెంకట్ జెట్టి, భరత్ ముప్పిరాళ్ల, రవి కిరణ్, నరహరి మార్నేని, హరి బాబు బొప్పూడి, వంశీ కృష్ణ నేలకుదిటి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

England: లండన్‌ ఆస్పత్రిలో కీచకపర్వం.. భారత సంతతి డాక్టర్‌పై లైంగిక అభియోగాలు

England: ఇంగ్లండ్‌లోని లంకాషైర్‌ బ్లాక్‌పూల్‌ విక్టోరియా ఆస్పత్రిలో జర్జన్‌గా పనిచేస్తున్న భారత సంతతి వైద్యుడు 54 ఏళ్ల అమల్‌ బోస్‌పై లైంగిక దాడి అభియోగాలు నమోదయ్యాయి. గతేడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆస్పత్రి బోస్‌ను సస్పెండ్‌ చేసింది. క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌(CPS)తో విచారణ తర్వాత ఆరుగురు బాధిత మహిళలు బోస్‌పై 14 లైంగిక అభియోగాలు మోపారు.

2017 నుంచి 2022 వరకు..
బోస్‌ బ్లాక్‌పూల్‌ విక్టోరియా ఆస్పత్రిలో కార్డియోవాస్కులర్‌ సర్జరీ విభాగానికి అధిపతిగా పనిచేశాడు. 2017 నుంచి 2022 మధ్య ఆస్పత్రి సిబ్బందితోపాటు, రోగులు, వారి బంధువులపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపించారు. దీంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై విడుదలయ్యాడు. కేసు విచారణ కొనసాగుతోంది. జూన్‌ 7న లాంకాస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. బోస్‌పై ఆరోపణలను బ్లాక్‌పూల్‌ టీచింగ్‌ హాస్పిటల్స్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ధ్రువీకరించింది. పోలీసుల విచారణకు సహకరిస్తామని హామీ ఇచ్చింది. సేవలు యథావిధిగా కొనసాగిస్తూ, రోగులు, కుటుంబాలకు సురక్షితమైన, సంరక్షణ వాతావరణాన్ని నిర్వహించడంలో తమ నిబద్ధతను వారు నొక్కిచెప్పారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో..
ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇదే తరహా వెలుగులోకి వచ్చింది. ఇంగ్లిండ్‌లో తన వద్ద చికిత్స తీసుకుంటున్న మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు భారత సంతతి వైద్యుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఆగ్నేయ ఇంగ్లండ్‌లోని హాంప్‌షైర్‌లోని హవంత్‌ స్టాంటన్‌ సర్జరీ లో మాజీ జనరల్‌ ప్రాక్టీషనర్‌ మోహన్‌బాబు పోర్ట్స్‌ మౌత్‌ క్రౌన్‌ కోర్టులో మూడు వారాలపాటు జరిగిన విచారణకు హాజరయ్యాడు. లైంగిక వేదింపుల 2019 సెప్టెంబర్‌ నుంచి 2021 జూలై మధ్య జరిగాయని తెలిపాడు. బాధితుల్లో 19 ఏళ్ల యువతి కూడా ఉన్నట్లు కోర్టు పేర్కొంది. అదే క్లినిక్‌లో జనరల్‌ ప్రాక్టీషనర్‌ అయిన తన భార్యతోపాటు మోహన్‌బాబు పనిచేసిన స్టాంటన్‌ సర్జరీ ప్రాంగణంలో ముగ్గురు మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. మోహన్‌బాబుపై అనేక ఫిర్యాదులు వచ్చాయని, బాధతులను అనుచితంగా తాకడం, గగుర్పాటు కలిగించే వ్యాఖ్యలు చేయడం వంటివాటిపైన ఆయనను పలుమార్లు హెచ్చరించినట్లు న్యాయ నిపుణులు పేర్కొన్నారు.

Singapore: సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తి మృతి.. వాటర్‌ ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఘటన!

Singapore: సింగపూర్‌లోని నేషనల్‌ వాటర్‌ ఏజెన్సీలో విష వాయువులు పీల్చి భారత సంతతికి చెందిన వ్యక్తి మృతిచెందాడు. మృతుడు తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్‌ శివరామన్‌గా గుర్తించారు. శివరామన్‌ సింగరూర్‌లోని సూపర్‌సోనిక్‌ మెయిటెనెన్స్‌ సర్వీస్‌లో క్లీనింగ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

ట్యాంకు క్లీన్‌ చేయడానికి వెళ్లి..
మే 23న నేషనల్‌ వాటర్‌ ఏజెన్సీ పబ్‌కి చెందిన చోవాచు కాంగ్‌ వాటర్‌ వర్క్స్‌లో భాగంగా ట్యాంకు క్లీన్‌ చేసేందుకు వెళ్లాడు. ట్యాంకులో దిగి శుభ్రం చేస్తుండగా అందులో విష వాయువులు వెలువడ్డాయి. వాటిని పీల్చుకున్న శివరమాన్‌ అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో ఇద్దరు కార్మికులు కూడా ఆస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈమేరకు సింగపూర్‌లో కార్మికులను నియమించే స్టార్‌ గ్రూప్‌ ఎస్ట్‌ కంపెనీ తెలిపింది.

హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువు..
ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో ట్యాంకులో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువు వెలువడిందని, దానిని పీల్చడంతో ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని తేల్చారు. శివరామన్‌ పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య నర్మద, ఇద్దరు కూతుళ్లు మహాశ్రీ, శ్రీనిషా, సింగపూర్‌లోని ఆహార పరిశ్రమలో పనిచేస్తున్న మోహన్‌ నవీన్‌కుమార్‌ అనే సోదరుడు ఉన్నారు.

