Saturday, November 16, 2024

AB Venkateswara Rao: ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు

అమరావతి: గత ఐదేళ్లుగా జగన్‌ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) (AB Venkateswara Rao)కు పౌరసమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. #JusticeForABV పేరిట ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఏబీవీకి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ వేలాది మంది సంతకాలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన సంతకాల సేకరణకు ‘ఛేంజ్‌.ఓఆర్‌జీ’లో చక్కటి స్పందన లభిస్తోంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ఎంతో మంది ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఏబీవీకి న్యాయం చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు.

‘‘1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై జరుగుతున్న కుటిల, కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. గత అయిదేళ్లుగా ప్రభుత్వం ఆయనకు పోస్టింగు ఇవ్వలేదు. ఆయన పదవీ విరమణకు మరో 13 రోజులే ఉంది. అయినా ఇప్పటికీ విధుల్లోకి తీసుకోవట్లేదు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు శాఖకు సేవలందించిన ఏబీవీ లాంటి ఐపీఎస్‌ అధికారికి గౌరవప్రదంగా పదవీ విరమణ చేసే హక్కు కూడా లేకుండా చేస్తుండటాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి’’ అంటూ ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా ఆన్‌లైన్‌లో ఉద్యమం కొనసాగుతోంది.

పోస్టింగ్‌ ఇవ్వకుండానే పదవీ విరమణ చేయించే దురుద్దేశం
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే… గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. గత ఐదేళ్లుగా ఏబీవీకి పోస్టింగ్‌ ఇవ్వకుండా, సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి, అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టిన జగన్‌ ప్రభుత్వం, వైకాపా వీరభక్త అధికారగణం ఆయనపై ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నాయి. ఏబీవీ సస్పెన్షన్‌ చెల్లదని, ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలిచ్చి పది రోజులైనా ఇప్పటివరకూ ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు. ఈ నెలాఖరున ఏబీవీ పదవీవిరమణ చేయనున్నారు. అప్పటివరకూ తాత్సారం చేసి ఆయన్ను విధుల్లోకి తీసుకోకుండానే పదవీ విరమణ చేయించాలనే ఎత్తుగడ దీని వెనక ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయడం లేదా.. అయితే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం టైమ్‌కి తినడం, వ్యాయామం చేయడం లాంటివి చేయాలి. కానీ కొంతమంది టిఫిన్ చేయడంలో చాలా ఆలస్యం చేస్తుంటారు.

మారిన జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితం, ఆఫీసుకు త్వరగా వెళ్లాలని ఆరాటం, ఆఫీసు వర్క్ బిజీ వీటన్నింటి వలన చాలా మంది టిఫిన్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కానీ ఇది వారి ప్రాణానికే ప్రమాదం అని గుర్తించడంలో విఫలం అవుతున్నారు.

తాజాగా చేసిన న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు టిఫిన్ చేయకపోతే హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదంట. అందువలన ఉదయం 8 గంటలకు అల్పాహారం, రాత్రి 8 గంటలకు చివరి భోజనం తినడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి అంటున్నారు ఫ్రాన్స్‌లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోర్డ్ వైద్యులు. ఉదయం ఎనిమిది గంటలకే తినే వారికంటే ,9 గంటలకు తినే వారిలో హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం ఆరు శాతం ఎక్కువగా ఉందని వారు తెలిపారు. రాత్రి ఎనిమిది గంటలకు బదులుగా తొమ్మిదిగంటలకు తినడం వలన మహిళల్లో స్ట్రోక్ వంటి సెరెబ్రోవాస్కులర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతోందని వారు గుర్తించారు. అందువలన తప్పనిసరిగా ఫుడ్ తీసుకోవడంలో నెగ్లెట్ చేయకూడు అంటున్నారు నిపుణులు.

హైదరాబాద్ చివరన కొత్త సిటీ.. ఇక్కడ స్థలం కొంటే మీ లైఫ్ సెటిల్!

కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టాలి అనుకునేవారికి ఎక్కడైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయచ్చు. రియల్ ఎస్టేట్ కూడా ఒక వ్యాపారమే. ఎక్కడుంటే ఏంటి స్థలం లాభాలు తీసుకురావాలి.

అయితే లాభాల శాతం అనేది పెట్టుబడి పెట్టే ప్రాంతం మీద, ధరల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ధర ఉన్నప్పుడు కొనుక్కుని తక్కువ లాభాలు పొందే కంటే తక్కువ ధర ఉన్నప్పుడు కొనుక్కుని ఎక్కువ లాభాలను పొందడం మేలు. లొకేషన్ తో పని లేకుండా సిటీకి దగ్గర ఏరియాలో తక్కువ ధరకు ప్లాట్కొనుక్కుని ఫ్యూచర్ లో ఎక్కువ లాభాలకు అమ్ముకోవడం బెటర్. అలాంటి ఏరియా గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఆ ఏరియాలో చాలా తక్కువ ధరకే ప్లాట్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఊహించని లాభాలను పొందవచ్చునని చెబుతున్నారు.

ఆ ఏరియా పేరు కొంగరకలాన్. ఇప్పుడు ఈ ఏరియాలో స్థలాల మీద పెట్టుబడి పెడితే అతి తక్కువ సమయంలోనే లక్షల్లో లాభాలను పొందవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ కి 28 కి.మీ. దూరంలో ఉంది ఈ ఏరియా. ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్ కూడా ఉంది. ఇక్కడ ఫాక్స్ అనే అంతర్జాతీయ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టింది. 4,550 కోట్ల పెట్టుబడితో ఈ టెక్ దిగ్గజం కొంగరకలాన్ లో అడుగుపెట్టింది.

ఫాక్స్ కాన్ అనేది అంతర్జాతీయ కంపెనీ. యాపిల్ యాక్ససరీస్ కి సంబంధించిన కంపెనీ. బ్రాండ్ నేమ్ ఉన్న కంపెనీ. పలు యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేసుకుంటుంది. కంపెనీ పూర్తయితే కనుక లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తామని కంపెనీ తెలిపింది. అయితే కంపెనీ పూర్తి స్థాయిలో పూర్తవ్వడానికి మూడు, నాలుగేళ్లు అయినా పడుతుందని అంటున్నారు. ఏడాదిలోగా కనీసం 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వీలుందని అంటున్నారు. అందుకోసం తొలుత ఒక యూనిట్ ని ఫినిష్ చేసి స్టార్ట్ చేయనున్నారు. ఈ కంపెనీ ఎప్పుడైతే ఈ ఏరియాలో పెట్టుబడులు పెట్టిందో అప్పుడే ఈ ఏరియాలో ల్యాండ్ రేట్లు పెరిగిపోయాయి.

గజం 7 వేల నుంచి 25 వేలకు పెరిగింది:

2014లో గజం 7 వేలు ఉండేది. ఎప్పుడైతే ఫాక్స్ కాన్ కంపెనీ ఇన్వెస్ట్ చేసిందో అప్పుడే భారీగా పెరిగిపోయారు. ఇప్పుడు త్రిబుల్ అయ్యింది అక్కడ స్థలం రేటు. చదరపు అడుగు స్థలం రూ. 2800గా ఉంది. అంటే గజం స్థలం రూ. 25 వేలు ఉంది.

ఈ కారణాల వల్లే భారీ లాభాలు:

కొంగరకలాన్ అవుటర్ రింగ్ రోడ్ కి 1 కి.మీ., శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి 8 కి.మీ. దూరంలో ఉంది. మంగళపల్లిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకు 3 కి.మీ. దూరంలో ఉంది. రంగారెడ్డి కలెక్టరేట్ కి హాఫ్ కి.మీ. దూరంలో ఉంది. ఈ కొంగరకలాన్ శ్రీశైలం హైవే, సాగర్ హైవేల మధ్యలో ఉంది. ఆదిభట్ల టీసీఎస్ కంపెనీకి 3 కి.మీ. దూరంలో ఉంది. ఏరో స్పేస్ సెజ్ కి దగ్గరలో ఉంది. రోడ్ కనెక్టివిటీ బాగుంది. ఈ ప్రాంతం గ్రోత్ జోన్ గా ఉంది. హెచ్ఎండీఏ జెన్యూన్ లేఅవుట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ 200 ఫీట్ రోడ్లే వస్తున్నాయి. ఫాక్స్ కంపెనీ పెట్టుబడులు పెట్టాక ఇక్కడ డిమాండ్ పెరిగిపోయింది. ఇక్కడ ఆల్రెడీ పలు డెవలపర్స్ అపార్ట్మెంట్స్, లగ్జరీ విల్లాలు డెవలప్ చేసేశారు. కోటిన్నర నుంచి 4 కోట్లకు విల్లాలు అమ్ముతున్నారు. ఫ్లాట్ లు కూడా భారీ ధరకే అమ్ముతున్నారు.

ఆ ఫాక్స్ కాన్ కంపెనీ పూర్తయ్యేలోపు ఇంకా వేరే ఇండస్ట్రీలు రావచ్చు. అలానే ఫాక్స్ కాన్ పూర్తయితే లక్ష ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని చెప్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో డిమాండ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు స్థలాలు కొని ఉంచుకుంటే రాబోయే రోజుల్లో భారీ లాభాలను పొందవచ్చునని చెబుతున్నారు. ఇప్పుడు 25 వేలు ఉన్న గజం రేటు రాబోయే రోజుల్లో 70 వేల నుంచి లక్ష రూపాయలు అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అంటే ఇప్పుడు 25 లక్షలు పెట్టి 100 గజాలు కొన్నవారికి.. 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ వస్తాయని అంటున్నారు. అంటే 25 లక్షల పెట్టుబడికి 45 లక్షల నుంచి 75 లక్షల లాభం ఉంటుందని చెబుతున్నారు.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

లక్షల్లో జీతాలా.. ఫలితాలు అంతంతమాత్రమా

ఆలస్యంగా బడికొచ్చినా సాయంత్రం ముందే వెళ్లిపోతున్నారుఉపాధ్యాయులతో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌

పాఠ్యపుస్తకాలను పరిశీలించి సూచనలిస్తున్న ప్రవీణ్‌ప్రకాశ్‌

తణుకు, న్యూస్‌టుడే: లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు… ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి… ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ ప్రశ్నించారు. శనివారం రాత్రి తణుకు ఎన్టీఆర్‌ ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో ప్రభుత్వ బడులు 20 శాతం వెనుకబడి ఉన్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నా నూరుశాతం సాధించకపోవడానికి నిర్లక్ష్యమే కారణం. ఉదయం ఆలస్యంగా వచ్చినా సాయంత్రం నిర్దేశిత సమయం కంటే ముందే వెళ్లిపోతున్నారు’ అని అన్నారు.

ఒక్కొక్కరు 50 మందిని చూడలేరా? ‘ఒక్కో తరగతి ఉపాధ్యాయుడికి సగటున 20 నుంచి 25 మంది పిల్లలే ఉంటున్నారు. ఒక వాలంటీరు 50 ఇళ్లను చూస్తుంటే కనీసం ఒక ఉపాధ్యాయుడు 50 మంది పిల్లలను చూడలేరా. ఆరో తరగతి నుంచే పిల్లలకు ప్రతీ యూనిట్‌లో 70శాతం మార్కులు రావాలి. పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు తక్కువగా ఉంటే తల్లిదండ్రులతో చర్చించాలి. మీకు జీతాలుగా ఇచ్చేది ఉచిత సొమ్ము కాదు… ప్రజలందరిదని గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంపై ఆయాలు ఆయన్ని కలువగా మూడు రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అనియత విద్య బోధకులు, సూపర్‌వైజర్లు రాష్ట్ర సమగ్రశిక్షా ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించాలని వినతిపత్రం అందించారు. అనంతరం విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, బూట్లు, సంచుల నాణ్యతను పరిశీలించి, నూతన పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖాధికారి వెంకటరమణ తదితరులు ఉన్నారు.

మీ పిల్లలు టీవీ చూస్తూ ఫుడ్ తింటున్నారా? జరిగేది ఇదే.. జాగ్రత్త!

