Saturday, November 16, 2024

ఆడపిల్లల భవిష్యత్తుకు అద్భుత స్కీం.. 21 ఏళ్లు వచ్చేసరికి మీ చేతిలో రూ. 70 లక్షలు.. ఎలాగంటే.?

మనం మన కుమార్తెల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం గురించి చర్చించినప్పుడు, అనుకోకుండానే సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రస్తావన వస్తుంది. రాజన్ తన స్నేహితులు లేదా సలహాదారులతో మాట్లాడినప్పుడు, అతని 10 ఏళ్ల కుమార్తె రియా కోసం సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టే విషయంపైనే చర్చ జరిగింది.

ఇతర చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే ఈ స్కీమ్ అత్యధికంగా 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. మీకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అదనంగా, సుకన్య యోజన కింద మెచ్యూరిటీపై అందుకున్న మొత్తమంతా పన్ను రహితమే.

సుకన్య యోజనలో, కుమార్తె కోసం 10 సంవత్సరాల వరకు ఖాతాను తెరవవచ్చు. రాజన్ కుమార్తెకు కూడా పదేళ్లు. అతడు ఈ ఖాతాను తెరవగలడు. 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. ఇక అతడి కూతురికి 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సుకన్య సమృద్ధి యోజన ఖాతా మెచ్యూర్ అవుతుంది.ఈ సుకన్య సమృద్ది యోజన పథకం కింద, అమ్మాయికి 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన భాగాన్ని చదువుకు, ఇతరత్రా ఖర్చులకు పొదుపు చేయవచ్చు. రాజన్ సుకన్య ఖాతాలో ఏటా 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. రియా ప్రస్తుతం 10 ఏళ్ల వయస్సు ఉన్నందున, ఆమెకు 18 ఏళ్లు వచ్చేసరికి మొత్తం రూ. 12 లక్షల పెట్టుబడి అవుతుంది.

ప్రస్తుత 8.2 శాతం వడ్డీ రేటును పరిగణనలోకి తీసుకుంటే 8 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం 16.95 లక్షల రూపాయలు కావచ్చు. రాజన్ అప్పుడు ఉండే ఈ మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేయగలడు. ఆ మొత్తాన్ని ఆమె ఉన్నత విద్య ఫీజులకు కవర్ చేయొచ్చు. ఒకవేళ అలాకాకుండా అమ్మాయికి మొదటి నుంచి 21 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ సుకన్య స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే.. 2045 నాటికి కార్పస్ సుమారు 70 లక్షల రూపాయలకు పెరుగుతుంది. ఈ పధకం ఆడపిల్లల భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుంది.

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

Drink for Lungs: గాలి కాలుష్యం, కరోనా వైరస్ వీటివల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యేవి ఊపిరితిత్తులే. ప్రస్తుత రోజుల్లో ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది.

న్యూమోనియా, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇలా ఎన్నో రకాల కారణాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన కఫం పట్టడం, ఆయాసం, శ్వాస తీసుకోలేకపోవడం వంటివి ఛాతీని ఇబ్బంది పెడుతున్నాయి. ఊపిరితిత్తులు పరిశుభ్రంగా ఉండాలంటే మేము ఇక్కడ చెప్పిన చిన్న చిట్కాను పాటించండి చాలు. ఈ ఇంటి చిట్కాలు ప్రతిరోజూ పాటించడం వల్ల ఊపిరితిత్తులు పూర్తిగా పరిశుభ్రమవుతాయి.

ఇదిగో డ్రింక్

ప్రతిరోజూ గ్లాసు గోరువెచ్చటి నీటిని తీసుకోండి. అందులో నాలుగు స్పూన్ల తేనెను కలపండి. అలాగే ఒక స్పూను నిమ్మరసం కూడా కలపండి. అందులోనే చిటికెడు మిరియాల పొడి, చిటికెడు యాలకుల పొడి వేసి బాగా కలిపి తాగుతూ ఉండండి. ఈ గ్లాసు నీటిని ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి తాగుతూ ఉంటే ఎంతో మంచిది. అయితే ఈ సమయంలో మిగతా ఆహారాలను తీసుకోకూడదు.

ఇలా ఆగి ఆగి కొన్ని గంటల పాటు ఆ నీటిని తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం, వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పోతాయి. బ్యాక్టీరియా, వైరస్ లో వంటివి నశిస్తాయి. రోగ నిరోధక శక్తి బలోపేతం అయ్యి యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఈ గ్లాసుడు నీళ్లు ఒక పూటంతా తాగి ఉపవాసం ఉంటే మంచిది. ఆ తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇలా మూడు నాలుగు రోజులు పాటు చేసి చూడండి. ఛాతీకి పట్టిన కఫం మొత్తం పోతుంది. మధ్య మధ్యలో ఆవిరి పడుతూ ఉండాలి. ఆవిరి పట్టేటప్పుడు అందులో పసుపు, తులసి ఆకులు, యూకలిప్టస్ ఆయిల్ కూడా వేస్తూ ఉండాలి.

ఊపిరితిత్తులు కఫం పట్టినట్టు అనిపిస్తున్నా, ఆయాసం వస్తున్నా, శ్వాసకి ఇబ్బంది అనిపిస్తున్నా ఈ చిట్కాను తరచూ పాటిస్తూ ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ సమయంలో వేడి నీళ్లతోనే స్నానం చేయాలి. ఇలా చేస్తే వారంలోపే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటివి తగ్గుతాయి. నిమోనియా కూడా అదుపులోకి వస్తుంది. ఉప్పును చాలా తగ్గించి తీసుకోవాలి. రోజులో ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. మిగతా సమయాల్లో ఆ నీటిని తాగుతూ ఉండాలి. ఇది మీకు నాలుగు రోజుల్లోనే మంచి ఫలితాన్ని చూపిస్తుంది.

మళ్లీ జగనే సీఎం.. సంబరాలకు సిద్ధం కండి : YSRCP

మళ్లీ జగనే సీఎం.. సంబరాలకు సిద్ధం కండి అంటూ YSRCP ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రమాణం చేయనున్నట్లు ‘YSRCP’ ట్వీట్ చేసింది.

విశాఖలో జూన్ 9న ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది.

జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేయబోతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆ రోజు నుంచి సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఇక అటు ఇవాళ సీఎం జగన్‌ లండన్ చేరుకున్నారు. ఈ తరుణంలోనే లండన్‌ లో సీఎం జగన్‌ కు గ్రాండ్‌ గా వెలకమ్‌ పలికారు. ఈ సందర్భంగా ప్లైట్‌ నుంచి దిగుతూ సీఎం జగన్‌ కనిపించారు. పింక్‌ కలర్‌ షటర్‌ చేతిలో పట్టుకుని… నడుచుకుంటూ కారు ఎక్కారు జగన్‌. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

చిన్నస్వామి స్టేడియంకు అద్భుతమైన ప్రత్యేకత!.. ఎన్ని నీరు పోసిన ఇట్టే ఇంకిపోతున్నాయి (వీడియో వైరల్)

మైదానంలో చిన్న వర్షం పడ్డ కూడా మైదానం తడిసి పోవడంతో ఆ రోజు జరగాల్సిన ఆటను ఆపేసి వాయిదా వేస్తుంటారు. అలాంటిది మూడు ట్యాంకర్ల నీరు మైదానంలో ఓకే చోట పోసినా ఇట్టే మాయమైపోయాయి.

ప్రపంచంలో ఏ మైదానానికి లేని ఓ ప్రత్యేకత చిన్నస్వామి స్టేడియంకు ఉంది. బెంగళూరులోని చిన్న స్వామి క్రికెట్ స్టేడియంలో ఎన్ని నీళ్లు పోసినా ఇట్టే ఇంకిపోతున్నాయి. ఈ మైదానం ప్రపంచంలోనే ఎక్కడా లేని సబ్ ఎయిర్ డ్రైనేజీ, ఎయిరేషన్ సిస్టమ్ ను కలిగి ఉంది.

దీనిని ఇటీవలే పరీక్షించిన అధికారులు నిర్ఘాంతపోయారు. మూడు పైపుల ద్వారా మైదానంలో నీరు వదిలిన తర్వాత అందరూ చూస్తుండగానే కొద్ది సేపటికే నీరు మొత్తం భూమిలోకి ఇంకిపోయింది. అనంతరం అధికారులు మైదానాన్ని తడిమి చూడగా కొంచెం కూడా తడి లేదని తేల్చేశారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సిస్టమ్ అన్ని మైదానాలకు ఉంటే బాగుంటుంది అని, ఇలా అయితే ఏ ఒక్క మ్యాచ్ కు కూడా అంతరాయం కలగదని, రేపు జరగబోయే మ్యాచ్ కు కూడా వర్షం వచ్చినా ఆగకుండా ఉంటే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు.

itel నుంచి స్మార్ట్ వాచ్ మరియు లాకెట్ గా వాడగల వాచ్ లాంచ్! ధర వివరాలు

Itel సంస్థ తన సరికొత్త స్మార్ట్‌వాచ్, యునికార్న్ పెండెంట్ వాచ్‌ను ముందుగా టీజ్ చేసిన తర్వాత ఇప్పుడు భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ జెన్ Z ఫ్యాషన్‌కి అధునాతన టచ్‌ని జోడిస్తూ స్టైలిష్ లాకెట్టు డిజైన్ తో వస్తుంది.

అందువల్ల,స్మార్ట్‌వాచ్ మరియు లాకెట్టు రెండింటిగాను ఉపయోగించవచ్చు.