మృతదేహం అప్పగింత..
ప్రమాదం జరిగిన రోజే కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన అధికారులు శివరామన్‌ మృతదేహాన్ని మే 26న కుటుంబ సభ్యులకు అందించారు. మంగళవారం(మే 28న) అతడి మృతదేహాన్ని తమిళనాడులోని స్వగ్రామానికి తరలించినట్లు తెలిసింది.

మలేషియా వెళ్లాలనుకుని..
వాస్తవానికి శివరామన్‌ మే 27న మలేషియా వెళ్లాలనుకున్నాడు. ఈమేరకు సెలవు కూడా తీసుకున్నాడు. అంతకు ముందురోజు రెస్ట్‌ తీసుకోవాలని కూడా భావించాడు. కానీ ఇంతలోనే మే 23న అస్వస్థతకు గురై మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

UK Royal Award: భారతీయ యువతికి లండన్‌ ప్రతిష్టాత్మక అవార్డు!

UK Royal Award: భారత్‌కు చెందిన ఓ టీనేజీ అమ్మాయి లండన్‌ ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. అది కూడా లండన్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ను కలిసి ఆయన చేతుల మీదుగా అందుకునే అరుదైన అవకాశం దక్కించుకుంది. ఎవరా యువతి.. అవార్డు ఎందుకు వచ్చింది. అనే వివరాలు తెలుసుకుందాం..

18 ఏళ్ల రిక్షా డ్రైవర్‌..
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బహ్రెచ్‌ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఆర్తి రిక్షా డ్రైవర్‌. ఆమెను లండన్‌లోని ప్రతిష్టాత్మక అమల్‌ కూన్లీ ఉమెన్‌ ఎంపవర్మెంట్‌ అవార్డు వరించింది. ఈ అవార్డును బ్రిటిష్‌ స్వచ్ఛంద సంస్థ ప్రిన్స్‌ ట్రస్టు స్పాన్సర్‌ చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఇంగ్లిష్‌ బారిస్టర్‌ అమల్‌ క్లూనీ పేరు పెట్టారు. ఆర్తి ప్రభుత్వ ఈ రిక్షా చొరవతో డ్రైవర్‌గా పనిచేసి ఇతర యువతను ప్రేరేపించింది. అందుకు లండన్‌ ప్రతిష్టాత్మక అవార్డుకు బ్రిటిష్‌ స్వచ్ఛంద సంస్థ అవార్డుకు ఎంపిక చేసింది.

పింక్‌ రిక్షా ఇనిషియేటివ్‌..
ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం 2020లో మిషన్‌శక్తి పథకాన్ని ప్రారంభించింది. రక్షణ, శిక్షణ, స్వావలంబన ద్వారా మహిళలకు సాధికారత కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద పింక్ ఈ రిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మహిళలకు ఈ రిక్షాలు నడపడంలో శిక్షణ, ట్రాపిక్ నిబంధనల గురించి సమాచారాన్ని అందిస్తుంది. వితంతువుల, ఒంటరి తల్లులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఆర్తి గతేడాది జూలైలో భారత ప్రభుత్వం పింక్‌ ఈ రిక్షా పథకాన్ని పరిచయం చేసేందుకు ముందుకు వచ్చారు. యూపీలో ఆమె తొలి పింక్‌ ఈ రిక్షా డ్రైవర్‌. చిన్న వయసులో ఆమె అందించిన గొప్ప సహకారానికి ప్రిన్స్ ట్రస్ట్ అవార్డుని తెచ్చిపెట్టింది. అసమానతలకు వ్యతిరేకంగా తన చుట్టూ ఉన్నవారిలో శాశ్వతమైన మార్పు తీసుకొచ్చేలా ప్రపంచ పనిలో విజయం సాధించిన యువతులను ఈ అవార్డుతో సత్కరిస్తుంది ప్రిన్స్‌ ట్రస్టు. ఈ ఏడాది ఆర్తిని ఎంపిక చేసింది.

తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్‌గా..
ఇక ప్రతిష్టాత్మక లండన్‌ అవార్డు గెల్చుకున్న ఆర్తి.. పింక్‌ ఈరిక్షా డ్రైవర్‌. ఆమె కూడా ఒంటరి తల్లి. దీంతో మిషన్‌ శక్తి పథకం ద్వారా శిక్షణ పొంది తొలి ఈ రిక్షా డ్రైవర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అవార్డు గెలుచుకున్న సందర్భంగా ఆర్తి మాట్లాడుతూ సవాళ్లను ఎదుర్కొనేలా ఇతర అమ్మాయిలకు స్ఫూర్తినివ్వగలిగినందుకు గర్విస్తున్నానని తెలిపింది. ఈ కొత్త స్వాతంత్ర్యం ప్రపంచాన్ని వేరే కోణంలో చూసేందుకు నన్ను అనుమతించిందని పేర్కొంది. ఇప్పుడ నేను నా కలలన మాత్రమే కాకుండా నా కుమార్తె కలలను కూడా నెరవేరుస్తాను. ఈ చొరవే నాకు బకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ చార్లెస్ ను కలిసే అవకాశం లభించేలా చేసింది అని వెల్లడించింది. ఇది ఒక అద్భుతమైన అనుభవంగా అభివర్ణించింది. ప్రిన్స్‌ చార్లెస్‌ తనకు ఈ రిక్షా డ్రైవింగ్‌పై ఉన్న ఆసక్తిని శ్రద్ధగా విన్నారని తెలిపింది. తన ఆటో రిక్షా కాలుష్యం కలిగించని వాహనం అని చార్లెస్‌తో గర్వంగా చెప్పానని ఆర్తి పేర్కొంది.

Health

సినిమా