Are your kids watching TV and eating food?: పిల్లలకు ఫుడ్ తినిపించడం అనేది ఈ రోజుల్లో తల్లులకు పెద్ద తలనొప్పిగా మారింది. నోట్లో ముద్ద పెట్టాలంటే చేతిలో ఫోన్ పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది. ఏ గోల లేకుండా భోజనం చేయాలంటే చేతిలో ఫోన్ అయినా ఉండాలి. టీవీలో కిడ్స్ ఛానెల్ అయినా పెట్టాలి. లేదంటే, వారికి ఫుడ్ తినిపించడం చాలా కష్టం. అయితే, పిల్లలు టీవీ, ఫోన్ చూస్తూ భోజనం చేయడం మంచిది కాదంటోంది తాజా అధ్యయనం. అలా చేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటోంది.

టీవీ చూస్తూ ఫుడ్ తింటే ఏమవుతుందంటే?
టీవీ లేదంటే ఫోన్ చూస్తూ భోజనం చేయడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. పిల్లలు టీవీ చూస్తూ ఫుడ్ తీసుకోవడం వల్ల కడుపు నిండినా అలాగే తింటూనే ఉంటారని చెప్తున్నారు. మోతాదుకు మించి భోజనం తీసుకుంటారట. అలా చేయడం ఈజీగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

735 మంది విద్యార్థులపై అధ్యయనం
పోర్చుగల్‌లోని మిన్హో యూనివర్శిటీ 735 మంది యువ విద్యార్థులపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడి అయ్యింది. టీవీ లేదంటే ఫోన్ చూస్తూ భోజనం చేసిన విద్యార్థులలో ఊబకాయం ఏర్పడినట్లు పరిశోధకులు గుర్తించారు. యుకె లెక్కల ప్రకారం 11 సంవత్సరాల వయసున్న పిల్లలో 91 శాతం మంది స్మార్ట్ ఫోన్ చూస్తున్నట్లు తేలింది. అంతేకాదు, రోజుకు కనీసం 2 నుంచి 4 గంటల పాటు ఆన్ లైన్ లో గడుపుతున్నారట. 16 ఏండ్ల లోపు వారు వారానికి కనీసం 5 గంటల పాటు టీవీ చూస్తున్నట్లు ఆఫ్కామ్ వెల్లడించింది.

ప్రైమరీ స్కూల్ విద్యార్థుల్లో 40 శాతం మందికి ఊబకాయం
దాదాపు 40 శాతం మంది పిల్లలు ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే సమయానికే అధిక బరువు లేదంటే ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.“పిల్లలు టీవీ, మొబైల్ ఫోన్‌ చూస్తూ ఫుడ్ తిన్నప్పుడు వాళ్లు ఎంత తింటున్నారో అర్థం కాదు. టీవీ, ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా మోతాదుకు మించి భోజనం చేస్తారు. పరధ్యానంలో పడి ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు. ఇలా చేయడం పిల్లలకు ఎంతో ప్రమాదకరం. వాళ్లు ఈజీగా బరువు పెరుగుతారు. మరికొంత మందిలో ఊబకాయం సమస్య తలెత్తుతుంది” అని పోర్చుగల్‌లోని మిన్హో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధలు చయిత్రి డాక్టర్ అనా డ్వార్టే వెల్లడించారు.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల మాదిరిగా అందరూ కలిసి భోజనం చేసే పరిస్థితి ఈ రోజుల్లో లేదని చైల్డ్ గ్రోత్ ఫౌండేషన్ చైర్మన్ టామ్ ఫ్రై వెల్లడించారు. “ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి భోజనాలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ రోజుల్లో పిల్లలు ఒకసారి, తల్లిదండ్రులు మరోసారి భోజనం చేస్తున్నారు. పిల్లలు ఫోన్లు, టీవీలకు బాగా అలవాటుపడిపోయారు. వారి ఆరోగ్యం పైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది” అని వెల్లడిచారు.

సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది ఇక్కడే.. అందుకే అక్కడి నీళ్లు వేడిగా ఉంటాయి..

రామాయణ కావ్యం అంటే తెలియని వారు ఎవరుంటారు. మన భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో సీతారాములు తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే బీహార్‌లోని ముంగేర్‌లో రామాయణానికి సంబంధించిన అనేక ప్రదేశాలు ఉన్నాయి.

వాటిలో ఒకటి సీతా కుండ్. సీత మాత ఇక్కడే అగ్నిపరీక్షకు నిలిచిందని పురాణాలు చెబుతున్నాయి. సీతాదేవి ఎక్కడ అగ్నిప్రవేశం చేసిందో అక్కడ వేడి నీటి చెరువు ఏర్పడిందని, ఈ నీళ్లు ఎల్లప్పుడూ వేడిగా ఉంటుందని చెబుతారు. ఈ ప్రదేశాన్ని రామతీర్థం అని కూడా అంటారు. ఈ చెరువులో ఉండే నీరు ఎప్పుడూ వేడిగా ఉండటానికి కారణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

సీతా కుండ్ నీళ్లు..

ఆలయ ప్రాంగణంలోని సీతాకుండ్‌తో పాటు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్న పేర్లతో సమీపంలో నాలుగు చెరువులు కూడా ఉన్నాయి. అయితే సీతా కుండ్‌లోని నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది. కాగా మిగిలిన నాలుగు చెరువుల నీరు చల్లగా ఉంటుందని చెబుతున్నారు. ఇది ఇప్పటికీ ప్రజలకు పరిష్కారం కాని పజిల్‌లా ఉంది.

శాస్త్రవేత్త పరిశోధన..

సీతా కుండ్‌లోని వేడి నీటి రహస్యాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనల కోసం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఈ మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోయారు. పరిశీలన అనంతరం ఈ చెరువు పొడవు, వెడల్పు 20 అడుగులు కాగా, చెరువు 12 అడుగుల లోతు ఉందని చెప్పారు. అలాగే పరీక్ష నిర్వహించి ఎనిమిది నెలల పాటు ఇక్కడి నీరు స్వచ్ఛంగా ఉంటుందని తెలిపారు. వేసవిలో నీటి ఉష్ణోగ్రత తగ్గుతుందని ఆయన చెప్పారు.

మాఘమాసంలో ప్రత్యేక జాతర..

ప్రజలు ఏడాది పొడవునా సీతా కుండ్‌ని సందర్శించడానికి వస్తూనే ఉంటారు. కానీ మాఘమాసంలో ప్రత్యేక జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలో చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి సీతా కుండ్‌లోని వేడి నీటిలో స్నానం చేసి ఆలయంలో పూజలు చేస్తారు. ఈ జాతర నెల రోజుల పాటు కొనసాగుతుంది.

Upma History: ఇప్పుడు మనం తింటున్న ఉప్మా అంతా ఒకప్పటి చెత్తే, తెల్లోడు చేసిన అతి పెద్ద మోసం ఇది

ఉప్మా కేవలం అల్పాహారం మాత్రమే కాదు. దాని చుట్టూ ఎన్నో రాజకీయాలున్నాయి. మరెన్నో ఆర్థిక కోణాలూ ఉన్నాయి. చెప్పాలంటే అందులో మన బానిసత్వం కనిపిస్తుంది. కాస్తంత అతిశయోక్తి అనిపించినా అసలు కథ తెలిస్తే అదంతా నిజమే అని అర్థమవుతుంది.

ఉప్మా కథ ఇది..

Upma అనే పేరు uppu mavu అనే తమిళ పదాల నుంచి పుట్టింది. అంటే ఉప్పగా ఉండే పిండి అని అర్థం. పిండిలో నీళ్లు పోసి కాస్తంత ఉప్పు వేసుకుని వండుకునే వాళ్లు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. కర్ణాటకలో ఉప్పిట్టు అని, ఆంధ్రప్రదేశ్లో ఉప్పుడు పిండి అని కూడా పిలుస్తారు. 18వ శతాబ్దంలోనే మనకి ఈ వంటకం (Rava Upma) పరిచయం అయింది. ఈ ఉప్మా పుట్టుక వెనక పెద్ద చరిత్రే ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని బియ్యం నిల్వలన్నింటినీ బ్రిటీష్ వాళ్లు తమ సైనికుల కోసం ఎగుమతి చేసుకున్నారు. ఫలితంగా సౌత్లో బియ్యం దొరక్కుండా పోయింది. ఈ సమస్యని తీర్చేందుకు అప్పటికప్పుడు బర్మా నుంచి దిగుమతి చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో బర్మాపై జపాన్ దాడి చేసింది. ఫలితంగా రైస్ ఇంపోర్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. రెస్టారెంట్లు అన్నీ మూతపడ్డాయి. అప్పుడే బ్రిటీష్ పాలకులు చాలా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నారు. సౌత్ ఇండియన్స్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలని పంజాబ్ నుంచి గోధుమలను దిగుమతి చేసుకోవాలని చూసింది. కానీ ఇక్కడ ఓ సమస్య వచ్చి పడింది. గోధుమలను తీసుకొచ్చినా వాటిని పిండి పట్టించి చపాతీలు చేసుకునేందుకు స్థోమత అప్పట్లో దక్షిణాది ప్రజలకు లేకుండా పోయింది.

చెత్త నుంచి పుట్టిన టిఫిన్..

సింపుల్గా వండుకునేలా ఏముంటుందని ఆలోచిస్తే ఫ్లోర్ మిల్లుల్లో (How Upma is Invented) పిండి పట్టగా మిగిలిపోయిన రవ్వపై వాళ్ల దృష్టి పడింది. ఓ రకంగా అది చెత్త లాంటిదే. కాకపోతే వండుకోడానికి సులువుగా ఉంటుందని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. పైగా ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారం అంటూ ప్రచారం చేశారు. ఆకలి నుంచి బయటపడాలంటే ఇదే మంచిదంటూ ఊదరగొట్టారు. అంతే కాదు. ఈ రవ్వని ఎలా వండుకోవాలో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇచ్చారు. రెస్టారెంట్లకూ సప్లై చేశారు. అలా క్రమంగా అందరికీ ఈ ఉప్మాని అలవాటు చేశారు. అప్పటికి అందరికీ అదే పంచభక్ష్య పరమాన్నమైపోయింది. అప్పట్లో MTR (Mavalli Tiffin Room) అధినేత యజ్ఞనారాయణ మయ్యా రవ్వ ఇడ్లీని పరిచయం చేశారు. మద్రాస్ రెసిడెన్సీలో రెస్టారెంట్లలో పొంగల్కి బదులుగా అప్పటి నుంచి రవ్వ ఇడ్లీ సర్వ్ చేయడం మొదలు పెట్టారు. అది కాస్తా ఫేమస్ అయిపోయింది. అలా మొదలైన ఈ ఉప్మా ప్రస్థానం ఇక్కడి వరకూ వచ్చింది. రకరకాల ఉప్మాల రెసెపీలు ఇప్పుడు వచ్చేసినా ఎక్కడో మనలో తెలియకుండానే దానిపై విరక్తి వచ్చేసింది. ఎంత స్పైసీగా చేసుకున్నా మసాలా తగలదు కాబట్టి చప్పటి తిండిగానే మిగిలిపోయింది. నచ్చినా నచ్చకపోయినా తిన్నా తినకపోయినా ఇప్పటికీ కిచెన్ని రూల్ చేసేస్తోంది ఉప్మా.

ఎన్నికల ఫలితాల ముందే ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..!!

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాల పైన ఉత్కంఠ సాగుతుంది. ప్రధాన పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం నుంచి ఏపీకి కీలక సమాచారం అందింది.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రెండో ఐకానిక్ తీగల వంతెనకు ప్రతిపాదన సిద్ధమైంది. రాష్ట్రంలో రెండో తీగల వంతెన నిర్మాణానికి కసరట్టు జరుగుతుంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ మధ్య నంద్యాల, ఆత్మకూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ – కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.

మరో వంతెన కోసం

ఇదే తరహాలో మరో వంతెనకు ప్రతిపాదిస్తుంది. ఆ నిర్మాణం సైతం ఏపీ తెలంగాణ సరిహద్దులోని కృష్ణానది పైన నిర్మించనుంది. శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వేకి సమాంతరంగా ప్రస్తుతం ఉన్న పాత వంతెన స్థానంలో దానికి సమీపంలో కొత్తగా తీగల వంతెన నిర్మించేందుకు కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించిన డి పి ఆర్ సిద్ధమవుతోంది. గుంటూరు-కర్నూలు రోడ్డులో ఉన్న కుంట జంక్షన్ నుంచి దోర్నాల, శ్రీశైలం క్రాస్ రోడ్, సున్నిపెంట, దోమల పెంట మీదుగా హైదరాబాద్ కు వెళ్లే జాతీయ రహదారిని విస్తరిస్తుంది.