అద్భుతమైన డిజైన్ మరియు IML టెక్నాలజీతో రూపొందించబడిన, యునికార్న్ పెండెంట్ వాచ్ స్లిమ్ మెటాలిక్ బాడీని కలిగి ఉంది. మరియు ఈ డిజైన్ లో లెదర్ స్ట్రాప్ మరియు లాకెట్టు డిజైన్ ను రెండింటినీ కలిగి ఉంటుంది. ఇందులో, సులభమైన నావిగేషన్ కోసం స్పోర్ట్స్ మోడ్ బటన్, డైనమిక్ క్రౌన్ మరియు స్విచ్ బటన్‌ను కూడా కలిగి ఉంది.

500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఈ స్మార్ట్‌వాచ్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే ఫీచర్ ను అందిస్తుంది మరియు DIY వాచ్ ఫేస్ స్టూడియో ద్వారా అనుకూలీకరించదగిన 200 కంటే ఎక్కువ స్టైలిష్ వాచ్ ఫేస్‌లను అందిస్తుంది.

7 రోజుల బ్యాటరీ లైఫ్ మరియు 15 రోజుల స్టాండ్‌బై టైమ్‌తో, ఈ వాచ్ కేవలం 30 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ అవుతుంది. ఇది 100+ స్పోర్ట్స్ మోడ్‌లతో పాటు ఫిమేల్ సైకిల్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్ మరియు హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి ఆరోగ్య ఫీచర్లను కూడా కలిగి ఉంది.

డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్లలో SpO2, 24×7 హృదయ స్పందన రేటు, ఒత్తిడి, స్త్రీ ఆరోగ్యం, నీటి రిమైండర్ మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. AI వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది.

అదనంగా, ఇది సంగీతం మరియు కెమెరా కంట్రోల్ ఫీచర్లు కూడా కలిగి ఉంది. ఫైండ్ మై ఫోన్ మరియు DND మోడ్ వంటి స్మార్ట్ ఫంక్షనాలిటీలతో సహా బ్లూటూత్ కాలింగ్‌ ఫీచర్ ను కూడా అందిస్తుంది. ఇది వాయిస్ అసిస్టెంట్లకు మద్దతు ఇస్తుంది మరియు మన్నిక కోసం IP68 నీటి నిరోధక ఫీచర్ ను కలిగి ఉంది.

ధర మరియు లభ్యత వివరాలు

ఈ ఐటెల్ యునికార్న్ పెండెంట్ వాచ్ ధర రూ. 2,899 గా లాంచ్ అయింది మరియు డార్క్ క్రోమ్ మరియు షాంపైన్ గోల్డ్ రంగులలో వస్తుంది. ఇది మే 18 నుండి ఆన్‌లైన్‌లో మరియు ఇతర రిటైలర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ఈ స్మార్ట్ వాచ్ లాంచ్‌పై ఐటెల్ ఇండియా సీఈఓ అరిజీత్ తలపాత్ర మాట్లాడుతూ, ఐటెల్ యునికార్న్ పెండెంట్ వాచ్‌ను లాంచ్ చేయడంతో, మా వినియోగదారుల జీవనశైలిని మెరుగుపరిచే స్టైలిష్ స్మార్ట్ యాక్సెసరీని అందించడం ద్వారా భారతదేశంలోని స్మార్ట్‌వాచ్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చడానికి మేము ప్రయత్నిస్తున్నాము.

మా లక్ష్యం అత్యాధునిక టెక్నాలజీ ని మాత్రమే కాకుండా చక్కదనం మరియు అనుకూలతను కూడా అందించడం. ఈ యునికార్న్ లాకెట్టు గడియారం కేవలం ఫ్యాషన్ యాక్సెసరీకి మించి ఉంటుంది; ఇది కస్టమర్ సంతృప్తి పట్ల మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. అప్రయత్నమైన వినియోగంతో రోజువారీ జీవితంలో సజావుగా ఏకీకృతం చేయడం, ఇది సమకాలీన జీవనంలో ముఖ్యమైన భాగం అవుతుంది. ఒక సొగసైన డిజైన్‌లో సౌలభ్యం మరియు డిజైన్ రెండింటినీ మెరుగుపరుస్తుంది. అని తెలియచేసారు

Curd : రోజూ పెరుగు తింటే ఆ క్యాన్సర్ మటుమాయం..!

Curd : ఈ రోజుల్లో ఎప్పుడు ఏ రోగం వచ్చేది కూడా తెలియట్లేదు. అందులోనూ క్యాన్సర్ వచ్చిందంటే మాత్రం దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. ప్రస్తుత కాలంలో ఎంత టెక్నాలజీ వచ్చినా సరే ఈ క్యాన్సర్ కు మాత్రం మందులు పనిచేయట్లేదు.

ఎన్ని మందులు వాడినా సరే అస్సలు తగ్గట్లేదు. అధునాతన ట్రీట్ మెంట్లు వచ్చినా సరే క్యాన్సర్ తగ్గకపోవడంతో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే క్యాన్సర్లలో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువ మందికి వస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా వస్తోంది.

Curd : కాలుష్యంతో కూడా..

వాస్తవానికి స్మోకింగ్ చేసే వారిలోనే ఇది ఎక్కువగా కనిపిస్తోంది. అంతే కాకుండా పొగాకు తాగేవారిలో కూడా కనిపిస్తోంది. కేవలం పొగ తాగే వారిలోనే కాకుండా పొగ పీల్చే వారిలో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు వీరే కాకుండా అటు కాలుష్యంతో కూడా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో 20 శాతం మంది సిగరెట్లు తాగని వారే ఉంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం జీవన విధానంలో వస్తున్న మార్పులు కూడా కావచ్చు.

కాగా ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు చేయాలని చెబుతున్నారు. దాంతో పాటు రోజూ తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే ఊపిరిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఏదో తమాషాకు చెబుతున్న విషయం కాదండోయ్.. ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత చెబుతున్న మాట. రోజుకు సుమారు 85 గ్రాముల పెరుగు తినే మగవారికి, 113 గ్రాముల పెరుగు తినే ఆడవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 19% వరకు తక్కువ.

Curd : రోజూ పెరుగు తింటే ఆ క్యాన్సర్ మటుమాయం..!

ఎందుకంటే పెరుగులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది లంగ్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని బాగానే తగ్గిస్తుంది. దాదాపు 14 లక్షల మందిని పరిగణలోకి తీసుకొని వారిపి రీసెర్చ్ చేయగా ఈ విషయాలు తెలిశాయి

తెలంగాణ EAMCET ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి!

ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించాలంటే.. టెన్త్ తర్వాత ఇంటర్ మీడియట్ నుంచి కష్టపడాలి. తమ పిల్లలు గొప్ప చదువులు చదివి గొప్ప ఉద్యోగం సంపాదించి సొసైటీలో మంచి పొజీషన్ లో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం వారి తాహతకు మించినప్పటికీ పిల్లలను మంచి విద్యాసంస్థల్లో చేర్పించి చదివిస్తారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు విద్యార్థులు. ఎంసెట్ లో సీటు సాధించి ఉన్నత విద్యనభ్యసించేందుకు పునాధులు వేసుకుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఈఏపీసెట్ (ఎంసెట్) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో మే 7 నుంచి 11 వ తేదీ వరకు ఇంజనీరింగ్,ఫార్మసీ, అగ్రి కల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటల తర్వాత విద్యాశాఖ అధికారులు జేఎన్టీయూ హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. త్వరలోనే ఈఏపీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఈఏపీసెట్ 2024 ప్రవేశ పరీక్షలకు దాదాపు 3.54 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 94 శాతం, అగ్రి కల్చర్ , ఫార్మసీ విభాగాలకు 90 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. eamcet.tsche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి.. TS EAPCET 2024 Results ఆప్షన్ ని ఎంచుకోవాలి. మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.. TS EAPCET 2024 ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. మీ రిజల్ట్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు.

ఈ ఏడాది ఇంజనీరింగ్ లో 74.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్ ఎస్ జ్యోతిరాదిత్య (శ్రీకాకుళం-పాలకొండ), సెకండ్ ర్యాంక్ హర్ష (కర్నూల్-పంచలింగాలు), మూడవ ర్యాంక్ రిషి శేఖర్ శుక్లా (సికింద్రాబాద్-తిరుమలగిరి), నాలుగో ర్యాంక్ సందేశ్ (హైదరాబాద్ – మాదాపూర్), ఐదో ర్యాంక్ యశ్వంత్ రెడ్డి (కర్నూల్) సాధించారు. ఈసారి ఇంజనీరింగ్ లో మొదటి పది ర్యాంకుల్లో ఒక్క అమ్మాయి మాత్రమే స్థానం సంపాదించింది. అగ్రి కల్చర్, ఫార్మసీ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ ప్రణీత (మదనపల్లె), రెండో ర్యాంక్ రాధాకృష్ణ(విజయనగరం), మూడో ర్యాంక్ శ్రీవర్షిణి (హనుమకొండ), నాలుగో ర్యాంక్ సాకేత్ రాఘవ్ (చిత్తూరు), ఐదో ర్యాంక్ సాయి వివేక్ (హైదరాబాద్) సాధించారు. త్వరలోనే ఈఏపీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు.

సెకన్ల వ్యవధిలో దూసుకొచ్చిన జలపాతం..బాలుడి గల్లంతు

తమిళనాడులోని తేన్ కాశి జిల్లాలో పశ్చిమ కనుమల వద్ద కొలువుదీరిన పుణ్యక్షేత్రం… కుర్తాళం.

ఇక్కడి జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. అయితే ఈ ప్రాంతంలో గత ఐదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎప్పట్లాగానే పర్యాటకులు పాత కుర్తాళం జలపాతం వద్దకు రాగా, కొన్ని సెకన్ల వ్యవధిలోనే మెరుపు వరదలు సంభవించాయి. చూస్తుండగానే నీటి ప్రవాహం ఉద్ధృతమైంది.