విస్తరణ పనులు
నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో ఈ రహదారి అనేకచోట్ల 5.5 మీటర్ల నుంచి ఏడు మీటర్ల మేరకే ఉంది. దీనిని 10 మీటర్లకు పెంచుతుంది. ఇప్పటికే కుంట- దోర్నాల మధ్య 24.2 కిలోమీటర్ల మేర 20045 కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. దోర్నాల నుండి శ్రీశైలం క్రాస్ రోడ్, సున్నిపెంట మీదుగా కృష్ణా నదిపై వంతెన దాటే వరకు 53.5 కిలోమీటర్ల మేర విస్తరించేలా డిపిఆర్ ను కేంద్రం సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం కృష్ణానది పై ఉన్న వంతెన 1972లో నిర్మాణం చేసుకుంది. దీనికి సమీపంలోనే ఐకానిక్ తీగల వంతెన నిర్మించనుంది.

మారనున్న రూపు రేఖలు

ఇందుకోసం దాదాపు 1000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేసింది టీపీఎఫ్ కన్సల్టెంట్స్ అనే సంస్థ ద్వారా ఈ ప్యాకేజీ కి సంబంధించిన డిపిఆర్ ను సిద్ధం చేస్తున్నారు. ఇది తయారైతే వచ్చే ఏడాదిలోగా పనులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. ఈ ఐకానిక్ వంతెన కూడా అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రూప రేఖలు రానున్నాయి. ఈ రెండు బ్రిడ్జిలు నిజంగానే ఐకానిక్ వంతెనలుగ నిలిచిపోనున్నాయి.

కల్కీ 2898 AD.. బుజ్జిని రివీల్ చేసిన మేకర్స్.. ఎన్నో స్పెషాలిటీలు కూడా!

డార్లింగ్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ మూవీపై వరల్డ్ వైడ్ గా బజ్ ఉంది. ఆ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అంతా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ మూవీ అయితే జూన్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. అంతకన్నా ముందే అసలు కల్కీ అంటే ఏంటి? ఆ ప్రపంచం ఎలా ఉంటుంది? అనే విషయాన్ని చెప్పేందుకు స్క్రాచ్ పేరిట మూవీ టీమ్ కొన్ని ఎపిసోడ్స్ ని విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా మే 18న స్క్రాచ్ ఎపిసోడ్ 4ని విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ ఎపిసోడ్ గురించే చర్చలు స్టార్ట్ అయిపోయాయి.

నిన్నటి నుంచి కల్కీ 2898 ఏడీ సినిమా గురించే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ తన బుజ్జిని పరిచయం చేస్తాను అని చెప్పాడు. ఆ బుజ్జి ఎవరో తెలుసుకోవాలి అని అంతా తెగ వెయిట్ చేస్తున్నాడు. ఎప్పటిలాగానే ఈసారి కూడా కల్కీ మూవీ టీమ్ చెపిన్న టైమ్ కి అప్ డేట్ ఇవ్వలేదు. ఫ్యాన్స్ అంతా 5 దాటి చాలాసేపు అయ్యింది అంటూ చాలానే ట్వీట్లు వేస్తున్నారు. ఎట్టకేలకు ఆ స్క్రాచ్ ఎపిసోడ్ రానే వచ్చింది. కల్కీ 2898 ఏడీ మూవీ హీరో భైరవ తన బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

మొదట అంతా అమ్మాయి అని.. ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. చివరకు బుజ్జి అంటే ఒక కారు అనే విషయాన్ని తాజాగా ఈ ఎపిసోడ్ ద్వారా వెల్లడించారు. కల్కీ మూవీలో ప్రభాస్ వాడేది నిజంగానే సూపర్ ఫ్యూచరిస్టిక్ కారు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఈ స్క్రాచ్ 4 ఎపిసోడ్ మొత్తం కల్కి సినిమాపైనే అంచనాలను భారీగా పెంచేసింది. ఎందుకంటే ఇప్పటికే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోంది అనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ తాజా ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. అలాగే ప్రభాస్ క్యారెక్టర్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉండబోతోంది అనే విషయం అర్థమవుతోంది.

ఈ బుజ్జికి సంబంధించి.. అది ఒక రోబో. కానీ, దాని బాడీని కోల్పోతుంది. అందుకే దానిని ఒక సూపర్ కారుకు అటాచ్ చేస్తారు. అంటే ట్రాన్సాఫ్మర్స్ లో రేంజ్ లో బుజ్జి ఒక పెద్ద రోబోలాగా మారిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక రోబో హెడ్ ని తీసుకెళ్లి కారుకు తగిలిస్తున్నారు. పైగా తన బాడీని ఈ హెడ్ ద్వారానే కంట్రోల్ చేస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూస్తే.. హాలీవుడ్ ట్రాన్సాఫ్మర్స్ లో తరహాలో ఒక సీక్వెన్స్ ప్లాన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే బుజ్జిని పూర్తిగా చూపించలేదు. మే 22న ఒక ఈవెంట్ పెట్టి రివీల్ చేస్తారని చెప్తున్నారు.

 

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!

వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది. మే 23 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

దీంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. మే 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇది మే 24 నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. వాయిగుండంగా మారితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

ప్రస్తుతానికి ఏపీ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ఆవర్త ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. దీని కారణంగా తెలంగాణలో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇప్పటికే గత వారం రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అటు ఏపీలో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని తెలిపింది. ఆదివారంలోకి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి.

రుతుపవనాలు మే 31 కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత కేరళ అంతా వ్యాపించనున్నాయి. జూన్ 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణలో కూడా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలు సకాలంలో పడితే పంటలు సాగు మొదలు పెట్టేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు కురిస్తే రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

రాత్రి సమయంలో అడవిలో కనువిందు చేసే అందాలు.. భారతదేశ మాయా అడవి ఎక్కడుందంటే

అడవిలో మిణుగురల కాంతి మాత్రమే కాదు.. అడవిలో మొక్కలు కూడా ప్రకాశిస్తాయి. ముఖ్యంగా రుతుపవనాలు ఎంట్రీ సమయంలో వర్షాల పడే ప్రారంభం సమయంలో అడవిలో ప్రకాశం చాలా రెట్లు పెరుగుతుంది.

కనుక ఎవరైనా మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలను సందర్శించాలనుకుంటున్నట్లయితే ఈ ప్రదేశాన్ని తప్పనిసరిగా సందర్శించండి.

ఒక మాయా ప్రపంచం: వర్షాకాలంలో ఇక్కడ భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. రాత్రి వేళ ఈ అడవి మాయా ప్రపంచంలా కనిపిస్తుంది. ఎక్కడో చెట్టు కాండం మీదనో, ఎక్కడో పొద మధ్యలోనో, ఎక్కడో చెట్టు మీద నుంచి రాలిన ఆకుల కుప్పల మీదనో లైట్ మెరుస్తూ ఉండడం చూసి ఎవరైనా ఆశ్చర్యపోతారు. అయితే ఈ అడవిలో రాత్రిపూట మెరుస్తున్నది ఏమిటి? ఇది మాయా ప్రపంచంలో భాగమా?

మెరుస్తున్న పుట్టగొడుగు: నిజానికి ఈ అడవిలో మెరుస్తుండడంలో ఎలాంటి మాయాజాలం లేదు. భీమశంకర్ వన్యప్రాణుల రిజర్వ్ రాత్రి చీకటిలో మెరిసిపోవడానికి కారణం మైసీనా ఫంగస్. ఇది ఒక రకమైన పుట్టగొడుగు. దీనిని చాలా సార్లు నాచు అని పొరబడతారు. ఈ అడవిలో దొరికే పుట్టగొడుగు. రాత్రి చీకటిలో మట్టి, ఆకుల కుప్పల మధ్య మెరుస్తూ కనిపిస్తుంది.

అది ఎలా ప్రకాశిస్తుందంటే: ఈ పుట్టగొడుగు లూసిఫేరేస్ అనే ప్రత్యేక రకం ఎంజైమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. పుట్టగొడుగులో ఉండే లూసిఫెరిన్‌తో సంబంధానికి వచ్చినప్పుడు.. అది మెరుస్తూ ఉంటుంది. లూసిఫెరిన్ కాంతి ఉద్గార సమ్మేళనంగా పరిగణించబడుతుంది.

ఈ రెండు మూలకాల రసాయన చర్య వల్ల బయోలుమినిసెంట్ గ్లో ఉత్పత్తి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులతో పోలిస్తే భీమశంకర్ రిజర్వ్‌లో బయోలుమినిసెంట్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా ఇక్కడికి వెళ్లాలని అనుకుంటే జూలై నుంచి సెప్టెంబర్ మధ్య భీమాశంకర్ వన్యప్రాణుల రిజర్వ్‌ను సందర్శించాలని ప్లాన్ చేసుకోండి.

రాత్రి పడుకునే ముందు ఈ నీళ్లను తాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

మనం వంటల్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ఒకటి. ఇది ఆహారం రుచిని పెంచడమొక్కటే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే దాల్చిన చెక్క నీటిని రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల శరీరం మొత్తం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. అసలు పడుకునే ముందు దాల్చిన చెక్క వాటర్ ను తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దాల్చిన చెక్క వాటర్ మధుమేహులకు ఒక ఔషదంలాగే పనిచేస్తుంది. వీల్లు రాత్రి పడుకునే ముందు దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఉదయం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అలాగే దాల్చినచెక్క వాటర్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని కనుగొనబడింది. అందుకే దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉండే దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం కూడా నియంత్రణలోకి వస్తుంది. గ్యాస్, అజీర్ణంతో పాటుగా మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

బరువు తగ్గాలనుకునే వారికి దాల్చిన చెక్క నీరు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఆకలి చాలా వరకు తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలనుకునేవారు దాల్చిన చెక్క నీటిని తాగొచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్న దాల్చినచెక్క నీటిని తాగడం వల్ల మెదడు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.

IPL 2024: చెన్నై కొంపముంచిన శివమ్ దూబే.. సంచలన విజయంతో ప్లే ఆఫ్స్‌కు ఆర్‌సీబీ!

ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్‌రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్‌లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్‌ ప్రపంచం తీర్మానించింది. ఆర్సీబీ నిస్సహాయతను, వైఫల్యాన్ని ఎగతాళి చేస్తూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పోటెత్తాయి. ఆఖరికి ఆ జట్టు ఆటగాడు కూడా కలలో సైతం తమ జట్టు ముందంజ వేస్తుందని ఊహించి ఉండడు. కానీ అద్భుతం!

బెంగళూరు అదరగొట్టింది. మిగతా అన్ని మ్యాచ్‌ల్లో, అంటే వరుసగా 6 మ్యాచ్‌ల్లో గెలిచి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసింది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ కనీ వినీ ఎరగని రీతిలో ఐపీఎల్‌-17 ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. గెలుపు తప్పనిసరైన తన ఆఖరి మ్యాచ్‌లో ఆర్సీబీ శనివారం చెన్నైపై గెలిచింది. 14 పాయింట్లతో చెన్నైతో సమంగా నిలిచిన ఆర్సీబీ.. మెరుగైన రన్‌రేట్‌తో ముందంజ వేసింది.

బెంగళూరు: కీలక పోరులో బెంగళూరు అదరగొట్టి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. చెన్నై ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. బెంగళూరు నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితం అయింది. ఆ జట్టులో రచిన్‌ రవీంద్ర (61: 37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో చెలరేగగా, జడేజా (42*: 22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అజింక్య రహానె (33: 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), ధోనీ (25: 13 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించారు. బెంగళూరు బౌలర్లలో యశ్‌ దయాల్‌ రెండు వికెట్లు తీయగా, మాక్స్‌వెల్‌, సిరాజ్‌, ఫెర్గూసన్‌, కామెరూన్‌ గ్రీన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. అర్ధశతకం చేసిన డుప్లెసిస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ దిమ్యాచ్‌ వచ్చింది. ఈ మ్యాచ్‌తో కలిపి వరుసగా ఆరు విజయాలు సాధించిన బెంగళూరు ప్లేఆఫ్స్‌లో నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

చివరి వరకు ఉత్కంఠే..
219 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన చెన్నైకి తొలి బంతికే షాక్‌ తగిలింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను మాక్స్‌వెల్‌ ఔట్‌ చేశాడు. షార్ట్‌ ఫైన్‌ లెగ్‌లో బంతిని ఆడగా యశ్‌ దయాల్‌ క్యాచ్‌ అందుకున్నాడు. మూడో ఓవర్లో మిచెల్‌ను యశ్‌ దయాల్‌ ఔట్‌ చేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రహానెతో కలసి రచిన్‌ రవీంద్ర ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగడంతో పవర్‌ప్లే ముగిసే సరికి చెన్నై 58 పరుగులతో నిలిచింది. 10వ ఓవర్‌ తొలి బంతికి ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో రహానె ఔటయ్యాడు. 10 ఓవర్ల ముగిసే సరికి ఆ జట్టు 87 పరుగులతో నిలిచింది. అయితే 12 ఓవర్‌ వేసిన ఫెర్గూసన్‌కి రచిన్‌ చుక్కలు చూపించాడు. సిక్స్‌తో అర్ధశతకం బాదిన అతడు తర్వాతి బంతిని సైతం స్టాండ్స్‌లోకి పంపించాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. అయితే 13వ ఓవర్‌లో రెండో పరుగు తీసే క్రమంలో రచిన్‌ రనౌటయ్యాడు. ఆ తర్వాత దూబెను గ్రీన్‌ పెవిలియన్‌ పంపించాడు. ఇక సిరాజ్‌ వేసిన బంతికి డుప్లెసిస్‌ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్‌ పట్టడంతో శాంట్నర్‌ వెనుదిరిగాడు. 15 ఓవర్లలో చెన్నై 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులతో నిలిచింది.

దీంతో క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. చెన్నై 18 పరుగుల కంటే తక్కువ తేడాతో ఓడిపోయినా నెట్‌రన్‌రేట్‌ కారణంగా ప్లేఆఫ్స్‌ చేరుకునేందుకు అవకాశం ఉండడంతో రెండు జట్లు గెలుపుపై ఆశలు పెట్టుకున్నాయి. క్రీజులో ఉన్న జడేజా, ధోనీ ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లు బాదుతుండడంతో బెంగళూరు శిబిరంలో ఉత్కంఠ పెరిగింది. చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరాలంటే చివరి రెండు ఓవర్లలో 35 పరుగులు కావాలి. 19వ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 35 పరుగులు కావాలి. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే 6 బంతుల్లో 17 పరుగులు చేస్తే చాలు. ఈ ఓవర్‌లో యశ్‌ దయాల్‌ మాయ చేశాడు. తొలి బంతికి ధోనీ సిక్స్‌ కొట్టగా, రెండో బంతికి స్వప్నిల్‌ సింగ్‌ క్యాచ్‌ పట్టడంతో ధోనీ ఔటయ్యాడు. దీంతో ఇరుజట్లలోనూ ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. స్ట్రైకింగ్‌లోకి శార్దూల్‌ ఠాకూర్‌ రాగా, మూడో బంతికి పరుగులు రాలేదు. నాలుగో బంతికి సింగిల్‌ వచ్చింది. సమీకరణం చివరి రెండు బంతులకు 10 పరుగులుగా మారింది. స్ట్రైకింగ్‌లో జడేజా ఉండడంతో అతడేమైనా మాయ చేస్తాడా అని చెన్నై అభిమానులు ఆశించారు. అయితే చివరి రెండు బంతులకు యశ్‌ దయాల్‌ పరుగులేమీ ఇవ్వకపోవడంతో బెంగళూరు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చివరి ఓవర్‌లో దయాల్‌ కేవలం 7 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ తీసి బెంగళూరు హీరోగా మారిపోయాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (54: 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లీ (47: 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), రజత్‌ పటీదార్‌ (41: 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కామెరూన్‌ గ్రీన్‌ (38: 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడారు. చెన్నై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు తీయగా, తుశార్‌ దేశ్‌పాండే, శాంటర్న్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

ఇప్పటికే కోల్‌కతా, రాజస్థాన్‌, హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకోగా, తాజా విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్‌లో నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. కోల్‌కతా, రాజస్థాన్‌, హైదరాబాద్‌, పంజాబ్‌ ఒక్కొక్క మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా 19 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తన తర్వాతి మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోయినా మొదటి స్థానంలోనే ఉంటుంది. మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ రెండో స్థానానికి చేరుకోవాలంటే పంజాబ్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో నెగ్గాల్సి ఉంటుంది.

పేదలందరికీ భారీగా డబ్బు .. ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన

మీరు గమనించే ఉంటారు.. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బృందాలు దేశవ్యాప్తంగా తనిఖీలు చేస్తూ.. చాలా చోట్ల అక్రమ మనీ, నగలు, ఆస్తుల వంటి వాటిని స్వాధీనం చేసుకుంటోంది.

ఇవన్నీ అక్రమం కాబట్టే.. స్వాధీనం చేసుకుంటున్నారన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ భారీ మొత్తాలన్నీ తిరిగి పేదలకే దక్కాలన్నది తన భావన అని అన్నారు. ఈ విషయానికి సంబంధించి తన మనసులో చాలా ఆలోచనలు వస్తున్నాయన్న మోదీ.. దోపిడీ అయిన పేదల సొమ్మును తిరిగి పేదలకే ఎలా ఇవ్వాలన్న అంశాన్ని లోతుగా ఆలోచిస్తున్నారు.

పేదలకు తిరిగి మనీ ఇచ్చే విషయంలో ఎలా చేస్తే బాగుంటుందన్న అంశంపై న్యాయసలహా కోరామనీ, నిపుణులతోనూ లోతుగా చర్చిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌రు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు. ఈడీ స్వాధీనం చేసుకున్న వేల కోట్లను ఏం చేస్తారని అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ ఆన్సర్ ఇచ్చారు. న్యాయ నిపుణులు ఇచ్చే సలహాల ప్రకారం.. అవసరమైతే.. చట్టపరమైన మార్పులు కూడా చేస్తామని మోదీ అన్నారు.

కాంగ్రెస్ హయాంలో సీబీఐ, ఈడీ ఇతర దర్యాప్తు సంస్థలు ప్రభావవంతంగా పనిచెయ్యలేదన్న ప్రధాని మోదీ.. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు దాదాపు రూ.1.25 లక్షల కోట్లను అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఎక్కువ కేసుల్లో ఆర్థికంగా నష్టపోతున్నది పేదలే అన్న ఆయన, పేదలకు దక్కాల్సిన ప్రయోజనాలను అక్రమార్కులు, అవినీతిపరులూ దోచుకుంటున్నారని మోదీ అన్నారు. అవినీతి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.

జరుగుతుందా?

ఇదివరకు నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కి తెప్పిస్తాననీ, దాన్ని పేదలకు ఇస్తానని ప్రధాని మోదీ అన్నారు. ఈ కారణంగానే దేశంలో కోట్ల మంది జన్ ధన్ బ్యాంక్ అకౌంట్‌లను తెరిచారు. కానీ వాటిలో కేంద్రం రూపాయి కూడా వెయ్యలేదు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. మోదీ పేదలకు మనీ అంశాన్ని మళ్లీ ప్రస్తావించారు. తద్వారా పేదలకు మనీ ఇవ్వాలనే ఆలోచన ఆయనకు ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ అది ఎప్పటికి ఆచరణలోకి వస్తుంది అనేది ప్రశ్నగానే ఉంది. కేంద్రం తలచుకుంటే ఈ క్షణమే అమలు చెయ్యవచ్చు కూడా. కానీ కేంద్రం.. న్యాయపరమైన సమస్యలు రాకుండా, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

పాకిస్తాన్ మూడు ముక్కలుగా మారే టైం వచ్చిందా.. పీవోకే బాటలో అడుగులేస్తున్న ఆ ప్రాంతాలు ఏంటి?

Pakistan: చెరపకురా చెడేవు.. అన్న సామెత పాకిస్తాన్‌కు అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. భారత్ నుంచి కశ్మీర్‌ను విడగొట్టడానికి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూ వచ్చింది ఆ దేశం.

అందుకు మిలటరీని, నిఘా సంస్థలను ఉసిగొల్పింది. అవి కాస్తా సొంతంగా ఉగ్రవాదమనే భూతాన్ని సృష్టించాయి. దాన్ని ఉసి గొలిపి.. జిహాద్ పేరిట విధ్వంసాన్ని పాక్‌ సృష్టించింది. కానీ, చేసిన పాపం ఊరికేపోదు కదా.. ఇప్పుడు పీవోకే రూపంలో తాను తవ్వుకున్న గోతిలోనే తానే పడుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే భారత్‌ను విడగొట్టా లని పగటి కలలు కన్న పాకిస్తానే తానే ముక్కలుగా మారేందుకు సిద్ధమైంది. ఎందుకంటే, ఇస్లామాబాద్ ఎదుర్కొంటున్న సమస్య పీవోకే ఒక్కటే కాదు.. మరో రెండు ప్రాంతాలు కూడా పాకిస్తాన్‌తో తెగదెంపులకు సిద్ధమవుతున్నాయి. ఇంతకూ, పీవోకే బాటలో అడుగులేస్తున్న ఆ రెండు ప్రాంతాలు ఏంటి? పాకిస్తాన్ నిజంగా మూడు ముక్కలు కాబోతోందా?

అది 1971. తూర్పున ఉన్న బెంగాలీ ప్రాంతం స్వేచ్ఛకోసం పోరాడి స్వతంత్రం సంపాదించుకుంది. బంగ్లాదేశ్‌గా అవతరించింది. పశ్చిమాన ఉన్న ప్రాంతం మాత్రమే పాకిస్తాన్‌గా మిగిలిపోయింది. ఇది ఆ దేశ చరిత్రలోనే ఓ పీడ కలగా మిగిలిపోయింది. ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్‌లో అలాంటి పరిస్థితే వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు రెండు ముక్కలుగా మారిన పాకిస్తాన్ ఇప్పుడు మూడు ము క్కలుగా మారబోతోందేమో అన్నట్టుగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఇస్లామాబాద్‌పై తిరగబడ్డారు. షరీఫ్ సర్కార్ కాళ్ల బేరానికొచ్చినా కనికరించడంలేదు. స్వేచ్ఛ ఒక్కటే సొల్యూషన్ అని తేల్చి చెబుతున్నారు.

అయితే, పాకిస్తాన్‌కు అసలు సమస్య పీవోకే ఒక్కటే కాదు. నిజానికి.. పీవోకే ఆందోళనల కంటే ముందే పశ్చిమ, దక్షిణ పాకిస్తాన్‌లోని పెద్ద మొత్తంలో భూభాగాలపై ఇస్లామాబాద్ నియంత్రణ కోల్పోయింది. ఆ ప్రాంతాలను తెహ్రీక్ ఈ-తాలిబన్ పాకిస్తాన్ సొంతం చేసుకుంది. దీనంతటికీ కారణం ఇస్లామాబాద్‌ చేసుకున్న స్వయం కృతాపరాధమే. రెండు దశాబ్దాల క్రితం పాక్‌కు చెందిన ఆర్మీ, నిఘా సంస్థ ఐఎస్ఐ ఆధ్వర్యంలో టీటీపీ భూతాన్ని సృష్టించింది. 2001 నుంచి 2021 నాటికి అది పెరిగి పెద్దయ్యింది. ఇప్పుడు తనను సృష్టించిన పాకిస్తాన్‌నే అది కబళిస్తోంది. ప్రస్తుతం ఆ ఉగ్ర సంస్థనే పాకిస్తాన్‌లో ఏకంగా సమాంతర ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసింది. ఆ దేశ సార్వభౌ మత్వాన్నే సవాల్ చేస్తోంది. పాక్‌ను ముక్కలుగా చేసేందుకు యత్నిస్తోంది. 1971 నాటికి పరిస్థితులను మళ్లీ పునరావృతం చేసేందుకు సిద్ధమైంది.