దాంతో పర్యాటకులు హడలిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా, కుర్తాళం జలపాతం భయానక రూపుదాల్చిన నేపథ్యంలో, అశ్విన్ అనే ఓ 17 ఏళ్ల కుర్రాడు గల్లంతయ్యాడు. 11వ తరగతి చదువుతున్న ఆ బాలుడు పాలయంకొట్టై ప్రాంతంలోని ఎన్జీవో కాలనీకి చెందినవాడిగా గుర్తించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంటనే స్పందించి కుర్తాళం జలపాతం వద్దకు చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే అశ్విన్ మృతదేహం జలపాతం నుంచి అరకిలోమీటరు దూరంలో కొండరాళ్ల మధ్య చిక్కుకుని కనిపించింది.

ప్రశాంతమైన జీవితానికి గౌతమ బుద్ధుడు చెప్పే బోధనలు ఇవే

బుద్ధ పూర్ణిమ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ సమాజం భక్తి శ్రద్ధలతో జరుపుకునే బుద్ధ పూర్ణిమను దేశంలోని అనేక ప్రాంతాల్లో వైశాఖ పూర్ణిమ లేదా వెసక్ అని కూడా పిలుస్తారు.

బౌధ్ధ ప్రజలు ఈ పవిత్రమైన రోజును వేడుకలా నిర్వహించుకుంటారు. గౌతమ బుద్ధుని జయంతిని బుద్ధ పూర్ణిమగా నిర్వహించుకుంటారు. ఈ రోజున సిద్ధార్థ గౌతముడు బుద్ధగయలోని పవిత్ర బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారాడు.

ఈ సంవత్సరం బుద్ధ పూర్ణిమ మే 23 గురువారం నిర్వహించుకుంటారు. ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకుంటున్నప్పుడు గౌతమ బుద్ధుని బోధనలను, శాంతి, అహింస, ఆప్యాయతలతో కూడిన జీవితాన్ని ఆయన బోధనల ద్వారా నేర్చుకోవచ్చు. గౌతమ బుద్ధుడి బోధనలు జీవితంలో ఎంతో స్పూర్తిని నింపుతాయి. జీవితంపై ఆశను పెంచుతాయి. అత్యాశను తగ్గిస్తాయి.

మీ జీవితాన్ని మార్చే గౌతమ బుద్ధుని బోధనలు

ఈ విశ్వంలో ఏదీ కోల్పోలేదు: గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రకారం మనం చేసిన పని ఫలితం తిరిగి మనకే వస్తుంది. కాబట్టి, ఏ పని అయినా శ్రద్ధా, ప్రేమతో చేయాలి. జీవితాన్ని ఆనందంగా గడపాలి.

ప్రతిదీ మారుతుంది: మార్పు ఈ ప్రపంచంలో స్థిరంగా ఉంటుంది. మీ చుట్టూ పరిస్థితులు ఎలా మారినా మీరు దానిని స్వీకరించడం నేర్చుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా జీవించగలరు.

వర్తమానంలో జీవించండి: గతం గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం కంటే వర్తమానంపై దృష్టి పెట్టాలని బుద్ధుడు ప్రజలను కోరారు.

సత్యాన్ని దాచలేం: సూర్యచంద్రుల మాదిరిగానే సత్యాన్ని కూడా కంటికి కనిపించకుండా దాచలేమని వివరిస్తున్న గౌతమ బుద్ధుడు. నిజం కాస్త ఆలస్యమైనా కచ్చితంగా బయటికి వస్తుంది.

పాజిటివ్ గా ఆలోచించండి: మనస్సు ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. సానుకూల జీవితాన్ని పొందడానికి మీరు మనస్సును సానుకూల ఆలోచనలతో నింపాలి.

వదులుకోవద్దు: మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా మీపై మీకు శ్రద్ధను, ఇష్టాన్ని వదులు కోవద్దు. అదే జీవితానికి చుక్కానిలాంటిది.

ఒంటరిగా నడవండి: కొన్నిసార్లు మనం సత్యమార్గంలో నడిచినప్పుడు తోడు ఎవరూ రాకపోవచ్చు. అయినా సరే ఒంటరిగానే నడవాలి కానీ… సత్య మార్గాన్ని వదలకూడదు.

కఠినమైన పదాలు వద్దు: నాలుక ఎంతటి మాటనైనా సులువుగా అనేస్తుంది. ఒక వ్యక్తిని బాధపెడుతుంది . మీరు మాట్లాడే మాట పొదుపుగా ఉండాలి. పదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి.

శరీరమే మన ఆస్తి: మన శరీరమే మన గొప్ప ఆస్తి. దాన్ని మనం శ్రద్ధగా, ప్రేమగా చూసుకోవాలి.

మీ కోపాన్ని నియంత్రించుకోండి: మన కోపం మన స్వభావానికి విరుద్ధమైన పనులు చేసేలా చేస్తుంది. దాన్ని మీరు నియంత్రించుకోవాలి.

గతాన్ని ఎన్నడూ గుర్తుంచుకోవద్దు: గతం గడిచి పోయింది. దాన్ని విడిచిపెట్టాలి. వర్తమానంలోనే జీవిస్తూ ముందుకు నడవాలి.

సంతృప్తి: సంతోషంగా జీవించేందుకు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడాలి. లేని దాని కోసం బాధపడే కన్నా… ఉన్నదాన్ని చూసి ఆనందించడం వల్ల ఎంతో ఆనందం దక్కుతుంది.

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఆగస్టు నెల ఆన్ లైన్ టికెట్ల కోటా విడుదల!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు.

ఇక్కడికి ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీతారలు వస్తుంటారు. స్వామి వారి దర్శనం చేసుకుంటారు. తిరుమల వెళ్లే భక్తులకు ఓ ముఖ్య గమనిక. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్లు రేపు విడుదల కానున్నట్లు అధికారులు తెలిపారు.

ఆగస్టు నెలకు సంబంధించిన కోటాను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో శనివారం విడుదల చేయనున్నారు. ఆగస్టులో శ్రీవారి దర్శనంతో పాటు ఇతర సేవల్ని పొందాలనుకునే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. దీంతో పాటు పలు రకాల సేవలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా టీటీడీ ప్రకటించింది.

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈనెల 18న శనివారం ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్తానం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి https://ttdevasthanams.ap.gov.in లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ఈ సేవా టికెట్ల కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం పదిగంటలకు అన్లైన్‌లోఅప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ డిప్‌లో సొమ్ము చెల్లించినవారికి మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు చేస్తారు.

ఇతర సేవా టిక్కెట్ల కోటా…

ఆగస్టు నెలలో తిరుమలలో జరిగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను కూడా ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడి తెలిపింది. ఆలయంలోని వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను కూడా ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

వీటితో పాటు ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్ లైన్ కోటాను కూడా ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను కూడా ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు..

ఇక, వీటితో పాటు ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా మే 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల స్వామివారి దర్శనం కోసం విచ్చేసే భక్తులకు బస కల్పించే కోటాను కూడా ఈనెల 24న విడుదల చేయనున్నారు.

ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు తిరుపతి శ్రీవారి సేవ కోటా, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు వీటిని బుక్ చేసుకునేందుకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను https://ttdevasthanams.ap.gov.inసంప్రదించగలరు.

పదో తరగతి పాసయ్యారా.. మీ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. మిస్‌ చేసుకోకండి

నేటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగమనే కాదు.. ప్రైవేటు జాబ్‌ సాధించాలన్న సరే.. కనీసం డిగ్రీ అర్హతగా నిర్ణయిస్తారు. డిగ్రీ అయినా పూర్తి చేయకపోతే ఉద్యోగాలు సంపాదించడం చాలా కష్టం.

ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే డిగ్రీ కచ్చితంగా ఉండాలి. అది రెగ్యులరా.. డిస్టెన్సా అన్న దానితో సంబంధం ఉండదు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు.. వేరే కారణాల వల్ల కొందరు పదో తరగతితోనే చదువు ఆపేస్తారు. మరి అలాంటి వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే.. అసలు వారికి ఆ అవకాశం ఉందా అంటే.. ఉంది. పదో తరగతి పూర్తి చేసిన వారు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఈ మేరకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఆ వివరాలు..

పదో తరగతి పాస్‌ అయిన వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం కల్పిస్తోంది ఎస్‌ఎస్‌సీ. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌) భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. పదో తరగతి పాస్‌ అయిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు. గ్రూప్‌ సీ, నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌ పోస్టులుగా పిలిచే ఎంటీఎస్‌ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతుంది. ఈ జాబ్‌కి ఎంపికైతే.. ప్రాంరభంలోనే మంచి జీతం పొందవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం..

అర్హత: మెట్రిక్యూలేషన్‌, పదో తరగతి లేదా తత్సమాన తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: కొన్ని పోస్టులకు 18-25, మరికొన్నింటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాల వారికి వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఫీజు: జనరల్‌, ఓబీసీలకు రూ.100. ఎస్టీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.
సెలక్షన్‌ ప్రాసెస్‌: పేపర్‌-1లో పాస్‌ అయితే.. రెండో దశంలో క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. పేపర్‌-1లో మెరిట్‌ ఆధారంగా క్యాండేట్స్‌ని సెలక్ట్‌ చేస్తారు. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. 90 నిమిషాల సమయం. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానికి 0.25 మార్క్‌ మైనస్‌ చేస్తారు. ఎగ్జామ్‌ పేపర్‌ హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లోనే ఉంటుంది.
అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.ssc.nic.inని సందర్శించాలి.

ఏసీ, కూలర్, ఫ్యాన్ తో కరెంట్ బిల్లు పెరుగుతుందా ? ఈ విద్యుత్ ఆదా పరికరం మీ టెన్షన్‌ని తగ్గిస్తుంది..