పాకిస్తాన్‌లో నాలుగు రాష్ట్రాలు పంజాబ్‌, సింధ్‌, బలూచిస్తాన్‌, ఖైబర్‌ ఫఖ్తుంఖ్వాలు ఉన్నాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో రెండు ప్రాంతాలు ముజఫరాబాద్‌, గిల్గిట్-బాల్టిస్థాన్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఒక పంజాబ్‌ మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో వేర్పాటువాదం పెచ్చరిల్లుతోంది. ఇది క్రమంగా విస్తరిస్తే ఆ దేశం తన అస్థిత్వాన్నే కోల్పోయే ప్రమాదముంది. పాక్‌లో పంజాబ్‌ ప్రాంతానికి చెందిన వారి ఆధిపత్యం ఎక్కువగా ఉంది. జనాభాలో ఈ రాష్ట్ర వాటా దాదాపు 40 శాతం. అయితే వనరులు మాత్రం అందుకు సరిపడా లేవు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వనరులను దోచి పెట్టి పంజాబ్‌కు ఇస్తున్నారనే వాదన ఉంది. సైన్యం, దేశ పాలనలో కూడా వీరిదే సింహభాగం కావడంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఈ ఆధిపత్య ధోరణికి నిరసనగా పాకిస్తాన్‌లో వేర్పాటువాదం బలపడింది. అది ఏ స్థాయిలో ఉందీ అంటే పాకిస్తాన్‌లో రక్తపాతం సృష్టిస్తున్న మెజారిటీ దాడులకు బలూచీ వేర్పాటు వాదులే కారణం.

నిజానికి పాకిస్తాన్ ఏర్పాటుకు ముందు బలూచిస్తాన్‌తో ఆ దేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే బ్రిటిషు పాలనలో బలూచిస్తాన్ ఓ సంస్థానం. పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత స్వతంత్రంగా ఉన్న బలూచిస్తాన్‌ను 1948లో తనలో కలుపుకుంది. అప్పటి నుంచి అక్కడి బలూచ్ ప్రజలు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. బలూచ్‌లో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది పాక్ ప్రభుత్వం. తమకు ఎదురుతిరిగిన వాళ్లను ఆచూకీ లేకుండా చేసింది. ఏ ప్రాంతం అయినా అణచివేతలను కొంత వరకే భరించగలుగుతుంది. ఆ తర్వాత తిరుగుబాటు మొదలవు తుంది.

ఆ నాడు బంగ్లాదేశ్‌లో జరిగింది కూడా అదే. ఇప్పుడు బలూచిస్తాన్‌లోనే అదే జరుగుతోంది. ఎప్పు డైతే పాకిస్తాన్ అణచివేతలు తీవ్రమయ్యాయో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ప్రజలు ఎదురుతిరగడం మొదలుపెట్టారు. ఈ గ్రూపు చైనా-పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్తాన్‌లోని గ్యాస్‌, ఖనిజ వనరులను చైనా, పాక్‌ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. చైనా-పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా ఇక్కడి గ్వాదర్‌ పోర్ట్‌, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకున్న నేపధ్యంలో ఆ ప్రాజెక్టులే లక్ష్యంగా దాడులు చేస్తోంది.

బలూచ్ తర్వాత ఆజాదీ కోరుకుంటున్న మరో ప్రాంతం సింధ్. బ్రిటిష్ వారు తమ ఆక్రమించిన సింధూ రాజ్యాన్ని బలవంతంగా పాకిస్తాన్ లో కలిపారు. ఆనాడు మొగ్గ తొడిగిన పోరాటం యాభై ఏళ్లుగా వృద్ధి చెందుతూ వచ్చింది. దేశ విభజన అనంతరం లక్షలాదిమంది ముహజర్లు భారత్‌ నుంచి సింధ్‌కు వచ్చి స్థిరపడ్డారు. వీరిని పంజాబీ పాలకులు చిన్నచూపు చూడటంతో తమకు ప్రత్యేక దేశం ఇవ్వాలన్న ఉద్యమం ప్రారంభమైంది. స్థానిక సింధ్‌ ప్రజల నుంచి ఈ డిమాండ్‌కు పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. దేశానికి జీవనాడైన కరాచీ రేవు ఈ రాష్ట్రంలోనే ఉంది.

వాస్తవానికి.. సింధు దేశ్ పోరాటం ఇప్పుడిప్పుడే అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి వస్తోంది. జాఫర్ సాహితో లాంటి నాయకులు అమెరికా లాంటి దేశాల్లో సింధ్ దేశ్ గురించి ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పటి వరకూ సుమారు 60 మంది సింధ్ దేశ్ కీలక నేతలను హతమార్చింది. వేల మందిని జైళ్లలో నిర్బంధించింది. ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా సింధ్ దేశ్ పీపుల్స్ ఆర్మీ లాంటి సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయి. బలుచిస్తాన్ పోరాటంతో పోల్చి చూస్తే సింధ్ దేశ్ పోరాటానికి ప్రజల మద్దతు తక్కువగానే ఉన్నప్పటికీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల తిరుగుబాటు సింధ్ ప్రజల ఆలోచనను కూడా మార్చేస్తోంది.

బలూచిస్తాన్, సింధ్ తర్వాత ఇస్లామాబాద్ నుంచి విముక్తి కురుకుంటున్న మరో ప్రాంతం ఖైబర్ ఫఖ్తుంఖ్వా. పాక్‌లోని వాయువ్య రాష్ట్రం అయిన ఖైబర్‌ ఫఖ్తుంఖ్వాలో ఫస్తూన్‌ జాతీయవాదం బలంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లోనూ వీరిసంఖ్య మెజార్టీగా ఉంది. రెండు దేశాల మధ్య డ్యూరండ్‌ రేఖ ఉన్నా సన్నిహిత సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయి. ఆఫ్ఘాన్ వాసులు ఎక్కువగా వస్తున్నారన్న కారణంతో పాక్‌ సైన్యం తరచూ సరిహద్దును మూసివేస్తోంది. దీనిపై ఫస్తూన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ఆఫ్ఘాన్ ను ఆనుకొని ఉండటంతో పాకిస్తాన్ తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువ. ఎంతలా అంటే అక్కడి గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ చట్టాలకు విలువే లేదు. తాలిబన్లు చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం.

ఇక ఆర్థిక పరిస్థితి దిగజారి పోవడంతో ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. వీరందరికీ ఆఫ్ఘన్ తాలిబాన్ల మద్దతు లభిస్తోంది. గతంలో పాక్ ఇంటీరియల్ మంత్రి రాణా సనావుల్లా మిలిటరీ యాక్షన్‌పై కామెంట్స్ చేశారు. దీనికి ప్రతిగా తాలిబాన్లు 1971లో భారత సైన్యం ముందు లొంగిపోయిన పాకిస్తాన్ ఆర్మీ ఫోటోను షేర్ చేశారు తాలిబాన్లు. మరోసారి మిలిటరీ యాక్షన్.. అంటే 1971 సీన్ రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఖైబర్ ప్రాంతంలో ఇటీవల భద్రతా బలగాలపై దాడులు అధికం అయ్యాయి. దీనికితోడు ఆ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య డ్యూరాండ్ లైన్ వివాదం నడుస్తోంది. దీంతో ఆఫ్ఘన్ తాలిబాన్లు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు.

నిజానికి ఈ పరిస్థితులన్నింటికీ కారణం పాకిస్తానే. భారత్‌ నుంచి కశ్మీర్‌ను విడదీయాలనే కుట్రలతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హెచ్‌యూఎం వంటి ఉగ్రవాద సంస్థలను సృష్టించి భారత్‌లో విధ్వంసానికి కుట్రలు చేసింది. అలాంటి వాటిలో ఇప్పుడు పాకిస్తాన్‌పైనే తిరగబడుతున్న టీటీపీ కూడా ఉంది. గతేడాది ఇదే సమయంలో టీటీపీ.. పాకిస్తాన్‌లో సమాంతర ప్రభుత్వాన్ని ప్రకటించి సంచలనం సృష్టించింది. కేబినెట్ ఏర్పాటు చేసి మంత్రులను కూడా నియమించింది. రక్షణ, విద్య, న్యాయ, సాంకేతిక, నిఘా, ఆర్థిక, రాజకీయ సంబంధాలతో పాటు నిర్మాణ శాఖను కూడా ఏర్పాటు చేస్తూ ఫత్వా జారీ చేసింది.

తమ ఆధ్వర్యంలో ఉన్న భూభాగాలను టీటీపీ రెండుగా విభజించింది. నార్త్‌జోన్ కింద పెషావర్, మలకాండ్, గిల్గిట్-బాల్టిస్తాన్, మర్డాన్.. సౌత్ జోన్ కింద డేరా ఇస్మాయిల్ ఖాన్, బన్ను, కొహాట్ ప్రాంతాలను చేర్చింది. ఆయా ప్రాంతాలు తాత్కాలికంగా పాకిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత అక్కడ ఇస్లామాబాద్ అధికారం ఓ కలగానే మారింది. అక్కడితో ఆగని టీటీపీ ఇస్లామాబాద్‌పైకి ఉగ్రవాదులను పంపి దాడులు చేయించడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ అత్యవసర సమావేశాలు నిర్వహించి.. టీటీపీ శిబిరాలు, నెట్‌వర్క్‌ను నాశనం చేయాలని నిర్ణయించింది. కానీ, అవేవీ వర్క్‌ఔట్ కాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అందుకు నిధుల్లేవ్. ఈ పరిస్థితులే పాకిస్తాన్‌ను ముక్కలు చెక్కలు చేయబోతున్నాయి.

గుడ్ న్యూస్ ..ఇక హైదరాబాద్ లో ఎయిర్ ట్యాక్సీలు..

హైదరాబాద్ లో ఎయిర్ ట్యాక్సీలు నడపడానికి డ్రోన్ టెక్ స్టార్టప్ కంపెనీ డ్రోగ్రో డ్రోన్స్ ప్రయత్నిస్తోంది.
దానికి సంబంధించిన టెక్నికల్ వర్స్ అన్నీ బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతున్నాయని డ్రోగో డ్రోన్స్ కో ఫౌండర్ శ్రీధర్ దన్నపనేని శుక్రవారం తెలిపారు.

కమర్షల్ ఎయిర్ ట్యాక్స్ సర్వీసులు నడపడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తో గ్రేటర్ హైదరాబాద్ లో డ్రోన్లతో మనుషుల రవాణా చేయనున్నారు. ఇక అటోలు, ట్యాక్సీలు ఎలా ఎక్కుతామో.. డ్రోన్లలో కూడా అలా కూర్చొని ట్రావెల్ చేయవచ్చు. ఎయిర్ ట్యాక్సీ హైదరాబాద్ సిటీలో ఎమర్జెన్సీ సర్వీసులకు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు డ్రోగ్రో డ్రోన్స్ సీఈఓ యశ్వంత్ బొంతు వివరించారు.

6 లక్షల అయ్యప్ప ప్రసాద డబ్బాలని నాశనం చేయండి! కేరళ హైకోర్టు సంచలన తీర్పు!

కేరళ రాష్ట్రంలో కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రల్లో శబరిమల కూడా ఒకటి. ఇక్కడే ఆ అయ్యప్ప స్వామి కొలువై ఉన్నారు. అంతేకాకుండా.. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు స్వామి దర్శనం కోసం ప్రతి ఏటా శబరిమలకు వెళ్తుంటారు.

ఈ క్రమంలోనే..అయ్యప్ప మాలలు ధరించి.. ఆ మణికంఠుడ్ని సందర్శించి.. ఆ తర్వాత మాల విరమణ చేస్తారు. అయితే కేరళలో కొలువై ఉన్న అయ్యప్ప స‍్వామి ఎంత ఫేమస్సో.. ఇక అక్కడ ఆయన అరవణ ప్రసాదం కోసం కూడా అంతే ఫేమస్‌.

ఈ క్రమంలోనే చాలామంది శబరిమలకు ఎవరైనా వెళ్తున్నారంటే.. అరవణ ప్రసాదం తీసుకురమ్మని చెబుతూ ఉంటారు. పైగా ఆ అరవణ ప్రసాదం టేస్ట్‌ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే అలాంటి ఫేమస్‌ అరవణ ప్రసాదాన్ని.. శబరిమల ఆలయ దేవస్థానం బోర్డు నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈమేరకు తాజాగా కేరళ హైకోర్టు ఆదేశాలతో ఈ చర్యలకు దిగింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..కేరళలో అయ్యప్ప స్వామి ప్రసాదం ఎంత ఫేమస్‌ అనేది అందరికి తెలిసిందే. అయితే ఈ ప్రసాదాన్ని తాజాగా దేవస్థానం బోర్డు నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం తాజాగా కేరళ హైకోర్టు ఆదేశాలతో ఈ చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే.. దాదాపు 6.65 లక్షల అరవణ ప్రసాదం టిన్లను డిస్పోజ్ చేయాలని ఇప్పటికే కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

ఎందుకంటే.. ఆ అరవణ ప్రసాదంలో వాడే యాలకుల్లో మోతాదుకు మించి పెస్టిసైడ్స్ ఉన్నాయని తేలింది. అందుకోసమే కేరళ హైకోర్టు ఈ తీర్పును ఆదేశించింది. ఇక ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయకుండా.. వాటిని డిస్పోజ్ చేయాలని సూచించింది. అయితే కేరళ హైకోర్టు ఆదేశాలతో 6.5 లక్షల ప్రసాదం క్యాన్లను సైంటిఫిక్‌గా డిస్పోజ్ చేసేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తాజాగా ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాగా, ఈ అరవణ ప్రసాదం మొత్తం విలువ 5.3 కోట్లు ఉండవచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ అరవణ ప్రసాదం టిన్లను డిస్పోజ్ చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఆ ప్రసాదం క్యాన్ల షెల్ఫ్ లైఫ్ పూర్తైన నేపథ్యంలో.. ఎట్టి పరిస్థితిలోనూ అవి భక్తులకు చేరకూడదని వెల్లడించింది. అలాగే పవిత్రమైన అయ్యప్ప ప్రసాదం కావడంతో వాటిని నాశనం చేసే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఈ ప్రక్రియలో హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ పాటించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది.

Maida Pindi : మైదా పిండి ఎలా తయారవుతుందో తెలిస్తే ఇకపై దాన్ని తినడం మానేస్తారు..!

Maida Pindi : మనం బయట లేదా ఇంట్లో అనేక రకాల వంటకాలను చేసి తింటుంటాము. వాటిల్లో అనేక రకాల స్వీట్లు, కేకులు, బ్రెడ్‌, పిండి వంటకాలు, నూనె పదార్థాలు ఇలా ఉంటాయి.

అయితే వాటిల్లో ఎక్కువగా ఏ పిండి వాడుతారో తెలుసు కదా. అవును, మైదా పిండినే వాడుతారు. అయితే సాధారణంగా గోధుమలను మరలో ఆడించి గోధుమ పిండి తీస్తారు. అదే రాగుల నుంచి అయితే రాగి పిండి, బియ్యం నుంచి బియ్యం పిండి వస్తాయి. మరి మైదా పిండి దేనితో తయారవుతుంది ? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. కానీ మైదా పిండిని మాత్రం మనం వాడుతున్నాం. అయితే మైదా పిండితో తయారు చేసిన పదార్థాలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ చాలా మంది వినడం లేదు. ఇక మైదా పిండిని దేంతో తయారు చేస్తారో తెలుసుకుందాం.

మైదా పిండిని ఇలా చేస్తారు..

సాధారణంగా గోధుమ పిండిని పట్టేటప్పుడు గోధుమలను నేరుగా అలాగే మరలో వేస్తారు. దీంతో పిండి బయటకు వస్తుంది. కానీ గోధుమలను బాగా పాలిష్ చేసి మరలో వేస్తే మైదా పిండి తయారవుతుంది. గోధుమలపై ఉండే పొరను దాదాపుగా తీసేస్తారు. దీంతో లోపల మృదువైన పిండి ఉంటుంది. అదే మైదా పిండి. ఇలా గోధుమలను బాగా పాలిష్ పట్టి అనంతరం వాటిని మరలో వేసి తీయగా వచ్చేదే మైదా పిండి. ఈ పిండిలో అసలు ఎలాంటి పోషకాలు ఉండవు. గోధుమల పైపొరలోనే పోషకాలు ఉంటాయి. కనుక మైదా పిండిని తింటే ఎలాంటి పోషకాలు లభించవు. పైగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక మైదా పిండిని తెల్లగా చేసేందుకు దానికి అజోడికార్బోనోమైడ్, క్లోరీన్ గ్యాస్, బెంజోల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను కలుపుతారు. చివర్లో పొటాషియం బ్రోమేట్‌ను కలుపుతారు. దీంతో మైదా పిండి చాలా తెల్లగా, మెత్తగా, మృదువుగా తయారవుతుంది. ఇలా చేసిన మైదా పిండి చాలా తక్కువ ధరకు లభిస్తుంది. అందుకనే మైదా పిండిని చాలా మంది వాడుతారు. కానీ వాస్తవానికి ఇది ఏమాత్రం మంచిది కాదు.

Maida Pindi
గారెలు, ఇడ్లీల తయారీలోనూ..

గోధుమ పిండి కన్నా కూడా మైదా పిండి చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అందుకనే హోటల్స్‌లోనూ పూరీల తయారీలో దీన్నే ఎక్కువగా వాడుతారు. అలాగే దీంతో బొండాలను కూడా వేస్తారు. దీంతోపాటు గారెలు, ఇడ్లీల తయారీలోనూ కొందరు మైదాను వాడుతారు. ఇలా మైదా వాడకం ఎక్కువైపోయింది. కానీ దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్న విషయాన్ని మాత్రం చాలా మంది గ్రహించడం లేదు.

వాస్తవానికి మైదా పిండి అనేది వట్టి వ్యర్థ పదార్థం. ఇందులో కెమికల్స్ తప్ప ఏమీ ఉండవు. అందువల్ల దీన్ని తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలగకపోగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే చాన్స్ ఉంటుంది. మైదా పిండి తయారీలో వాడే బ్రోమేట్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకనే బ్రోమేట్‌ను నిషేధించారు కూడా. ఇక చాలా కీటకాలు కూడా మైదాను తిన్న వెంటనే చనిపోతాయి. దానికి కారణం అందులో ఉండే కెమికల్సే. దీన్ని బట్టి మైదా ఎంత ప్రమాదకరమైనదో మీకు ఇట్టే అర్థమవుతుంది. ఇక మైదా పిండితో నీళ్లు కలిపి పోస్టర్లు అంటించేందుకు తప్ప అది ఎందుకూ పనికిరాదు. దీంతో చాలా మంది రవ్వ దోశలు, పరోటా, రుమాలీ రోటీ, కేకులు, కాజా, జిలేబీ, హల్వా వంటి అనేక స్వీట్లు చేస్తారు. కనుక ఇకపై మైదా పిండి వాడకండి. దానికి బదులుగా వేరే ఏదైనా పిండి వాడండి. లేదంటే అనారోగ్యాల పాలు కాక తప్పదు.

ఏపీలో హింసాత్మక ఘర్షణలు..బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ

కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని ఈసీ స్పష్టం చేసింది.

నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయిల్ బంకుల లైసెన్స్లు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు అన్ని బంకుల యజమానులకు నోటీసులు పంపింది. పోలింగ్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో పలుచోట్ల హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.

కాగా రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు రాళ్లు, రాడ్డు, కర్రలు, కత్తులు, పెట్రోల్ బాంబులతో దాడుల చేసుకున్నారు. ఈ దాడుల్లో చాలా మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది.పలువురు అధికారులను బదిలీ చేసింది. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది.

AP Elections 2024: అల్లర్లపై రంగంలోకి సిట్… త్వరలో కీలక నేతల అరెస్ట్‌లు..!

అమరావతి: ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP)ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దాడులు పెరిగిపోయాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024)పోలింగ్ జరిగిన రోజు దగ్గరి నుంచి వరుసగా ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ప్రజలను, ప్రతిపక్షాలను వైసీపీ మూకలు భయపెడుతూ అరాచకాలు, అల్లర్లకు పాల్పడుతున్నాయి.మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతున్నాయి.

అయితే వైసీపీ మూకలు చేస్తున్న అల్లర్లు, అరాచకాలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. పల్నాడుతో పాటు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, తిరుపతిలో చెలరేగిన హింసపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పల్నాడు జిల్లాలో అల్లర్లపై సిట్ ఆరా…

పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన ఘటనలపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఈ మేరకు పల్నాడు జిల్లాలో ఈరోజు (శనివారం) సిట్ బృందం పర్యటిస్తోంది. అలాగే నరసరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై ఆరా తీస్తోంది. టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులకు కారణమైన వారిపై సిట్ బృందం వివరాలు అడిగి తెలుసుకుంటుంది. టీడీపీ- వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీస్తుంది. ఆయా పోలీస్ స్టేషన్లలో నుంచి సిట్ బృందం విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

దర్యాప్తులో వేగం..

పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులపై సరైన చర్యలు తీసుకోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు మరికొంత మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. హింసకు పాల్పడుతుంటే పోలీసులు ఎవరికి కొమ్ము కాశారని ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది. దాడులకు ఇంకా ఎవరు సహకరించారనే దానిపై పూర్తి దర్యాప్తు చేయడానికి సీట్‌ను ఎన్నికల సంఘం నియమించింది.

ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. 13 మంది పోలీసులతో కూడిన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ విచారణలో ఎంతటి వ్యక్తులు పాల్గొన్న దర్యాప్తునకు వెనకాడబోవద్దని సీట్‌కు ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తులో సిట్ వేగం పెంచినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే దాడులకు స్పంచ్ఛదంగా, పరోక్షంగా సహకరించిన కొంతమంది నేతలపై ఈసీ కన్నెర్ర జేసింది. ఇందులో భాగంగానే కీలక నేతలపై ఈసీ, సిట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వారు ఎంతటి వారయినా ఉపేక్షించేది లేదని వదలిపెట్టబోవద్దని హెచ్చరించింది. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు సిట్ కీలక వివరాలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది.

తొలిసారిగా సిట్ ఏర్పాటు

కాగా.. ఈసీ ఆదేశాలతో ఐజీ వినీత్‌, బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో దర్యాప్తులో వేగం పెంచింది. సిట్ ఇస్తున్న నివేదికలతో ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకు ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేయలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగిపోవడంతో సిట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఏర్పడింది.

కుంభకోణాలు, భారీ స్కాములు జరిగితేనే సిట్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ తొలిసారిగా ఏపీలో అధికార వైసీపీకి పోలీసులు వత్తాసు పలకటంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీట్ ఇచ్చే నివేదికపై కీలక నేతల్లో ఉత్కంఠత నెలకొంది. కాగా.. ఇప్పటికే కొంత మంది నేతలు పక్క రాష్ట్రాలకు పారిపోయినట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలియడంతో ముందస్తుగా వారు ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆడపిల్లల భవిష్యత్తుకు అద్భుత స్కీం.. 21 ఏళ్లు వచ్చేసరికి మీ చేతిలో రూ. 70 లక్షలు.. ఎలాగంటే.?

మనం మన కుమార్తెల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం గురించి చర్చించినప్పుడు, అనుకోకుండానే సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రస్తావన వస్తుంది. రాజన్ తన స్నేహితులు లేదా సలహాదారులతో మాట్లాడినప్పుడు, అతని 10 ఏళ్ల కుమార్తె రియా కోసం సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టే విషయంపైనే చర్చ జరిగింది.

ఇతర చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే ఈ స్కీమ్ అత్యధికంగా 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. మీకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అదనంగా, సుకన్య యోజన కింద మెచ్యూరిటీపై అందుకున్న మొత్తమంతా పన్ను రహితమే.

సుకన్య యోజనలో, కుమార్తె కోసం 10 సంవత్సరాల వరకు ఖాతాను తెరవవచ్చు. రాజన్ కుమార్తెకు కూడా పదేళ్లు. అతడు ఈ ఖాతాను తెరవగలడు. 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. ఇక అతడి కూతురికి 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సుకన్య సమృద్ధి యోజన ఖాతా మెచ్యూర్ అవుతుంది.ఈ సుకన్య సమృద్ది యోజన పథకం కింద, అమ్మాయికి 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన భాగాన్ని చదువుకు, ఇతరత్రా ఖర్చులకు పొదుపు చేయవచ్చు. రాజన్ సుకన్య ఖాతాలో ఏటా 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. రియా ప్రస్తుతం 10 ఏళ్ల వయస్సు ఉన్నందున, ఆమెకు 18 ఏళ్లు వచ్చేసరికి మొత్తం రూ. 12 లక్షల పెట్టుబడి అవుతుంది.