వేసవి కాలంలో కరెంటు బిల్లుల టెన్షన్ అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఏసీ, కూలర్, ఫ్యాన్లు మొదలైన వాటి వల్ల కరెంటు బిల్లు పెరుగుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఏసీ ఆన్ చేయాలా, ఆఫ్ చేయాలా అన్నది అర్థం కాని పరిస్థితి. కానీ మీరు ఈ గందరగోళంలో ఉండవలసిన అవసరం లేదు. మీరు వేసవిలో AC గాలిని ఆస్వాదించవచ్చు, దీని కోసం మీరు మీ ఇంట్లో ఈ చిన్న పరికరాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

విద్యుత్ ఆదా పరికరం..

PUNZONE Super Maxx పవర్ ఒక విద్యుత్ సేవర్ పరికరం. ఈ పరికరం వోల్టేజ్ స్టెబిలైజర్‌గా కూడా పనిచేస్తుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గులకు గురైనట్లయితే, అది స్థిరీకరించడానికి సహాయపడుతుంది. మీరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో ఈ పరికరాన్ని చాలా చౌకగా పొందవచ్చు. ఈ పరికరం అసలు ధర రూ. 1,499 అయినప్పటికీ, మీరు దీన్ని 73 శాతం తగ్గింపుతో కేవలం రూ. 398కి కొనుగోలు చేయవచ్చు.

ఈ పరికరం బిల్లును సగానికి తగ్గిస్తుంది..

మీరు నివాస,వాణిజ్య ప్రదేశాలలో MD Proelectraని ఉపయోగించవచ్చు. ఇది మీ బిల్లును సగానికి పైగా తగ్గిస్తుంది. మీరు ఈ పరికరాన్ని 67 శాతం తగ్గింపుతో కేవలం రూ.720కి కొనుగోలు చేయవచ్చు. ఇది ఒక కిలోవాట్‌లో మాత్రమే కాకుండా 5 నుండి 9 కిలోవాట్ ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది.

40% బిల్లు తగ్గింపు..

KEYORA Turbo Maxx పవర్ పరికరం మీ టెన్షన్‌ని తగ్గిస్తుంది. కంపెనీ క్లెయిమ్ ప్రకారం, ఇది మీ బిల్లును 40 శాతం తగ్గించగలదు. మీరు ఈ పరికరాన్ని 34 శాతం తగ్గింపుతో కేవలం రూ. 398కి కొనుగోలు చేయవచ్చు.

బిల్లులు తగ్గించుకోవడానికి సులభమైన మార్గం..

మీరు అమెజాన్ లో Wingwon Super Maxx హెవీ డ్యూటీ ఎలక్ట్రిసిటీ సేవింగ్ డివైజ్‌ని కేవలం రూ. 549కి పొందవచ్చు. ఇందులో మీరు కలిసి ఒక ఫ్రీబీని పొందవచ్చు.

ఈ పరికరాలను ఇన్‌స్టాల్ చేయడంతో పాటు, మీరు మీ విద్యుత్ పరికరాల వినియోగంలో శ్రద్ధ వహించాలి. అవసరం లేనప్పుడు పరికరాన్ని స్విచ్ ఆఫ్ చేసి, అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించుకోండి. LED బల్బులు మొదలైన వాటిని ఎక్కువగా ఉపయోగించండి.

Credit Card : క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారా? అయితే ఈ తప్పులు మాత్రం చెయ్యకండి..

ఈరోజుల్లో ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు.. కొందరు అవసరం ఉన్నా లేకున్నా కూడా తీసుకుంటారు.. ఇక బ్యాంకులు కూడా తమ సేల్స్ పెంచుకోవడం కోసం కార్డులను జారీ చేస్తుంటారు..

అయితే క్రెడిట్ కార్డులను తీసుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం నష్టాలను చూడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్కువ మంది క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులను చెల్లిస్తారు.. క్రెడిట్ కార్డులతో కొన్ని మాత్రం కొనుగోలు చేస్తే రివార్డు పాయింట్స్ వస్తాయి. డైనింగ్, ట్రావెల్, కిరాణా లేదా ఇంధనం వంటి నిర్దిష్ట ఖర్చు వర్గాలకు అనుగుణంగా వివిధ రివార్డ్‌లు, ప్రయోజనాలను అందిస్తాయి. ఎక్కడ ఉపయోగిస్తే రివార్డ్స్ ఎక్కువగా వస్తాయో ముందుగా తెలుసుకోవాలి.. అక్కడ మాత్రమే కార్డులను వాడటం మంచిది..

అలాగే క్రెడిట్ కార్డుల బిల్లును కరెక్ట్ టైంకు చెల్లించాలి.. లేకుంటే అదనపు డబ్బులను చెల్లించాలి.. ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ అవి అధిక వార్షిక రుసుములతో రావచ్చు. వార్షిక రుసుమును చెల్లించడాన్ని సమర్థించడానికి మీ వినియోగ ఫ్రీక్వెన్సీని, ఈ ప్రయోజనాల నుంచి మీరు పొందిన విలువను పరిగణించాలి. యాన్యూవల్ ఫీ తక్కువగా ఉన్న కార్డులను మాత్రమే తీసుకోవాలి..

క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకున్నప్పుడు చాలా మంది వ్యక్తులు వడ్డీ రేట్లను పట్టించుకోరు. కేవలం రివార్డ్‌లు, ప్రయోజనాలపైనే దృష్టి పెడతారు.. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి.. లేకుంటే భారాన్ని మోయాల్సి వస్తుంది.. బలమైన భద్రతా ఫీచర్‌లతో క్రెడిట్ కార్డ్‌లను ఎంచుకోవాలి. కార్డ్ జారీచేసేవారి మోసం ను నియంత్రించే శక్తి ఉందో లేదో కనుక్కోవాలి..ఇవే కాదు ఒకేసారి వివిధ కార్డులను అస్సలు తీసుకోవడం మంచిది కాదు. అందుకే కార్డులను తీసుకొనే ముందు అన్ని తెలుసుకోవడం మంచిది..

UPI చెల్లింపులు చేస్తున్నారా?..పెద్ద ముప్పే ఉందట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..

దేశంలో ఎక్కువ మంది ప్రజలు UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. రోజువారీ అవసరాలు మాత్రమే కాకుండా ఖరీదైన హోం అప్లియెన్స్, గాడ్జెట్స్, డిజైనర్ క్లాత్స్ వంటి ఇతర వస్తువుల కొనుగోలుకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(UPI) ని ఉపయోగిస్తున్నారు.

అయితే UPI ద్వారా చాలా ఈజీగా, త్వరగా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నందున వృధా ఖర్చుకు దారితీస్తుందని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. అదేంటో చూద్దాం..

ఇటీవల ఐఐఐటీ ఢిల్లీ నిర్వహించిన సర్వే ప్రకారం.. దేశంలోని దాదాపు 74 శాతం మంది UPI , ఇతర డిజిటల్ చెల్లింపులు చేయడం ద్వాారా అతిగా ఖర్చు చేస్తున్నారట. యూపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలు ఈజీగా ఉన్నా.. క్యాస్ పేమెంట్లతో పోలిస్తే.. డిజిటల్ లావాదేవీల ద్వారా అధికంగా ఖర్చు చేస్తున్నట్లు తేలింది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల డేటా ప్రకారం.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ద్వారా జరిపిన లావాదేవీలు.. 1330 కోట్లకు చేరింది. ఇది సంవత్సర ప్రాతిపదిక చూస్తే.. యూపీఏ లావాదేవీలలో 50 శాతం పెరుగుదలను సూచిస్తుంది. గతేడాది యూపీఐ లావాదేవీలు దాదాపు 60 శాతం పెరిగి రికార్డు స్తాయిలో 11,768 కోట్లకు చేరుకుంది. మొబైల్ లావాదేవీలలో గణనీయమైన వృద్ధి కారణంగా UPI విస్తృత మార్జిన్‌తో మొదటి స్థానంలో ఉందట. ఇది స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లింపులపై కస్టమర్లకు పెరుగుతున్న నమ్మకాన్ని స్పష్టం చేస్తుంది.

UPI లావాదేవీల సగటు టిక్కెట్ పరిమాణం (ATS) రూ. 1,648 నుండి రూ. 1,515కి 8% తగ్గింది. కార్లు, స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ఇతర వస్తువులను కొనుగోలు చేయడం వల్ల భారతదేశంలో కస్టమర్ల వ్యయం పెరుగుతోందని, ఇది దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

అయినప్పటికీ ఈ ధోరణి UPI కారణంగా కొంతమంది ఖరీదైన వస్తువులపై అధికంగా ఖర్చు చేయడానికి దారితీస్తుందని అమెజాన్ ఇండియా తరపున నీల్సన్ మీడియా ఇండియా ఇటీవలి నివేదిక వెల్లడించింది. 42శాతం కస్టమర్లు ఆన్‌లైన్ పండుగ షాపింగ్ కోసం UPIని ఉపయోగిస్తారని తేలింది. దేశంలో డిజిటల్ చెల్లింపు పద్ధతులు మరింత ఆదరణ పొందుతున్నాయని సూచిస్తున్నాయి.

మద్యం తాగితే.. షుగర్ తగ్గుతుందా ? పెరుగుతుందా ? డాక్టర్స్ ఏం చెపుతున్నారంటే ?

ఆల్కహాల్ తాగడం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుందని చాలా మంది అనుకుంటారు. అందువల్ల వారు డయాబెటిక్ పేషెంట్ అయినప్పటికీ ధైర్యంగా మద్యం తాగుతుంటారు.

మద్యం సేవించడం ద్వారా మధుమేహాన్ని నిజంగా నియంత్రించవచ్చా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. అసలు మధుమేహ రోగులు ఆల్కహాల్ తీసుకోవడం రక్తంలో చక్కెరపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మధుమేహ వ్యాధిగ్రస్తులు మద్యం సేవించాలా? అసలు దీని గురించి డాక్టర్స్ ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహం ఉన్న వ్యక్తులు మద్యం సేవించడం వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది లేదా చాలా వేగంగా పడిపోతుంది. ఈ రెండు పరిస్థితులు మధుమేహ రోగులకు ప్రమాదకరమే. ఆల్కహాల్‌ కూడా అత్యధిక కేలరీలు కలిగి ఉంటుంది. ఇది మధుమేహ రోగులకు మంచిది కాదు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆల్కహాల్ రక్తంలో చక్కెర స్థాయిలలో వేగవంతమైన హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. అసలు మద్యం సేవించడం మీకు సురక్షితమా కాదా అని తెలుసుకోవడానికి, మీరు మీ వైద్యుని నుండి సలహా పొందవచ్చు.

నిపుణుల అధ్యయనం ప్రకారం తక్కువ పరిమాణంలో ఆల్కహాల్ తాగడం వల్ల కూడా మీ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అలాంటిది అధికంగా మద్యం తీసుకుంటే మీ షుగర్ స్థాయి ప్రమాదకర స్థాయికి పడిపోతుంది. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ రోగులకు ఆల్కహాల్ సేవించడం మరింత ప్రమాదకరం

బీర్ వైన్ లో కూడా చక్కెర స్థాయిలు కలిగి ఉంటాయి. ఇవి కూడా రక్తంలో చక్కెరను పెంచుతాయి. అంతేకాకుండా ఆల్కహాల్ మీ ఆకలిని పెంచి అవసరమైన దానికంటే ఎక్కువగా తినేలా చేస్తుంది. అప్పుడు మీ చెక్కెర స్థాయి అదుపులో లేకుండాపోతుంది. మద్యపానం కూడా రక్తపోటును పెంచుతుంది. దీన్ని బట్టి ఆల్కహాల్ శరీరానికి ఎటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుందనడానికి ఇప్పటి వరకు ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు.

Saudi Arabia: ఒక్క మలుపు కూడా లేకుండా 256 కి.మీ. పొడవైన హైవే!

హైవేలపై కొంత దూరం వరకు మలుపులు లేని ప్రయాణం ఉండటం సాధారణంగా కనిపించే దృశ్యమే. కానీ సౌదీ అరేబియాలో మాత్రం అసాధారణ స్థాయిలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంపాటు మలుపులు లేకుండా నిటారుగా ఒక హైవే ఉంది!

రబ్ అల్ ఖలీ ఎడారి మీదుగా నిర్మించిన హైవే 10 లో ఏకంగా 256 కిలోమీటర్ల దూరం వరకు ఒక్క మలుపు కూడా లేదట! చమురు, గ్యాస్ నిల్వల నగరమైన హరద్ నుంచి పొరుగునున్న యూఏఈ సరిహద్దు ప్రాంతం అల్ బతా వరకు ఉన్న ఈ హైవే పూర్తిగా నిటారుగానే ఉంటుందని అరబ్ న్యూస్ సంస్థ తెలిపింది.

ఇప్పటివరకు ఆస్ట్రేలియాలోని ఐర్ హైవే (146 కి.మీ.) పేరిట ఉన్న ప్రపంచంలోనే అతిపొడవైన నిటారు రోడ్డు రికార్డును సౌదీలోని హైవే 10 బద్దలు కొట్టినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. దేశ రాజు అబ్దుల్లా కోసం తొలుత దీన్ని ప్రైవేటు రోడ్డుగా ఇలా ప్రత్యేకంగా నిర్మించారట. అయితే ప్రస్తుతం చమురు రవాణాకు దీన్ని వినియోగిస్తున్నారు.

ఈ హైవే నిటారుగా ఉండటమే కాదు.. మొత్తం 256 కి.మీ. మార్గంలో ఎత్తుపల్లాలు కూడా ఉండవని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ వెల్లడించింది. అలాగే ఈ దారిలో ఎక్కడా ఒక్క చెట్టు లేదా కట్టడం కూడా కనిపించదు.

దీంతో ఈ రోడ్డుపై వాహనాలు కేవలం 2 గంటల వ్యవధిలోనే 256 కి.మీ. దూరం వరకు దూసుకెళ్లగలవట! అయితే అక్కడక్కడా ఒంటెలు, కంగారూలు మాత్రం ఉన్నట్టుండి రోడ్డు దాటుతుంటాయని.. అందువల్ల వాహనదారులు జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదాలు తప్పవని dangerousroads.org అనే వెబ్ సైట్ హెచ్చరించింది.

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అలర్ట్.. వెలుగులోకి కొత్త రకం మోసం

ప్రతీ ఏడు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది విద్యార్థులు పై చదువుల కోసం వెళ్తుంటారు. ముఖ్యంగా యూఎస్ వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. యూఎస్ లో చదివితే భవిష్యత్ బాగుంటుందని, డాలర్లలో సంపాదించొచ్చని భావిస్తుంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఫారిన్ లో చదివించేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. అయితే విదేశాలకు వెళ్లే విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఫారిన్ లో చదివే విద్యార్థులే టార్గెట్ గా మోసాలక పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఇప్పటి వరకు ఉద్యోగాల పేరిట లక్షలు కాజేసిన సంఘటనలు చూశాం. ఇప్పుడు మరో కొత్త రకం మోసానికి తెరలేపారు. ఏకంగా ఎగ్జామ్ ఫీజులపై డిస్కౌంట్ పేరుతో ఫ్రాడ్ చేస్తున్నారు.

మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. మోసాలకు పాల్పడే వారు ఏచిన్న అవకాశం దొరికినా కూడా వదలడం లేదు. ఈ క్రమంలో ఓ ఘరానా మోసం వెలుగు చూసింది. యూఎస్ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న స్టూడెంట్స్ ను టార్గెట్ గా చేసుకుని లక్షల రూపాయలను కొల్లగొడుతున్నాడు ఓ యువకుడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కనోళ్ల అశోక్ అనే యువకుడు గతంలో యూఎస్ఏ కన్సల్టెంట్ ఏజన్సీలో వర్క్ చేశాడు. అందులో ఉన్న అనుభవంతో ఈజీగా మనీ సంపాదించేందుకు స్టూడెంట్స్ సెమిస్టర్ ఫీజులను టార్గెట్ గా మలుచుకున్నాడు.

అమెరికాలో చదువుతున్న విద్యార్థులు తమ సెమిస్టర్ ఫీజులన తమ ద్వారా చెల్లిస్తే 10 శాతం డిస్కౌంట్ అందిస్తామని మోసానికి పాల్పడ్డాడు. సుధాకర్ అనే యువకుడికి ఫీజు చెల్లిస్తే 10 శాతం డిస్కౌంట్ ఇప్పిస్తానని రూ.4 లక్షల 38 వేల 599 రూపాయలు వసూలు చేసి మోసం చేశాడు అశోక్. దీంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అశోక్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు ఇలాంటి ఏజన్సీలను , ఏజెంట్లను నమ్మకుండా జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు

Spirituality:కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో తెలుసా?

Spirituality:సాధారణంగా మనం ఇంటిలో నోములు,వ్రతాలు,పూజలు చేసే సమయంలో కలశం మీద కొబ్బరికాయను పెట్టి పూజలు చేస్తూ ఉంటాం. కలశం కోసం రాగిచెంబు లేదా వెండి చెంబును తీసుకోని దానికి పసుపు,కుంకుమ రాయాలి.

కలశంలో కొంచెం నీటిని పోసి, అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు. కలశంపై మావిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి, వాటిపై కొబ్బరికాయను ఉంచుతారు. కొబ్బరికాయ చుట్టూ ఒక వస్త్రాన్ని చుడతారు. ఇక పూజ అయ్యిపోయాక కలశంలో కొబ్బరికాయను ఏమి చేయాలా అనే సందేహం రావటం సహజమే.

కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయను పారే నీటిలో నిమజ్జనం చేయవచ్చునని, ఒక వేళ అది వీలు కాకపోతే దగ్గరలో ఉన్న ఏదైనా జలాశయంలో నిమజ్జనం చేయవచ్చు. లేదంటే నోములు – వ్రతాల సమయంలో పీఠంపై గల బియ్యం బ్రాహ్మణులకు ఇస్తూ వుంటారు గనుక, వాటితో పాటు కొబ్బరికాయను కూడా వారికి ఇవవచ్చు.

ఇలా ఇవ్వటం వలన ఎలాంటి దోషము ఉండదని పండితులు అంటున్నారు. అదే దేవాలయాల్లో అయితే ఇలా కలశానికి ఉపయోగించిన కొబ్బరి కాయలను ‘పూర్ణాహుతి’కి వాడుతుంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Diabetes: అలర్ట్.. డయాబెటిస్‌ను కంట్రోల్ చేసే ఏడు సూత్రాలు.. ఇలా చేస్తే 400 ఉన్న షుగర్‌ 100కు రావడం ఖాయం..

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. హార్మోన్ల కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు మీ శరీరంలో వేళ్లూనుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు, థైరాయిడ్ హార్మోన్లలో హెచ్చుతగ్గులు హైపో లేదా హైపర్ థైరాయిడిజానికి దారితీస్తాయి.
అదేవిధంగా, ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాకపోయినా లేదా సరిగ్గా పని చేయకపోయినా, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉండవు. చాలా సందర్భాలలో, చక్కెర స్థాయి పెరుగుతుంది. దీనివల్ల మధుమేహం, ప్రీ-డయాబెటిస్, టైప్-2 మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. మధుమేహంతో పాటు, ఇన్సులిన్ నిరోధకత కొలెస్ట్రాల్ స్థాయిలు, థైరాయిడ్ పనితీరు, రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆహారం ద్వారా ఇన్సులిన్ హార్మోన్ స్థాయిలను నిర్వహించవచ్చు.. అలాంటి ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకోండి..