ప్రస్తుత 8.2 శాతం వడ్డీ రేటును పరిగణనలోకి తీసుకుంటే 8 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం 16.95 లక్షల రూపాయలు కావచ్చు. రాజన్ అప్పుడు ఉండే ఈ మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేయగలడు. ఆ మొత్తాన్ని ఆమె ఉన్నత విద్య ఫీజులకు కవర్ చేయొచ్చు. ఒకవేళ అలాకాకుండా అమ్మాయికి మొదటి నుంచి 21 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ సుకన్య స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే.. 2045 నాటికి కార్పస్ సుమారు 70 లక్షల రూపాయలకు పెరుగుతుంది. ఈ పధకం ఆడపిల్లల భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుంది.

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

Drink for Lungs: గాలి కాలుష్యం, కరోనా వైరస్ వీటివల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యేవి ఊపిరితిత్తులే. ప్రస్తుత రోజుల్లో ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది.

న్యూమోనియా, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇలా ఎన్నో రకాల కారణాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన కఫం పట్టడం, ఆయాసం, శ్వాస తీసుకోలేకపోవడం వంటివి ఛాతీని ఇబ్బంది పెడుతున్నాయి. ఊపిరితిత్తులు పరిశుభ్రంగా ఉండాలంటే మేము ఇక్కడ చెప్పిన చిన్న చిట్కాను పాటించండి చాలు. ఈ ఇంటి చిట్కాలు ప్రతిరోజూ పాటించడం వల్ల ఊపిరితిత్తులు పూర్తిగా పరిశుభ్రమవుతాయి.

ఇదిగో డ్రింక్

ప్రతిరోజూ గ్లాసు గోరువెచ్చటి నీటిని తీసుకోండి. అందులో నాలుగు స్పూన్ల తేనెను కలపండి. అలాగే ఒక స్పూను నిమ్మరసం కూడా కలపండి. అందులోనే చిటికెడు మిరియాల పొడి, చిటికెడు యాలకుల పొడి వేసి బాగా కలిపి తాగుతూ ఉండండి. ఈ గ్లాసు నీటిని ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి తాగుతూ ఉంటే ఎంతో మంచిది. అయితే ఈ సమయంలో మిగతా ఆహారాలను తీసుకోకూడదు.

ఇలా ఆగి ఆగి కొన్ని గంటల పాటు ఆ నీటిని తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం, వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పోతాయి. బ్యాక్టీరియా, వైరస్ లో వంటివి నశిస్తాయి. రోగ నిరోధక శక్తి బలోపేతం అయ్యి యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఈ గ్లాసుడు నీళ్లు ఒక పూటంతా తాగి ఉపవాసం ఉంటే మంచిది. ఆ తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇలా మూడు నాలుగు రోజులు పాటు చేసి చూడండి. ఛాతీకి పట్టిన కఫం మొత్తం పోతుంది. మధ్య మధ్యలో ఆవిరి పడుతూ ఉండాలి. ఆవిరి పట్టేటప్పుడు అందులో పసుపు, తులసి ఆకులు, యూకలిప్టస్ ఆయిల్ కూడా వేస్తూ ఉండాలి.

ఊపిరితిత్తులు కఫం పట్టినట్టు అనిపిస్తున్నా, ఆయాసం వస్తున్నా, శ్వాసకి ఇబ్బంది అనిపిస్తున్నా ఈ చిట్కాను తరచూ పాటిస్తూ ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ సమయంలో వేడి నీళ్లతోనే స్నానం చేయాలి. ఇలా చేస్తే వారంలోపే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటివి తగ్గుతాయి. నిమోనియా కూడా అదుపులోకి వస్తుంది. ఉప్పును చాలా తగ్గించి తీసుకోవాలి. రోజులో ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. మిగతా సమయాల్లో ఆ నీటిని తాగుతూ ఉండాలి. ఇది మీకు నాలుగు రోజుల్లోనే మంచి ఫలితాన్ని చూపిస్తుంది.

మళ్లీ జగనే సీఎం.. సంబరాలకు సిద్ధం కండి : YSRCP

మళ్లీ జగనే సీఎం.. సంబరాలకు సిద్ధం కండి అంటూ YSRCP ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రమాణం చేయనున్నట్లు ‘YSRCP’ ట్వీట్ చేసింది.

విశాఖలో జూన్ 9న ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది.

జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేయబోతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆ రోజు నుంచి సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఇక అటు ఇవాళ సీఎం జగన్‌ లండన్ చేరుకున్నారు. ఈ తరుణంలోనే లండన్‌ లో సీఎం జగన్‌ కు గ్రాండ్‌ గా వెలకమ్‌ పలికారు. ఈ సందర్భంగా ప్లైట్‌ నుంచి దిగుతూ సీఎం జగన్‌ కనిపించారు. పింక్‌ కలర్‌ షటర్‌ చేతిలో పట్టుకుని… నడుచుకుంటూ కారు ఎక్కారు జగన్‌. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

చిన్నస్వామి స్టేడియంకు అద్భుతమైన ప్రత్యేకత!.. ఎన్ని నీరు పోసిన ఇట్టే ఇంకిపోతున్నాయి (వీడియో వైరల్)

మైదానంలో చిన్న వర్షం పడ్డ కూడా మైదానం తడిసి పోవడంతో ఆ రోజు జరగాల్సిన ఆటను ఆపేసి వాయిదా వేస్తుంటారు. అలాంటిది మూడు ట్యాంకర్ల నీరు మైదానంలో ఓకే చోట పోసినా ఇట్టే మాయమైపోయాయి.

ప్రపంచంలో ఏ మైదానానికి లేని ఓ ప్రత్యేకత చిన్నస్వామి స్టేడియంకు ఉంది. బెంగళూరులోని చిన్న స్వామి క్రికెట్ స్టేడియంలో ఎన్ని నీళ్లు పోసినా ఇట్టే ఇంకిపోతున్నాయి. ఈ మైదానం ప్రపంచంలోనే ఎక్కడా లేని సబ్ ఎయిర్ డ్రైనేజీ, ఎయిరేషన్ సిస్టమ్ ను కలిగి ఉంది.

దీనిని ఇటీవలే పరీక్షించిన అధికారులు నిర్ఘాంతపోయారు. మూడు పైపుల ద్వారా మైదానంలో నీరు వదిలిన తర్వాత అందరూ చూస్తుండగానే కొద్ది సేపటికే నీరు మొత్తం భూమిలోకి ఇంకిపోయింది. అనంతరం అధికారులు మైదానాన్ని తడిమి చూడగా కొంచెం కూడా తడి లేదని తేల్చేశారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సిస్టమ్ అన్ని మైదానాలకు ఉంటే బాగుంటుంది అని, ఇలా అయితే ఏ ఒక్క మ్యాచ్ కు కూడా అంతరాయం కలగదని, రేపు జరగబోయే మ్యాచ్ కు కూడా వర్షం వచ్చినా ఆగకుండా ఉంటే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు.

itel నుంచి స్మార్ట్ వాచ్ మరియు లాకెట్ గా వాడగల వాచ్ లాంచ్! ధర వివరాలు

Itel సంస్థ తన సరికొత్త స్మార్ట్‌వాచ్, యునికార్న్ పెండెంట్ వాచ్‌ను ముందుగా టీజ్ చేసిన తర్వాత ఇప్పుడు భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ జెన్ Z ఫ్యాషన్‌కి అధునాతన టచ్‌ని జోడిస్తూ స్టైలిష్ లాకెట్టు డిజైన్ తో వస్తుంది.

అందువల్ల,స్మార్ట్‌వాచ్ మరియు లాకెట్టు రెండింటిగాను ఉపయోగించవచ్చు.

అద్భుతమైన డిజైన్ మరియు IML టెక్నాలజీతో రూపొందించబడిన, యునికార్న్ పెండెంట్ వాచ్ స్లిమ్ మెటాలిక్ బాడీని కలిగి ఉంది. మరియు ఈ డిజైన్ లో లెదర్ స్ట్రాప్ మరియు లాకెట్టు డిజైన్ ను రెండింటినీ కలిగి ఉంటుంది. ఇందులో, సులభమైన నావిగేషన్ కోసం స్పోర్ట్స్ మోడ్ బటన్, డైనమిక్ క్రౌన్ మరియు స్విచ్ బటన్‌ను కూడా కలిగి ఉంది.

500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఈ స్మార్ట్‌వాచ్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే ఫీచర్ ను అందిస్తుంది మరియు DIY వాచ్ ఫేస్ స్టూడియో ద్వారా అనుకూలీకరించదగిన 200 కంటే ఎక్కువ స్టైలిష్ వాచ్ ఫేస్‌లను అందిస్తుంది.

7 రోజుల బ్యాటరీ లైఫ్ మరియు 15 రోజుల స్టాండ్‌బై టైమ్‌తో, ఈ వాచ్ కేవలం 30 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ అవుతుంది. ఇది 100+ స్పోర్ట్స్ మోడ్‌లతో పాటు ఫిమేల్ సైకిల్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్ మరియు హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి ఆరోగ్య ఫీచర్లను కూడా కలిగి ఉంది.

డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్లలో SpO2, 24×7 హృదయ స్పందన రేటు, ఒత్తిడి, స్త్రీ ఆరోగ్యం, నీటి రిమైండర్ మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. AI వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది.

అదనంగా, ఇది సంగీతం మరియు కెమెరా కంట్రోల్ ఫీచర్లు కూడా కలిగి ఉంది. ఫైండ్ మై ఫోన్ మరియు DND మోడ్ వంటి స్మార్ట్ ఫంక్షనాలిటీలతో సహా బ్లూటూత్ కాలింగ్‌ ఫీచర్ ను కూడా అందిస్తుంది. ఇది వాయిస్ అసిస్టెంట్లకు మద్దతు ఇస్తుంది మరియు మన్నిక కోసం IP68 నీటి నిరోధక ఫీచర్ ను కలిగి ఉంది.

ధర మరియు లభ్యత వివరాలు

ఈ ఐటెల్ యునికార్న్ పెండెంట్ వాచ్ ధర రూ. 2,899 గా లాంచ్ అయింది మరియు డార్క్ క్రోమ్ మరియు షాంపైన్ గోల్డ్ రంగులలో వస్తుంది. ఇది మే 18 నుండి ఆన్‌లైన్‌లో మరియు ఇతర రిటైలర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ఈ స్మార్ట్ వాచ్ లాంచ్‌పై ఐటెల్ ఇండియా సీఈఓ అరిజీత్ తలపాత్ర మాట్లాడుతూ, ఐటెల్ యునికార్న్ పెండెంట్ వాచ్‌ను లాంచ్ చేయడంతో, మా వినియోగదారుల జీవనశైలిని మెరుగుపరిచే స్టైలిష్ స్మార్ట్ యాక్సెసరీని అందించడం ద్వారా భారతదేశంలోని స్మార్ట్‌వాచ్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చడానికి మేము ప్రయత్నిస్తున్నాము.

మా లక్ష్యం అత్యాధునిక టెక్నాలజీ ని మాత్రమే కాకుండా చక్కదనం మరియు అనుకూలతను కూడా అందించడం. ఈ యునికార్న్ లాకెట్టు గడియారం కేవలం ఫ్యాషన్ యాక్సెసరీకి మించి ఉంటుంది; ఇది కస్టమర్ సంతృప్తి పట్ల మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. అప్రయత్నమైన వినియోగంతో రోజువారీ జీవితంలో సజావుగా ఏకీకృతం చేయడం, ఇది సమకాలీన జీవనంలో ముఖ్యమైన భాగం అవుతుంది. ఒక సొగసైన డిజైన్‌లో సౌలభ్యం మరియు డిజైన్ రెండింటినీ మెరుగుపరుస్తుంది. అని తెలియచేసారు

Curd : రోజూ పెరుగు తింటే ఆ క్యాన్సర్ మటుమాయం..!

Curd : ఈ రోజుల్లో ఎప్పుడు ఏ రోగం వచ్చేది కూడా తెలియట్లేదు. అందులోనూ క్యాన్సర్ వచ్చిందంటే మాత్రం దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. ప్రస్తుత కాలంలో ఎంత టెక్నాలజీ వచ్చినా సరే ఈ క్యాన్సర్ కు మాత్రం మందులు పనిచేయట్లేదు.

ఎన్ని మందులు వాడినా సరే అస్సలు తగ్గట్లేదు. అధునాతన ట్రీట్ మెంట్లు వచ్చినా సరే క్యాన్సర్ తగ్గకపోవడంతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే క్యాన్సర్లలో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువ మందికి వస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా వస్తోంది.