ఏడు సూత్రాలతో డయాబెటిస్ కు చెక్..
మెంతులు – దనియాల నీరు:
మెంతులు, దనియాల నీటిని రోజూ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ హార్మోన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. 1/2 టీస్పూన్ మెంతి గింజలు, 1 టీస్పూన్ దనియాలను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి తాగండి.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. గుండెల్లో మంటగా ఉన్నా.. అజీర్ణంతో బాధపడుతున్నా ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

ఉసిరి – అలోవెరా జ్యూస్: ఉసిరి, కలబంద రెండూ ఇన్సులిన్ నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ పానీయంలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి, పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ పానీయం రక్తంలోని అదనపు గ్లూకోజ్‌ను గ్రహిస్తుంది.

సరైన పద్ధతిలో ఆహారాన్ని తినండి: ఆహారంలో సరైన మొత్తంలో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉండాలి. రోజు ప్రారంభంలో ఫైబర్ తీసుకోండి. ఆ తర్వాత ప్రోటీన్.. చివరకు పిండి పదార్థాలు లాంటివి తీసుకోవాలి.. అయితే. మితంగా తినడం మాత్రం మర్చిపోవద్దు..

ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం:
శరీరంలో ప్రొటీన్ల లోపాన్ని తీర్చడానికి గుడ్లు, చికెన్, బాదం, కాజు, పప్పులు వంటివి తినండి.. ఇటువంటి ఆహారాలు ఇన్సులిన్ హార్మోన్ ప్రభావాన్ని పెంచుతాయి. రోజులో ఏదైనా భోజనంలో ప్రొటీన్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే బ్లడ్ షుగర్ లెవెల్ మెయింటెయిన్ అవుతుంది.

దాల్చిన చెక్క నీరు:
దాల్చిన చెక్క ఇన్సులిన్ నిరోధకత.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. ఈ మసాలాలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. దాల్చిన చెక్క పొడిని వేడి నీటిలో మరిగించి తాగాలి.. రోజులో ఏదో ఒకపూట ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

పుష్కలంగా నీరు త్రాగండి:
ఇన్సులిన్ హార్మోన్ స్థాయిలను నిర్వహించడానికి.. వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి పుష్కలంగా నీరు త్రాగాలి. రోజంతా 3-4 లీటర్ల నీరు త్రాగాలి.. దీనివల్ల హైడ్రేట్‌గా కూడా ఉంటాం..

రాత్రి భోజనం తర్వాత నడవండి:
రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోకండి. రాత్రి భోజనం తర్వాత కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు నడవండి. ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది.. వ్యాధి ప్రమాదాన్ని నివారిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.

Narayana Murthy: ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి

భారత్‌లో ప్రతీ విద్యార్థి చదవాల్సిన ఓ పుస్తకాన్ని ఇన్ఫోసిస్‌ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) పంచుకున్నారు. పాల్ జి.హెవిట్‌ రాసిన ‘కాన్సెప్చువల్‌ ఫిజిక్స్‌’ను (Conceptual Physics) ప్రతిఒక్కరూ చదవాలని సూచించారు. దీన్ని రచయిత అద్భుతంగా రాశారని.. అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

‘‘ప్రస్తుతం నేను కాన్సెప్చువల్‌ ఫిజిక్స్‌ అనే పుస్తకాన్ని చదువుతున్నాను. దీన్ని హైస్కూల్‌ టీచర్‌ పాల్‌ హెవిట్‌ రాశారు. హైస్కూల్‌ విద్యార్థులను దృష్టిలోఉంచుకొని రచించారు. ఫిజిక్స్‌ ఎలా బోధించాలో అద్భుతంగా వివరించారు. రచయిత నుంచి అనుమతి లభిస్తే దీన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాలి. దీంట్లో అద్భుతమైన ఎక్సర్‌సైజులు ఉన్నాయి. క్లిష్టమైన ఐడియాలను చాలా చక్కగా వివరించారు. శ్రీనగర్‌ నుంచి కన్యాకుమారి.. మేఘాలయ నుంచి జామ్‌నగర్‌ వరకు ప్రతిఒక్కరూ దీన్ని చదవాలి. ‘సైన్స్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, మేథమేటిక్స్‌ సబ్జెక్టుల్లో మంచి అవగాహన ఏర్పడుతుంది’’ అని ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణమూర్తి (Narayana Murthy) వెల్లడించారు.

ఏఐతో కొత్త అవకాశాలు..
కృత్రిమ మేధ వల్ల (Artificial Intelligence- AI) ఉద్యోగాలు కోల్పోతామనే భయాలను నారాయణ మూర్తి (Narayana Murthy) కొట్టిపారేశారు. దీన్ని మరీ ఎక్కువ చేసి చూపుతున్నారని అభిప్రాయపడ్డారు. కొత్త అవకాశాల సృష్టి, మనుషుల ఉత్పాదకతను పెంచే సామర్థ్యం ఏఐకి ఉందని తెలిపారు. 1970ల్లోనూ ఇదేతరహా అపోహలు వినిపించాయని గుర్తుచేశారు. ‘కేస్‌ టూల్స్‌’ అనే కంప్యూటర్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ టూల్స్‌ వచ్చినప్పుడు అనేక భయాలు వ్యాపించాయని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు ఊడిపోతాయనే ప్రచారం జరిగిందని వెల్లడించారు. కానీ, రానురానూ మరింత క్లిష్టమైన సమస్యలు మనుషులకు ఎదురయ్యాయని.. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంకా అభివృద్ధి చెందిందని వివరించారు.

ప్రపంచంలో ఎక్కడ ఏ ఆవిష్కరణ జరిగినా భారత్‌ దాన్ని వినియోగించుకునే సామర్థ్యాన్ని అందుపుచ్చుకుందని మూర్తి (Narayana Murthy) తెలిపారు. జనరేటివ్‌ ఏఐను అందుకు ఉదాహరణగా చెప్పారు. ఇప్పటి యువత పాత తరాలతో పోలిస్తే చాలా చురుగ్గా ఉన్నారని అన్నారు. ఏఐ వల్ల అటానమస్‌ డ్రైవింగ్‌, న్యూక్లియర్‌ రియాక్టర్ల వంటి ప్రమాదకరమైన ప్రాంతాల్లో మెషీన్‌ ఆపరేటర్లు, రిమోట్‌ సర్జరీ వంటి రంగాల్లోని ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం తప్పకపోవచ్చునని తెలిపారు. ఉద్యోగాలు పోతాయనే ఆలోచనల నుంచి బయటకు వచ్చి దాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించగలమనే విషయంపైకి చర్చను మళ్లించాలని మూర్తి సూచించారు.

విజయవాడ రోడ్డును వెంటనే విస్తరించాలి

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై 17 ప్రాంతాల్లో ఉన్న బ్లాక్‌ స్పాట్స్‌ కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటూ ప్రాణనష్టం జరుగుతున్నందున ఆ రోడ్డును వీలైనంత తొందరలో విస్తరించాల్సిన అవసరం ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రె డ్డి పేర్కొన్నారు.
ప్రమాదాలకు కారణమవుతున్న లోపాలను ముందుగా మరమ్మతు చేయాలని అధి కారులను ఆదేశించారు. మరమ్మతులతో వాహనా లకు ఇబ్బంది ఎదురుకాకుండా, ముందుగా ప్రత్యా మ్నాయ మార్గం ఏర్పాటు చేసి పనులు చేపట్టాలని సూచించారు. అధికారిక అనుమతుల పేరిట ఇంకా జాప్యం చేస్తే ప్రమాదాలు కొనసాగుతూనే ఉంటాయని, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని పేర్కొ న్నారు.

శుక్రవారం ఆయన ఎన్‌హెచ్‌ఏఐ, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహæదారుల విభాగం అధికారులతో సమీక్షించారు. విజయవాడ రహæదారిపై ప్రమాదాలు జరుగు తున్న చోట్ల వాహనచోదకులు గమనించేలా హెచ్చరిక, సూచిక బోర్డుల ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అతివేగం నియంత్రణ చర్యలు చేపట్టడం, అవసరమైన ప్రాంతాల్లో ఆరు వరుసలకు రోడ్డును విస్తరించటం, కావాల్సిన చోట్ల వెహికిల్‌ అండర్‌ పాస్‌లు, రెండు వైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం వంటి చేపట్టాలని తెలిపారు. 2021లో మంజూరైన రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులు ఈ పాటికే ప్రారంభమై ఉంటే అది ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసి ఉండేదని మంత్రి అభిప్రాయపడ్డారు.

రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి 70 శాతం భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, అటవీ భూములు, కోర్టు కేసుల వల్ల మిగతా దానిలో జాప్యం జరుగుతోందని ఎన్‌హెచ్‌ఏఐ రీజినల్‌ అధికారి రజాక్‌ మంత్రి దృష్టికి తెచ్చారు. సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి విజేంద్రబోయీ, ఈఎన్‌సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోజూ రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తింటే ఈ లాభాలన్నీ పక్కా..

వెల్లుల్లిలోని ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా అల్లిసిన్ అనే పోషకం ఉంటుంది. ఇందులో పవర్‌ఫుల్ యాంటీ మైక్రోబయల్, శరీరంపై బ్యాక్టీరియా, వైరస్‌లకి వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో వివిధ ఆరోగ్య సమస్యల నుండి కాపాడుకోవచ్చు. అందుకోసం రోజూ రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి రెబ్బని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. దీంతో పాటు ఏమేం లాభాలున్నాయో తెలుసుకోండి.