Curd : కాలుష్యంతో కూడా..

వాస్తవానికి స్మోకింగ్ చేసే వారిలోనే ఇది ఎక్కువగా కనిపిస్తోంది. అంతే కాకుండా పొగాకు తాగేవారిలో కూడా కనిపిస్తోంది. కేవలం పొగ తాగే వారిలోనే కాకుండా పొగ పీల్చే వారిలో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు వీరే కాకుండా అటు కాలుష్యంతో కూడా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో 20 శాతం మంది సిగరెట్లు తాగని వారే ఉంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం జీవన విధానంలో వస్తున్న మార్పులు కూడా కావచ్చు.

కాగా ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు చేయాలని చెబుతున్నారు. దాంతో పాటు రోజూ తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే ఊపిరిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఏదో తమాషాకు చెబుతున్న విషయం కాదండోయ్.. ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత చెబుతున్న మాట. రోజుకు సుమారు 85 గ్రాముల పెరుగు తినే మగవారికి, 113 గ్రాముల పెరుగు తినే ఆడవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 19% వరకు తక్కువ.

Curd : రోజూ పెరుగు తింటే ఆ క్యాన్సర్ మటుమాయం..!

ఎందుకంటే పెరుగులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది లంగ్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని బాగానే తగ్గిస్తుంది. దాదాపు 14 లక్షల మందిని పరిగణలోకి తీసుకొని వారిపి రీసెర్చ్ చేయగా ఈ విషయాలు తెలిశాయి

తెలంగాణ EAMCET ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి!

ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించాలంటే.. టెన్త్ తర్వాత ఇంటర్ మీడియట్ నుంచి కష్టపడాలి. తమ పిల్లలు గొప్ప చదువులు చదివి గొప్ప ఉద్యోగం సంపాదించి సొసైటీలో మంచి పొజీషన్ లో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం వారి తాహతకు మించినప్పటికీ పిల్లలను మంచి విద్యాసంస్థల్లో చేర్పించి చదివిస్తారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు విద్యార్థులు. ఎంసెట్ లో సీటు సాధించి ఉన్నత విద్యనభ్యసించేందుకు పునాధులు వేసుకుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఈఏపీసెట్ (ఎంసెట్) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో మే 7 నుంచి 11 వ తేదీ వరకు ఇంజనీరింగ్,ఫార్మసీ, అగ్రి కల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటల తర్వాత విద్యాశాఖ అధికారులు జేఎన్టీయూ హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. త్వరలోనే ఈఏపీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఈఏపీసెట్ 2024 ప్రవేశ పరీక్షలకు దాదాపు 3.54 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 94 శాతం, అగ్రి కల్చర్ , ఫార్మసీ విభాగాలకు 90 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. eamcet.tsche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి.. TS EAPCET 2024 Results ఆప్షన్ ని ఎంచుకోవాలి. మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.. TS EAPCET 2024 ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. మీ రిజల్ట్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు.

ఈ ఏడాది ఇంజనీరింగ్ లో 74.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్ ఎస్ జ్యోతిరాదిత్య (శ్రీకాకుళం-పాలకొండ), సెకండ్ ర్యాంక్ హర్ష (కర్నూల్-పంచలింగాలు), మూడవ ర్యాంక్ రిషి శేఖర్ శుక్లా (సికింద్రాబాద్-తిరుమలగిరి), నాలుగో ర్యాంక్ సందేశ్ (హైదరాబాద్ – మాదాపూర్), ఐదో ర్యాంక్ యశ్వంత్ రెడ్డి (కర్నూల్) సాధించారు. ఈసారి ఇంజనీరింగ్ లో మొదటి పది ర్యాంకుల్లో ఒక్క అమ్మాయి మాత్రమే స్థానం సంపాదించింది. అగ్రి కల్చర్, ఫార్మసీ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ ప్రణీత (మదనపల్లె), రెండో ర్యాంక్ రాధాకృష్ణ(విజయనగరం), మూడో ర్యాంక్ శ్రీవర్షిణి (హనుమకొండ), నాలుగో ర్యాంక్ సాకేత్ రాఘవ్ (చిత్తూరు), ఐదో ర్యాంక్ సాయి వివేక్ (హైదరాబాద్) సాధించారు. త్వరలోనే ఈఏపీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు.

సెకన్ల వ్యవధిలో దూసుకొచ్చిన జలపాతం..బాలుడి గల్లంతు

తమిళనాడులోని తేన్ కాశి జిల్లాలో పశ్చిమ కనుమల వద్ద కొలువుదీరిన పుణ్యక్షేత్రం… కుర్తాళం.

ఇక్కడి జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. అయితే ఈ ప్రాంతంలో గత ఐదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎప్పట్లాగానే పర్యాటకులు పాత కుర్తాళం జలపాతం వద్దకు రాగా, కొన్ని సెకన్ల వ్యవధిలోనే మెరుపు వరదలు సంభవించాయి. చూస్తుండగానే నీటి ప్రవాహం ఉద్ధృతమైంది.

దాంతో పర్యాటకులు హడలిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా, కుర్తాళం జలపాతం భయానక రూపుదాల్చిన నేపథ్యంలో, అశ్విన్ అనే ఓ 17 ఏళ్ల కుర్రాడు గల్లంతయ్యాడు. 11వ తరగతి చదువుతున్న ఆ బాలుడు పాలయంకొట్టై ప్రాంతంలోని ఎన్జీవో కాలనీకి చెందినవాడిగా గుర్తించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంటనే స్పందించి కుర్తాళం జలపాతం వద్దకు చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే అశ్విన్ మృతదేహం జలపాతం నుంచి అరకిలోమీటరు దూరంలో కొండరాళ్ల మధ్య చిక్కుకుని కనిపించింది.

ప్రశాంతమైన జీవితానికి గౌతమ బుద్ధుడు చెప్పే బోధనలు ఇవే

బుద్ధ పూర్ణిమ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ సమాజం భక్తి శ్రద్ధలతో జరుపుకునే బుద్ధ పూర్ణిమను దేశంలోని అనేక ప్రాంతాల్లో వైశాఖ పూర్ణిమ లేదా వెసక్ అని కూడా పిలుస్తారు.

బౌధ్ధ ప్రజలు ఈ పవిత్రమైన రోజును వేడుకలా నిర్వహించుకుంటారు. గౌతమ బుద్ధుని జయంతిని బుద్ధ పూర్ణిమగా నిర్వహించుకుంటారు. ఈ రోజున సిద్ధార్థ గౌతముడు బుద్ధగయలోని పవిత్ర బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారాడు.

ఈ సంవత్సరం బుద్ధ పూర్ణిమ మే 23 గురువారం నిర్వహించుకుంటారు. ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకుంటున్నప్పుడు గౌతమ బుద్ధుని బోధనలను, శాంతి, అహింస, ఆప్యాయతలతో కూడిన జీవితాన్ని ఆయన బోధనల ద్వారా నేర్చుకోవచ్చు. గౌతమ బుద్ధుడి బోధనలు జీవితంలో ఎంతో స్పూర్తిని నింపుతాయి. జీవితంపై ఆశను పెంచుతాయి. అత్యాశను తగ్గిస్తాయి.

మీ జీవితాన్ని మార్చే గౌతమ బుద్ధుని బోధనలు

ఈ విశ్వంలో ఏదీ కోల్పోలేదు: గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రకారం మనం చేసిన పని ఫలితం తిరిగి మనకే వస్తుంది. కాబట్టి, ఏ పని అయినా శ్రద్ధా, ప్రేమతో చేయాలి. జీవితాన్ని ఆనందంగా గడపాలి.

ప్రతిదీ మారుతుంది: మార్పు ఈ ప్రపంచంలో స్థిరంగా ఉంటుంది. మీ చుట్టూ పరిస్థితులు ఎలా మారినా మీరు దానిని స్వీకరించడం నేర్చుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా జీవించగలరు.

వర్తమానంలో జీవించండి: గతం గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం కంటే వర్తమానంపై దృష్టి పెట్టాలని బుద్ధుడు ప్రజలను కోరారు.

సత్యాన్ని దాచలేం: సూర్యచంద్రుల మాదిరిగానే సత్యాన్ని కూడా కంటికి కనిపించకుండా దాచలేమని వివరిస్తున్న గౌతమ బుద్ధుడు. నిజం కాస్త ఆలస్యమైనా కచ్చితంగా బయటికి వస్తుంది.

పాజిటివ్ గా ఆలోచించండి: మనస్సు ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. సానుకూల జీవితాన్ని పొందడానికి మీరు మనస్సును సానుకూల ఆలోచనలతో నింపాలి.

వదులుకోవద్దు: మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా మీపై మీకు శ్రద్ధను, ఇష్టాన్ని వదులు కోవద్దు. అదే జీవితానికి చుక్కానిలాంటిది.

ఒంటరిగా నడవండి: కొన్నిసార్లు మనం సత్యమార్గంలో నడిచినప్పుడు తోడు ఎవరూ రాకపోవచ్చు. అయినా సరే ఒంటరిగానే నడవాలి కానీ… సత్య మార్గాన్ని వదలకూడదు.

కఠినమైన పదాలు వద్దు: నాలుక ఎంతటి మాటనైనా సులువుగా అనేస్తుంది. ఒక వ్యక్తిని బాధపెడుతుంది . మీరు మాట్లాడే మాట పొదుపుగా ఉండాలి. పదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి.

శరీరమే మన ఆస్తి: మన శరీరమే మన గొప్ప ఆస్తి. దాన్ని మనం శ్రద్ధగా, ప్రేమగా చూసుకోవాలి.

మీ కోపాన్ని నియంత్రించుకోండి: మన కోపం మన స్వభావానికి విరుద్ధమైన పనులు చేసేలా చేస్తుంది. దాన్ని మీరు నియంత్రించుకోవాలి.

గతాన్ని ఎన్నడూ గుర్తుంచుకోవద్దు: గతం గడిచి పోయింది. దాన్ని విడిచిపెట్టాలి. వర్తమానంలోనే జీవిస్తూ ముందుకు నడవాలి.

సంతృప్తి: సంతోషంగా జీవించేందుకు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడాలి. లేని దాని కోసం బాధపడే కన్నా… ఉన్నదాన్ని చూసి ఆనందించడం వల్ల ఎంతో ఆనందం దక్కుతుంది.

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఆగస్టు నెల ఆన్ లైన్ టికెట్ల కోటా విడుదల!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు.

ఇక్కడికి ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీతారలు వస్తుంటారు. స్వామి వారి దర్శనం చేసుకుంటారు. తిరుమల వెళ్లే భక్తులకు ఓ ముఖ్య గమనిక. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్లు రేపు విడుదల కానున్నట్లు అధికారులు తెలిపారు.

ఆగస్టు నెలకు సంబంధించిన కోటాను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో శనివారం విడుదల చేయనున్నారు. ఆగస్టులో శ్రీవారి దర్శనంతో పాటు ఇతర సేవల్ని పొందాలనుకునే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. దీంతో పాటు పలు రకాల సేవలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా టీటీడీ ప్రకటించింది.

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈనెల 18న శనివారం ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్తానం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి https://ttdevasthanams.ap.gov.in లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ఈ సేవా టికెట్ల కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం పదిగంటలకు అన్లైన్‌లోఅప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ డిప్‌లో సొమ్ము చెల్లించినవారికి మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు చేస్తారు.

ఇతర సేవా టిక్కెట్ల కోటా…

ఆగస్టు నెలలో తిరుమలలో జరిగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను కూడా ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడి తెలిపింది. ఆలయంలోని వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను కూడా ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

వీటితో పాటు ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్ లైన్ కోటాను కూడా ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను కూడా ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు..

ఇక, వీటితో పాటు ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా మే 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల స్వామివారి దర్శనం కోసం విచ్చేసే భక్తులకు బస కల్పించే కోటాను కూడా ఈనెల 24న విడుదల చేయనున్నారు.

ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు తిరుపతి శ్రీవారి సేవ కోటా, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు వీటిని బుక్ చేసుకునేందుకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను https://ttdevasthanams.ap.gov.inసంప్రదించగలరు.

Health

సినిమా