గుండె ఆరోగ్యం..
రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తింటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. దీనికి కారణం వెల్లుల్లిలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే గుణాలు ఉన్నాయి. కాబట్టి, రాత్రి పూట తింటే గుండె సమస్యలు దూరమవుతాయి. కాబట్టి, రాత్రి పడుకునే ముందు ఓ వెల్లుల్లి రెబ్బ తింటే మంచిది.

అధిక బరువుని కంట్రోల్ చేసే వెల్లుల్లి..
యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు..
వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడేందుకు, శరీరంలోని ఫ్రీ రాడికల్స్ అని పిలిచే క్యాన్సర్ కారక కణాల నుండి శరీరాన్ని రక్షించడంలో సాయపడుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి రెబ్బని తీసుకుంటే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మీ శరీరాన్ని సెల్ డ్యామేజ్ నుండి కాపాడతాయి. దీంతో వృద్ధాప్య ప్రక్రియ తగ్గుతుంది. దీంతో చర్మ ఆరోగ్యం మెరుగవవ్వడమే కాకుండా అభిజ్ఞా పనితీరు మెరుగవుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

బరువు తగ్గడం..
శరీరం బరువు తగ్గించడానికి, శరీరంలోలోని ట్యాక్సిన్స్‌ని తగ్గించేందుకు వెల్లుల్లి తినాలి. ఇదో సహజ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. ఇక్కడ అల్లిసిన్ శరీరంలోని ట్యాక్సిన్స్‌ని దూరం చేస్తుంది. కాబట్టి, రోజు ఓ వెల్లుల్లి తీసుకుంటే బాడీ క్లీన్ అవుతుంది. శరీరంలోని మలినాలను తొలగించడానికి కొవ్వుని వాడడం వల్ల బరువు తగ్గుతారు.

మంచి నిద్ర కోసం..
వెల్లుల్లిలో ట్రిప్టోఫాన్ అనే పోషకం ఉంటుంది. ఇది నిద్రని ప్రేరేపించే అమైనో ఆమ్లం. దీనిని తీసుకోవడం వల్ల సెరోటోనిన్ ఉత్పత్తి పెరిగుతుంది. ఇది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ నిద్ర, మేల్కోనే సమయాలని నియంత్రించడంలో సాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. పడుకునే ముందు ఓ వెల్లుల్లి రెబ్బని తీసుకుంటే త్వరగా నిద్రపోతారు. ప్రశాంతంగా నిద్రపోతారు.

మొత్తంగా..
రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తీసుకుంటే కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవచ్చు. దీంతో బరువు కూడా తగ్గుతారు. ఇందులోని విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్ వంటి పోషకాలు అందుతాయి. మొత్తం ఆరోగ్యానికి మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Telangana News: TS బదులుగా TG.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ విభాగాలన్నీ ఇక నుంచి తెలంగాణను టీఎస్‌ బదులుగా టీజీగానే ప్రస్తావించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వాహనాల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికారిక సమాచారాల్లో అంతటా టీజీగా ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు, అటానమస్ విభాగాలన్నింటిలోనూ వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌లలో టీజీ అనే పేర్కొనాలని ఉత్తర్వుల్లో సీఎస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, వెబ్ సైట్లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలలోనూ టీజీ ఉండాలన్నారు. టీఎస్ అని ముద్రించిన స్టేషనరీ, ప్రింటింగ్ మెటీరియల్ ను తొలగించి.. టీజీతో కొత్తగా ముద్రించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వులు అమలు చేసి ఈనెల 31 నాటికి సాధారణ పరిపాలన శాఖకు నివేదిక సమర్పించాలని వివిధ శాఖల కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు.

JEE Advanced Admit cards: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి.
మే 26న జరగనున్న ఈ పరీక్ష అడ్మిట్‌ కార్డులను ఐఐటీ మద్రాస్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డుల్ని మే 26న మధ్యాహ్నం 2.30గంటల వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారితంగా జరిగే ఈ పరీక్ష పేపర్‌ -1 ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు; పేపర్‌ -2 మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరగనుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసిన విద్యార్థుల రెస్పాన్స్‌ షీట్లను మే 31 నుంచి అందుబాటులో ఉంచుతారు. ప్రాథమిక కీ జూన్‌ 2న విడుదల చేసి తుది కీ, ఫలితాలను జూన్‌ 9న ప్రకటిస్తారు. ఈ పరీక్షలో ర్యాంకులు సాధించిన వారికి దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఇతర ప్రఖ్యాత యూనివర్సిటీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు

Download ….. JEE Advanced Admit cards

Dhaniya Tea: ధనియాలతో టీ చేసుకుని తాగితే ఈ సమస్యలన్నీ దూరం..

ధనియాలు.. కొత్తిమీర అంటే చాలా మందికి ఇష్టం. వీటిని వంటల్లో వాడుతూనే ఉంటారు. ధనియాల్లో శరీరానికి అవసరమైన విటమిన్స్ ఎ, సి, కె వంటి పోషకాలు ఉన్నాయి. వీటితో టీ చేసుకుని తాగితే చాలా సమస్యలు దూరమవుతాయి. అవేంటో తెలుసుకోండి.

మైగ్రేన్..
చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో మైగ్రేషన్ ఒకటి. ఎండాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువ అవుతుంది. దీని నుంచి రిలాక్స్ అవ్వాలంటే ధనియాలతో టీ చేసుకొని తాగొచ్చు. మీరు మైగ్రేన్‌ని కంట్రోల్ చేసుకోవాలంటే మీ డైట్‌లో ధనియాలతో చేసిన టీని మీ డెయిలీ రొటీన్‌లో యాడ్ చేయండి.

జీర్ణ సమస్యలు..
జీర్ణ సమస్యల్ని దూరం చేయడంలో ధనియాలు ముందుంటాయి. ధనియాలతో చేసిన టీ తాగితే మూత్ర విసర్జన పెరుగుతుంది. ఇందులోని శోథ నిరోధక లక్షణాలు కడుపు, పేగు సమస్యల్ని దూరం చేస్తాయి. జీర్ణక్రియని మెరుగ్గా చేస్తాయి. అందుకోసం ఓ కప్పు ధనియాల టీని రెగ్యులర్‌గా తాగాలి.

ట్యాక్సిన్‌ని బయటికి పంపడం..
చాలా మంది శరీరాల్లో ట్యాక్సిన్ పేరుకుపోయి ఉంటాయి. ఇవి లివర్, గాల్ బ్లాడర్‌‌లో సమస్యల్ని సృష్టిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ ధనియాల టీని తాగండి. దీని వల్ల బాడీ డీటాక్సీఫై అవుతుంది.

మంటను తగ్గించడం..
ధనియాల్లో శరీరంలో మంటని తగ్గించే గుణాలు ఉంటాయి. వీటితో టీ చేసుకుని తాగడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులు, ఆర్థరైటీస్, ఇతర ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను తగ్గిస్తాయి. రెగ్యులర్‌గా తాగితే రిజల్ట్ ఉంటుంది.

ఎలా చేయాలి?
రెండు గ్లాసుల నీటిని తీసుకుని అందులో 2 టీ స్పూన్ల ధనియాలను వేయండి. రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే ఆ నీటిని రోజంతా తాగొచ్చు. లేదంటే నీరు సగమయ్యే వరకూ మరిగించి వడపోసి వేడిగా ఉన్నప్పుడు తాగండి.

యూరిక్‌ యాసిడ్ ఉంటే నిర్లక్ష్యం వద్దు.. తినే ఆహారంలో జాగ్రత్త.. ఏవి తినాలి? ఏవి తినకూడదు అంటే..

మటన్, ఆల్కహాల్ వంటి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు ఎంత ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ అంత ఎక్కువగా పేరుకుపోతుంది.

గౌట్ నొప్పి పెరుగుతుంది.

యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే, ఔషధాల సహాయం తీసుకోవడం అవసరం. అయితే ఔషధం తీసుకుంటున్నామని జీవనశైలిపై అలక్ష్యం చేయవద్దు. ఎందుకంటే జీవన శైలిలో మార్పులు యూరిక్ యాసిడ్ స్థాయిలు, గౌట్ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.

చక్కెర ఉన్న ఆహారాన్ని, రసాయన పానీయాలకు దూరంగా ఉండండి. తీపి ఆహారాన్ని ఎక్కువగా తింటే శారీరక సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. స్వీట్లు తినడం ఇష్టం అయితే తినే ఆహారంలో పండ్లు చేర్చుకోండి.

యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే ఆల్కహాల్ మానేయాలి అనడంలో సందేహం లేదు. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. బీర్, వైన్, విస్కీ వంటి అన్ని రకాల ఆల్కహాల్‌లకు దూరంగా ఉండాలి.

యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే, అది మూత్రపిండాల ద్వారా శరీరంలో వ్యర్ధాలు ఫిల్టర్ చేయబడదు. అప్పుడు కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం కూడా పెరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి పుష్కలంగా నీరు త్రాగాలి. ఈ సందర్భంలో మూత్రపిండాలు శరీరం నుంచి అదనపు యూరిక్ ఆమ్లాన్ని తొలగిస్తాయి.

2016లో జరిపిన ఒక అధ్యయనంలో కాఫీ శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను ఎక్కువగా బయటకు పంపగలదని కనుగొంది. కాఫీ శరీరంలోని ప్యూరిన్‌లను విచ్ఛిన్నం చేస్తుంది. యూరిక్ యాసిడ్ ఉత్పత్తి రేటును తగ్గిస్తుంది.

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి.. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం అవసరం. డయాబెటిక్ పేషెంట్ అయితే దీని గురించి మరింత తెలుసుకోవాలి. మీ షుగర్ లెవల్స్‌ను పెంచే ఏ ఆహారాన్ని అయినా తినవద్దు.

చాలా సందర్భాలలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు.. అది బొటనవేలు, చీలమండ లేదా మోకాలిలో పేరుకుపోతుంది. నొప్పి కూడా తీవ్రంగా ఉంటుంది. ఆ సమయంలో శరీరంలోని ఒత్తిడి కూడా పాదాలపై పడితే నొప్పి పెరగడం మొదలవుతుంది. ఈ స్థితిలో శరీర బరువును తగ్గించుకోవడం అవసరం. కనుక బరువుని అదుపులో ఉంచుకోండి.

Personality: మీరు ఎలా పడుకుంటారు.? దానిబట్టి మీరెలాంటి వారో చెప్పొచ్చు..

మనం చేసే ప్రతీ పని మనం ఎలాంటి వాళ్లమో నిర్ణయిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనం చూసే విధానం, తినే విధానంతో పాటు పడుకునే విధానం కూడా మన వ్యక్తిత్వాన్ని చెబుతుందని అంటున్నారు. మరి మనం నిద్రపోయే విధానం ఆధారంగా మన వ్యక్తి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఒకవేళ మీరు కాళ్లు చేతులు దగ్గరికి ముడుచుకొని పడుకుంటే మీరు చాలా సున్నితమైన వ్యక్తిత్వం ఉన్న వారని అర్థం. అలాగే మీరు చాలా సిగ్గుపడతారని చెబుతున్నారు. మీరు దేని గురించి ఆలోంచారు, ఎప్పుడూ సేఫ్‌ సైడ్‌గా ఉండాలనే భావనతో ఉంటారు. అలాగే సమస్యల నుంచి పారిపోవాలనే ఆలోచనతో ఉంటారు. మానసికంగా బలహీనమైన వ్యక్తులని అర్థం చేసుకోవాలి.

* ఇక ఒకవైపు పడుకొని చేతులు, కాళ్లు నిటారుగా పెట్టే వారు సామాజికి జీవితాన్ని గడుపుతారని అర్థం. వీరు ఇతరులను మోసం చేయరు. అందరినీ సులభంగా నమ్ముతారు. కొన్ని సందర్భాల్లో ఈ అతి నమ్మకమే వారికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది.

* చేతులు ముందుకు చాచి పడుకునే వారు ఓపెన్ మైండెడ్‌గా ఉంటారు. వీరి ఆలోచనలను విస్తృతంగా ఉంటాయి. అలాగే పనులను చాలా నెమ్మదిగా చేస్తారు. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు.

* చేతులు, కాళ్లు నిటారుగా ఉంచి వెనక్కి తిరిగి పడుకునే వారు రిజర్వ్‌గా ఉండటానికి ఇష్టపడతారు. వీరు నలుగురిలో కలవడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. తమ గురించి తాము ఎక్కువగా కేర్‌ తీసుకుంటారు. ఇతరుల కంటే తమకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. అంటే వీరిలో సెల్ఫ్‌ కేరింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట.

* బోర్లా పడుకునే వారు ఉల్లాసంగా, ఓపెన్ మైండెడ్‌తో ఉంటారని అర్థం. వీరి స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు. రిస్క్‌ తీసుకోవడానికి అస్సలు వెనుకడుగు వేయరు. ఇతరులు ఏమి చెప్పినా అస్సలు పట్టించుకోరు. తమకు నచ్చిందే చేస్తారు.

* రెండు చేతులను తల వెనుక దిండులా పెట్టుకుని నిద్రించే వారు ఇతరులతో సౌమ్యంగా ఉంటారు. వీరు ఎవరి గురించి చెడుగా ఆలోచించరు.

* ఇక పిల్లోని కౌగిలించుకుని నిద్రించే వ్యక్తులు ప్రేమతో నిండి ఉంటారు. వారు ఇతరులకు ప్రేమను ఇవ్వడానికి, అదే సమయంలో స్వీకరించడానికి ఇష్టపడతారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు మానసిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అందించినవి మాత్రమే.

Cholesterol Control Tips: మూలమూలల్లో పేరుకు పోయిన కొవ్వును కరిగించే డ్రింక్..

ప్రస్తుత కాలంలో చాలా మంది చెడు కొలెస్ట్రాల్‌తో బాధ పడుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతే..

గుండె వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువై పోతాయి.

కొలెస్ట్రాల్ కారణంగా అధిక రక్త పోటు, షుగర్, గుండె వ్యాధులు ముప్పు పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అలోవెరా జ్యూస్ అద్భుతంగా పని చేస్తుంది. చాలా మంది అలోవెరా జ్యూస్‌ను కేవలం స్కిన్‌కేర్ కు మాత్రమే ఉపయోగిస్తారు అనుకుంటారు.

అలోవెరా జ్యూస్‌తో వ్యాధుల్ని సైతం నియంత్రణ చేసుకోవచ్చు. శరీరంలో విపరీతంగా పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్‌ను మొత్తం కరిగించి.. బయటకు పంపుతుంది అలోవెరా జ్యూస్. ప్రతి రోజూ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

శరీరంలోని మూలమూలల్లో పేరుకుపోయిన కొవ్వును సైతం కరిగిస్తుంది. అంతే కాకుండా అలోవెరా జ్యూస్ తాగడం వల్ల మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి సమస్యల్ని కూడా తగ్గిస్తుంది.

ప్రతిరోజూ కొద్ది రోజులు అలోవెరా జ్యూస్ తాగితే.. కొలెస్ట్రాల్ అనేది నియంత్రణలోకి వస్తుంది. దీంతో త్వరగానే వెయిట్ లాస్ అవుతారు. అంతే కాకుండా స్కిన్, జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.

AP Elections 2024: నిఘా వర్గాల హెచ్చరిక ఎవరి ఓటమికి సంకేతం?

AP Elections 2024: ఫలితాల తర్వాత కూడా ఏపీలో అల్లర్లు జరుగుతాయా? కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక దేనికి సంకేతం? అధికార పార్టీ ఓడిపోయి అల్లర్లకు దిగుతుందా?

లేకుంటే గెలిచామని అధికార పార్టీ విపక్షాలపై దాడి చేస్తుందా? ఇప్పుడు దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీలో పోలింగ్ నాడు చాలా ప్రాంతాల్లో హింస రేగిన సంగతి తెలిసిందే. అది రెండు రోజులపాటు కొనసాగింది. ఎలక్షన్ కమిషన్ సీరియస్ చర్యలతో పాటు కేంద్ర బలగాలు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఫలితాల తరువాత హింస మరింత పెరుగుతుందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఫలితాల తర్వాత రెండు వారాల పాటు కేంద్ర బలగాలు ఏపీలో కొనసాగనున్నాయి.

ఏపీలో అధికార పార్టీ ఓడిపోతే.. ఆ ఫ్రస్టేషన్లో దాడులు జరిగే అవకాశం ఉంది. గెలిచామన్న ఆనందంలో తెలుగుదేశం కూటమి శ్రేణులు దాడులు చేసే అవకాశం ఉంది. అంటే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు వైసిపి ఓడిపోతుందన్న సంకేతాలు వచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు చాలా చోట్ల రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా చోట్ల రిగ్గింగ్ కూడా జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. అటు కొంతమంది సీనియర్లు చేస్తున్న వ్యాఖ్యలు భయంతో కూడుకున్నవే నన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్రం అల్లర్లు జరిగే అవకాశం ఉందని అప్రమత్తం చేసిందంటే.. వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమని.. ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అల్లర్లకు తెగబడే ఛాన్స్ ఉందని హెచ్చరించి ఉండొచ్చునని విశ్లేషిస్తున్నారు.

అదే సమయంలో మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి దీటుగా టిడిపి శ్రేణులు నిలబడ్డాయి. వైసీపీ అధికారంలోకి వస్తే టిడిపి శ్రేణుల అంతు చూద్దామని.. భావనలో వైసీపీ శ్రేణులు ఉండొచ్చని.. అందుకే కేంద్ర నిఘా వర్గాలు ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో పలు ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించినట్లుగా మరికొందరు విశ్లేషిస్తున్నారు. అయితే ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని కూటమి పార్టీల ధీమా.. అధికార వైసీపీ శ్రేణుల నుంచి వినిపించడం లేదు. పోలింగ్ పెరగడం, ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు వ్యతిరేకించడం, యువత పెద్ద ఎత్తున ఓట్లు వేయడంతో ఒక రకమైన అనుమానం అధికార పార్టీలో ఉంది. అందుకే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో ఎక్కువగా వైసీపీ భయపడుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఎన్నికల ఫలితాలకు ముందు చంద్రబాబు సంచలన నిర్ణయం..కారణం ఇదే!

టీడీపీ ప్రతి ఏటా మే 27,28, 29 తేదీల్లో ‘మహానాడు’ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఎన్నికల హడావిడి ఉండటంతో టీడీపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా మే 28వ తేదీ కలిసివచ్చేలా ప్రతి ఏటా టీడీపీ మహానాడు నిర్వహిస్తుంది. పార్టీ కార్యకర్తల పసుపు పండగగా మహానాడును జరుపుకుంటారు. ఈ సారి ఇది వాయిదా పడింది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారు.

జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.. పార్టీ నేతలంతా ఆ పనుల్లో ఉంటారు కాబట్టి మహానాడు నిర్వహించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. చంద్రబాబు పార్టీ వ్యూహ కమిటీ సభ్యులతో ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ 2025లోనే మహానాడును నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

Health

సినిమా